-
ఢిల్లీకి బదిలీ అయిన సందర్భంలో
ఘనముగ నాకొసగిరి తమ
వినయముతో సహచరులిక వీడ్కోలనుచున్
అనుకోనటువంటి బదిలి
కనులలొనింపెను తెలీని కలవరమ్ములన్
చక్కని మాఇంటివసతి
మక్కువతో జూచినట్టి మాయజమానుల్
దక్కరు మాకింకొకరని
బిక్కమొహము బెట్టిమాకు వీడ్కోలిచ్చెన్
ఢిల్లీ యెటులుండునొ మరి
ఇల్లూదూరం బవునట ఇల్లాలే నా
తల్లిగ తోడుండినడువ
మెల్లగ పయనంబయితిమి మేలున్ దలచిన్
చల్లటి మేఘా లనడుమ
మెల్లగ సాగెను పయనమె మిన్నం చులలోన్
ఢిల్లీ వచ్చిం దనియిక
ఉల్లా సంబున మనస్సె ఉరకలు వేసెన్
కొత్తని వాతా వరణము
పుత్తడి దొంగల గురించి పూర్తిగ దెలియన్
పుస్తెలు కమ్మలు దీసెను
ఒత్తిడి తోనా సతినను ఓరగ జూచిన్ -
కంద పద్యములు
నాజీవిత మొకపద్యము
రాజీ పడనట్టి రాత లాద్యంతములున్
చేజిక్కెను యవకాశమె
రాజీవము నిండునట్టు రాసెద చూడున్.
నాదిది చిన్నని పద్యము
కాదిది యర్థము యెఱుగని కవితయు ననుచున్
భాదలు దీర్చెడి పదములు
యాదియు యంతము రసమయ యమృతమొసంగున్
సుబ్బారామయ్య సుతుడ
న్నిబ్బరముగ జెప్పుచుంటి నిప్పుడు ఈనా
కబ్బిన విద్యలు యెల్లను
అబ్బుర పరచిన పితరుల అమృత ఫలముల్
(మా నాన్నగారికి నమస్కరిస్తూ)భరతావని కలలనుతన
కరమున బిగియించి ఈటె కసిగా విసిరెన్
గురితప్పని నీరజుడిని
పరవశముగ పసిడిజేర భారతి పొంగెన్
భావం : భారతదేశ 100 సంవత్సరాల కలలన్నీ తనపిడికిలిలో బిగించి, ఈటెపైమోపి కసిగా విసరగా అది గురితప్పకుండా బంగారు పతకాన్ని తాకగా, భారతదేశం పొంగిపోయింది.
(OLYMPICS lo Niraj ku Gold Medal-08-08-2021)
కోపంబున బట్టబయెలె
లోపంబులు పిదపవీవు లోకువె ప్రజకున్
ఆపంగ కోపమునునీ
రూపంబే మారి బతుకు రుచులే దెలియున్
-
కంద పద్యములు
కుదరదుయని తెలిపినయిక
వదలక తుదివరకు యుండు వాడే గెలుతున్
కుదరదనెడి మాటవిలువ
అధికారిని బట్టిదెలుప అంతే బలమౌ
(19-06-2020)ఏదీ నీసొంతమవదు
ఏదీ నీతోడురాదు ఇహపర మందున్
నీతో నుండున దదియే
నీతిగ నువుజేసినట్టి నీసత్కర్మల్
(14-06-2020)అక్షరముల లక్షణమే
లక్షల మనసులలొ జేరి లక్ష్యమె జూపున్
శిక్షణ జేయుచు రాసిన
అక్షరమే యవనియందు ఆయుధ మవ్వున్
(21-06-2020)బలమూ బలగము గలవని
తలచిన యేదైన గూడ దరికొచ్చనుచూ
పలికిన వారెందరికో
తలరాతలు మార్చికరొన తరిమెను చితికిన్
(14-06-2020)ఓటమి ఓటమనెడి యీ
మాటలతో భయమునింపి మనసును చెరిపే
నాటక రాయుళ్ళ యెదలొ
ధీటుగ నీ గెలుపుతోటి దింపుము గుణపాల్
(27-05-2020) -
కంద పద్యములు
తరగని ఆస్థుల లెక్కల్
మెరుగైన చికిత్స జేయుమేలగు వైద్యుల్
ధరణిలొ నీకే మున్నను
మరణాన్నే యాపువారు మహిలో గలరే
(03-05-2020)నీతిని నమ్మిన వాడున్
చేతలలో జేసిజూపు చెప్పిన వన్నీ
ఆతని మనసును మార్చగ
భూతలములొ లేరెవరిక పుట్టరు గూడన్
భావం : నీతిని నమ్ముకుని బతికేవాడు, తాను మాటలలో చెప్పినవన్నీ చేతలలో చేసి చూపుతూ బతికేస్తాడు.
అటువంటి వాడి మనసును మార్చి, లొంగదీసుకునే వారు ఈభూమిమీద లేరు ఇంక పుట్టలేరుకూడా.
(01-05-2020)వదిలిన ప్రాణము దెచ్చుట
కదిలెడి కాలాన్ని పట్టి కదలక నిలుపన్
మదిలో ప్రేమను గొలుపుట
విధిరాతల వాడికైన వీలున్ పడదే
(23-04-2020)నవమ సమ్ములు మోయుచు
నవరంధ్రా లేర్పడంగ నవ్వుతు తనువున్
అవలీలగ పంచేసెడి
అవనిన్ వేరెవరులేరు అమ్మే సుమ్మీ
(01-05-2020)గాలికి యందరు సమములె
నేలకునూ యందరొకటె నింగికి గూడన్
కాలాగ్నికి కాలేయీ
తోలుకొరకు యేలనీకు తుదిలేనాశల్
-
కంద పద్యములు
బాణీ ఏదే మైనను
గానమె సేయంగ బాలు కమనీయంబౌ
వీనుల విందగు బాలుని
గానంబిక గగనమేగి కనులను తడిపెన్
(26-04-2020- బాలసుబ్రమణ్యం గారిమృతి)
తుఛ్ఛంబగు యీ జగమున
ఉఛ్ఛము నీఛము గురించి ఊహలె చాలున్
చచ్చే నాటికి నీకొక
మచ్చే లేకుండయున్న మహనీయడవౌ
(19-09-2020)పంచకు నీబాధనెపుడు
కొంచెము కూడను పరులకు కోరిన గూడన్
వంచన తోఓ దార్పుని
మంచిగ జూపించి నిన్ను మట్టున బెట్టున్
(14-06-2020)దుర్భరమగు యాకలితో
గర్భిణియగు యేనుగొకటి గ్రామము కేగెన్
అర్భకులగు యచటిజనులు
నిర్భయముగ మందుబెట్టి నిలువున గాల్చెన్భావం : ఆకలితో ఒక గర్భిణి అయిన ఏనుగు, కేరళ లోని ఒక గ్రామముకు వెళ్ళగా అక్కడి ప్రజలు దానికి పేలుడు పదార్థము గలిపిన పండును ఇవ్వగా అదితిని అక్కడే మరణించింది.
మూతికి మాస్కులు తొడగగ
వాతలు దేలుచు ముఖమిక వాచిన పిదపన్
కోతులె మనపూ ర్వికలను
రాతలె నిజమని బలికితి రసరమ్యముగా
ముఖానికి మాస్కులు తప్పనిసరి అనగా ఇటులుంటుందని చమత్కారంగా(03-05-2020)
-
కంద పద్యములు
చైనా దేశము కుమిలె, క
రోనా నామము గలిగన రోగము సోకన్
నానా జీవుల మాంసమె
చైనా కొంపను దహింప చెదిరెను బతుకుల్
చైనా ఆకలి దీర్చెడి
నానా జీవుల తనువుల నాక్రం దములే
ఈనాడొక వైరసువలె
ప్రాణాలను దీసెనంట రాక్షస కరొనా
(06-03-2020)నగువును పంచెడి జనులను
బిగువుగ జూచుచు జగమ్ము భీతిని పెంచున్
నగవులె వీడిన వారికి
జగమొక శత్రువయివారి చావునె గోరున్
భా: నవ్వులు పంచుతూ, సరదాగా వుండే వారిని ఈలోకం ఈర్ష్య, కోపంతో చూస్తూ భయాన్ని పెంచుతుంది. అదే నవ్వును విడిచి వెళ్తే, ఈలోకం వారిని ఒక శత్రువు లాగా చూసి ప్రాణాలే కోరుకుంటుంది కదా...
-(02-04-2020)సమస్య
"ఆంగ్లమ్మే తల్లియగును ఆంధ్రమ్మునకున్"
ఆంగ్ల శునక పాలనలో
ఆంగ్లముతో కలిసితెలుగు అశువులు బాసెన్
ఆంగ్లమ్మున మమ్మియనగ
ఆంగ్లమ్మే తల్లియగును ఆంధ్రమ్మునకున్!!
(30-12-2019)కాదోయీ ఏబంధము
నాదే కడవర కనుటకు నటనే సర్వం
రాదోయీ నీతోడుగ
నీదని నువుతలచినట్టి నీసంపత్తుల్
(27-12-2019) -
కంద పద్యములు
కనుగొనదగునా మగువల
మనసును, మనుజుల మనసున మాయల్
ఘనమగు గగనపు అంతము
తనువున జీవమ్ముయెచటొ తగునా తెలుపన్
తాకిన పడతుల తనువును
మైకమె తనువంతపాకి మాయలె జరుగున్
బాకుల చూపుల జోలికి
పోకుము మునుముందుకీవు పోవును పరువే
(29-12-2019)ఎదురే మాకెవ్వరనుచు
బెదరక వనితల జెరచుచు భీతిని గొలుపే
మదమెక్కిన కుక్కలనిక
పదపదమని కాటివరకు పరిగెత్తించెన్
(ప్రియాంకరెడ్డి హత్య నిందితులకు మరణశిక్ష)
-11-12-2019మితిమీరిన కోపంబున
మతిపోయిన మరకటములె మహిళలు గనుకే
సుతిమెత్తగ పలికినచో
అతికించిన తప్పులైన అతివలు పొంగున్
(20-11-2019)సమస్య - 2929 (చుట్టల్ గాల్చిన...)
"చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్"
కంది శంకరయ్య వద్ద 2/13/2019 05:00:00 AM
నా పూరణ:
మొట్టిన తనసతి మెదలగ
పుట్టిన ఆవేశమందు పురుషుడి మదిలో
తట్టిన ఆ నీతిపదమె
చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్
-
కంద పద్యములు
నాలుక జూపును రుచులను
మేలును కీడును తెలుపును మెదడే మనకున్
నీలా కాశము నేర్పును
కాలా తీతమ గుశక్తి గాంచిన మదితో
చెప్పకు తప్పుడు మాటలు
మెప్పును పొందెద యనిజన మెల్లరి గూర్చిన్
నిప్పుగ మారుచు నినుయిక
యెప్పుడు మసిచే యునొమరి యెవ్వరి కెరుకన్
పాపం బేదో జేయగ
లోపం బగుకాయమొసగె లోకేశుడనిన్
కోపం బేలర నరుడా
లోపంబే లేనివార లుర్విన్ లేరే
చక్కగ గాచిన పాలను
దక్కిన ప్రియసఖి కొలువును తగదుర వీడన్
మొక్కిన దొరకదు మరిమరి
అక్కున జేకొని నిలిచెడి ఆడది యిలనన్
చూసిన నీకల జెరిపితి
మోసపు మాటలు నిజమని మొండిగ విని నే
జేసిన తప్పుకు శిక్షను
వేసెను దైవమె ననునిను వేరుగ జేసిన్
-
కంద పద్యములు
వాడుక భాషలొ కవితలు
నాడిని చేరును గనుకనె నయమగు రాయన్
వాడిని పెంచేటి తెనుగు
వేడుకలిక సాగవలెను వెయ్యేండ్లైనన్
కుక్కలె మేలాయె గదర
లెక్కలు చూడక మనఃస్సు లీనమె జేస్తూ
మిక్కిలి ప్రేమను పంచగ
దక్కదు యటువంటి ప్రేమ ధరిలో యెపుడున్
గురువులె యెల్లపు డునుమన
బరువగు జీవిత ముయొక్క భాద్యత తెలుపున్
మరువక గుర్తుం చుకొనుము
గురువులె దైవం బులిలన గొల్వుము మదితో
కంటికి యింపై నదనుచు
ఇంటికి మనువా డిదెచ్చి యింతిగ గొనగన్
వుండున పరువా లుయెపుడు
యెండక నిండుగ గనుకనె యెరుగుము మనసున్
కాయము ఎవ్వరి దయినను
మాయక యుండవు వలువలు మరిమరి తొడగన్
తీయటి మదిగల జనులిక
చేయగ చెలిమిని ఖలునితొ చెరుగును గుణముల్.
-
కంద పద్యములు
వయసది మీరిన పిమ్మట
నయనము చక్షువు లలసిన నంతటపుట్టే
భయముతొ భగవంతుడిని వి
నయముగ పూజించునట్టి నరుడే శవమౌ
కత్తిని నేనని పలుకకు
చెత్తగ రాముడి గురించి చెల్లదు సుమ్మీ
నెత్తిన గొట్టుచు జనులిక
చిత్తును జేయగ తమకిక చితియే మిగులున్.
కత్తి మహేష్ 🐷 వ్యాఖ్యల గురించి....😠😠😠
నిండని వుదరము కెప్పుడు
మెండగు నొకపూ టకూడె మిక్కిలి సుఖమౌ
నిండిన వుదరము కెపుడును
కొండల తీరగు తలపులె గూర్చును చింతల్.
కరములెపుడు వరములడుగ
కొరకుయనుచు జనులుపలికి గుడివర కెడలన్
నరులనొదలి హరహరులిక
చరచరముల చెరనుగొనిరి జనులవి డుచుచున్.
బంధము లనుబం ధములవి
ఎందుల కికయని పలుకుచు యెటకారముగా
చిందులు వేయుచు సాగిన
వందల జనులిక జగమున ఒంటరు లాయెన్
భావం: బంధాలూ అనుబంధాలూ అనేవి అవసరమేలేదు అని వెటకారంగా పలికి చిందులు వేస్తూ సాగిన వారందరూ ఒంటరులై బాధపడుతున్నారు.
-
కంద పద్యములు
చెప్పక చెప్పక నొకపరి
నిప్పును తలపించునట్టి నిజమున్ జెప్పన్
ఒప్పుగ జెప్పెద చూడుము
ముప్పును తెప్పించికనిను ముంచును యిలలో
ఇంపగు సంపాదనతో
సొంపుగ భవనాలగట్టి సుఖముగ బతికీ,
నింపుము ననుయని పలికెడి
గంపెడు ఆశల మనసును గగనమె గెలువన్.
జవసత్వ ముండినప్పుడె
శివతత్వం బెరిగి నడిన చింతలె తొలగున్
శివనా మస్మర ణెరుగక
అవహేళన జేయువాడు అంతమె నొందున్
చిన్నారులు దైవసమం
బన్నా వినకుండ వారి బతుకుల జెరచీ
చిన్నాభిన్నము జేసెడి
ఉన్మాదుల చెరనుబట్టి ఉరితీయ దగున్.
ఏనాటికి యేనాటికొ
ఏనాటికి మారిజనులు నెరుగును నిక్కం
బానాటికి యీనాటికి
నానాటికి తరిగిపోయె నరుల గుణంబుల్. -
కంద పద్యములు
మౌనమె యొకసరి దీర్చును
మానని మది గాయములను, మరియొక సరియా
మౌనమె దీయును ప్రాణము
మౌనమునే మించుశక్తి మహిలో లేదే.
శౌర్యము యుండిన జనులకు
కార్యము ఏదైనగూడ కష్టము గాదే
భార్యే గయ్యా ళైనచొ
ధైర్యపు ధీశాలికైన తలబడు తరమా!!
నెయ్యితొ కొవ్వులె పెరుగని
నెయ్యమె నెయ్యితొ తగదని నేర్పిన వారి
న్నుయ్యిలొ తొయ్యగ తగునిక
నెయ్యే లేనట్టి కూడు నెన్నడు గొనకున్.
అడ్డమె ఆయెను కలిలో
బిడ్డల కేతల్లిదండ్రి విడ్డూరముగా
రోడ్డున వదిలే కొడుకుల
నడ్డియి రగదన్నినంత నడతే మారున్.
ఏదేవిని తమమదిలో
నాదేవత యనిగొలిచెడి నరులిక యేడ్చెన్
శ్రీదేవే లేదనెడీ
భాదే బరువాయయనుచు పగలగ గుండెల్
(శ్రీదేవి మరణించిన సందర్భంలో) -
కంద పద్యములు
ఎంతో జేసిన కూడను
కొంతైనసుఖము నొసగని కొలువుల కన్నన్
సుందర మైనట్టి వనము
చెంతనె నివసిం చిజపము జేయుటె సుఖమున్
నాలాగని నీలాగని
ఏలాగో తెలియదనుచు యేలయు చింతల్
కాలాన్నే వృధ జేయక
నీలాగే నువుబతికిన నిరతము సుఖమే.
పక్కలొ పెండ్లాముండగ
పక్కింట్లో తొంగిజూడ పరువే బోవున్
నిక్కము తెలియగ నీసతి
మక్కులిరగగొట్టుచు నిను మట్టున బెట్టున్!
ఎగతాళిని చేజాలదు
పగవారిని గూడయెపుడు పదువురి యందున్
తగువారెవ్వరొ మరియిక
తగనోళ్ళెవ్వరొ కనుగొన తరమా మనకున్
అర్థమె పరమార్థమని
వ్యర్థము జేయగ సమయమె వయసే బోవున్
అర్థము నెరిగే లోపే
వ్యర్థం బాయెను బతుకని వగచుట యేలన్ -
కంద పద్యములు
రంగుల చీరను చుట్టీ
కొంగును చేతిలొ నలుపుచు కోమలి నడచే
భంగిమ గాంచగ నరులూ
నింగిలొ సురులూ మతిచెడి నిశ్చేష్టులయెన్
సాహిత్యామృత ధారలె
దాహార్తుల గొంతికలను తడపగ, తనువే
బాహ్యపు అందాలను విడి
ఆహాయని తేలెనంట ఆనందముగన్
సమస్య:
మీసములన్ గనగ గలమె మేదిని యందున్!
పూరణ:
కాసులు ఎన్నున్నను మా
దాసులె దైవంబులనుచు దయతో జూచే
ఆసాములె దైవంబులు
మీ సములన్ గనగ గలమె మేదిని యందున్.
బుగ్గన చుక్కను పెట్టగ
సిగ్గులె చేమంతులవుచు చెంపల జేరెన్
ముగ్గులె వేసెను పాదమె
లగ్గము సమయానపడతి లావణ్యముగా
తాగనిదే మనసాగదు
తాగినచో తనువెయాగ దాశ్చర్యముగా
దాగక నిజములు యెల్లను
రాగములై నోటినుండి రాలును సుమ్మీ -
కంద పద్యములు
మోడీ తెచ్చిన పథకాల్
పాడెను గట్టెను గదయిక బ్యాంకుల కెల్లన్
కేడీలను వదిలేయుచు
తోడేళ్ళై బ్యాంకుధనము దోచన్ దగునా!
చేసేది బ్యాంకుననిన
చూసే వీలుండదుగద సూర్యాస్తములన్
మోసే భారము గొలవ
త్రాసే లేదన్నమనకు తగవీ బ్యాంకుల్
ఉద్యోగం బ్యాంకుననిన
ఉద్వాసన యుండదనుచు మురిసిన నీకే
ఉద్యోగము తొలగించగ
ఉద్వేగము తోటిమనసు వుడుకుచు పొంగెన్.
ఏనగవున విరయునొమరి
ఆనింగిన పారిజాత మాహ్లాదంగా
ఆనవ్వే వరలక్ష్మిది
తానా నాదేవతనుచు తపములె జేస్తిన్.
ధూపంబులు దీపములతొ
పాపంబులు తొలగుననుచు ప్రార్థించంగా
రూపంబుల నిచ్చు విభుడు
ఆపండని సకలప్రాణి ఆత్మలొ నిలచెన్
భావం: ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తే పాపములు తొలగి పోతాయని భావించి ప్రార్థించగా, ప్రాణముల నిచ్చు ఆ భగవంతుడు ఆపండి ఈ పూజలు అని అన్ని జీవరాశుల ఆత్మలో నిలచి అన్ని జీవములలో నేనే వున్నాను కావున జీవులను పూజించమని తెలిపాడు.
-
కంద పద్యములు
నేరము జేసిన ధనికుల
బేరము జేయుచు విడిచిక పేదలపై మీ
భారము జూపుట కన్నను
ఘోరమె యింకోటిగలద గొర్రెలె మేలున్.
భావం: ధనికులు నేరాలు చేస్తే డబ్బులకు అమ్ముడుపోయి వదిలేసి, పేదవారిపై మీ ప్రతాపము చూపించే మీకన్న గొర్రెలు మేలు కదరా.
మధురా న్వితమగు గాత్రమె
మధుగారికి సొంతమనుచు మరిమరి వింటిన్
అధరామృతము నుగోరుచు
మధులత నామమె జపించ మనసే పొంగెన్
లెక్కకు యందని ధనముతొ
దక్కును యానందమనకు ధరమున తగదున్
అక్కున జేకొని గాంచుము
దిక్కే లేనట్టి వారి దీనపు గాథల్
స్నేహమె జేయుము యిలలో
ద్రోహమె తెలియని జనులతొ తోడై నిలుతుర్
మోహమె తగదో యివినుము
బాహ్యపు అందా లమీద భవితమె పోవున్.
అందమె జూచిక నీవే
ముందడుగును వేయబోకు మూర్ఖుడ వోలెన్
తొందర పడకుండ వినుము
కొందరికే యుండుమనసు కుసుమము రీతిన్. -
కంద పద్యములు
గ్రక్కున వీడుము నీపై
నక్కసు తోజే సినట్టి నమ్మక ద్రోహం
దొక్కును వారిని దైవము
మొక్కిన నీదై వమెనిను బ్రోచును వినుడీ
అరువది నొకసరి అడిగిన
మరిమరి అడుగని మనసిక మాయను జేయున్
తరగని అరువులె నినుయిక
పరువది నిడమని పలుకుచు ప్రాణమె దీయున్
భావం:అప్పు అనునది ఒక్క సారి తీసుకోవడం మొదలు పెడితే, ఇక మనసు మళ్ళీ మళ్ళీ తీసుకోమని లాగుతుంది.అప్పులు పెరిగిపోయి, పరువు అను దానిని వదిలి చావమని మనసు చెబుతుంది.
నమ్మకు అమ్మడి పలుకులు
కమ్మనియా పలుకులందు కపటమె యుండున్
రమ్మని పిలచిన పలుకులె
పొమ్మని వెలివేయ నీకు బూడిదె మిగులున్.
వెచ్చని కౌగిలి ముంగిట
తుచ్చములే తక్కినవని తొందర పడకున్
పచ్చిగ జెప్పెద విను,నీ
ఇచ్చములే పెరిగినిన్ను యిరుకున బెట్టున్
అమ్మాయిలెకరు వైరని
అమ్మో తనయుడి వివాహ మదియెటు లనిమా
యమ్మా నాన్నల దిగులుకు
అమ్మాయిలతల్లిదండ్రు లాశలె అడ్డౌ -
కంద పద్యములు
మందారమె నీముదమని
కందామని నాకనులతొ కదిలిన నన్నే
హుందాగా వలచిననిను
యెందా కైనను విడువక వెంటే నడుతున్
మాటల మాంత్రికు డవునీ
బాటయె బంగా రగునని బలుకగ మేమే
ఓటమి నినుచే రదుయిక
ధీటుగ ముందడు గువెయ్యు ధీరుడ వోలెన్.
(నా సహచర వుద్యోగి రామకృష్ణ గురించి)అంగడి సరుకాయె చదువు
లొంగెను పిల్లల భుజమ్ము లోర్వగ బరువుల్
మింగుచు చక్కని విద్యను
భంగము చేసిరి చదువుల భవితము యంతన్.
సర్వము నీవే జీవిత
మర్మము నీవే కరుణతొ మన్నిం చుహరా
కర్మమె తెలియక జేసితి
ధర్మము తోదయ నుజూప ధన్యుడ నౌదున్
కాపాడుము మమునీవే
ఓపార్వతి పుత్రనీకు మొక్కెద మికమా
పాపాలను తొలగించెడి
నీపాదమె శరణమాయె నీవే దిక్కున్ -
కంద పద్యములు
రీజన లాఫీసులొ మా
భోజనమగు నీపలుకుల మోజేతీరే
రోజన్నది లేదనినే
రాజీ పడకుండ యనెద రమణీ యముగా
(నా సహచర వుద్యోగి రామ రామ కృష్ణ గురించి)వద్దన్నా వచ్చునులే
నిద్దుర మరి సోమరులకు నిలుపన్ దగునా
బద్దలు కానీ భువియే
నిద్దుర వదలము యనెదరు నిజమిది సుమ్మీ
తెల్లని గడ్డము నాదని
పళ్ళను ఇకిలించి నీవు పలుకకు మోయీ
చల్లని మనసున్న జనుల
కెల్లరి కొచ్చేను తెలుపు కేశమ్ములురా
ప్రైవేటు యాసుపత్రుల
పైవేటును వేయకున్న పైకము యంతన్
నైవేద్యమె వైద్యులకును
చావేయిక శరణమగును జనులందరికిన్
చేసే పనియొకటి మనసు
చూసే దింకోటి కలలు జూచుట వరకే
మోసే భాద్యత లనడుమ
పూసే లోగా మనసును పూడ్చెద రుజనుల్ -
కంద పద్యములు
మోకాలికి రోగమనిన
టీకాతోమా నుయనుచు ఠీవీ గానీ
బైకం ముట్టిన పిమ్మట
పైకేనీ పయనమనెటి పైత్యపు వైద్యుల్
వచ్చును లేయవ కాశము
గాచును లేదైవమనిన కాలమె వ్యర్థం
ఇచ్చిన యవకాశములను
మెచ్చక వదిలే సిదైవ మెక్కడ యనకున్
కొంటానని తెగనీల్గకు
తింటానికె లేనినీకు దినమొక గండమ్
వెంటాడే ఋణ భాదలు
ఇంటా బయటా, సుఖములు ఇంకెక్కడివిన్
మారెనుగద మనిషి గుణము
జారెనుగద జాలికరుణ చలనమె లేనీ
భారపు జీవనమున మన
బారెడు యాశలె రగుల్చు నారని మంటల్
రావోయీ బామరిదీ
తేవోయీ బీరుసీస తెరదిం చేద్దాం
నావో టేనీ కెపుడూ
కవ్విం చేబీ రుతాగి కారెక్కేద్దాం -
కంద పద్యములు
మాగాయత్రికికన్నులు
బాగాలేవని పలికిన వారందరికిన్
జాగా లేకుండభువిన
బాగా శిక్షను వొసగెను భగవం తుండున్
(ఆడదాని ఆవేదన, కళ్ళు బాలేవని హింసించిన ఆమె భర్త మరణం సందర్భములో)మెండైన మనసు నీదని
అండై వుంతు ననిమాయ మాటలతోనీ
గుండెకు గాయాలనొసగి
కొండం తబరువు లనిచ్చి కొంపనె ముంచెన్
(ఆడదాని ఆవేదన, కళ్ళు బాలేవని హింసించిన ఆమె భర్త మరణం సందర్భములో)
అందములా యివి మాటల
కందని యెన్నో సుమధుర కావ్యములై,యా
నందంబున మది కూర్గుకు
బందీయవగా తలొంచి వందన మిడితిన్.
(కూర్గ్ ప్రయాణము గురించి.)కాబోకు వతిథి యెపుడు
న్నీబో వింటిజ నులెమరి నిరుపే దలనిన్
ఈబోకుమాటనిచ్చిన
పోబోకు ముదా టిమరణ మొచ్చిన గూడన్
తిన్నావా లేదానువు
కన్నాయని యడుగునట్టి కాంతయె తల్లిన్
వున్నావా పోయావా
యన్నప్రశ్న నడుగునది యాలియె యనెదన్ -
కంద పద్యములు
పూచిన నోటికి రుచులను
దాచిన సొమ్ముతొ నొసగని దానము రీతిన్
నీచపు మనసుతొ చేసెడి
పూజకు పూలెన్ని యున్న పుణ్యము రాదే
పద్యము రాయగ తెలుగున
చోద్యంబుగ జనులుజూచి జోరుగ తిట్టున్
ఉద్యమమిక తేదలచిన
విద్యల నెల్లను తెలుగున వివరించ దగున్
ముండకు ముచ్చట దీర్చుచు
అండగ వుంతునని యేల దండగ పలుకుల్
నిండుగ పెండ్లాడి తనతొ
నుండిన తనబతుకునిండ నుండును సుఖముల్
తప్పులు జేసితి నేనే
తప్పనిఒప్పు కొనుచుంటి దయనొసగరితా
నిప్పులపై నడువనినను
యిప్పుడె నడిచెద క్షమించు యికననుహరితా
నిండగు పున్నమివెన్నెల
కండ్లార గనినమనసున కాంతులు నిండున్
మెండగు యాలోచనలతొ
నిండుచు నినుకవి నిజేయు నిజమిది సుమ్మీ. -
కంద పద్యములు
వరము లొసగు మాలక్ష్మీ
కరము లొసగుసా యములను కడవరక నెదన్
కరుణా రసమయి ఈమా
వరలక్ష్మిని తలచుకొనగ వదనము వెలుగున్.
(వరలక్ష్మి గురించి)ఎవ్వాని పలుకులు వినిన
పువ్వోలె విరయు నుజనుల ముదములు యెల్లన్
అవ్వాని సభాపరమున
సవ్వాలుగ నిలుచుదెవరు షౌకతు గార్కిన్.
(నా సహచర వుద్యోగి షౌకత్ సారు గురించి)ధీటగు మాటలు వాడకు
మాటుగ దప్పిదముజేసి మానం బిడకున్
దాటకు చేసిన బాసలు
మేటిప లుకులివి విడువక మేలగు వినుడీ
వీడము మీమార్గంబును
వీడము మీయాశయముల వీడము యనుచున్
వీడము మీభాష్యములను
వీడము మీజ్ఞాపకముల వీడము సుమ్మీ.
(మా రీజియన్ అసిస్టెంట్ జనరల్ మేనేజరు శ్రీ బి యస్ రాజా గారి గురించి)రాజాలదు ఈరోజని
బేజారున మామనసులు బెంబేలెత్తన్
రాజాలా మముగాచిన
"రాజా"గారే నిజమగు రాజని యనెదన్.
(మా రీజియన్ అసిస్టెంట్ జనరల్ మేనేజరు శ్రీ బి యస్ రాజా గారి గురించి) -
కంద పద్యములు
ఎక్కడి కన్నడ రాష్ట్రము
ఎక్కడి యాంధ్రము,ముదమున విరిసిన నగుతోన్
యిక్కడి కేగిన మీకును
ఎక్కడ దక్కని యశమది ఇచ్చట దక్కెన్.
(మా రీజియన్ అసిస్టెంట్ జనరల్ మేనేజరు శ్రీ బి యస్ రాజా గారి గురించి)జూచితి తొలిసారిగనిను
వేచిన నామనసునందు వెన్నెల గురిసెన్
దాచుము ననునీలో యని
జాచిన నాజేతినిగొన జాలును హరితా.
ఎందని వెదుకుదు కృష్ణా!
నందనవన సుందరవదనాయని నేనా
నందంబున పిలువగ నీ
సుందర వదనంబుజూపి శుభముల నిడుమా.
ఓరామా! నేపలికెద
నారాముడు సకలలోక నాథుడు యనుచున్
నోరారా రామాయని
పారాయణ జేసుగొనిన భాదలు తొలగున్.నారాయణ నామంబును
పారాయణ జరుపుకొనిన పాపము తొలగున్
నారాయణు సేవించుచు
నౌరాయనురీతి మీరలవనిని మనుడీ. -
కంద పద్యములు
కాసుల రాశులు బెంచుచు
దాసుల దోషుల ననకుము, దైవము గాంచున్
త్రాసున దూచును పాపం
కాసుల వీడుచు మనుజుల గాంచుము నరుడా.
పదమిది బలికితి తెనుగున
పదములు గలుపుచు బలికిన కదనము లొచ్చున్
పదములు బలుకుము తెనుగున
పదపదమని బలుకునుమది పదనిస ములుగన్
కష్టము నెరుగని పురుషుడు
ఇష్టము చూపం గలేని యింట్లో సతియున్
నష్టము తెచ్చెడి బేరము
అష్టమ శనివలె విడువక కష్టము లిచ్చున్.
కందము రాయుట యెఱుగని
అందరు కవులను కవులని యనడమె దగదున్
వందల సైన్యము యున్నను
మందుడు రాజై నవిజయ మందుట దగునే
వలదు వలదినిన యెరుగక
వలచి మురిసెదవు మగువల వలపుల వలలోన్
వలచి గెలిచిన మగువ నిను
కలచి విడిచినయెడల మరి కలలే మిగులున్.
Pages:
<<
>>
రచన : వంశీకృష్ణ కాసులనాటి