పద్యములు
-
కండ కావ రముతొ కన్నత ల్లిమనసు
కుంగ దీయు నట్టి కొడుకు కన్న
గుడ్డి దైన నొక్క కుక్కపెం చదగును
చావు లోన గూడ జతగ యుండు
కనులు మూసు కొనిన కష్టంబు లాగునా
ఏడ్చి నంత దిగున యెదన భాద
బతుకు నందు సుఖము పరికించి చూడగా
మనసు నందె యుండు మహిలొ గాదె.
నవ్వి నడువ వలయు నరకమైనను గూడ
కాంతు లీడి ముదము కళను బెంచ
కరిగి పోడ యముడె కరుణామృతముతోన
నవ్వ లేని వాడు నరుడె గాడు.
ఆగ లేక నీవు ఆపుకొననులేక
వచ్చు కోప మెపుడు దెచ్చు తంట
అణచి గొనుచు నడువ యట్టియాగ్రహమును
జగము యందు నీకు జయమె గలుగు.
దిక్కు లెన్ని యున్న దిశనుజూపెదొకడె
పేగు దెంచు తల్లి ప్రేమ యొకటె
మనసు యెపుడు నొక్క మగువకోసమెసుమ్మి
మాట నిలిపి నోడె మనుజు డౌను
-
విశ్వ నాథు డనెడి విఖ్యాత దర్శకు
డవని యందు లేడు యట్టి ఘనుడు
కాలమందు నిలచె కళలతపస్వియై
తెలుగు చిత్రసీమ వెలుగు బెంచి
కండ కావ రముతొ కన్నులె గప్పగ
తిండి యరగ కుండ తిక్క బుట్టి
ముండ మాట లన్ని మూటను గట్టి కో
దండ రాము ననిన తగదు రోయి.
కత్తిమహేష్ గురించి నేను రాసింది.
దేవుడంటె యితడె దీవెనలొసగని
కరుణ లేని వాడి కాళ్ళ నొదిలి
దేహి యన్నవారి దేహములలొజూడు
యుండు దైవ మెపుడు నిండు గాను
తాగి బోకు యెపుడు తల్లిదండ్రి కెదురు
ధరణి యందు వారె దైవసమము
తెలిసి యెపుడు నీవు తెగియించ బోకురా
వారి బాధ దీర్చు వారు లేరు
వేలు తోటి గిరిని వీలుగ నెత్తిన
గోపి నాథు కన్న గొప్ప దనము
ఉదర మందు నిన్ను ఓర్పుగ మోసిన
తల్లి యందె గలదు ధరణి లోన
-
అర్థ మెరుగ నట్టి అర్థాంగి చెంతన
తగిన ఆస్తి యుండి తపన తెగని
చదువు గల్గి గూడ సభ్యత లేనట్టి
వారి బతుకు లెపుడు భార మవును
ఎంత ధనము యున్న ఏమిలా భమ్మురా
అంతు లేని యట్టి చింత యున్న
ఎంత నీరు యున్న ఏమిలా భమ్మురా
గొంతు తడప నట్టి సంధ్ర ములతొ
చింత=బాధ, సంధ్రం= సముద్రము
ఆయుర్ వేదము యనునది
ఆయువె మనవైద్య విద్య లన్నిం టికనీ
జేయుచు చికిత్స కరొనకు
ఆయువె పోయుము జనులకు ఆనం దయ్యే
ఆనం దయ్యా నీవే
ప్రాణం బులనిలు పునట్టి పరమా త్మనుచున్
దీనం బుగనిను జేరిరి
పూనంగ తనువు కరోన భూతము తోడన్
Pages:
<<
>>
రచన : వంశీకృష్ణ కాసులనాటి