Pages

ఆచమనం

*ఆచమనం అంటే ఏమిటి?*



పూజలు, వ్రతాల్లో ''ఆచమనం'' అనే మాట చాలా సార్లు వింటాం. కానీ ఆ పదానికి అర్ధం చాలామందికి సరిగా తెలీదు. అందుకే  ''ఆచమనం'' అంటే ఏమిటో, దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

*ఆచమనం అనే ఆచారం అపరిమితమైనది.*

ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత,పూజకు ముందు, సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు,భోజనానికి ముందు, తర్వాత, బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ముఖం, కాళ్ళూ చేతులూ కడుక్కున్న తర్వాత  ఆచమనం చేయొచ్చు.ఆచమనం చేసే వ్యక్తి శుచిగా,శుభ్రంగా ఉండాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరణి చొప్పున మంత్రయుక్తంగా మూడుసార్లు చేతిలో నీరు పోసుకుని తాగాలి...

 ఆచమనం గురించి సంస్కృతంలో ''గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్'' అని వర్ణించారు. అంటే, కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, ఇందులో మూడు ఉద్ధరణిల నీటిని (ఒక మినపగింజమునిగేంత పరిమాణంలో నీళ్ళు) పోసి, వాటిని తాగాలి. చేతిలో పోసేనీళ్ళు అంతకంటే ఎక్కువ కానీ, తక్కువ కానీ ఉండకూడదు. నీరు కొలత అంతే ఉండాలి...

 ఆచమనం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు అని చెప్తున్నారు.. బాగానే ఉంది.

1.అసలు ఆచమనం ఎందుకు చేయాలి?

2.నీటిని అరచేతిలో పోసుకుని తాగడం వల్ల ప్రయోజనం ఏమిటి? 

3.అలా ఎందుకు తాగాలి?

4.ఉద్ధరణితో తిన్నగా నోట్లో పోసుకుని ఎందుకు తాగకూడదు?

5.మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే ఎందుకు తీసుకోవాలి?

6. నీరు కొంతఎక్కువో తక్కువో అయితే ఏమవుతుంది? 
7.“కేశవాయ స్వాహా,నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా...” అని మాత్రమేఎందుకు చెప్పాలి?

ఇలాంటి సందేహాలు కలగడం సహజం. దేవుడు,ఆచారాల పట్ల నమ్మకం లేని నాస్తికులు అయితే వీటిని అపహాస్యం చేస్తారు కూడా.అందుకే ఆచమనం చేయడంలో పరమార్థం ఏమిటో విపులంగా తెలుసుకుందాం.మన గొంతు ముందు భాగం లోంచి శబ్దాలు వస్తాయి. దీన్ని స్వరపేటిక అంటాం. దీనిచుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది కనుక కొంత వరకూ రక్షణ లభిస్తుంది. అయినప్పటికీ, ఇది ఎంత అద్భుతమైనదో, అంత సున్నితమైనది. ఈ గొంతు స్థానంలో చిన్నదెబ్బ తగిలినా ప్రమాదం. స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు. స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి. ఇవి ఇంగ్లీషు అక్షరం 'V' ఆకారంలో పరస్పరం కలిసిపోయి ఉంటాయి. ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి,ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి. స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి.ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే, మన భావవ్యక్తీకరణకు కారకమైన స్వరపేటిక మహా సున్నితమైనది. ముక్కు,నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక,గొంతు లోపలి భాగం, శ్వాస నాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటిచుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి. వీటికిబలం కలిగించడమే ఆచమనం పరమోద్దేశం...

ఆచమనంలో మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే తాగాలి అనిచెప్పుకున్నాం కదా ! గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది. ఇలాలోపలి నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులోవేగం ఉండకూడదు.శబ్దం సులువుగా, స్పష్టంగా రావాలి. ఇలా కొన్నినీటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని, అంతే జాగ్రత్తగా మెల్లగాతాగడం అనే అలవాటు వల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ,జాగ్రత్త అలవడుతుంది. రోజులో ఆచమనం పేరుతొ అనేకసార్లు మెల్లగా నీరు తాగడంవల్ల గొంతు, ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది...

*“కేశవాయ స్వాహా"* అన్నప్పుడు అది గొంతునుండి వెలువడుతుంది.
 *“నారాయణాయ స్వాహా"* అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది.
 చివరిగా *"మాధవాయ స్వాహా"* అనే మంత్రం పెదవుల సాయంతో వెలువడుతుంది.

ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈ మంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు,నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది. పైగా ఇవి పరమాత్ముని నామాలు కనుక, భక్తిభావంతో ఉచ్చరించడం వల్లమేలు జరుగుతుంది...

ఇక ఉద్ధరణితో తిన్నగా ఎందుకు తాగకూడదు, చేతిలో వేసుకునే ఎందుకు తాగాలి అంటే, మన చేతుల్లో కొంతవిద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసిశరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది...

ఒక ఉద్ధరణి చొప్పున కొద్దికొద్దిగా నీరు సేవించడం వల్ల ఆకొద్దిపాటి విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు,పెగుల వరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజ పరుస్తాయి...

ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా భావిస్తూ రోజులో అనేకసార్లు పాటించడం వల్ల మనసు దానిమీద కేంద్రీకృతమై,లేనిపోని బాధలు, భయాలు తొలగుతాయి...

ఏదో అలవాటుగా పాటించే ఆచారాల వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శాస్త్రీయత ఉంది...
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

వీధిచివర




కృష్ణా.... కృష్ణా.. ఓసారి ఇలా రా.. అంటూ తన ఏడేళ్ల కృష్ణను వాళ్ల అమ్మ పిలవగానే పరుగెత్తుకుంటూ వచ్చాడు కృష్ణ... చెప్పమ్మా ఏంటి అన్నాడు. ఇదిగో ఇది తీసుకెళ్లి ఆ వీధిచివర కూర్చుని వుంటుంది కదా ఆ అవ్వకు ఇచ్చిరా అనిచెప్పి చిన్న క్యారియర్ బాక్స్ కృష్ణచేతికిచ్చింది.
అమ్మా ఎందుకమ్మా ఆ అవ్వకు రోజూ ఇలా అన్నం పెట్టి పంపుతుంటావు. ఆమె మన చుట్టాలా అని అడిగాడు కృష్ణ.
కాదునాన్నా.. ఆమె ఎవరో ఏమిటో తెలియదు. ఆమెకేంజరిగిందో తెలియదు. కొన్ని రోజుల నుండి అక్కడే కూర్చుని వుంటోంది. పాపమనిపంచి ఇలా చేస్తున్నాను అంది. అలా చేస్తే మనకేమొస్తుందమ్మా అని అడిగాడు కృష్ణ. మనకేదో ఉపయోగం వుంటుంది లేదా మనకు ఏదో మంచి జరుగుతుందని చేసేది సాయంకాదు నాన్నా అని చెప్పింది. అసలు సాయం అంటే ఏంటి ఎందుకు మనం చేయాలి అని కృష్ణ అడిగిన ప్రశ్నకు వీడికి ఎలా చెప్తే అర్థమౌతుందని ఆలోచించి ఇలా చెప్పసాగింది.
సాయం అంటే సాటి వారికి అండగా నిలవడం. అంటే ఎదుటి వారు కష్టాల్లో వున్నప్పుడు వారినుండి మనము ఏమీ ఆశించకుండా వారి కష్టాలను తీర్చడంలో మనము వారికి తోడుగా వుండడం. మరి అలా చేస్తే ఏంజరుగుతుందని అడిగాడు కృష్ణ. మన మనసులో చాలా ఆనందం నిలుస్తుంది. ఎవరైతై ఇలా ఏమీ ఆశించకుండా సాయం చేస్తారో వారు దేవుళ్ళతో సమానమౌతారు. ఇంకేంకావాలిరా అంతకన్నా అని చెప్పింది. అసలు దేవుడంటే ఏంటమ్మా. రోజూ ఫోటోలో చూపించి దండంకూడా పెట్టమంటావ్ కదా నువ్వు అని అన్నాడు. దేవుడంటే కనిపించే రూపంకాదునాన్నా. మన అందరిలోనూ దేవుడుంటాడు. మంచి చేయమనే మన మనసుకు చెబుతూ వుంటాడు.కానీ మనమే మన స్వార్థంకోసం మనకు నచ్చినట్టు చేస్తుంటాము. అంతెందుకు నీగురించే తీసుకో... ఈఅన్నం ఆ అవ్వకు పెట్టమని నీకు చెబితే నన్ను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావ్. ఇలా చేయడంవల్ల నీకేమి వస్తుంది అనుకుంటున్నావ్. ఒక పని చెయ్యి ఇప్పుడు ఈఅన్నం ఆమెకిచ్చి ఆమె కళ్ళలోకి చూసి నేను ఇప్పుడు చెప్పేమాటే చెప్పు. అవ్వా బాగున్నావా. ఇదిగో అన్నం నీకోసమే అని ఇచ్చి చూడు అంది. సరే అమ్మా అలాగే చెప్పి వస్తానని చెప్పి అన్నంతీసుకొని వెళ్ళాడు కృష్ణ...
కాసేపటికి ఇంటికి వచ్చి అమ్మను గట్టిగా పట్టుకొని ఏడ్చేశాడు...
ఆమెకు అర్థంఅయ్యింది. ఊరుకో కృష్ణా ఊరుకో.. అని చెప్పి తన కళ్ళు తుడుస్తూ అడిగింది. ఏమందిరా ఆ అవ్వ అని...
నువ్వడగమన్నట్టే అడిగానమ్మా. అప్పడు ఆమె నా చెయ్యి పట్టుకొని తనకళ్ళకు అద్దుకొని మానాయనవిరా నువ్వు. నాదేవుడివి నువ్వు. నువ్వెప్పుడూ సంతోషంగా వుంటావు. ఆయుష్మాన్ భవ. నాఆయుష్షు కూడా నీకే పోసి నిన్ను ఆదేవుడు చల్లంగా చూడాలని ఏడుస్తూ చెప్పిందమ్మా అన్నాడు. ఆమె ఎంతో ఆకలితో ఉన్నట్టుందమ్మా పాపం అని ఏడ్చేశాడు కృష్ణ.
అప్పడు వాళ్ళమ్మ, ఇప్పడు చెప్పు నీకేమనిపిస్తోంది. సాయం అనేది నీకు నచ్చినప్పుడు చేయటం కాదురా, అది నీఅలవాటుగా మార్చుకో. అప్పుడు జీవితమంతా సంతోషంగా వుంటావు అని చెప్పింది. అప్పడు కృష్ణ.. నిజమే అమ్మా. పెద్దయ్యాక నా డబ్బుతో నేనే వెళ్లి ఇలాంటి వారికి సాయంచేస్తాను అని చెప్పి అమ్మ బుగ్గకు ప్రేమతో ఒక ముద్దిచ్చాడు.

-మనం మన పిల్లలకు మాటలతో చెప్పటంకన్నా వారితో మంచి పనులు చేయించడం అలవాటు చేస్తే నూటికి 99 మందైనా ఖచ్చితంగా మంచివారుగా తయారౌతారు అనే వుద్దేశంతో రాశాను.
-అందుకే అన్నారు మన పెద్దలు "మొక్కై ఒంగనిది మానై ఒంగునా అని
తెలుగులో విజ్ఞానం
written by : Kasulanati Vamsikrishna

చచ్చి పోయామనుకో

'చచ్చిపోయేమనుకో.. అప్పుడు ఏమవుతుందంటావ్?'

'ఆ చావులో నన్నెందుకూ కలపడం? నాకింకా బతకాలనే ఉంది'

'సరే.. పోనీ.. నేనే చచ్చిపోయేననుకో.. అప్పుడు ఏమవుతుందంటావు?'

'ఏమీ అవ్వదు.. నిన్ను ఇష్టపడేవాళ్ళు ఓ రెండ్రోజులేడుస్తారు.. స్విగ్గీ వాడూ, డొమినోస్ వాడూ  'అయ్యో.. మంచి బేరం పోయిందే.. సారు మంచిగా టిప్పులిచ్చేవాడు' అని బాధపడతారు'

'అలాక్కాదు.. అంటే.. పుణ్యం గట్రా బాగానే చేసేను కదా.. స్వర్గానికి పోతానంటావా?'

'స్వర్గం అంటే ఏమిటో?'

'అదే.. ఇంద్రుడు, మునులూ కూచునుంటే రంభా, మేనకా డాన్సాడుతూంటారూ..'

'నీకసలే డాన్సులంటే బోరు కదా.. మరి నువ్వెళ్ళి ఏం చేస్తావు?'

'పుణ్యం చేస్తే అక్కడ మనకోసం రంభా, మేనకా వెయిటింగన్నారు? '

' రంభా, మేనకా ఏవైనా కామపిశాచులేవిటీ? పైకొచ్చే  మగవెధవలందరికోసం కాసుక్కూచోడానికి? అయినా నువ్వు పుణ్యం చెయ్యడానికి కారణం ఎవరో తెలీని ఆడదానితో పడుక్కోడానికన్నమాట'

' మరి పుణ్యం చేసి ప్రయోజనమేంటీ అని? '

' సరే.. మీ ఆవిడ పుణ్యం చేసిందనుకో.. ఆవిడ కోసం ఇంద్రుడూ, వరుణ దేవుడూ కాసుక్కూచునుంటారా? '

' ఛఛ.. మా ఆవిడ పతివ్రత.. '

' అంటే.. నువ్వు వెధవ్వన్నమాట'

' సర్లే.. నువ్వు మరీ పచ్చిగా మాటాడేస్తున్నావు.. స్వర్గం సంగతి పక్కనెడదాం.. పోనీ పాపం చేసి పోయేననుకో.. యమధర్మరాజు నన్ను నూన్లో వేయిస్తాడా? '

' నువ్వేమైనా పకోడీవా బజ్జీవా నూన్లో వేయించడానికి? పోనీ.. వేయించేడే అనుకో... వేయించి ఏం చేస్తాడూ? ఇదిగో తినండర్రా అంటూ నిన్ను తలో పీసూ కింకరులకివ్వడానికి నువ్వేమీ మేక మటనూ కాదు.. కోడి చికినూ కాదు.. '

' అంటే వేయించడంటావా? '

' ఆ యముడు గారేమైనా వంటల మేస్టరా? చచ్చి ఒచ్చినాళ్ళందరినీ వేయించడానికి? అయినా పాపులందర్నీ వేయించడానికి సరిపడా నూనె సప్లై చెయ్యడానికి.. పైనేమైనా నూనె సముద్రముందా? '

' అంటే.. స్వర్గం, నరకం లేవంటావు? '

' ఎందుకు లేవూ?... స్వర్గం, నరకం చస్తే ఉండవు... బతికుండగానే ఉంటాయి .. ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా, నీ పని నువ్వు చేసుకున్నావనుకో.. ఆ రాత్రి హాయిగా నిద్దరడుతుంది.. అది స్వర్గం.. అలాక్కాకుండా ఎవర్నో ఏదో ఇబ్బందెట్టాలనే ఎదవాలోచన చేసేవనుకో... అదే ఆలోచన నిన్ను నిద్దర్లో కూడా తినేస్తుంది.... అది నరకం'
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

కరొనా పద్య పంచకం

కరోనా పద్య పంచకం


  • 1) తల్ల డిల్లె తల్లి పిల్లలాకలిజూసి
    తండ్రి కేమొ పనులు తరిగి పోయె
    చావు గొరకు వారు జపములే జేయంగ
    కరుణ జూప వమ్మ కరొన నీవు

    2) నడచి నడచి కాళ్లు నగరాలు దాటంగ
    ఆక లనుచు నోళ్ళు ఆవి రాయె
    వలస కూలి బతుకె వాడెను ఎండలో
    కరుణ జూప వమ్మ కరొన నీవు

    3) నెలలు నిండి నట్టి నిండు చూలాలికి
    పురుడు కొరకు జూడ పుడమి పైన
    చోటె లేక కుమిలి కాటికి చేరంగ
    కరుణ జూప వమ్మ కరొన నీవు

    4) భాగ్య మైన యట్టి భారత దేశంబు
    యెప్పు డెరుగ నట్టి ముప్పు తోటి
    ఎంతొ జిక్కి పోయె వింత రోగముజేత
    కరుణ జూప వమ్మ కరొన నీవు

    5) బయట కెళ్ళు దమ్ము బలహీన మాయెను
    ముక్కు కేమొ గుడ్డ ముఖ్య మాయె
    దూర మొకటె జనుల తోడుగా నయ్యెను
    కరుణ జూప వమ్మ కరొన నీవు

Pages:

  • <<

    >>




తెలుగులో విజ్ఞానం

రచన : వంశీకృష్ణ కాసులనాటి

రచన : వంశీకృష్ణ కాసులనాటి

Geeta




ఆఫీసులో వర్క్ ఎక్కవగా వుండడంతో టైంచూసుకోలేదు. బయటకొచ్చేటప్పటికి రాత్రి 11 అవుతోంది. బుక్ చేసిన క్యాబ్ వాడేమో బుకింగ్ కాన్సల్ చేసేశాడు. ఒక్కదాన్నే రోడ్డు మీద బిక్కుబిక్కు మంటూ నిలబడి వేరే క్యాబ్ బుక్ చేయటానికి ట్రై చేస్తున్నాను. ఏవీ బుక్ అవట్లేదు. టెన్షన్ పెరిగి పోతోంది. ఏంచేయాలో అర్థంకాక మా కలీగ్ శ్రీధర్ కి కాల్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. వాడెప్పుడూ నాచుట్టే తిరుగుతుంటాడు. వేరే అమ్మాయిలనస్సలు పట్టించుకోడు. నాకు ఏదన్న ప్రాబ్లమ్ వచ్చినా వెంటనే సాల్వ్ చేస్తాడు...వాడు ఇవాళ లీవ్ లో వున్నాడు.

అన్నట్టు నా పేరు. స్వాతి. నేను 3 ఇయర్స్ నుండి అసేంచర్ లో టీంలీడ్ గా వర్క్ చేస్తున్నాను.

తప్పేదిలేక శ్రీధర్ కు కాల్ చేశాను. రింగ్ అవుతోంది..... హలో స్వాతి.. ఏమైంది...ఈ టైంలో కాల్ చేశావ్ అన్నాడు శ్రీధర్నా. తనకు పరిస్థితి అర్థం అయ్యేలా చెప్పాను.
సరే ఇప్పుడే వస్తాను. నువు టెన్షన్ పడొద్దని చెప్పి కాల్ కట్ చేశాడు. నేను అలాగే మొబైల్ చూసుకుంటూ నిల్చున్నాను. ఇంతలో ప్రేమ్ నుండి మెసేజ్ వచ్చింది. హే హాయ్. ఈరోజు ఆఫీస్ నుండి లేటుగా బయల్దేరావంట. సందీప్ చెప్పాడు. నీ డ్రాపింగ్ వేహికల్ కూడ్ రాలేదంట. ఏదైనా ప్రాబ్లమ్ వుంటే ప్లీజ్ ఇన్ఫాంచెయ్యి. అని.

ప్రేమ్ మా ఆఫీసులో కలీగ్అం. అతనంటే ఆఫీస్ లో అందరికీ ఇష్టం ఒక్క నాకు తప్ప. అతను అందరితో క్లోజ్ గా వుంటాడు. అందరూ అతని చుట్టే తిరుగుతుంటారు. మనిషి చూడ్డానికి చాలా బాగుంటాడని అందరూ అంటుంటారు. నేను మాత్రం అస్సలు పట్టించుకోను. అందరూ చెప్పేది ఒక్కటే. అతనికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుతుంటాడని. కానీ నాకెందుకో అస్సలిష్టం వుండదు అతని కలుపుగోలుతనమంటే.

ఎదురుగా బైక్ సౌండ్ వస్తోంది. హమ్మయ్యా వచ్చేశావా. చాలా టెన్షన్ గా వుంది. త్వరగా పోనివ్వు అంటూ బైక్ ఎక్కేశాను. అలా మాట్లాడుకుంటూ షార్ట్ రూట్ అయితే దగ్గరని ఆ దారినుండి వెళ్తున్నాము.
సడన్ గా ఎవరో ఒక బ్యాచ్ మూడు బైక్ లు ఆపుకొని ఏదో మాట్లాడుకుంటూ కనిపించారు. మమ్మల్ని చూడగానే రోడ్డుకు అడ్డంగా వచ్చి బైక్ ని ఆపేశారు. నాకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఎక్కడి నుండి వస్తున్నారని అడిగాడు ఆగ్యాంగ్ లోని ఒకడు శ్రీధర్ని. ఈమెకు ఆఫీస్ లేటైతే డ్రాప్ చేయడానికెళ్తున్నాను అన్నాడు. సరే సరే నువ్వెళ్ళు మేము డ్రాప్ చేస్తామని అన్నారు. నేను వెంటనే పిచ్చి పచ్చిగా వుందా.. మర్యాదగ అడ్డు తప్పుకోండి. లేదంటే పోలీసులకు కాల్ చేస్తానని అన్నాను. నన్ను చెంపమీద గట్టిగా కొట్టి చెయ్యి పట్టుకొని కిందకు లాగేశారు. నీకు బతకాలని ఆశవుంటే మూసుకొని బయలుదేరు ఇక్కడినుండి అన్నారు శ్రీధర్ తో.
నీకేంకాదు... నేనిప్పుడే వెళ్లి పోలీసులను తీసుకొస్తా అంటూ ఏడుస్తూ నన్నొంటరిగా అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.
ఇక నాకు చావటం తప్ప వేరే దారి కనిపించట్లేదు. ఈమృగాలచేతికి చిక్కటం కంటే అదే చాలా బెటర్ అనుకొని నా బ్యాగులో వున్న నెయిల్ కటర్ తీసుకొని పొడుచకోబోయాను. ఇంతలో వారిలో ఒకడు చేతిని గట్టిగా పట్టుకొని... అంత తొందరదేనికి.. ఆగు కాసేపు అని నవ్వటం మొదలెట్టడు.
వారిలో ఒకడు.. ఈరోడ్డు మీద ఎక్కవ సేపుంటే ఎవరైనా వస్తారు. ముందు పక్కకు తీసుకెళ్దాం అన్నాడు...
అలా అంటూండగానే ఏదో బైక్ చాలా ఫాస్ట్ గా మావైపే వచ్చి ఆగింది...
ఒక్క క్షణంలో పోయే నా ప్రాణాన్ని పట్టి లాగి నాకు తిరిగి ఇచ్చినట్టయ్యింది. నేను వెంటనే బిగ్గరగా... ప్రేమ్ మ్ మ్... అంటు అరచి ఏడ్వటం మొదలెట్టాను.

కళ్ళలో నిండిన నీటిలో కూడా తన కళ్ళు నిప్పు కనికళ్ళా కనిపిస్తున్నాయి. భయ్యా తప్పు చేస్తున్నారు. మంచిగా చెప్తున్నాను మమ్మల్ని వదిలేయండి. అన్నాడు.

నీకు బతకాలని లేకపోతే తీసుకెళ్ళటానికి ట్రైచెయ్యి అన్నారు.
నన్ను చంపే ధైర్యం మీలో ఒక్కరి కళ్ళలో కూడా కనబడట్లేదు గానీ, నన్నెక్కువ విసిగించకుండా బయలుదేరండి అన్నాడు. అంతలో వాళ్ళలో ఒకడు.. వద్దురా పోదాం పద. మనం చేస్తోంది తప్పేమోరా అన్నడు.. అవునురా అని ఇంకోడు పలికాడు.
ఇంతలో ఇంకొకడు..రేయ్ వీడు ఒక్కడున్నాడు. మనమేంట్రా వీడికి భయపడేది. అన్నాడు.
ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి...
ఇంతకు ముందు ఇలాగే నా గీతకు జరిగినప్పుడు కాపాడుకోడానికి నేను లేను. ఇప్పుడు తనను చూస్తూ చావలేక బతుకుతున్నాను. ఆబాధ నానరాలను తెంపుతోంటే ఏంచేయాలో తెలీక కుమిలి కుమిలి ఏడుస్తూ నరకయాతన అనుభవిస్తున్నాను. మళ్లీ అలా నాకు తెలిసి తెలిసి ఇంకెకవరికీ జరుగకూడదని, అలాంటి పరిస్థితుల్లోని వారిని కాపాడేసమయంలో నా ప్రాణానికి ఏంజరిగినా పర్వాలేదని ఫిక్స్ అయ్యున్నాను. సరిగ్గా ఇప్పుడు మీరు దొరికారు. మీకు ఆలోచించుకోడాని రెండేనిముషాలు ఇస్తున్నా.... అన్నాడు ప్రేమ్.

అంతే... అక్కడినుండి మెల్లగా జారుకున్నారు అందరూ.
అప్పుడర్థమైంది స్వాతికి ప్రేమ్ ని అందరూ ఎందుకు ఇష్టపడుతారో. ఐయామ్ ఎక్స్ ట్రీంలీ సారీ ప్రేమ్ అని ఏడుస్తూ కౌగిలించుకోబోయింది.
అతను ఆగమని సైగచేసి బండి ఎక్కమని చూపించాడు.
బైక్ ఎక్కి,... గీతకు ఇప్పుడెలావుంది.. తనని ఓ సారి చూడాలనుంది ప్రేమ్ అని అడిగాను.
తను-ఆటాపిక్ వదిలెయ్ ప్లీజ్... అన్నాడు.
ప్లీజ్ ప్రేమ్.. చాలా బాధేస్తోంది. పాపం తను... ప్లీజ్ అని అడిగాను.
క్యూర్వెల్ హాస్పిటల్ కి వెళ్ళి డాక్టర్ ప్రీతమ్ అని వుంటారు. అతనిని కలువు. గీతను చూపిస్తారు. అన్నాడు.
ఆరోజు రాత్రి నాకస్సలు నిద్ర పట్టలేదు. ఎప్పుడెప్పుడు గీతను చూస్తానా అని ఆలోచిస్తూ వుండిపోయాను.
మరుసటిరోజు ఆఫీసుకు లీవ్ పెట్టేసి ప్రేమ్ చెప్పిన హాస్పిటల్ కు చేరుకున్నాను. అతను చెప్పిన డాక్టరును కలిసి గీతను చూడాలి అని అడిగాను.
అప్పుడు డాక్టర్ ఆశ్చర్యంగా చూసి, ఎందుకు. అసలు మీరెవరు అని అడిగారు. ఏంచెప్పాలో అర్థంకాక వాళ్ళ ఫ్రెండుని అని చెప్పాను. లెఫ్టుకి తిరిగి స్ట్రైటుగా వెళ్లి అక్కడ రామన్న అని వుంటాడు. అతనిని అడగండి అనిచెప్పి వెళ్లిపోయాడు డాక్టర్ .
నేను వెళ్లి రామన్నను గీతను చూడాలి అన్నాను. రండి అని ఒకరూములోకి తీసుకెళ్ళాడు. అదేంటి ఈరూములోకి తీసుకొచ్చావ్ అని అడిగేలోపే... ఎదురుగా ఉన్న ఒక అరను లాగి ఇదుగో చూడండి ఈమే గీత అన్నాడు....
ఒక్కసారిగా నాగుండెనెవరో గట్టిగా పొడిచినంత బాధయ్యింది. కన్నీళ్ళతో వెంటనే బయటకొచ్చేశాను...
ప్రేమ్ కు ఫోన్ చేశాను. ఆమె చని పోయి రెండు నెలలవుతోంది. కేసు ఇన్వెస్టిగేషన్ లో వుంది. అందుకే మార్చురీలోనే వుంచారు అని బాధతో మాట్లాడలేక కాల్ కట్ చేసేశాడు ప్రేమ్.........
ఇంత బాధలో కూడా అందరితోనూ నవ్వుతూ సరదాగా వుండే ఈ ప్రేమ్ గురించి ఎంత తప్పుగా అనుకున్నానో అని బాధపడుతూ ఇంటికి పయనమయ్యాను.
తెలుగులో విజ్ఞానం

రచన : వంశీకృష్ణ కాసులనాటి