Pages

కల(ఓకథ)



హలో అమ్మా... చెప్పమ్మా... వినబడుతోందిలే. హా.. బయటకొచ్చాము. కూరగాయలు కొందామని. హా దీనికేం మమ్మల్నందరినీ ముప్పు తిప్పలు పెడుతూ అన్ని ఫ్లాట్లూ పరిగెత్తిస్తోంది. నాన్నగారికెలావుంది ఆరోగ్యం. ఈసారి పండక్కు తప్పకుండా వస్తాము లేమ్మా. ఈయనకు అస్సలు కుదరట్లేదు. ఈసారి తీసుకెళ్ళకపోతే నేనే వెళ్ళొస్తా అని ఖరాఖండిగా చెప్పేశానులే....అంటూ యామిని తన మొబైల్ లో మాట్లాడుతూ పాప శరణ్యను ఇంకో చేతితో పట్టుకొని నడుస్తోంది. ఇంతలో ఎదురుగా వస్తున్న ఒకామె యామినికి పొరబాటున తగిలి ఫోన్ కింద పడిపోయింది. హలో అమ్మా... వినబడుతోందా. ఇక్కడ రోడ్ దాటాలి. ఇంటికెళ్ళి మాట్లాడుతాలే అని ఫోన్ పెడుతూండగానే..... శరణ్యా.... అంటు కుప్పకూలి పోయింది యామిని.......
మమ్మీ... మమ్మీ.... ఏమైంది మమ్మీ అంటూ తన మూడేళ్ళ శరణ్య తనని నిద్రలేపసాగింది...
ముచ్చెమటలు పట్టిన తన శరీరంతో ఆందోళనగా చిన్నగా కళ్ళు తెరచి చూచింది యామిని.
యామిని అరుపులకు తన భర్త కార్తీక్ ఖంగారుగా ఏమైంది యామిని. శరణ్య ఇక్కడే వుందిగా. ఇదిగో నీపక్కనే వుంది చూడు అని తన తల నిమురుతూ చెప్పాడు...
ముందు కాస్త ఈ నీళ్లు తాగి రిలాక్స్ అవ్వు....
తను నీళ్లు తాగి ఏడుస్తోంది...
ఏమైంది యామిని. టెన్షన్ పడొద్దు నేనున్నాగా..అంటూ కార్తీక్ తనచేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఏదోపీడకలయ్యుంటుంది. ఏమీ ఆలోచించకు నేను శరణ్య నీ పక్కనే వున్నాము నువ్వు ముందు ప్రశాంతంగా పడుకో. రేపు వుదయం మాట్లాడుకుందాం అని చెప్పి పడుకున్నాడు...
మరుసటి రోజు: వంటగదిలో కఫీపెడుతోన్న యామినిని కార్తీక్, ఏమైంది నిన్న? ఏదైనా పీడకల వచ్చిందా యామినీ? ఎందుకంత గట్టిగా అరిచావ్ అని అడిగాడు.
అప్పుడు యామిని- అవునండీ. నా గుండె ఆగినంత పనైంది.
కార్తీక్- ఏంటా పీడకల యామినీ?
యామిని- నేను పాప రోడ్ క్రాస్ చేస్తుండగా పాప నా చేయి వదిలి ముందుకెళ్ళగానే ఏదో వాహనమొచ్చి ఢీకొన్నట్టు కల వచ్చిందండీ అంటూ కన్నీటి పర్యంతమైంది.
అందుకే యామినీ నీకు ఎన్నో సార్లు చెప్పాను పడుకునేముందు ఆ మొబైల్ లో వీడియోలు చూడడం ఆపెయ్యమని. మనం పడుకునేముందు వేటిగురించి ఆలోచిస్తామో 99% అవే మనకు కలల్లో వస్తాయని సైంటిఫికల్గా రుజువుచేశారు సైంటిస్ట్లు.
సో.. డోంట్ వర్రీ. ఈరోజైనా పడుకునేముందు మొబైల్ పక్కన పెట్టెయ్యి. ఓకేనా? అని అడిగాడు కార్తీక్.
అందుకు యామిని సరే అన్నట్టుగా లీలగా తల ఆడించింది. సరే నేను ఈరోజు ఆఫీసునుండి రావడం కాస్త లేటవుతుంది. సో పక్కింటి శాంతి గారితో కలిసి సరదాగా ఏదైనా పార్కుకు వెళ్ళిరండి పాపను తీసుకొని. నీ మనసుకుకు కూడా కాస్త వూరట వుంటుంది అంటూ తను ఆఫీసుకు రెడీ అవుతున్నాడు కార్తీక్.
కార్తీక్ ఆఫీసు కెళ్ళి వచ్చాడు. ఇక అందరూ ఆ కల గురించి మర్చి పోయి హాయిగా మాట్లడుకుంటూ భోజనాలు ముగించుకొని పడుకున్నారు.
తెల్లవారుఝాము 4.00 గంటలకు....
శరణ్యా... శరణ్యా.. అంటూ గట్టిగా కేకలు పెట్టసాగింది యామిని. మళ్లీ కార్తీక్ లేచి నిన్నటి లాగే సముదాయించి పడుకున్నారు.
మరుసటి రోజు ఉదయం...
కార్తీక్: మళ్ళీ అదే కలేనా యామినీ?
యామిని: అవునండీ. మళ్ళీ అదేకల. నాకు చాలా భయంగా వుందండీ. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమౌతాయని మా బామ్మ, తాతయ్య వాళ్ళు చాలాసార్లు చెప్పారు. ఎందుకలాంటి కలవస్తోందో ఏమీ అర్థం కావడం లేదు. మీరు చెప్పినట్టుగా రాత్రి ఫోన్ కూడా ముట్టుకోలేదండీ.. అని చెప్పి బోరున ఏడ్వసాగింది యామిని.
సరే ఈరోజు చూద్దాము. మళ్లీ అదే రిపీటయితే మా ఫ్రెండు షణ్ముగం వున్నాడుగా. అదే ఆ సైక్రియాటిస్ట్. వాడితో మట్లాడి వెళ్ళి కలుద్దాం. ఏం వర్రీకావద్దు. పాపకు ఏమీ అవ్వదు. మనమున్నాంకదా. చూడు అది ఎంత హాపీగా ఆడుకుంటుందో... డోంట్ వర్రీ యామినీ.. అని చెప్పి అంతటితో ఆ టాపిక్ కి ముగింపు పలికారు...
మరుసటి రోజు తెల్లవారుఝాము 4.00గం...
మళ్ళీ అదేకల మళ్లీ మళ్లీ... అవే కేకలు..
కార్తీక్ కు ఏంచేయాలో అర్థం కాలేదు. ఇక లాభంలేదు. డాక్టర్ కు చూపించాల్సిందే అని నిర్ణయించుకున్నారు.
మరుసటి రోజు ఆఫీసుకి లీవ్ పెట్టేసి యామినిని తీసుకొని తన ఫ్రెండ్ డా||షణ్ముగం దగ్గరకు తీసుకెళ్ళాడు కార్తీక్.
డాక్టర్ షణ్ముగం : ఎప్పటి నుండి ఈకల వస్తోంది యామిని?
యామిని: మూడు రోజులుగా.
డాక్టర్ షణ్ముగం: సరే. మొదటిసారి కల వచ్చిన రోజు ఉదయం నుండి నువు ఏమేం చేశావో చెప్పగలవా.?
యామిని:ఉదయాన లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్టు ప్రిపేరు చేసి ఆయనకు బాక్సు కట్టిచ్చాను. ఆ తర్వాత పాపను తీసుకొని మార్కెట్టుకు వెళ్ళొచ్చాను. తర్వాత వంట ఆతర్వాత మధ్యాహ్నం పాపను నిద్రబుచ్చి నేను అలా కునుకు తీశాను. ఆతర్వాత ఈవినింగ్ పక్కింటావిడతో కాసేపు కబుర్లు చెప్పుకున్నాను. ఈయన వచ్చాక మళ్ళీ వంట, ఆతర్వాత భోజనం చేసి పడుకున్నాం.
డాక్టర్ షణ్ముగం: వెయిట్ వెయిట్.. ఈ మధ్యలో మొబైల్లో ఏమైనా ఆక్సిడెంట్స్ కి సంబంధించిన వీడియోస్ చూసావా? అదే మొన్న కరీంనగర్లో ఒక లేడీ ఫోన్ మాట్లాడుతూ బాబును చెయ్యి వదిలేస్తే వాడు రోడ్డు అవతలున్న ఐస్క్రీమ్ బండి దగ్గరకు పరుగెడుతుంటే ఒక బస్సు వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అలాంటి వీడియోస్?...
యామిని : నో..
డాక్టర్ షణ్ముగం : బాగా గుర్తు తెచ్చుకో యామిని. నువు పాపతో బయటకెళ్ళినపుడు రోడ్ మీద ఏమైనా ఆక్సిడెంట్స్ లాంటివి ఎదురుపడ్డాయా?.
యామిని : లేదు లేదు... కానీ... (ఆలోచిస్తోంది?)
డాక్టర్ షణ్ముగం : హా.. చెప్పు.. ఏమైంది.. బాగా గుర్తు తెచ్చుకో..
యామిని : నేను ఫోన్లో అమ్మతో మాట్లాడుతుండగా ఒకామె ఎదురుగా వచ్చి నన్ను ఢీకొట్టింది. అప్పుడు ఆమె వెనక్కి తిరిగి నన్నే చూస్తూ ఏదో చెప్పి వెళ్ళి పోయింది...
డాక్టర్ షణ్ముగం: ఏం చెప్పిందో గుర్తుందా?
యామిని : గుర్తుకు రావట్లేదు.
డాక్టర్ షణ్ముగం: కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచించి చూడు యామిని. పోనీ ఆమెను నువు ఇంతకు ముందెపుడైనా చూశావా... ఆలోచించు.. ప్రశాంతంగా ఆలోచించు..
ఒక రెండు నిముషాల తర్వాత.....
యామిని : ఒక్కసారిగా యామిని శరీరం చెమటలతో నిండి పోయింది. ఠక్కున కళ్ళు తెరచి గుర్తొచ్చింది అనింది..
డాక్టర్ షణ్ముగం: చెప్పు యామిని.. ఏమంది ఆమె?
యామిని : పిల్లలకన్నా ఫోన్ ముఖ్యమైనపుడు కనడందేనికి.? అదినీ చెయ్యి వదిలేసి వెళ్తుంది చూడు. ఏదో ఒక వేహికలొచ్చి గుద్దిన తర్వాత ఎంత ఏడిస్తే ఏమి లాభం? జాగ్రత్తగా చూసుకోవే... అనింది.
డాక్టర్ షణ్ముగం: ఆమెవరో గుర్తొచ్చిందా అని అడిగేలోపే యామిని కళ్ళు కన్నీటితో నిండి పోయాయి.
ఏం బాధపడకు. నీ కలకు ముగింపు పలకడానికే ఇవన్నీ అడిగి నీకు గుర్తు చేస్తున్నా యామిని. చెప్పు యామిని. ఆమెవరో తెలుసా?
యామిని : అవునన్నట్టు తల వూపింది.
తను నా ఫ్రెండ్ సాహిత్య.. అది యిలాగే ఫోన్ మాట్లాడుతూ తన కొడుకుతో బాటు రోడ్ క్రాస్ చేస్తుండగా వాడు దీని చెయ్యి వదిలేసి పరిగెత్తాడు. ఇంతలో ఆక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే........ అని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆపేసింది.
డాక్టర్ షణ్ముగం : ఓహ్ మైగాడ్. ఐయామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ యామిని... మేబీ తనే నీకు గుర్తు చేస్తోందనుకుంటా.. తనలాగా నువ్వు బాధపడకూడదని అలా చెప్పిందేమో.. సో.. నీవు ఫోను వాడడంలో కాస్త జాగ్రత్త వహిస్తే ఇక ప్రాబ్లమ్స్ ఏవీ వుండవు. ఇంకేమీ ఆలోచించకు యామిని. కొన్నరోజులు అలా మీ అమ్మగారింటికి వెళ్లి ప్రశాంతంగా గడిపి వచ్చెయ్యి అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు డాక్టర్ షణ్ముగం.
యామిని: సరే అంటూ కళ్ళు తుడుచుకొని అక్కడి నుండి బయలుదేరింది.
కార్తీక్ : థాంక్యూ సోమచ్ రా. అంటు డాక్టర్ షణ్ముగానికి షేక్ హాండ్ ఇచ్చి బయలుదేరారు.
డాక్టర్ షణ్ముగం : యామినీ... అన్నట్టూ.. మీ ఫ్రెండ్ సాహిత్యకు కాల్ చేసి చెప్పు. నేను ఫోన్ విషయంలో జాగ్రత్తగా వుంటానని, ఇంకెప్పుడూ కలలోకొచ్చి డిస్టర్బ్ చెయ్యొద్దని. అని చెప్పి నవ్వాడు.
యామిని : వెనక్కి తిరిగి.. వాళ్ళ బాబు చనిపోయిన కొన్నిరోజులవరకు తను తీవ్ర మనస్తాపంతో, బాధపడి చని పోయింది. అని చెప్పి వెళ్ళి పోయింది. - - - -

తెలుగులో విజ్ఞానం

రచన : వంశీకృష్ణ కాసులనాటి

భగవద్గీత శ్లోకాల అర్థం

*భగవద్గీత 101శ్లోకాల అర్థం*

1. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారంశము, భక్తుడైన అర్జునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారతయుద్దము జరుగరాదని సర్వవిధముల భగవానుడు ప్రయత్నించెను. కానీ, ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్ధములాయెను. అటుపిమ్మట శ్రీకృష్ణుడు పార్దునకు సారధియై నిలిచెను.
యుద్దరంగమున అర్జునుని కోరిక మేరకు రధమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయం ద్రవించి.

2. స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయాము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్భాణము లను క్రింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మా...

౩. దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చిగాని, నిత్యములు, శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు.

4. జీవునకు దేహమునందు బాల్యము, యౌవనము, ముసలితనము యేట్లో మరొక దేహమును పొందుటకు కూడా అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహము నొందరు.

5. మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రములను వదలి నూతన వస్త్రములను ధరించునో అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది.

6. ఆత్మ నాశనము లేనిది, ఆత్మను శస్త్రములు చేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు అర్పివేయును సమర్ధము కాదు. ఆత్మ నాశనము లేనిది.

7. పుట్టినవానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు.

8. యుద్దమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జునా! యుద్దమును చేయు కృతనిశ్చయుడవై లెమ్ము.

9.కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు.

10.దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడును, రాగము, భయము, క్రోధము పాయిన వాడును, స్థితప్రజ్ఞుడని చెప్పబడును.

11.విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వాణి యందను రాగమధికమై, అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధమువలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముముగా మనుజుడు బుద్ద్దిని కోల్పోయి చివరకు అధోగతి చెందును.

 
12. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుస్టారము, బ్రహ్మప్రాప్తిసాధనము కలిగిన జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు.

13. అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసుకలు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్దిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను, ముక్తి కలుగు చున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడియున్నది.

14. అన్నము వలన జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూరును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవమగును. 

 
15. పార్దా! నాచే నడుపబడు ఈ లోకము అను చక్రమును బట్టి, యెవడు అనుసరింపడో, వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్ధుడు, జ్ఞానీ కానివాడు సదా కర్మల నాచరించుచునే ఉండవలెను.

16. ఉత్తములైన వారు దేని నాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించును.

17. అర్జునా! నీ వోనర్చు సమస్త కర్మలనూ నా యందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై, అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్దము చేయుము.

18. చక్కగా అనుస్టింపబడిన పరధర్మము కన్న, గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది.

19. పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామముచేత జ్ఞానము కప్పబడి యున్నది.

20. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్దినొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంరక్షణముల కొఱకు ప్రతీయుగమునా అవతారము దాల్చుచున్నాను.

21. అనురాగము, భయము, క్రోధము వదలి నా యందు మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి.

22. ఎవరెవరు యేయే విధముగా నన్ను తెలియ కోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించు చున్నాను కానీ, ఏ ఒక్కనియందు అనురాగాముకాని, ద్వేషముగాని లేవు.

23. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టివానిని పండితులని విద్వాంసులని పల్కుదురు.

24. యగ్నపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము గూడ బ్రహ్మమనియే తలంచవలయును.

25. శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్ధుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును.

26. కర్మ సన్యాసములు రెండునూ మోక్షసోపాన

సాధనములు. అందు కర్మ పరిత్యాగము కన్నా, కర్మానుష్టానమే శ్రేష్ఠమైనది.

27. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పనముగా కర్మల నాచరించునో, అతడు తామరాకుకు నీటిబిందువులు అంటని రీతిగా పాపమున చిక్కుబడదు.

28. ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్థతత్వమును జూపును.

29. విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణునియందును శునకము శునక మాంసము వొండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి వుందురు.

౩౦. దేహత్యాగము నకు ముందు యెవడు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించునో, అట్టివాడు యోగి అనబడును.

31. ఎవడు ఇంద్రియములను జయించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంబిమపజేసి, మనస్సును, బుద్దిని, స్వాధీన మొనర్చుకొని, మోక్షాసక్తుడై యుండునో అట్టివాడే ముక్తుడనబడును.

32. సకల యజ్ఞ తపః ఫలములను పొందువానిగాను, సకల ప్రపంచ నియామకునిగను, నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు.

౩౩. అర్జునా! సన్యాసమని దేనినందురో, దానినే కర్మయోగ మనియు అందురు. అట్టి యెడ సంకల్పత్యాగమొనర్పనివాడు యోగి కాజాలడు.

౩4. యుక్తాహార విహారాదులు, కర్మాచరణము గలవానికి ఆత్మసంయమ యోగము లభ్యము.

35. గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము కలిగి అత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును.

౩6. సకలభూతము లయందూ సమదృష్టి కలిగినవాడు, అన్ని భూతములు తనయందును, అన్ని భూతములయందును చూచుచుండును.

37. అర్జునా! ఎట్టివానికైనను, మనస్సును నిశ్చలముగా నిల్చుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాసవైరాగ్యములచేత నిరోధింప వచ్చును.

38. అర్జునా! పరిపూర్ణమైన విశ్వాసముతో నన్నాశ్రయించి వినయముతో ఎవరు సేవించి, భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు.

39. వేలకొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ది కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యదార్ధముగా తెలుసుకోన గలుగుచున్నాడు.

40. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి యెనిమిది విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము.

41. అర్జునా! నా కన్నా గొప్పవాడుగాని, గొప్పవస్తువుగాని, మరేదియు ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గ్రుచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమై ఉన్నది.

42. భూమియందు సుగంధము, అగ్నియందు తేజము, ఏళ్ళ భూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము.

43. పార్దా! త్రిగునాత్మకము, దైవసంబందమగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభసాధ్యము.

44. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్నా శ్రయించుచున్నారు.

45. జ్ఞాన సంపంనుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను శరణము నొందుచున్నాడు.

46. ఎవడు అంత్య కాలమున నన్ను స్మరించుచు శరీరమును వదలుచున్నాడో, వాడు నన్నే చెందుచున్నాడు.

47. అర్జునా! ఎవడు అభ్యాసయోగాముతో, ఏకాగ్రచిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించునో, అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణపురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువుకన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారమున కన్నా ఇతరుడు.

48. ఇంద్రియగోచరము కాని పరబ్రహ్మపదము శాశ్వతమైనది. పునర్జన్మ రహితమైన ఆ ఉత్తమపదమే పరమపదము.

49. జగత్తునందు శుక్లకృష్ణములనెడి రెండు మార్గములు నిత్యములుగా నున్నవి. అందు మొదటి మార్గము వలన జన్మ రాహిత్యము, రెండవదాని వలన పునర్జన్మము కలుగుచున్నవి.

5౦. యోగియైనవాడు వేదాధ్యయనము వలన, యగ్నతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మ పదవిని పొందగలడు.

51. పార్దా! ప్రళయకాలమునందు సకల ప్రాణులును, నాయందు లీనమగుచున్నవి, మరల కల్పాదియందు సకల ప్రాణులను నేనే సృష్టించుచున్నాను.

52. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందును నన్నే ధ్యానించుచుండునో, అట్టివాని యోగ క్షేమములు నేనే వహించుచున్నాను.

53. ఎవడు భక్తితో నాకు పత్రమైనాను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడో, అట్టి వానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను.
54. పార్దా! నాయందు మనస్సు లగ్నముచేసి యెల్లకాలము యందు భక్తీ శ్రద్దలతో స్థిరచిత్తుడవై పుజించితినేని నన్నే పొందగలవు.

55. కశ్యాపాది మహర్షి సప్తకము, సనకసనందనాదులు, స్వయంభూవాది మనువులు నావలననే జన్మించిరి. పిమ్మట వారివలన ఎల్లలోకమందలి సమస్త భూతములు జన్మించును.

56. పండితులు నాయందు చిత్తముగలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావ మెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందము ననుభవించు చున్నారు.

57. సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు నాశములకు నేనే కారకుడను.

58. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే.

59. రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో

గరుత్మంతుడు నేనే.

6౦. లోకమునందు ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తెజోభాగము వలననే సంభవములు.

61. పార్దా! దివ్యములై, నానావిధములై, అనేక వర్ణములై, అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కనులార దర్శింపుము.

62. ప్రభో కృష్ణా! దేవా! ఎల్లదేవతలు, ఎల్లప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకీ మొదలగుగాగల యెల్ల సర్పములు నీయందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వరా! నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లయ్యుయు నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై, ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుటవలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో! నా యందు దయముంచి నాకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణా! ప్రసన్నుడవు కమ్ము.

6౩. అర్జునా! ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్దము నకు సిద్దపడినవారిని నీవు చంపకున్ననూ బ్రతుకగల వారిందెవ్వరును లేరు.

64. ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రధ కర్ణాది యోధ వీరులు నాచే సంహరింప బడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము.

65. అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి, కిరీటము, గద, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింప గోరుచున్నాను కృష్ణా...

66. అర్జునా! నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరునూ సదా కోరుచుందురు.

67. ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి, శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు.

68. అభ్యాస యోగము కన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్న కర్మఫలత్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి, మోక్షప్రాప్తి సంభవించుచున్నది.

69. ఎవడు కోరికలు లేనివాడై, పవిత్రుడై, పక్షపాతరహితుడై, భయమును వీడి, కర్మఫలత్యాగియై నాకు భక్తుడగునో, అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు.

7౦. శత్రుమిత్రుల యందును, మానావ మానములయందును, శీతోష్ణ సుఖ దుఃఖాదులయందును సమబుద్ది కలిగి సంగరహితుడై, నిత్యసంతుస్టుడై, చలించని మనస్సు గలవాడై, నా యందు భక్తిప్రవత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు.

71. అర్జునా! దేహము క్షేత్రమనియు, దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు.

72. ఆత్మజ్ఞానము నందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగియుండుట జ్ఞానమార్గాములనియు, వానికి ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును.

7౩. ప్రకృతిని ‘మాయ’ యని యందురు.
అది శరీర సుఖ దుఃఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు, ఆ సుఖదుఃఖాదులను అనుభవించు చుండెను.

75. అర్జునా! గుణనాశరహితుడైనవాడు పరమాత్మ, అట్టి పరమాత్మ దేహాంతర్గుడయ్యును. కర్మలనాచారించువాడు కాడు.

76. పార్దా! సుర్యుడోక్కడే యెల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింప జేయుచున్నాడో, ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు ఏళ్ళ దేహములను ప్రకాశింపజేయుచున్నాడు.

77. జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీస్వరులు మోక్షమును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించు చున్నాను.

78. అర్జునా! ప్రపంచమున జన్మించు ఎల్లా చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది. నేను తండ్రి వంటివాడను.

79. అర్జునా! త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటంజేసి, సుఖ జ్ఞానాభిలాషల చేత, ఆత్మను దేహమునందు బందించు చున్నది.

8౦. ఓ కౌంతేయా! రజో గుణము కోరికలయందు అభిమానము, అనురాగము పుట్టించి, ఆత్మను బందించుచున్నది.

81. అజ్ఞానము వలన బుట్టునది తమోగుణము, అది సర్వప్రాణులను మొహింపజేయునది. ఆ గుణం, మనుజుని ఆలస్యముతోను, అజాగ్రత్తతోను, నిద్రతోను బద్దునిజేయును.

82. మానావ మానములయందు, శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతు డందురు.

8౩. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల అశ్వర్థవృక్షము అనాది అయినది. అట్టి సంసార వృక్షమునకు వేదములు ఆకులు వంటివి. అట్టిదాని నెరింగినవాడే వేదార్ధసార మెరింగినవాడు.

84. పునరావృత్తి రహితమైన మోక్షపధము, సుర్యచంద్రాద్నుల ప్రకాశమున కతీతమై, నా ఉత్తమ పథమై యున్నది.

85. దేహులందు జటరాగ్నిస్వరూపుడనై, వారు భుజించు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పదార్థముల జీర్ణము చేయు చున్నాను.

86. పార్దా! సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, కావరము లేకుండుట మొదలుగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే డంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠీనపు మాటలాడుట, అవివేకము, మొదలగు గుణములు రాక్షసాంశమున బుట్టిన వారికుండును.

87. కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశామును చేయును. అవి నరకప్రాప్తికి హేతువులు కావున, వానిని వదలి వేయవలెను.

88. శాస్త్రవిషయముల ననుసరింపక యిచ్చామార్గమున ప్రవర్తించువాడు సుఖసిద్దులను పొందజాలడు. పరమపదమునందజాలడు.

89. జీవులకు గల శ్రద్ధ, పూర్వజన్మ వాసనాబలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగా నున్నవి.

9౦. సత్వగుణులు దేవతలను, రాజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణులు భూతప్రేతగణంబులను శ్రద్ధాభక్తులతో పూజ
ించుచుందురు.

91. ఇతరుల మనస్సుల నొప్పింపనిదియు, ప్రియము, హితములతో కూడిన సత్యభాషనము, వేదాద్యన మొనర్చుట, వాచకతపస్సని చెప్పబడును.

92. జ్యోతిష్టోమాది కర్మల నాచరింప కుండుట సన్యాసమనియు, కర్మఫలము, ఈశ్వరార్పణ మొనర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు.

9౩. కర్మములు- ప్రియములు, అప్రియములు, ప్రియాతి ప్రియములని మూడు విధములు. కర్మఫలము కోరినవారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుచున్నాడు. కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు.

94. అర్జునా! కర్మమోక్షమార్గముల, కర్తవ్య భయాభయముల, బంధమోక్షముల, ఏ జ్ఞానమెరుగుచున్నదో అది సత్వగుణ సముద్భనమని ఎరుగుము.

95. ఈశ్వరుడు యెల్ల భూతములకు నియామకుడై, ప్రాణుల హృదయ ముందన్నవాడై, అంత్రగాడు బొమ్మలనాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయు చున్నాడు.   

 
96. సమస్త కర్మల నాకర్పించి, నన్నే శరణుబొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తుని గావింతును. నీవు చింతింపకుము.
     

97. ఎవడు పరమొత్క్రష్టమైనదియు, పరమ రహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకుపదేశము చేయుచున్నాడో వాడు మోక్షమున కర్హుడు.

98. ధనంజయా! పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా? నీ అజ్ఞాన జనితమైన అవివేకము నశించినదా?

99. కృష్ణా! అచ్యుతా! నా అవివేకము నీ దయవలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించినది. నాకు సందేహములన్నియు తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించెదను. 

100. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్దారియగు అర్జునుడు ,ఎచట నుందురో, అచ్చట సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతి యుండును.

101. గీతాశాస్త్రమును ఎవరు పటింతురో వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుజ్యమును పొందుదురు...



తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

సహాయం


ఒక అద్భుతమైన  కథ  
రాత్రి చీకటి పడుతోంది.  తాళం వేసిఉన్న ఇనుప ద్వారం  బయట నుండి ఒక పిలుపు.  ఎవరా అని వచ్చి చూశాను.  గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు.  చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన  బట్టలు చేతిలో చిన్న సంచి తో నిలబడి  ఉన్నారు.  అయన తన చేతిలోని చిన్న కాగితం లోకి చూస్తూ "ఆనంద్, నెంబర్ 8, యోగానంద వీధి ఇదే కదూ!" అని అడిగారు.  "అవును నేనే ఆనంద్.  ఇదే చిరునామా.  మీరూ ..." అని నసిగాను.  అయన చిన్నగా వణుకుతూ తడారి పోయిన తన పెదవులను నాలుక తో  తడుపుకుంటూ "బాబూ!  నేను మీ నాన్నగారి మిత్రుడిని.  మీ ఊరినుండే వస్తున్నాను.  నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు" ఉత్తరాన్ని చేతిలో పెట్టారు. 
అయన ఆ ఉత్తరం ఇవ్వగానే "నాన్నగారా?" అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను.  అందులో "ప్రియమైన ఆనంద్!  నీకు నా ఆశీర్వాదములు.  ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు.  పేరు రామయ్య.  చాలా కష్టజీవి.  కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక ఆక్సిడెంట్  లో చనిపోయాడు.  నష్టపరిహారం  కోసం తిరుగుతున్నాడు.  అది వస్తే అయనకు, ఆయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది.  ఆక్సిడెంట్ జరిగిన తరువాత పోలీస్ వారి విచారణలు, ట్రావెల్స్ వారు ఇస్తామని అన్న నష్టపరిహారపు పేపర్లు అన్ని సేకరించి  నీకు పంపాను.  డబ్బులు Head Office  లో తీసుకోమన్నారు.  ఆయనకు హైదరాబాద్  కొత్త.  ఏమి తెలియదు.  నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను.  ఆరోగ్యం జాగ్రత్త.  కుదిరినప్పుడు ఒక్కసారి ఊరికి రావాల్సిందిగా కోరుతూ
మీ నాన్న" అని ఉంది. 
నన్నే చూస్తూ నిలబడి ఉన్నారు రామయ్యగారు.  ఒక్క నిమిషం అలోచించి ఆయనను లోనికి ఆహ్వానించాను.  మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చి "ఏమైనా తిన్నారా" అని అడిగాను.  "లేదు బాబూ.  ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో పాటు తెచ్చుకున్న రెండు పళ్ళు మాత్రం తిన్నాన"ని  చెప్పారు.
నాలుగు దోశలు వేసుకొచ్చి అందులో కొద్దిగా ఊరగాయ వేసి ఆయన చేతిలో పెట్టాను.  "మీరు తింటూ ఉండండి" అని చెప్పి, ఆ గది బయటకు వచ్చి కొన్ని ఫోన్ లు చేసుకొని తిరిగి ఆయన దగ్గరకు వచ్చాను.  నేను వచ్చి చూసే సరికి ఆయన దోశలు ఆరగించి, చేతిలో ఏవో పేపర్లు పట్టుకుని కూర్చున్నారు.  నన్ను చూసి ఆ పేపర్ లు నా చేతిలో పెట్టారు.  అందులో ఆక్సిడెంట్ లో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది.  కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు.  సుమారు 22 సంవత్సరాల వయసు ఉంటుంది.  నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. 
"ఇతకు నా ఒక్కగానొక్క కొడుకు.  అంతకు ముందు పుట్టినవారు చిన్నతనం లోనే అనేక కారణాల వలన చనిపోయారు.  ఇతడు మాత్రమే మాకు మిగిలాడు.  పేరు మహేష్.  కష్టపడి చదివించాను.  బాగా చదువుకుని  ఉద్యోగం సంపాదించుకున్నాడు.  మమ్మల్ని చూసుకుంటానని, కష్టాలన్నీ తీరపోతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు.  ఆ రోజు రోడ్ దాటుతుండగా ఆక్సిడెంట్ జరిగింది.  అక్కడికక్కడే చనిపోయాడు.  నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డ పైన వచ్చిన పైకం వద్దనుకున్నాము.  కానీ రోజు రోజుకీ నాలో శక్తి తగ్గిపోతోంది.  నా భార్య ఆరోగ్యం బాగా  లేదు.  మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను.  నా కొడుకు సహాయం చేస్తారని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి పంపారు మీ నాన్నగారు" అని ముగించారాయన. 
"సరే పొద్దు పోయింది, పడుకోండి" అని చెప్పి నేను కూడా నిదురపోయాడు 
పొద్దున లేచి స్నానాదికాలు ముగించుకుని, కాఫీ తాగి ఇద్దరం బయల్దేరాము.  దారిలో టిఫిన్ ముగించుకుని ఆయన తీసుకొచ్చిన పేపర్ల లోని అడ్రెస్ ప్రకారాం ఆ ఆఫీస్ కు చేరుకున్నాము.  "ఆనంద్!  ఇక నేను చూసుకుంటాను.  నువ్వు ఆఫీస్ వెళ్ళు బాబు" అన్నారాయన.  "పర్లేదండి.  నేను లీవ్ పెట్టాను" అన్నాను.  దగ్గరుండి ఆ నష్టపరిహారం ఇప్పించాను.  చాలా థాంక్స్ బాబూ!  నేను ఊరికి బయల్దేరుతాను.  మా ఆవిడ ఒక్కతే  ఉంటుంది ఇంట్లో" అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యారు రామయ్య గారు.  "రండి, నేను మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్తా" అని చెప్పి, టిక్కెట్ తీసి ఇచ్చి, ఇప్పుడే వస్తానని వెళ్లి దారిలో తినడానికి పళ్ళు అవి తెచ్చి రామయ్య చేతిలో పెట్టాను. 
ఆయన సంతోషంగా "ఆనంద్ బాబూ!  నాకోసం సెలవు పెట్టుకొని, చాలా సాయం చేశావు.  ఊరు వెళ్ళగానే మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పాలి.  కృతజ్ఞతలు తెలియచేయాలి అన్నాడు. 
అప్పుడు నేను నవ్వుతూ రామయ్య గారి చేతులు పట్టుకుని "నేను మీ స్నేహితుడి కొడుకు ఆనంద్ ని కాదండీ.  నా పేరు కూడా అరవింద్.  మీరు చిరునామా మారి నా దగ్గరకు వచ్చారు.  ఆ ఆనంద్ ఇంటికి వెళ్లాలంటే అంత రాత్రిపూట మరో 2 km ప్రయాణం చేయాలి.  మీరేమో  అలసిపోయి ఉన్నారు.  అందుకే నేను నిజం చెప్పలేదు.  మీరు తెచ్చిన లెటర్ లో ఫోన్ నెంబర్ ఉండడంతో వారికి ఫోన్ చేశాను.  ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్లారట.  ఆయన భార్య చెప్పారు.  మీ మిత్రుడికి విషయం చెప్పాను.  అయన చాల బాధ పడ్డారు.  నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడంతో కాస్త కుదుట పడ్డారు.  మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిది.   కానీ ఏదో నాకు చేతనైన సహాయం చెయ్యాలనిపించింది.  నాకు ఆ తృప్తి చాలండి" అన్నాను.  బస్సు కదలడం తో ఒక్కసారి రామయ్యగారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.  "నువ్వు బాగుండాలి బాబు" అని ఆశీర్వదించారు.  ఆ మాటే చాలనుకున్నాను నేను.  పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు.  ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖం లో మా నాన్నగారు కనిపించారు. 
ఆకాశంలోకి చూశాను.  అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మానాన్న.  "నాన్నా!  నా అభివృద్ధి  చూడడానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు!  ఒక ఉత్తరం తీసుకువచ్చి నాకు చూపి నేను సాయం చేస్తానో లేదో అని పరీక్షించావా?  మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్నా!  మీకు సంతోషమేనా నాన్నా!" అంటూ ఆనంద బాష్పాలు రాల్చాను. 
"సాయం చెయ్యడానికి మనసు ఉంటే చాలు.  మిగిలినవన్నీ దానికి తోడుగా నిలబడతాయి"
నేమాని సూర్యనారాయణ
విశాఖపట్నం
27.03.2019




తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

వుద్యోగి

వుద్యోగి-కష్టాలు


  • 1)చదువులె పూర్తయి నవనుచు
    వెదకగ వుద్యోగమొకటి వెడలితి పట్నం
    వదలని కృషితో వచ్చెను
    పదిలంబగు కొలువనుచిక పదుగురు పొగడెన్

    2)తెలిసెను గదపట్నమనిన
    తెలిసెను మనుషుల కుతంత్ర తేనెల పలుకుల్
    తెలిసెను కాలుష్యమనిన
    తెలిసికొనుచు మదిలొరేగె తెలియని బాధల్

    3)అద్దెకు యింటిని వెదుకుట
    ఎద్దుకు యెదురెళ్ళి కళ్ళె మెయ్యుట తీరున్
    వృద్దుల పరుగుల పందెము
    నిద్దుర నందున కలిగెడి నిజమను కలలున్

    4)గతుకుల దారిలొ పయనమె
    మెతుకులు తినుటకు సమయమె మెదలని పనిలో
    వెదికిన దొరకదు సుఖమిక
    బతుకుదెరువు గొరకుననేనె బలియై తినిరా

    5)తప్పని జెప్పే నొక్కడు
    ఒప్పని యింకొకడు పలికి ఒత్తిడి దెచ్చున్
    చెప్పుకొనిక తప్పుకొనగ
    తప్పించే జనులులేక తనువిక కృంగెన్

    6)గజిబిజి బతుకున సాగెడి
    మజిలీలో మనసువిరిగి మౌనమె మిగలన్
    భజియింపగ దైవంబును
    రుచిబెంచగ బతుకుకు తనరూపమె జూపెన్

  • 7)కన్నులతో మాటగలిపి
    వన్నెల వయ్యారి నడుమె వలనే వేసెన్
    చిన్నని పెదవులు జేసిన
    సన్నని చిరునగవుదోటి సర్వము దోచెన్

    8)పక్కనె తోడై నడువగ
    దిక్కులనే దాటిమనసు దివిలో నిలచెన్
    మిక్కిలి సంతస మందున
    వుక్కిరి బిక్కరితొ వయసె వురకలు వేసెన్

    9)సతియే తానని నాకిక
    పతియై గాపాడుకొనుచు బతికెద యనినా
    మదినే పంచగ తానిక
    బదులే యివ్వక విడువగ ప్రశ్నలె మిగిలెన్

    10)తననడుగక నేనెరుగక
    మనువా డెదనని తలచితి మనసున తననే
    కనుగొనక మగువమనసును
    కనులుగనిన నదియెనిజము కాదని తెలిసెన్

    11)నచ్చిన నెచ్చెలి దొరకక
    హెచ్చగు యాలోచనలతొ యెదలో బాధే
    వెచ్చని కన్నీ రవుతూ
    వచ్చును తోడయ్యి నీకు వలదని యన్నా

    12)చాలుము చాలుమని మనసె
    గోలను చేయగ వినియిక కోర్కెలు బుట్టే
    మూలమె కనుగొని నడిచిన
    కాలమె నీవెనుక యుండు కడవర కైనన్

Pages:

  • <<

    >>




తెలుగులో విజ్ఞానం

రచన : వంశీకృష్ణ కాసులనాటి

రచన : వంశీకృష్ణ కాసులనాటి

బతుక మర్మము శతకము

FOR BOOK VIEW

01 నుండి 10 పద్యములు


చెమ్మ గిల్ల కనులె చేయుసా యమనుచు

ఆకలైన గూడ అడగ లేరు

అట్టి వైరి పైన ఆగ్రహం బొలదురా

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

చెప్పి చెప్ప గానె చెడుమంచినెంచక

నమ్మి నంత నీకె నష్టమొచ్చు

మాట నమ్మ బోకు మాయాజ గమ్మున

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

కోరి చేరి నట్టి కోమలి చెంతను

తనువు దెంపి నొసగు తల్లి ప్రేమ

వీడ బోకు యెపుడు విధులెన్ని యున్ననూ

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

తగిన ధనము యున్న తానునీ సొంతమై

ధనము లేని దినము దాటి నడయు

సఖియ కన్న జూడ సానియె మేలగు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

ఒకరి తోటె మనసు నొకరి తోటె తనువు

వదల బోకు నీవు వారినెపుడు

తిరిగి రాదు రన్న తెగిన బంధమెపుడు

బ్రతుక మర్మమిదియె భ్రాంతివిడుము

 

పాలు బోసి నంత పాముక రవదేమి

నీదు చెట్టు పళ్ళు నీవె యగున

సహజ గుణము లవియె సాధార ణములురా

బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము.

 

మాట లెన్నొ జెప్పి మనసును దోచేసి

పెళ్ళి యనగ ఒళ్ళు జల్లు మనుచు

తోక జార్చి తిరుగు తోడెళ్ళు యుండును

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

తావు నివ్వ బోకు తగనివారి కెదన

దిశయె లేని ఓడ తీరు యగును

ఆత్మ పంచినోళ్ళు ఆశించ రేమియు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

కలిగి వీడు గదర కష్టసు ఖమ్ములు

కష్టమొచ్చెననుచు కదలి పోకు

సుఖము లందు జనుల చులకన జేయకు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

రంగు రంగు రాళ్ళు రాతను మార్చునా

చేతి గీత లెపుడు చెరగ వేమి

జాతకములె మనిషి జన్మను మార్చునా

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

11 నుండి 20 పద్యములు


తరము గాదు రన్న తనువును గాపాడ

బేర మాడ గలవ ప్రేమ విలువ

పౌరు షంబె వీడి పరమాత్మ మెరుగుము

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

జన్మనిచ్చు వారె జననీ జనకులు నీ

ప్రాణ మిచ్చు విభుడె పరమ శివుడు

మనసు నిలుపు వాడె మహిమాన్వితుడుసుమీ

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

అరగనంత తిండి అంతులేని ధనము

సుఖముగోరి నడయు సులభమార్గ

మెపుడు కీడెజేయు మేలుకాదు వినుడీ

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

బతుక నేర్పు విద్య బడిలోన గలదేమి

జాలి కరుణ నేర్పు చదువు లేవి

పాఠ్య పుస్త కములె బాటతప్పెనుగద

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

మరల పొంద వచ్చు మణులుమా ణిక్యాలు

మంచి మనషి వీడ మరల రాడె

ధనము కొరకు జనుల దయయుంచి వీడకు

బ్రతుకమర్మమిదియె భ్రాంతి విడుము.

 

పుట్టి గిట్టె నడుమ బుడగవోలె బతుకు

అష్ట కష్ట ములతొ ఆస్తి బెంచి

అనుభ వించు లోపె ఆయువా గునుగదా

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

కలము కాగితంబె కరమున యుండగ

నిజము రాయ లేని నీకు యెపుడు

పాత్రి కేయు డనెడి పాత్రత గదుసుమీ

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

అందమెంతయున్న అణకువ లేకున్న

ఆడ దాన్ని యెవరు ఆడదనరు

జలము లేని బావి జనులకేమిఫలము

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

పాము తేళ్ళ తోటి పరిచయం బనినంత

కరచి కరచె జూపు కపట ప్రేమ

దుష్ట జనుల కెపుడు దూరమే తగునురా

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

ప్రేమ స్నేహ మనెడి వేలమన కనుచు

ఆశ పెరిగి జనులు ఆస్తి బెంచి

బంధ మొదిలి కాసు బంధీలు అవుదురు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

21 నుండి 30 పద్యములు


ధనమె దైవ మాయె ధరలోన జనులకు

ధనము లేదు యనిన దరికి రారె

కాయమున్న వరకె కాసువాం ఛలుసుమీ

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

చదువు రాని వారె చట్టాలు జెప్తుంటె

చదువు నేర్చి నోళ్ళు చవట లైరి

చదువు విలువ పోయి జారెబ తుకుసుమీ

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

చూడ వచ్చు రంట చుట్టాలు సుఖములో

కష్ట మొచ్చి నపుడు గాన రారె

కష్ట మందు కంట  కన్నీరె తోడగు

బ్రతుక మర్మమిదియె భ్రాంతివిడుము

 

నీదు జ్ఞాన మెపుడు నివ్వుము పరులకు

సాయ మొసగు రన్న శ్రమను విడచి

తెలివి బంచ తొలగు తెరలుజీ వితమున

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము,

 

ఎదుటి మనిషి బాధ నెరుగక పలికెడి

సూటి మాట లెపుడు సూది సమము

మాట భార మెరిగి మసలుట తగునురా

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

పుట్టి పుట్ట గానె మూర్ఖులు గారోయి

పెరుగు నపుడె మారు పెక్కు జనులు

మొగ్గలోనె దుంచు మోసగు ణంబుల

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

నిజము జెప్ప నీకు నిందాప నిందలే

కల్ల తోటె నడయు కలియు గమ్మె

నిజము పలుకు జనులు నిలుతురా గెలుతురా

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

అణిగి మణిగి యున్న అన్నివే ళలలోన

అణిచి వేయు జనులె యధిక ముండు

ఆత్మ గౌర వమ్మె ఆటబొమ్మాయెరా

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

హస్త రేఖ బట్టియాస్తులె వచ్చునా

పేరు మార్చ కీర్తి పెరగ దోయి

నమ్ము కొనగ నిన్నె నందని వుండునా

బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము.

 

నవ్వ బోకు పరుల  నష్టంబులనుజూచి

పరుల సుఖము పైన పగను మాను

సమయ మెపుడు నీకె సహకరిం చదుసుమీ

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

31 నుండి 40 పద్యములు


చంప దలచి నంత చంపుము మనిషినె

యదను దెంచు కన్న  యదియె మేలు

మనసు దుంచ దలచ మరణమే శరణమౌ

బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము

 

ఇష్ట మొచ్చి నట్టు ఇంటయున్న దగును

నడత చెరుపు కోకు నలుగు రందు

బతుకు చెడిన తిరిగి వచ్చునా చచ్చినా

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

గూఢ విషయ మెపుడు గుట్టుగే నుంచుము

నిన్ను దాట గుట్టు నిలుప దగున

గుట్టు రట్టు యయిన ఘోరంబె జరుగును

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

చేతి కొచ్చె నంట చెరవాణి దెయ్యంబె

చదువు, సంధ్య మాని చచ్చె యువత

చేతి స్పర్శ దెంచి చేయు నొంటరినిను

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

చదువు జనులె మరిర చయితలె యుండరు

చదివె వాడ్ని గూడ చవట జేసి

పద్యమేల తెలుగు పలుకులే లందురే

బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము.

 

నువ్వు మెచ్చి నట్టు నుండరు యందరు

నిన్ను నీవు యెరుగ నిజమె తెలియు

కారు యెవరు నీకు కానివా రనిసుమీ

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

కనులు తెరచి గాంచ కల్లయె లోకము

కనులు మూసి క్షణము గడుప దెలియు

చీక టందె యసలు జీవితమ్ముం డని

బ్రతుక మర్మమిదియె భ్రాంతివిడుము

 

మంచి మాట వినెడి మనుజులె కరువైరి

చెడువి నేరు జనులు చెవులు దెరచి

కనుల జూచి గూడ కల్లయం దురుగదా

బ్రతుక మర్మమిదియె భ్రాంతివిడుము.

 

ఆకలున్న వరకె ఆరగించి, మిగులు

దాని నిమ్ము యాక లన్న వార్కి

అర్థ మెరిగి ముద్ద వ్యర్థము జేయకు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

తగిన జలము తోటి తనువు శుభ్రమగును

మంచి మాట వినిన మనసు విరయు

మంచి కీర్తి గలుగ మరణమె యుండునా

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

41 నుండి 50 పద్యములు


కష్ట బెట్ట కుండ కంటిరెప్పగబెంచు

తల్లి దండ్రి కనులు తడుపు నట్టి

సుతుడి కన్న జూడ శునకంబె మేలగు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

పడతి ముదము జూసి పరవశమ్మును పొంది

సంబ రమ్ము తోన సతిగ గొనకు

అంద మొకటె గాదు మనసును గాంచరా

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

బండ్లు మేడలన్ని దండిగ పోగేసి

మనసు లోన దిగులు యనుట యేల

మూడు పూట్ల దొరకు ముద్దచా లుగదర

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

బాధ పంచుకొనిన భారమె తొలగును

నవ్వు పంచుకొనిన నలుగు రుందు

మనసు పంచబోకు మదిలేని జనులకు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

తీతు వనెడి పిట్ట గీతమశుభమట

పిల్లి యెదురు వచ్చు విధమె తగదు

మంచిచెడ్డ లెపుడు మనలోనె యుండును

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

దండు యెంత యున్న తల్లిపిల్ల నెరుగు

ఉన్న వాడ్నె జనులు చూతు రెపుడు

నరుడి మనసు నెపుడు నారాయ ణుడెరుగు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

మెప్పు నొందు కొరకు నేపనీ జేయకు

మనసు బెట్టి చేయ మనుగ డుండు

గొప్ప కొరకు బోయి నొప్పుకో కెప్పుడూ

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

కంచమందు కూడు కనులనిండనిదుర

కష్టబెట్టని సతి కలలు నింపు

ఇంతకన్న వేరె ఇఛ్ఛము లేలరా

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

అమ్మలేని దినము అన్నమే గిట్టదు

నాన్న లేని నాడు నాథు డెవడు

ధరణి దైవములను దయయుంచి పూజించు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

పోయు పోయి యేల పోరుపెట్టుకొనుట

పోరుకన్న వేరు పోటుగలద

మోటు మనసు తోటి మోడుబా రకుసుమీ

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

51 నుండి 60 పద్యములు


మంచి తాంబు లముతొ పండును నాలుక

ఇంతి మంచిదైన నిండు సుఖము

సజ్జనులతొ యున్న జన్మ ధన్యమగును

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

తప్పిదంబు జేసి తప్పించు కొనుకంటె

తప్పునొప్పుకొనుట తగిన గుణము

గుణము లేని వాడు గుండ్రాయి సమమురా

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

రాజకీయమనెది రాక్షస క్రీడరా

మంచి చేయ దక్కు మందలింపు

తప్పు జేసినోళ్ళె తారలై వెలుగును

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

మరణ మొచ్చు ననుచు మదిలోన దిగులేల

చేయదగిన మంచి చేయుమిపుడె

మరణమన్నదెపుడు మనసుకు కాదురా

బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము.

 

కొంచె కొంచె మైన గూర్చుము మంచిని

అంత కంత యౌను ఆత్మ శుధ్ధి

శుధ్ధి యైన ఆత్మ సుఖముల నొసగును

బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము.

 

వాడి పొయిన పూలు వాసన నివ్వవు

మాడి పొయిన కూడు మట్టి పాలె

గాడి చెడిన వాడి మాటచె ల్లదెపుడు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

వృత్తి భత్యములతొ భుక్తిచా లదనుచు

లంచమడిగి నింపు కంచ మేల

అట్టి కూడు కన్న మట్టి మేలు గదరా

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

అంతు లేనివన్ని అర్థము లేనివా

అర్థమున్న వన్ని గాన గలవ

తెలిసి దెలియ కుండ దీర్పులు జెప్పకు

బ్రతుక మర్మమిదియె భ్రాంతివిడుము

 

పెద్దవారి మాట పెడచెవి న్బెట్టుచు

హితము జెప్పు జనుల హింస జూపి

మదము తోన యున్న మనుగడె యుండదు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

బిచ్చ మడుగబోకు ప్రియురాలి ప్రేమను

కాసు కొరకు కాళ్ళు కడుగ బోకు

కాసు,కాంతలన్ని కాలమున్నవరకె

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

61 నుండి 70 పద్యములు


దర్ప ణంబు వీడి దర్శనం గల్గునా

నిన్ను నీవు గాంచ నిదియె దారి

దైవదర్శనముకు ధ్యానమే మార్గము

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

పచ్చ గడ్డి తినెడి పశువులై ననుకూడ

ఒక్క దెబ్బ తోటి వొదిగి యుండు

ఎన్ని దెబ్బలైన యెర్రోడు మారునా

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

ఎంత జేసి గూడ ఏమిజే స్తివనుచు

వాగుతున్నవాడి వాస మొదిలి

బిచ్చమెత్తి తిరుగ నిచ్చును సౌఖ్యము

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

కూడు తినెడి కాడ కులభేద మేలరా

మంచి మాట పలుక మతములేల

కులమతమ్ము వీడి గుణముల గాంచరా

బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము.

 

కామ కోరికగల కాంత యెల్లపుడును

కన్య యనుచు బలుకు కమ్మగాను

శాఖహారి ననెడి శార్దూల ముండునా

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

ఆశ పడుము గాని అత్యాశ వీడుము

మాయ జేయ బోకు మనసునెపుడు

నమ్మి చేరు జనుల నమ్మించి వీడకు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

అవసరమ్ము నొకరు అటుపిమ్మట నొకరు

సాయమొందినీవు సాకు జెప్ప

అంత్యసమయ మందు నాదరించరెవరు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

మోస బోతి వనుచు మోడువై యుండకు

భాద పడకు మనసు భార మనుచు

మనసు విత్తు యొకటె మరలైన మొలయును

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

ఏడిపించ బోకు ఎన్నడిల్లాలిని

ఇంతి కంట నీరు ఇంట కీడు

మనసు లేని పతిని మగవాడ నరుసుమీ

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

తల్లి దండ్రి మరియు తనసుఖంబుల వీడి

సగమె తాను యగును సతిగ నీలొ

కష్ట బెట్ట బోకు కాంతను యెప్పుడు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

71 నుండి 80 పద్యములు


ఆలి మనసు విరిచి ఆటలా డుకొనుచు

కామ కోరికలకె కాంత యనుచు

పలుకుతున్న నీకు పాడెగట్ట తగును

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

నుదుటి రాతలోనె నుండుజీ వితమని

చేత గాక యనకు చెత్త మాట

కష్ట పడిన దక్కు కలలసౌ ధంబులు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

వావి వరుసలొదిలి  వాంఛలు చూపెడి

నీదు బతుకు కన్న నీఛ ముంద

పశువు మేలురన్న  పరికించి చూడగా

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

వంద మంది ఆప్త బంధువులందరూ

ఆస్తి యున్న వరకె అండ నుండు

ఆయు వయ్యి యుండు నాప్తమి త్రుడొకడె

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

కోప తాప మపుడు ఓర్పుగ నుండుము

తోడ నడచు వార్ని దోషులనకు

కలిసి జేయ పనుల కలుగును జయములు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

చింతయేల నీకు చీకటి బతుకని

వెలుగు నింప గోరి వెదకి చూడ

దారి వేరె గలదె ధ్యానమా ర్గమొదలి

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

ఆకలన్న వాడి ఆకలి దీర్చుము

ప్రాణ మిచ్చు వాడి పక్క నిలుము

ఇంతకన్న పుణ్య మిలలోన దక్కునా

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

చెంత నున్న దెపుడు చేదుగే నుండును

అందరాని దెపుడు ఆశ పెంచు

ఆశ నదుపు జేయ ఆనంద మొసగును

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

కాశి నందు విడువ కాయమె ధన్యము

మనసు బెట్ట దక్కు మంత్ర ఫలము

అహము వీడి నడువ అమరంబు దక్కును

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

కఠిన విషము గూడ కలిగించదేహాని

మితము గొనిన గాని మిత్రు డైన

శత్రు వొక్కడున్న శరణమిం కెవరురా

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

81 నుండి 90 పద్యములు


తల్లి దండ్రి గురులు ధరలోన దైవాలు

సేవ జేసు కొనిన క్షేమ మగును

వీడి నడువ బోకు వీరిని యెన్నడు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

ఓర్పు విడవ బోకు వోటమి యొదురైన

గెలుపు పిదప నెపుడు అలుపు వలదు

అన్ని వేళ లందు ఆశయంబు నిడకు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

ఒక్కసారె జనన మొక్కసారెమరణ

మొక్క జీవి తంబె దక్కు నీకు

చక్క బెట్టు పూర్వ లెక్కలు అన్నియూ

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

మోము జూచి నమ్మ బోకుము జనులను

కన్ను లెపుడు జూపు కల్ల నిజము

మనసు బెట్టి జూడ మర్మంబు తెలియును

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

మంద బుధ్ధి జనుల మందలించ వలదు

కూడ గట్టి చూడ కూరు పనులు

వానరములె గూడి వారథి గట్టెను

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

చేతులున్న వరకు చేయుచు సాయమ్ము

మాటయున్న వరకు మంచి బలుక

మరణ మంటు లేనమరులుగా యుందురు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

ఒక్క సారి బలుకు ఓంకార మంత్రము

బాహు భంద మనెడి భార మొదిలి

కలుగు మోక్ష ఫలము కలికాల మందున

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

సంప దెంత యున్న సంతస మొందక

కూడ బెట్టు టేల గూడు వదిలి

రెప్ప పాటు బతుకు నెప్పుడు గనెదవు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

కానరాదు గనుక గాలిలే దనకుము

కాన రాని వన్ని కల్ల కాదు

గాంచ గలవ మదిని కారణ విభుడిని

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

నివురు తోటి నిప్పు నిర్మల మగురీతి

అంద మైన మగువ ఆశ బెంచు

తాకి చూడ బోకు తాటదీరునుసుమీ

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

91 నుండి 100 పద్యములు


పోయి మూర్ఖ జనుల పొత్తును గోరుట

తలచి జంట నడుమ తగువు దీర్చ

బీడు నేల లోన బీజంబు రీతగు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

కటిక నేల మీద కన్నుల నిండుగ

ఒక్క కునుకు జాలు నొక్క క్షణము

ధనము తోనె సుఖము దక్కుట జరగదు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

తెలుగు దెలిసి గూడ తెగ నీలిగెద వేల

ఆంగ్ల మందు మమ్మి యంటు నీవు

మాతృ భాష కన్న మధరమేది గలదు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

ఆచరించలేని  ఆశయా లన్నియు

ఆయు ధములు వీడి చేయు రణము

చీక టింట గీయు చిత్రంబు రీతగు

బ్రతుక మర్మ మిదియె భ్రాంతి విడుము.

 

నీతి లేని చోట  నీడైన జొప్పకు

మాట గెలువ దనిన మాట నిడకు

మిన్న కుండి నన్న మిక్కిలి సౌఖ్యము

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

కోపగించ దగదు కోమలి ప్రేమను

ఈసడింప దగదు హీన జనుల

ఎవరి మనసు నందు నేమేమి యుండునొ

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

మనసు నుండి బలుకు మాటలు జాలును

చేత నైన దనిన చేసి చూపు

చివరి వరకు నిలుచు చేసిన సాయమె

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

ధనము గూడబెట్టి దానంబు జేయక

విద్య నేర్చి గూడ విలువ మరచి

కాటి కాపరి వలె కాలమీ డ్చదగదు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

నాది నీది యన్న వాదమ్ము లేలరా

పుట్టినప్పుడేమి పట్టు కొస్తి

వీవు చావు లోన వెంటనే దినిలుచు

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము.

 

ఆడి తప్పబోకు యప్పులు జేయకు

తప్పిదంబుచేసి తప్పు కోకు

దాన ధర్మ దయను దాటను బోకుము

బ్రతుక మర్మమిదియె భ్రాంతి విడుము

 

Pages:

1 2 3 4 5 6 7 8 9 10
తెలుగులో విజ్ఞానం

రచన : వంశీకృష్ణ కాసులనాటి

కంద పద్యాలు

FOR BOOK VIEW
  • ఢిల్లీకి బదిలీ అయిన సందర్భంలో


    ఘనముగ నాకొసగిరి తమ
    వినయముతో సహచరులిక వీడ్కోలనుచున్
    అనుకోనటువంటి బదిలి
    కనులలొనింపెను తెలీని కలవరమ్ములన్

    చక్కని మాఇంటివసతి
    మక్కువతో జూచినట్టి మాయజమానుల్
    దక్కరు మాకింకొకరని
    బిక్కమొహము బెట్టిమాకు వీడ్కోలిచ్చెన్

    ఢిల్లీ యెటులుండునొ మరి
    ఇల్లూదూరం బవునట ఇల్లాలే నా
    తల్లిగ తోడుండినడువ
    మెల్లగ పయనంబయితిమి మేలున్ దలచిన్

    చల్లటి మేఘా లనడుమ
    మెల్లగ సాగెను పయనమె మిన్నం చులలోన్
    ఢిల్లీ వచ్చిం దనియిక
    ఉల్లా సంబున మనస్సె ఉరకలు వేసెన్

    కొత్తని వాతా వరణము
    పుత్తడి దొంగల గురించి పూర్తిగ దెలియన్
    పుస్తెలు కమ్మలు దీసెను
    ఒత్తిడి తోనా సతినను ఓరగ జూచిన్

  • కంద పద్యములు


    నాజీవిత మొకపద్యము
    రాజీ పడనట్టి రాత లాద్యంతములున్
    చేజిక్కెను యవకాశమె
    రాజీవము నిండునట్టు రాసెద చూడున్.

    నాదిది చిన్నని పద్యము
    కాదిది యర్థము యెఱుగని కవితయు ననుచున్
    భాదలు దీర్చెడి పదములు
    యాదియు యంతము రసమయ యమృతమొసంగున్

    సుబ్బారామయ్య సుతుడ
    న్నిబ్బరముగ జెప్పుచుంటి నిప్పుడు ఈనా
    కబ్బిన విద్యలు యెల్లను
    అబ్బుర పరచిన పితరుల అమృత ఫలముల్
    (మా నాన్నగారికి నమస్కరిస్తూ)

    భరతావని కలలనుతన
    కరమున బిగియించి ఈటె కసిగా విసిరెన్
    గురితప్పని నీరజుడిని
    పరవశముగ పసిడిజేర భారతి పొంగెన్

    భావం : భారతదేశ 100 సంవత్సరాల కలలన్నీ తనపిడికిలిలో బిగించి, ఈటెపైమోపి కసిగా విసరగా అది గురితప్పకుండా బంగారు పతకాన్ని తాకగా, భారతదేశం పొంగిపోయింది.

    (OLYMPICS lo Niraj ku Gold Medal-08-08-2021)

    కోపంబున బట్టబయెలె
    లోపంబులు పిదపవీవు లోకువె ప్రజకున్
    ఆపంగ కోపమునునీ
    రూపంబే మారి బతుకు రుచులే దెలియున్

  • కంద పద్యములు


    కుదరదుయని తెలిపినయిక
    వదలక తుదివరకు యుండు వాడే గెలుతున్
    కుదరదనెడి మాటవిలువ
    అధికారిని బట్టిదెలుప అంతే బలమౌ
    (19-06-2020)

    ఏదీ నీసొంతమవదు
    ఏదీ నీతోడురాదు ఇహపర మందున్
    నీతో నుండున దదియే
    నీతిగ నువుజేసినట్టి నీసత్కర్మల్
    (14-06-2020)

    అక్షరముల లక్షణమే
    లక్షల మనసులలొ జేరి లక్ష్యమె జూపున్
    శిక్షణ జేయుచు రాసిన
    అక్షరమే యవనియందు ఆయుధ మవ్వున్
    (21-06-2020)

    బలమూ బలగము గలవని
    తలచిన యేదైన గూడ దరికొచ్చనుచూ
    పలికిన వారెందరికో
    తలరాతలు మార్చికరొన తరిమెను చితికిన్
    (14-06-2020)

    ఓటమి ఓటమనెడి యీ
    మాటలతో భయమునింపి మనసును చెరిపే
    నాటక రాయుళ్ళ యెదలొ
    ధీటుగ నీ గెలుపుతోటి దింపుము గుణపాల్
    (27-05-2020)

  • కంద పద్యములు


    తరగని ఆస్థుల లెక్కల్
    మెరుగైన చికిత్స జేయుమేలగు వైద్యుల్
    ధరణిలొ నీకే మున్నను
    మరణాన్నే యాపువారు మహిలో గలరే
    (03-05-2020)

    నీతిని నమ్మిన వాడున్
    చేతలలో జేసిజూపు చెప్పిన వన్నీ
    ఆతని మనసును మార్చగ
    భూతలములొ లేరెవరిక పుట్టరు గూడన్

    భావం : నీతిని నమ్ముకుని బతికేవాడు, తాను మాటలలో చెప్పినవన్నీ చేతలలో చేసి చూపుతూ బతికేస్తాడు.
    అటువంటి వాడి మనసును మార్చి, లొంగదీసుకునే వారు ఈభూమిమీద లేరు ఇంక పుట్టలేరుకూడా.
    (01-05-2020)

    వదిలిన ప్రాణము దెచ్చుట
    కదిలెడి కాలాన్ని పట్టి కదలక నిలుపన్
    మదిలో ప్రేమను గొలుపుట
    విధిరాతల వాడికైన వీలున్ పడదే
    (23-04-2020)

    నవమ సమ్ములు మోయుచు
    నవరంధ్రా లేర్పడంగ నవ్వుతు తనువున్
    అవలీలగ పంచేసెడి
    అవనిన్ వేరెవరులేరు అమ్మే సుమ్మీ
    (01-05-2020)

    గాలికి యందరు సమములె
    నేలకునూ యందరొకటె నింగికి గూడన్
    కాలాగ్నికి కాలేయీ
    తోలుకొరకు యేలనీకు తుదిలేనాశల్

  • కంద పద్యములు


    బాణీ ఏదే మైనను
    గానమె సేయంగ బాలు కమనీయంబౌ
    వీనుల విందగు బాలుని
    గానంబిక గగనమేగి కనులను తడిపెన్
    (26-04-2020- బాలసుబ్రమణ్యం గారిమృతి)

    తుఛ్ఛంబగు యీ జగమున
    ఉఛ్ఛము నీఛము గురించి ఊహలె చాలున్
    చచ్చే నాటికి నీకొక
    మచ్చే లేకుండయున్న మహనీయడవౌ
    (19-09-2020)

    పంచకు నీబాధనెపుడు
    కొంచెము కూడను పరులకు కోరిన గూడన్
    వంచన తోఓ దార్పుని
    మంచిగ జూపించి నిన్ను మట్టున బెట్టున్
    (14-06-2020)

    దుర్భరమగు యాకలితో
    గర్భిణియగు యేనుగొకటి గ్రామము కేగెన్
    అర్భకులగు యచటిజనులు
    నిర్భయముగ మందుబెట్టి నిలువున గాల్చెన్

    భావం : ఆకలితో ఒక గర్భిణి అయిన ఏనుగు, కేరళ లోని ఒక గ్రామముకు వెళ్ళగా అక్కడి ప్రజలు దానికి పేలుడు పదార్థము గలిపిన పండును ఇవ్వగా అదితిని అక్కడే మరణించింది.

    మూతికి మాస్కులు తొడగగ
    వాతలు దేలుచు ముఖమిక వాచిన పిదపన్
    కోతులె మనపూ ర్వికలను
    రాతలె నిజమని బలికితి రసరమ్యముగా

    ముఖానికి మాస్కులు తప్పనిసరి అనగా ఇటులుంటుందని చమత్కారంగా(03-05-2020)

  • కంద పద్యములు


    చైనా దేశము కుమిలె, క
    రోనా నామము గలిగన రోగము సోకన్
    నానా జీవుల మాంసమె
    చైనా కొంపను దహింప చెదిరెను బతుకుల్

    చైనా ఆకలి దీర్చెడి
    నానా జీవుల తనువుల నాక్రం దములే
    ఈనాడొక వైరసువలె
    ప్రాణాలను దీసెనంట రాక్షస కరొనా
    (06-03-2020)

    నగువును పంచెడి జనులను
    బిగువుగ జూచుచు జగమ్ము భీతిని పెంచున్
    నగవులె వీడిన వారికి
    జగమొక శత్రువయివారి చావునె గోరున్

    భా: నవ్వులు పంచుతూ, సరదాగా వుండే వారిని ఈలోకం ఈర్ష్య, కోపంతో చూస్తూ భయాన్ని పెంచుతుంది. అదే నవ్వును విడిచి వెళ్తే, ఈలోకం వారిని ఒక శత్రువు లాగా చూసి ప్రాణాలే కోరుకుంటుంది కదా...
    -(02-04-2020)

    సమస్య

    "ఆంగ్లమ్మే తల్లియగును ఆంధ్రమ్మునకున్"

    ఆంగ్ల శునక పాలనలో
    ఆంగ్లముతో కలిసితెలుగు అశువులు బాసెన్
    ఆంగ్లమ్మున మమ్మియనగ
    ఆంగ్లమ్మే తల్లియగును ఆంధ్రమ్మునకున్!!
    (30-12-2019)

    కాదోయీ ఏబంధము
    నాదే కడవర కనుటకు నటనే సర్వం
    రాదోయీ నీతోడుగ
    నీదని నువుతలచినట్టి నీసంపత్తుల్
    (27-12-2019)

  • కంద పద్యములు


    కనుగొనదగునా మగువల
    మనసును, మనుజుల మనసున మాయల్
    ఘనమగు గగనపు అంతము
    తనువున జీవమ్ముయెచటొ తగునా తెలుపన్

    తాకిన పడతుల తనువును
    మైకమె తనువంతపాకి మాయలె జరుగున్
    బాకుల చూపుల జోలికి
    పోకుము మునుముందుకీవు పోవును పరువే
    (29-12-2019)

    ఎదురే మాకెవ్వరనుచు
    బెదరక వనితల జెరచుచు భీతిని గొలుపే
    మదమెక్కిన కుక్కలనిక
    పదపదమని కాటివరకు పరిగెత్తించెన్

    (ప్రియాంకరెడ్డి హత్య నిందితులకు మరణశిక్ష)
    -11-12-2019

    మితిమీరిన కోపంబున
    మతిపోయిన మరకటములె మహిళలు గనుకే
    సుతిమెత్తగ పలికినచో
    అతికించిన తప్పులైన అతివలు పొంగున్
    (20-11-2019)

    సమస్య - 2929 (చుట్టల్ గాల్చిన...)

    "చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్"

    కంది శంకరయ్య వద్ద 2/13/2019 05:00:00 AM

    నా పూరణ:

    మొట్టిన తనసతి మెదలగ
    పుట్టిన ఆవేశమందు పురుషుడి మదిలో
    తట్టిన ఆ నీతిపదమె
    చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్

  • కంద పద్యములు


    నాలుక జూపును రుచులను
    మేలును కీడును తెలుపును మెదడే మనకున్
    నీలా కాశము నేర్పును
    కాలా తీతమ గుశక్తి గాంచిన మదితో

    చెప్పకు తప్పుడు మాటలు
    మెప్పును పొందెద యనిజన మెల్లరి గూర్చిన్
    నిప్పుగ మారుచు నినుయిక
    యెప్పుడు మసిచే యునొమరి యెవ్వరి కెరుకన్

    పాపం బేదో జేయగ
    లోపం బగుకాయమొసగె లోకేశుడనిన్
    కోపం బేలర నరుడా
    లోపంబే లేనివార లుర్విన్ లేరే

    చక్కగ గాచిన పాలను
    దక్కిన ప్రియసఖి కొలువును తగదుర వీడన్
    మొక్కిన దొరకదు మరిమరి
    అక్కున జేకొని నిలిచెడి ఆడది యిలనన్

    చూసిన నీకల జెరిపితి
    మోసపు మాటలు నిజమని మొండిగ విని నే
    జేసిన తప్పుకు శిక్షను
    వేసెను దైవమె ననునిను వేరుగ జేసిన్

  • కంద పద్యములు


    వాడుక భాషలొ కవితలు
    నాడిని చేరును గనుకనె నయమగు రాయన్
    వాడిని పెంచేటి తెనుగు
    వేడుకలిక సాగవలెను వెయ్యేండ్లైనన్

    కుక్కలె మేలాయె గదర
    లెక్కలు చూడక మనఃస్సు లీనమె జేస్తూ
    మిక్కిలి ప్రేమను పంచగ
    దక్కదు యటువంటి ప్రేమ ధరిలో యెపుడున్

    గురువులె యెల్లపు డునుమన
    బరువగు జీవిత ముయొక్క భాద్యత తెలుపున్
    మరువక గుర్తుం చుకొనుము
    గురువులె దైవం బులిలన గొల్వుము మదితో

    కంటికి యింపై నదనుచు
    ఇంటికి మనువా డిదెచ్చి యింతిగ గొనగన్
    వుండున పరువా లుయెపుడు
    యెండక నిండుగ గనుకనె యెరుగుము మనసున్

    కాయము ఎవ్వరి దయినను
    మాయక యుండవు వలువలు మరిమరి తొడగన్
    తీయటి మదిగల జనులిక
    చేయగ చెలిమిని ఖలునితొ చెరుగును గుణముల్.

  • కంద పద్యములు


    వయసది మీరిన పిమ్మట
    నయనము చక్షువు లలసిన నంతటపుట్టే
    భయముతొ భగవంతుడిని వి
    నయముగ పూజించునట్టి నరుడే శవమౌ

    కత్తిని నేనని పలుకకు
    చెత్తగ రాముడి గురించి చెల్లదు సుమ్మీ
    నెత్తిన గొట్టుచు జనులిక
    చిత్తును జేయగ తమకిక చితియే మిగులున్.

    కత్తి మహేష్ 🐷 వ్యాఖ్యల గురించి....😠😠😠

    నిండని వుదరము కెప్పుడు
    మెండగు నొకపూ టకూడె మిక్కిలి సుఖమౌ
    నిండిన వుదరము కెపుడును
    కొండల తీరగు తలపులె గూర్చును చింతల్.

    కరములెపుడు వరములడుగ
    కొరకుయనుచు జనులుపలికి గుడివర కెడలన్
    నరులనొదలి హరహరులిక
    చరచరముల చెరనుగొనిరి జనులవి డుచుచున్.

    బంధము లనుబం ధములవి
    ఎందుల కికయని పలుకుచు యెటకారముగా
    చిందులు వేయుచు సాగిన
    వందల జనులిక జగమున ఒంటరు లాయెన్

    భావం: బంధాలూ అనుబంధాలూ అనేవి అవసరమేలేదు అని వెటకారంగా పలికి చిందులు వేస్తూ సాగిన వారందరూ ఒంటరులై బాధపడుతున్నారు.

  • కంద పద్యములు


    చెప్పక చెప్పక నొకపరి
    నిప్పును తలపించునట్టి నిజమున్ జెప్పన్
    ఒప్పుగ జెప్పెద చూడుము
    ముప్పును తెప్పించికనిను ముంచును యిలలో

    ఇంపగు సంపాదనతో
    సొంపుగ భవనాలగట్టి సుఖముగ బతికీ,
    నింపుము ననుయని పలికెడి
    గంపెడు ఆశల మనసును గగనమె గెలువన్.

    జవసత్వ ముండినప్పుడె
    శివతత్వం బెరిగి నడిన చింతలె తొలగున్
    శివనా మస్మర ణెరుగక
    అవహేళన జేయువాడు అంతమె నొందున్

    చిన్నారులు దైవసమం
    బన్నా వినకుండ వారి బతుకుల జెరచీ
    చిన్నాభిన్నము జేసెడి
    ఉన్మాదుల చెరనుబట్టి ఉరితీయ దగున్.

    ఏనాటికి యేనాటికొ
    ఏనాటికి మారిజనులు నెరుగును నిక్కం
    బానాటికి యీనాటికి
    నానాటికి తరిగిపోయె నరుల గుణంబుల్.

  • కంద పద్యములు


    మౌనమె యొకసరి దీర్చును
    మానని మది గాయములను, మరియొక సరియా
    మౌనమె దీయును ప్రాణము
    మౌనమునే మించుశక్తి మహిలో లేదే.

    శౌర్యము యుండిన జనులకు
    కార్యము ఏదైనగూడ కష్టము గాదే
    భార్యే గయ్యా ళైనచొ
    ధైర్యపు ధీశాలికైన తలబడు తరమా!!

    నెయ్యితొ కొవ్వులె పెరుగని
    నెయ్యమె నెయ్యితొ తగదని నేర్పిన వారి
    న్నుయ్యిలొ తొయ్యగ తగునిక
    నెయ్యే లేనట్టి కూడు నెన్నడు గొనకున్.

    అడ్డమె ఆయెను కలిలో
    బిడ్డల కేతల్లిదండ్రి విడ్డూరముగా
    రోడ్డున వదిలే కొడుకుల
    నడ్డియి రగదన్నినంత నడతే మారున్.

    ఏదేవిని తమమదిలో
    నాదేవత యనిగొలిచెడి నరులిక యేడ్చెన్
    శ్రీదేవే లేదనెడీ
    భాదే బరువాయయనుచు పగలగ గుండెల్
    (శ్రీదేవి మరణించిన సందర్భంలో)

  • కంద పద్యములు


    ఎంతో జేసిన కూడను
    కొంతైనసుఖము నొసగని కొలువుల కన్నన్
    సుందర మైనట్టి వనము
    చెంతనె నివసిం చిజపము జేయుటె సుఖమున్

    నాలాగని నీలాగని
    ఏలాగో తెలియదనుచు యేలయు చింతల్
    కాలాన్నే వృధ జేయక
    నీలాగే నువుబతికిన నిరతము సుఖమే.

    పక్కలొ పెండ్లాముండగ
    పక్కింట్లో తొంగిజూడ పరువే బోవున్
    నిక్కము తెలియగ నీసతి
    మక్కులిరగగొట్టుచు నిను మట్టున బెట్టున్!

    ఎగతాళిని చేజాలదు
    పగవారిని గూడయెపుడు పదువురి యందున్
    తగువారెవ్వరొ మరియిక
    తగనోళ్ళెవ్వరొ కనుగొన తరమా మనకున్

    అర్థమె పరమార్థమని
    వ్యర్థము జేయగ సమయమె వయసే బోవున్
    అర్థము నెరిగే లోపే
    వ్యర్థం బాయెను బతుకని వగచుట యేలన్

  • కంద పద్యములు


    రంగుల చీరను చుట్టీ
    కొంగును చేతిలొ నలుపుచు కోమలి నడచే
    భంగిమ గాంచగ నరులూ
    నింగిలొ సురులూ మతిచెడి నిశ్చేష్టులయెన్

    సాహిత్యామృత ధారలె
    దాహార్తుల గొంతికలను తడపగ, తనువే
    బాహ్యపు అందాలను విడి
    ఆహాయని తేలెనంట ఆనందముగన్

    సమస్య:

    మీసములన్ గనగ గలమె మేదిని యందున్!

    పూరణ:

    కాసులు ఎన్నున్నను మా
    దాసులె దైవంబులనుచు దయతో జూచే
    ఆసాములె దైవంబులు
    మీ సములన్ గనగ గలమె మేదిని యందున్.

    బుగ్గన చుక్కను పెట్టగ
    సిగ్గులె చేమంతులవుచు చెంపల జేరెన్
    ముగ్గులె వేసెను పాదమె
    లగ్గము సమయానపడతి లావణ్యముగా

    తాగనిదే మనసాగదు
    తాగినచో తనువెయాగ దాశ్చర్యముగా
    దాగక నిజములు యెల్లను
    రాగములై నోటినుండి రాలును సుమ్మీ

  • కంద పద్యములు


    మోడీ తెచ్చిన పథకాల్
    పాడెను గట్టెను గదయిక బ్యాంకుల కెల్లన్
    కేడీలను వదిలేయుచు
    తోడేళ్ళై బ్యాంకుధనము దోచన్ దగునా!

    చేసేది బ్యాంకుననిన
    చూసే వీలుండదుగద సూర్యాస్తములన్
    మోసే భారము గొలవ
    త్రాసే లేదన్నమనకు తగవీ బ్యాంకుల్

    ఉద్యోగం బ్యాంకుననిన
    ఉద్వాసన యుండదనుచు మురిసిన నీకే
    ఉద్యోగము తొలగించగ
    ఉద్వేగము తోటిమనసు వుడుకుచు పొంగెన్.

    ఏనగవున విరయునొమరి
    ఆనింగిన పారిజాత మాహ్లాదంగా
    ఆనవ్వే వరలక్ష్మిది
    తానా నాదేవతనుచు తపములె జేస్తిన్.

    ధూపంబులు దీపములతొ
    పాపంబులు తొలగుననుచు ప్రార్థించంగా
    రూపంబుల నిచ్చు విభుడు
    ఆపండని సకలప్రాణి ఆత్మలొ నిలచెన్

    భావం: ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తే పాపములు తొలగి పోతాయని భావించి ప్రార్థించగా, ప్రాణముల నిచ్చు ఆ భగవంతుడు ఆపండి ఈ పూజలు అని అన్ని జీవరాశుల ఆత్మలో నిలచి అన్ని జీవములలో నేనే వున్నాను కావున జీవులను పూజించమని తెలిపాడు.

  • కంద పద్యములు


    నేరము జేసిన ధనికుల
    బేరము జేయుచు విడిచిక పేదలపై మీ
    భారము జూపుట కన్నను
    ఘోరమె యింకోటిగలద గొర్రెలె మేలున్.

    భావం: ధనికులు నేరాలు చేస్తే డబ్బులకు అమ్ముడుపోయి వదిలేసి, పేదవారిపై మీ ప్రతాపము చూపించే మీకన్న గొర్రెలు మేలు కదరా.

    మధురా న్వితమగు గాత్రమె
    మధుగారికి సొంతమనుచు మరిమరి వింటిన్
    అధరామృతము నుగోరుచు
    మధులత నామమె జపించ మనసే పొంగెన్

    లెక్కకు యందని ధనముతొ
    దక్కును యానందమనకు ధరమున తగదున్
    అక్కున జేకొని గాంచుము
    దిక్కే లేనట్టి వారి దీనపు గాథల్

    స్నేహమె జేయుము యిలలో
    ద్రోహమె తెలియని జనులతొ తోడై నిలుతుర్
    మోహమె తగదో యివినుము
    బాహ్యపు అందా లమీద భవితమె పోవున్.

    అందమె జూచిక నీవే
    ముందడుగును వేయబోకు మూర్ఖుడ వోలెన్
    తొందర పడకుండ వినుము
    కొందరికే యుండుమనసు కుసుమము రీతిన్.

  • కంద పద్యములు


    గ్రక్కున వీడుము నీపై
    నక్కసు తోజే సినట్టి నమ్మక ద్రోహం
    దొక్కును వారిని దైవము
    మొక్కిన నీదై వమెనిను బ్రోచును వినుడీ

    అరువది నొకసరి అడిగిన
    మరిమరి అడుగని మనసిక మాయను జేయున్
    తరగని అరువులె నినుయిక
    పరువది నిడమని పలుకుచు ప్రాణమె దీయున్

    భావం:అప్పు అనునది ఒక్క సారి తీసుకోవడం మొదలు పెడితే, ఇక మనసు మళ్ళీ మళ్ళీ తీసుకోమని లాగుతుంది.అప్పులు పెరిగిపోయి, పరువు అను దానిని వదిలి చావమని మనసు చెబుతుంది.

    నమ్మకు అమ్మడి పలుకులు
    కమ్మనియా పలుకులందు కపటమె యుండున్
    రమ్మని పిలచిన పలుకులె
    పొమ్మని వెలివేయ నీకు బూడిదె మిగులున్.

    వెచ్చని కౌగిలి ముంగిట
    తుచ్చములే తక్కినవని తొందర పడకున్
    పచ్చిగ జెప్పెద విను,నీ
    ఇచ్చములే పెరిగినిన్ను యిరుకున బెట్టున్

    అమ్మాయిలెకరు వైరని
    అమ్మో తనయుడి వివాహ మదియెటు లనిమా
    యమ్మా నాన్నల దిగులుకు
    అమ్మాయిలతల్లిదండ్రు లాశలె అడ్డౌ

  • కంద పద్యములు


    మందారమె నీముదమని
    కందామని నాకనులతొ కదిలిన నన్నే
    హుందాగా వలచిననిను
    యెందా కైనను విడువక వెంటే నడుతున్

    మాటల మాంత్రికు డవునీ
    బాటయె బంగా రగునని బలుకగ మేమే
    ఓటమి నినుచే రదుయిక
    ధీటుగ ముందడు గువెయ్యు ధీరుడ వోలెన్.
    (నా సహచర వుద్యోగి రామకృష్ణ గురించి)

    అంగడి సరుకాయె చదువు
    లొంగెను పిల్లల భుజమ్ము లోర్వగ బరువుల్
    మింగుచు చక్కని విద్యను
    భంగము చేసిరి చదువుల భవితము యంతన్.

    సర్వము నీవే జీవిత
    మర్మము నీవే కరుణతొ మన్నిం చుహరా
    కర్మమె తెలియక జేసితి
    ధర్మము తోదయ నుజూప ధన్యుడ నౌదున్

    కాపాడుము మమునీవే
    ఓపార్వతి పుత్రనీకు మొక్కెద మికమా
    పాపాలను తొలగించెడి
    నీపాదమె శరణమాయె నీవే దిక్కున్

  • కంద పద్యములు


    రీజన లాఫీసులొ మా
    భోజనమగు నీపలుకుల మోజేతీరే
    రోజన్నది లేదనినే
    రాజీ పడకుండ యనెద రమణీ యముగా
    (నా సహచర వుద్యోగి రామ రామ కృష్ణ గురించి)

    వద్దన్నా వచ్చునులే
    నిద్దుర మరి సోమరులకు నిలుపన్ దగునా
    బద్దలు కానీ భువియే
    నిద్దుర వదలము యనెదరు నిజమిది సుమ్మీ

    తెల్లని గడ్డము నాదని
    పళ్ళను ఇకిలించి నీవు పలుకకు మోయీ
    చల్లని మనసున్న జనుల
    కెల్లరి కొచ్చేను తెలుపు కేశమ్ములురా

    ప్రైవేటు యాసుపత్రుల
    పైవేటును వేయకున్న పైకము యంతన్
    నైవేద్యమె వైద్యులకును
    చావేయిక శరణమగును జనులందరికిన్

    చేసే పనియొకటి మనసు
    చూసే దింకోటి కలలు జూచుట వరకే
    మోసే భాద్యత లనడుమ
    పూసే లోగా మనసును పూడ్చెద రుజనుల్

  • కంద పద్యములు


    మోకాలికి రోగమనిన
    టీకాతోమా నుయనుచు ఠీవీ గానీ
    బైకం ముట్టిన పిమ్మట
    పైకేనీ పయనమనెటి పైత్యపు వైద్యుల్

    వచ్చును లేయవ కాశము
    గాచును లేదైవమనిన కాలమె వ్యర్థం
    ఇచ్చిన యవకాశములను
    మెచ్చక వదిలే సిదైవ మెక్కడ యనకున్

    కొంటానని తెగనీల్గకు
    తింటానికె లేనినీకు దినమొక గండమ్
    వెంటాడే ఋణ భాదలు
    ఇంటా బయటా, సుఖములు ఇంకెక్కడివిన్

    మారెనుగద మనిషి గుణము
    జారెనుగద జాలికరుణ చలనమె లేనీ
    భారపు జీవనమున మన
    బారెడు యాశలె రగుల్చు నారని మంటల్

    రావోయీ బామరిదీ
    తేవోయీ బీరుసీస తెరదిం చేద్దాం
    నావో టేనీ కెపుడూ
    కవ్విం చేబీ రుతాగి కారెక్కేద్దాం

  • కంద పద్యములు


    మాగాయత్రికికన్నులు
    బాగాలేవని పలికిన వారందరికిన్
    జాగా లేకుండభువిన
    బాగా శిక్షను వొసగెను భగవం తుండున్
    (ఆడదాని ఆవేదన, కళ్ళు బాలేవని హింసించిన ఆమె భర్త మరణం సందర్భములో)

    మెండైన మనసు నీదని
    అండై వుంతు ననిమాయ మాటలతోనీ
    గుండెకు గాయాలనొసగి
    కొండం తబరువు లనిచ్చి కొంపనె ముంచెన్

    (ఆడదాని ఆవేదన, కళ్ళు బాలేవని హింసించిన ఆమె భర్త మరణం సందర్భములో)

    అందములా యివి మాటల
    కందని యెన్నో సుమధుర కావ్యములై,యా
    నందంబున మది కూర్గుకు
    బందీయవగా తలొంచి వందన మిడితిన్.
    (కూర్గ్ ప్రయాణము గురించి.)

    కాబోకు వతిథి యెపుడు
    న్నీబో వింటిజ నులెమరి నిరుపే దలనిన్
    ఈబోకుమాటనిచ్చిన
    పోబోకు ముదా టిమరణ మొచ్చిన గూడన్

    తిన్నావా లేదానువు
    కన్నాయని యడుగునట్టి కాంతయె తల్లిన్
    వున్నావా పోయావా
    యన్నప్రశ్న నడుగునది యాలియె యనెదన్

  • కంద పద్యములు


    పూచిన నోటికి రుచులను
    దాచిన సొమ్ముతొ నొసగని దానము రీతిన్
    నీచపు మనసుతొ చేసెడి
    పూజకు పూలెన్ని యున్న పుణ్యము రాదే

    పద్యము రాయగ తెలుగున
    చోద్యంబుగ జనులుజూచి జోరుగ తిట్టున్
    ఉద్యమమిక తేదలచిన
    విద్యల నెల్లను తెలుగున వివరించ దగున్

    ముండకు ముచ్చట దీర్చుచు
    అండగ వుంతునని యేల దండగ పలుకుల్
    నిండుగ పెండ్లాడి తనతొ
    నుండిన తనబతుకునిండ నుండును సుఖముల్

    తప్పులు జేసితి నేనే
    తప్పనిఒప్పు కొనుచుంటి దయనొసగరితా
    నిప్పులపై నడువనినను
    యిప్పుడె నడిచెద క్షమించు యికననుహరితా

    నిండగు పున్నమివెన్నెల
    కండ్లార గనినమనసున కాంతులు నిండున్
    మెండగు యాలోచనలతొ
    నిండుచు నినుకవి నిజేయు నిజమిది సుమ్మీ.

  • కంద పద్యములు


    వరము లొసగు మాలక్ష్మీ
    కరము లొసగుసా యములను కడవరక నెదన్
    కరుణా రసమయి ఈమా
    వరలక్ష్మిని తలచుకొనగ వదనము వెలుగున్.
    (వరలక్ష్మి గురించి)

    ఎవ్వాని పలుకులు వినిన
    పువ్వోలె విరయు నుజనుల ముదములు యెల్లన్
    అవ్వాని సభాపరమున
    సవ్వాలుగ నిలుచుదెవరు షౌకతు గార్కిన్.
    (నా సహచర వుద్యోగి షౌకత్ సారు గురించి)

    ధీటగు మాటలు వాడకు
    మాటుగ దప్పిదముజేసి మానం బిడకున్
    దాటకు చేసిన బాసలు
    మేటిప లుకులివి విడువక మేలగు వినుడీ

    వీడము మీమార్గంబును
    వీడము మీయాశయముల వీడము యనుచున్
    వీడము మీభాష్యములను
    వీడము మీజ్ఞాపకముల వీడము సుమ్మీ.
    (మా రీజియన్ అసిస్టెంట్ జనరల్ మేనేజరు శ్రీ బి యస్ రాజా గారి గురించి)

    రాజాలదు ఈరోజని
    బేజారున మామనసులు బెంబేలెత్తన్
    రాజాలా మముగాచిన
    "రాజా"గారే నిజమగు రాజని యనెదన్.
    (మా రీజియన్ అసిస్టెంట్ జనరల్ మేనేజరు శ్రీ బి యస్ రాజా గారి గురించి)

  • కంద పద్యములు


    ఎక్కడి కన్నడ రాష్ట్రము
    ఎక్కడి యాంధ్రము,ముదమున విరిసిన నగుతోన్
    యిక్కడి కేగిన మీకును
    ఎక్కడ దక్కని యశమది ఇచ్చట దక్కెన్.
    (మా రీజియన్ అసిస్టెంట్ జనరల్ మేనేజరు శ్రీ బి యస్ రాజా గారి గురించి)

    జూచితి తొలిసారిగనిను
    వేచిన నామనసునందు వెన్నెల గురిసెన్
    దాచుము ననునీలో యని
    జాచిన నాజేతినిగొన జాలును హరితా.

    ఎందని వెదుకుదు కృష్ణా!
    నందనవన సుందరవదనాయని నేనా
    నందంబున పిలువగ నీ
    సుందర వదనంబుజూపి శుభముల నిడుమా.

    ఓరామా! నేపలికెద
    నారాముడు సకలలోక నాథుడు యనుచున్
    నోరారా రామాయని
    పారాయణ జేసుగొనిన భాదలు తొలగున్.

    నారాయణ నామంబును
    పారాయణ జరుపుకొనిన పాపము తొలగున్
    నారాయణు సేవించుచు
    నౌరాయనురీతి మీరలవనిని మనుడీ.

  • కంద పద్యములు


    కాసుల రాశులు బెంచుచు
    దాసుల దోషుల ననకుము, దైవము గాంచున్
    త్రాసున దూచును పాపం
    కాసుల వీడుచు మనుజుల గాంచుము నరుడా.

    పదమిది బలికితి తెనుగున
    పదములు గలుపుచు బలికిన కదనము లొచ్చున్
    పదములు బలుకుము తెనుగున
    పదపదమని బలుకునుమది పదనిస ములుగన్

    కష్టము నెరుగని పురుషుడు
    ఇష్టము చూపం గలేని యింట్లో సతియున్
    నష్టము తెచ్చెడి బేరము
    అష్టమ శనివలె విడువక కష్టము లిచ్చున్.

    కందము రాయుట యెఱుగని
    అందరు కవులను కవులని యనడమె దగదున్
    వందల సైన్యము యున్నను
    మందుడు రాజై నవిజయ మందుట దగునే

    వలదు వలదినిన యెరుగక
    వలచి మురిసెదవు మగువల వలపుల వలలోన్
    వలచి గెలిచిన మగువ నిను
    కలచి విడిచినయెడల మరి కలలే మిగులున్.

Pages:

  • <<

    >>




తెలుగులో విజ్ఞానం

రచన : వంశీకృష్ణ కాసులనాటి

రచన : వంశీకృష్ణ కాసులనాటి