దేవుళ్ళు

*మంచి సందేశాత్మక కథ*. ఒక పిల్లాడు దేవుడిని చూడాలి అనుకున్నాడు . బుధ్ధుడిలా ఇంటినుండి బయలుదేరాడు . . అయితే ఇంటినుండి బయలుదేరినపుడు ఒక బేగ్ లో రెండు జతల బట్టలు కొన్ని కేకులూ పెట్టుకుని బయలుదేరాడు. అలసిపోవడం తో రెస్ట్ తీసుకుందాం అనుకున్నాడు . దగ్గరలో కనబడిన ఒక పార్కులోకి వెళ్ళాడు . ఆకలి అనిపించింది . ఒక కేక్ ప్యాకెట్ విప్పాడు . పక్కన ఒక ముసలి ఆమె ఆకలిగా చూస్తూ కనబడింది . ఆమె దగ్గరికి వెళ్లి ఒక కేక్ ముక్క పెట్టాడు . . ఆమె అతని వంక ఆప్యాయంగా చూస్తూ కేక్ తీసుకుని తిని ప్రేమ పూర్వకంగా నవ్వింది . ఆ నవ్వు కుర్రాడికి చాలా నచ్చింది ఆమె నవ్వు మళ్ళీ చూడాలి అనుకున్నాడు . ఇంకో సారి దగ్గరకి వెళ్లి మళ్ళీ చిన్న కేక్ ముక్క ఇచ్చాడు . ఆమె మళ్ళీ కేక్ ముక్క తీసుకుని కృతజ్ఞతగా ఆప్యాయంగా ప్రేమగా నవ్వింది . ఆ నవ్వు కుర్రవాడికి చాలా నచ్చింది . ఆమె నవ్వును చూస్తూ ఉండాలి అనిపించింది . మద్యాహ్నం అంతా అతను అలా ఇస్తున్నాడు . ఆమె తీసుకుంటోంది . నవ్వుతోంది . ఇద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు . . సాయంత్రం అయ్యింది . చీకటి పడుతోంది . లేచి వెళ్లి పోదాం అనుకున్నాడు . వెళ్లేముందు పరుగు పరుగున వెనక్కు వచ్చాడు . ఆమె దగ్గరగా వెళ్లి ఆమెను కౌగలించుకుని ఒక ముద్దు పెట్టాడు . ఆమె కూడా అతడిని దగ్గరకు తీసుకుని అందమైన తన నవ్వును బదులు ఇచ్చింది . . ఇంటికి తిరిగి వచ్చేశాడు . అతడి ముఖం లో కనబడుతున్న దివ్యమైన ఆనందాన్ని చూసిన అమ్మ అడిగింది . . కన్నా ! ఏమిటి రా ! ఈ రోజు నీ ముఖం లో అంత ఆనందం కనబడుతోంది . ఈ రోజు ఏమి జరిగిందిరా ? అని . “నేను ఇవాళ దేవుడితో కలిసి భోజనం చేశానమ్మా !” అన్నాడు ఆ కుర్రాడు . అమ్మ సమాధానం కోసం ఎదురు చూడకుండానే “నీకు తెలుసా అమ్మా ! నేను ఇప్పటి వరకూ అలా నవ్విన వాళ్ళని చూడనే లేదు” అన్నాడు . అక్కడ ఆ ముసలామె కూడా ఇంటికి సంతోషం గా చేరింది . ఆమె ముఖం లో కనబడుతున్న ప్రశాంతతను చూసి “ఏమిటమ్మా ! ఇవాళ అంత ఆనందం గా ఉన్నావు ?” అడిగాడు కొడుకు . . “ఈ రోజు దేవుడిని చూశానురా!” అంది కొడుకుతో . అతడు సమాధానం ఇచ్చే లోపులోనే “ఆయనతో కలిసి పార్కులో కేకులు తిన్నాను” . . “ దేవుడు నేను అనుకున్న కంటే చాలా చిన్నవాడేరా!” . . ఈ సంఘటన నుండి మనం ఏమి తెలుసుకోగలం ? . ఒక ఆత్మీయ స్పర్శ , ఒక చిన్న చిరునవ్వు , ఒక చిన్న మాట , ఒక చిన్న ఆలకింపు , ఒక చిన్న మెచ్చుకోలు , ఒక చిన్న సహాయం మన చుట్టూ ఉన్న వారిలో ఎంతో మార్పు తీసుకు రాగలదు . . మనలో ఎవరమూ దేవుడిని చూడలేదు . ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదు . . జీవితం లో మనుషులు మనకు ఎదురుకావడం యాదృచ్చికం కాదు , దైవ సంకల్పం .... అది ఒక క్షణం కావచ్చు , కొంత కాలం కావచ్చు , జీవితాంతం కావచ్చు . . ఎదురుపడిన వారిని సమానం గా గౌరవిద్దాం ! అందరిలోనూ దైవాన్ని చూడడానికి ప్రయత్నిద్దాం ! ఇది సాధన ద్వారానే సాధ్యం ! . ఇతరులు మనలో దైవాన్ని చూడగలిగేలా ప్రవర్తిద్దాం !
Share on WhatsApp
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

జీవిత సత్యాలు

Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


Share on WhatsApp


తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

దేహమే దేవాలయం (scientific Proof)

🧘‍♂️దేహమే🛕 దేవాలయం🧘‍♀️ మనం అందరం చిన్నప్పటి నుండి మన పెద్ద వాళ్ళు చెప్పారని, వారూ వెళుతున్నారు అనీ దేవాలయాలకు వెళుతున్నాము. అక్కడ గర్బగుడిలో వున్న ఈశ్వర లింగాన్ని లేక అక్కడ వున్నా దేవత ప్రతిమని చూసి మనసార మొక్కుకొని, మన కోరికలన్నీ కోరుకొని ఇంటికి వచ్చి ఈరోజు ఆలయంకి వెళ్లి నేను దేవుడిని దర్శనం చేసుకున్నాను అనుకొని మనం సంతృప్తి పడతాము. కానీ ఇక్కడ ఒక వేదాంత విషయాన్నీ గ్రహించాలి.అది ఏమిటంటే దేవాలయం అంటే మట్టితో కట్టిన ఒక భవనం అందులో (గర్భ గుడిలో) అంటే అంతరంలో ఈశ్వరుడు అతని దర్శనం. దేవాలయం ఒక దేహం నిజానికి పరిపూర్ణమైన, సుందరమైన ఆలయమంటే మానవ శరీరమే. ఇక్కడ 'తత్' (ఆత్మ) ఇల్లు చేసుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, పంచవిషయాలు అంతరంగ వృత్తులు (అంత: కరణ, మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారాలు) తమ క్రియలను నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చింది. దేహమే దేవాలయం. దేహంలో ఉన్న జీవమే పరమాత్మ. జీవాత్మ పరమాత్మ కంటే వేరన్న అజ్ఞానమే నిర్మాల్యం; నేనే అతనని పూజించలి అని అగమాలు ఘోషిస్తాయి. దేవాలయం ఒక దేహం లాంటిది. శిఖరం శిరస్సు; గర్భగృహం మెడ, ముందరి మంటపం ఉదరం; ప్రాకారపు గోడలు కాళ్ళూ; గోపురం పాదాలు; ధ్వజ స్తంభమే జీవితం. ఇలా ఆలయం భగవన్మూర్తిగా భావింపబడుతోంది. అందువల్లనే దేవలయాన్ని పవిత్రంగా భావిస్తున్నాము. ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణిస్తున్నాము. అక్కడే మనం విశ్వసిస్తున్నాము. భగవంతుడు లేకుండా మానవుడు లేడు.. మానవుడు జీవించలేడనీ, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనీ, అందుకనే భగవన్మూర్తిని ఒకచోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాము. భగవత్సాక్షాత్కారం కోసమే ప్రతి హిందువు తపన పడతాడు. ప్రయత్నిస్తాడు. అదే పవిత్ర స్థలం. అదే దేవాలయం. ఇది భౌతిక శరీరం (ఫిజికల్ బాడీ) మానసిక శరీరం (సైకిక్ బాడీ), తైజసిక శరీరాలను (సూపర్ కాన్షియస్ బాడీ) ప్రతిబింబిoచే ఒక ప్రతీక. అందువల్లనే దేవాలయం భగవంతుడికి మానవుడికి ఉన్న ఒక కొక్కీ (లింక్) అని విజ్ఞుల అభిప్రాయం. దేవాలయ నిర్మాణం ఎప్పుడు, ఎక్కడ ఆరంభింపబడిందో చెప్పడం కష్టం. వేదకాలాల్లో దేవాలయాలు లేవనీ, విగ్రహారాధనా పద్ధతి, దేవాలయాల నిర్మాణం వేదకాలపు చివరిదశలో, రామాయణ, మహాభారత కాలల్లో ఆరంభమైందనీ, వేదకాలపు యాగశాలలే కాలక్రంగా దేవాలయాలుగా రూపొందాయని పలువురి అభిప్రాయం. 🧘‍♂️దేహమే దేవాలయం:-🛕 శరీరం ‘శీర్యతే ఇతి శరీరః!!’ అని వ్యుత్పత్తి అర్థం. శీర్యతే అంటే శీర్ణమైపోయేది, జీర్ణమైపోయేది, శిథిలమైపోయేది అని అర్థం. జీర్ణించిపోవటం - శిథిలమైపోవటం దీని లక్షణం. ముసలితనంలో కావాలని మనం మందులు మాకులు మ్రింగనక్కరలేదు. అమృత భాండంలో పెట్టినా సరే ఈ శరీరం శిథిలమైపోయేదే, నశించిపోయేదే అందుకే శరీరం అన్నారు. 🧘‍♂️దేహం:-🧘‍♀️ దేహమని ఎందుకన్నారు ? 'దహ్యతే ఇతి దేహః' అని వ్యుత్పత్తి అర్థం. దహింపబడేది గనుక దీనిని దేహం అన్నారు. చచ్చిన తరువాత కట్టెలలో కాలుస్తారు గనుక దహింపబడేది అన్నారా ? మరి కొందరి దేహాలను కట్టెలతో కాల్చరు గదా ! అవి దహింపబడవు గదా ! మరి వాటిని దేహాలు అని అనరా ? చనిపోయిన తర్వాత దహింపబడటం కాదు. జీవించి ఉన్నప్పుడే తాపత్రయాలనే అగ్నిచేత నిరంతరం దహింపబడుతూ ఉండేదే ఈ దేహం. ఆధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక తాపాలే తాపత్రయం. 🛕దేవాలయం:- దేహాన్ని దేవాలయం అని వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఎందుకు అంటే "దేహో దేవాలయ ప్రోక్తః జీవోదేవస్సనాతనః" - అనేది ఉపనిషద్ వాక్యం. ఈ దేహం ఎలాంటి దేవాలయం, ఇది ఒక చోట స్థిరంగా ఉండే దేవాలయం కాదు. ఇది చరదేవాలయం. కదులుతూ ఉండేది. బయట కనిపించే దేవాలయాన్ని మానవులే కట్టిస్తారు. అందులో దేవుణ్ణి కూడా మానవులే ప్రతిష్టిస్తారు. కాని ఈ శరీరమనే దేవాలయాన్ని భగవంతుడే నిర్మించి, హృదయమనే గర్భగుడిలో తనకు తానే ప్రతిష్టితుడై కూర్చున్నాడు. బయటి గుడికి - ఈ గుడికి అదే తేడా. ఇక్కడ భగవంతుడు 'స్వయంభూ' అన్నమాట. మరి ఏ దేవాలయం ముఖ్యమైనది ? ఏ దేవుని పూజ గొప్పది ? ఆలోచించుకోవాలి. 🧘‍♂️దేహమే దేవాలయం🛕:- 'దేహమే దేవాలయం' అవును నీ దేహమే, పంచభూతాలతో నిర్మితమైన నీ శరీరమే దేవాలయం. ఈ శరీరానికి, మనస్సుకు, బుద్దికి, ప్రాణానికి, జీవానికి (అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలు) అన్నిటికి శక్తిని ఇచ్చే ఆ పరమాత్మనే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు నీ శరీరపు అంతరంలో హృదయంలోనే స్వయం ప్రకాశితమై దేదీప్యమానంగా వున్న ఆ చిదానంద స్వరూపుడు అయిన ఆ దేవదేవుడు నిరాకారుడు,శాశ్వతుడు, సత్యుడు, నిర్గుణుడు, సమస్త లోకాలకు సృష్టి కర్తయైన ఆ సర్వేశ్వరుడు ఈ శరీరపు అంతరంలోనే వుండి తను ఏమి చేయక తన శక్తి చేత ఈ శరీరాన్ని ముందుకు నడుపుతున్నాడు. నీ శరీరపు అంతరంలో వున్న ఆ పరమేశ్వరుడు స్వయం ప్రకాశితమై వెలుగుచున్నాడు అక్కడ ఏ సూర్యుడు లేడు. చంద్రుడు లేడు. ఆయనే స్వయం ప్రకాశి. సూర్య చంద్రులు కూడా అయన యొక్క శక్తి చేతనే ప్రకాశింపబడుతున్నారు. 💖హృదయమే దేవుని దేవాలయం🛕:- మీ హృదయాంతరాలంలో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఆ దేవ దేవునిని మీద మనస్సు ఉంచి సాధన (అంటే ధ్యానం) ద్వారా మీ హృదయాంతరంలోనే దర్శించుకొని మీరు పొందిన ఈ మానవ జన్మకు సార్ధకతను చేసుకొని తరించాలి. అదియే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అదియే దేవాలయం యొక్క విశిష్టత. దేవాలయానికి వెళ్లి గుడిలో వున్న విగ్రహ రూపములోని దైవాన్ని దర్శించడం అంటే మనం మన హృదయాoతరంలో వున్న ఆ సర్వేశ్వరున్ని ధ్యానం ద్వారా పరిపూర్ణ (సంపూర్ణ) దర్శనం చేసుకోవాలి అని ఆ విధంగా మనం దానిలోని వేదాంతాన్ని గ్రహించడానికి మన ఋషులు ఆలోచించి అలా చేయవలసి వచ్చింది. ఇందులో మనిషి ఎంతో తెలుసుకోవలసిన భగవంతుని దైవత్వ సత్య అన్వేషణ జ్ఞానం ఉన్నది. ఆలోచిస్తేనే ఎంతో అర్ధం చేసుకోగలం, సాధనతో సాధ్యం చేసుకోగలము. భగవంతుని జ్యోతి స్వరూపులు అయిన మానవుల దేహమే దేవాలయంగా ఉన్నది. ఈ సమస్త విశ్వ భూమండల సృష్టిలోని మహాద్భుత చిదంబర దేవాలయ రహస్యం ఇదియే. మనిషి జీవాత్మ దేహామే దేవాలయము ముక్తి మోక్ష మార్గ మహాజ్ఞాన సందేశం. మనిషి దేహమే దేవాలయం { చిదంబర ఆలయం}పంచభూతాల తత్త్వంతో నిర్మితమైన మహా అద్భుత మనిషి దేహా సృష్టి రహస్యం.మనవుల దేహమే దేవాలయం (గుడి ) మనిషి లోపల కొలువైవున్న "జీవుడు (దేవుడు)" ఆత్మ (పరమాత్మ) "జీవాత్మ" ను దర్శించి తనే పరబ్రహ్మమనే సత్యాన్ని తెలుసుకోవాలి. జీవిత శరీర గమ్యం ఇదే మోక్షం. దేవాలయము చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసిన ఫలితం ఉండదు. మీ దేహములోని పరమాత్మని అన్వేషించి దేహం లోపలికి అంతర్ముఖంగా ప్రయాణిస్తే ఫలితం అమోఘామృతం లభిస్తుంది. ప్రస్తుతం ఎంత మంది ఈ మార్గంలో ప్రయాణిస్తున్నారు.మనవ దేహం లోపల జీవుడే దేవుడిగా, ఆత్మయే పరబ్రహ్మ జ్యోతి దర్శనంగా చేసుకుంటున్నారు. మనవ దేహం లోపల వచ్చి వెళ్లే శ్వాసయే పరమాత్మ పరబ్రహ్మ జ్యోతి స్వరూపంగా ఉన్నది. ఆదినారాయణ తిప్పన
Share on WhatsApp
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

Rich and Poor

*How do you know* *you are rich?* *Amazing answer* *by an IIT student.* *When I was doing my B Tech, there was a Professor who used to teach us ‘Mechanics’.* *His lectures used to be very interesting since he had an* *interesting way to* *teach and explain* *the concepts.* *One day, in the class, he asked the following questions:* *1. What is ZERO?* *2. What is INFINITY?* *3. Can ZERO and INFINITY be same?* *We all thought that we knew the answers and we replied as following:* *ZERO means nothing.* *INFINITY means* *a number greater than any countable number.* *ZERO and INFINITY are opposite and they can never be same.* *He countered us by first talking about infinity and asked, How can there be any number which is greater than any countable number?* *We had no answers.* *He then explained the concept of infinity in a very interesting way, which I remember even after more than 35 years.* *He said that imagine that there is an illiterate shepherd who can count only* *upto 20.* *Now, if the number of sheep he has less than 20 and you ask him how many sheep he has, he can tell you the precise number (like 3, 5 14 etc.).* *However, if the number is more than 20, he is likely to say “TOO MANY”*. *He then explained that in science infinity means ‘too many’ (and not uncountable) and in the same way zero means ‘too few’ (and not nothing).* *As an example, he said that if we take the diameter of the Earth as compared to distance between Earth and Sun, the diameter of earth can be said to be zero since it is too small.* *However, when we compare the same diameter of earth with the size of a grain, diameter of earth can be said to be infinite*. *Hence, he concluded that the same thing can be ZERO and INFINITE at the same time, depending on the context, or your matrix of comparison*. *The relationship between richness and poverty is similar to the relationship between infinity* *and zero*. *It all depends on the scale of comparison with your wants*. *If your income is more than your wants,* *you are rich*. *If your wants are more than your income,* *you are poor.* *I consider myself rich because my wants are far less than my income.* *I have become rich not so much by acquiring lots of money, but by progressively reducing my wants.* *If you can reduce your wants, you too can become rich at this very moment.* May your lives get rich by good thoughts, good deeds, good people around you always. *Happy Morning!* *Keep Smiling!* 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 To see more stories click👇
Share on WhatsApp
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media


- 1 -
ఢిల్లీకి బదిలీ అయిన సందర్భంలో

ఘనముగ నాకొసగిరి తమ
వినయముతో సహచరులిక వీడ్కోలనుచున్
అనుకోనట్టీ బదిలీ
కనులలొనింపెను తెలీని కలవరమ్ములన్

చక్కని మాఇంటివసతి
మక్కువతో జూచినట్టి మాయజమానుల్
దక్కరు మాకింకొకరని
బిక్కమొహము బెట్టిమాకు వీడ్కోలిచ్చెన్

ఢిల్లీ యెటులుండునొ మరి
ఇల్లూదూరం బవునట ఇల్లాలే నా
తల్లిగ తోడుండినడువ
మెల్లగ పయనంబయితిమి మేలున్ దలచిన్

చల్లటి మేఘా లనడుమ
మెల్లగ సాగెను పయనమె మిన్నం చులలోన్
ఢిల్లీ వచ్చిం దనుచూ
ఉల్లా సంబున మనస్సె ఉరకలు వేసెన్

కొత్తని వాతా వరణము
పుత్తడి దొంగల గురించి పూర్తిగ దెలియన్
పుస్తెలు కమ్మలు దీసెను
ఒత్తిడి తోనా సతినను ఓరగ జూచిన్


- 2 -

నాజీవిత మొకపద్యము
రాజీ పడనట్టి రాత లాద్యంతములున్
చేజిక్కెను యవకాశమె
రాజీవము నిండునట్టు రాసెద చూడున్.

నాదిది చిన్నని పద్యము
కాదిది యర్థము యెఱుగని కవితయు ననుచున్
భాదలు దీర్చెడి పదములు
యాదియు యంతము రసమయ యమృతమొసంగున్

సుబ్బారామయ్య సుతుడ
న్నిబ్బరముగ జెప్పుచుంటి నిప్పుడు ఈనా
కబ్బిన విద్యలు యెల్లను
అబ్బుర పరచిన పితరుల అమృత ఫలముల్
(మా నాన్నగారికి నమస్కరిస్తూ)

కోపంబున బట్టబయెలె
లోపంబులు పిదపవీవు లోకువె ప్రజకున్
ఆపంగ కోపమునునీ
రూపంబే మారి బతుకు రుచులే దెలియున్

కందము రాయుట యెఱుగని
అందరు కవులను కవులని యనడమె దగదున్
వందల సైన్యము యున్నను
మందుడు రాజై నవిజయ మందుట దగునే


- 3 -

కుదరదుయని తెలిపినయిక
వదలక తుదివరకు యుండు వాడే గెలుతున్
కుదరదనెడి మాటవిలువ
అధికారిని బట్టిదెలుప అంతే బలమౌ
(19-06-2020)

ఏదీ నీసొంతమవదు
ఏదీ నీతోడురాదు ఇహపర మందున్
నీతో నుండున దదియే
నీతిగ నువుజేసినట్టి నీసత్కర్మల్
(14-06-2020)

అక్షరముల లక్షణమే
లక్షల మనసులలొ జేరి లక్ష్యమె జూపున్
శిక్షణ జేయుచు రాసిన
అక్షరమే యవనియందు ఆయుధ మవ్వున్
(21-06-2020)

కనుగొనదగునా మగువల
మనసును, మనుజుల మనసున మాయల్
ఘనమగు గగనపు అంతము
తనువున జీవమ్ముయెచటొ తగునా తెలుపన్

ఓరామా! నేపలికెద
నారాముడు సకలలోక నాథుడు యనుచున్
నోరారా రామాయని
పారాయణ జేసుగొనిన భాదలు తొలగున్.


- 4 -

బలమూ బలగము గలవని
తలచిన యేదైన గూడ దరికొచ్చనుచూ
పలికిన వారెందరికో
తలరాతలు మార్చికరొన తరిమెను చితికిన్
(14-06-2020)

ఓటమి ఓటమనెడి యీ
మాటలతో భయమునింపి మనసును చెరిపే
నాటక రాయుళ్ళ యెదలొ
ధీటుగ నీ గెలుపుతోటి దింపుము గుణపాల్
(27-05-2020)

తరగని ఆస్థుల లెక్కల్
మెరుగైన చికిత్స జేయుమేలగు వైద్యుల్
ధరణిలొ నీకే మున్నను
మరణాన్నే యాపువారు మహిలో గలరే
(03-05-2020)

తాకిన పడతుల తనువును
మైకమె తనువంతపాకి మాయలె జరుగున్
బాకుల చూపుల జోలికి
పోకుము మునుముందుకీవు పోవును పరువే
(29-12-2019)


- 5 -

వదిలిన ప్రాణము దెచ్చుట
కదిలెడి కాలాన్ని పట్టి కదలక నిలుపన్
మదిలో ప్రేమను గొలుపుట
విధిరాతల వాడికైన వీలున్ పడదే
(23-04-2020)

నవమ సమ్ములు మోయుచు
నవరంధ్రా లేర్పడంగ నవ్వుతు తనువున్
అవలీలగ పంచేసెడి
అవనిన్ వేరెవరులేరు అమ్మే సుమ్మీ
(01-05-2020)

గాలికి యందరు సమములె
నేలకునూ యందరొకటె నింగికి గూడన్
కాలాగ్నికి కాలేయీ
తోలుకొరకు యేలనీకు తుదిలేనాశల్

బాణీ ఏదే మైనను
గానమె సేయంగ బాలు కమనీయంబౌ
వీనుల విందగు బాలుని
గానంబిక గగనమేగి కనులను తడిపెన్
(26-04-2020- బాలసుబ్రమణ్యం గారిమృతి)


- 6 -

తుఛ్ఛంబగు యీ జగమున
ఉఛ్ఛము నీఛము గురించి ఊహలె చాలున్
చచ్చే నాటికి నీకొక
మచ్చే లేకుండయున్న మహనీయడవౌ
(19-09-2020)

పంచకు నీబాధనెపుడు
కొంచెము కూడను పరులకు కోరిన గూడన్
వంచన తోఓ దార్పుని
మంచిగ జూపించి నిన్ను మట్టున బెట్టున్
(14-06-2020)

దుర్భరమగు యాకలితో
గర్భిణియగు యేనుగొకటి గ్రామము కేగెన్
అర్భకులగు యచటిజనులు
నిర్భయముగ మందుబెట్టి నిలువున గాల్చెన్

భావం : ఆకలితో ఒక గర్భిణి అయిన ఏనుగు, కేరళ లోని ఒక గ్రామముకు వెళ్ళగా అక్కడి ప్రజలు దానికి పేలుడు పదార్థము గలిపిన పండును ఇవ్వగా అదితిని అక్కడే మరణించింది.

నారాయణ నామంబును
పారాయణ జరుపుకొనిన పాపము తొలగున్
నారాయణు సేవించుచు
నౌరాయనురీతి మీరలవనిని మనుడీ.


- 7 -

చైనా దేశము కుమిలె, క
రోనా నామము గలిగన రోగము సోకన్
నానా జీవుల మాంసమె
చైనా కొంపను దహింప చెదిరెను బతుకుల్

చైనా ఆకలి దీర్చెడి
నానా జీవుల తనువుల నాక్రం దములే
ఈనాడొక వైరసువలె
ప్రాణాలను దీసెనంట రాక్షస కరొనా
(06-03-2020)

నగువును పంచెడి జనులను
బిగువుగ జూచుచు జగమ్ము భీతిని పెంచున్
నగవులె వీడిన వారికి
జగమొక శత్రువయివారి చావునె గోరున్

భా: నవ్వులు పంచుతూ, సరదాగా వుండే వారిని ఈలోకం ఈర్ష్య, కోపంతో చూస్తూ భయాన్ని పెంచుతుంది. అదే నవ్వును విడిచి వెళ్తే, ఈలోకం వారిని ఒక శత్రువు లాగా చూసి ప్రాణాలే కోరుకుంటుంది కదా…
-(02-04-2020)


- 8 -

కాదోయీ ఏబంధము
నాదే కడవర కనుటకు నటనే సర్వం
రాదోయీ నీతోడుగ
నీదని నువుతలచినట్టి నీసంపత్తుల్
(27-12-2019)

మూతికి మాస్కులు తొడగగ
వాతలు దేలుచు ముఖమిక వాచిన పిదపన్
కోతులె మనపూ ర్వికలను
రాతలె నిజమని బలికితి రసరమ్యముగా
[ముఖానికి మాస్కులు తప్పనిసరి అనగా ఇటులుంటుందని చమత్కారంగా(03-05-2020)]

రంగుల చీరను చుట్టీ
కొంగును చేతిలొ నలుపుచు కోమలి నడచే
భంగిమ గాంచగ నరులూ
నింగిలొ సురులూ మతిచెడి నిశ్చేష్టులయెన్

బుగ్గన చుక్కను పెట్టగ
సిగ్గులె చేమంతులవుచు చెంపల జేరెన్
ముగ్గులె వేసెను పాదమె
లగ్గము సమయానపడతి లావణ్యముగా


- 9 -

నీతిని నమ్మిన వాడున్
చేతలలో జేసిజూపు చెప్పిన వన్నీ
ఆతని మనసును మార్చగ
భూతలములొ లేరెవరిక పుట్టరు గూడన్

భావం : నీతిని నమ్ముకుని బతికేవాడు, తాను మాటలలో చెప్పినవన్నీ చేతలలో చేసి చూపుతూ బతికేస్తాడు. అటువంటి వాడి మనసును మార్చి, లొంగదీసుకునే వారు ఈభూమిమీద లేరు ఇంక పుట్టలేరుకూడా. (01-05-2020)

భరతావని కలలనుతన
కరమున బిగియించి ఈటె కసిగా విసిరెన్
గురితప్పని నీరజుడిని
పరవశముగ పసిడిజేర భారతి పొంగెన్

భావం : భారతదేశ 100 సంవత్సరాల కలలన్నీ తనపిడికిలిలో బిగించి, ఈటెపైమోపి కసిగా విసరగా అది గురితప్పకుండా బంగారు పతకాన్ని తాకగా, భారతదేశం పొంగిపోయింది.
(నీరజ్ చోప్రాకు ఒలంపిక్స్ లో స్వర్ణ పతకం - 08-08-2021)


- 10 -

ఎదురే మాకెవ్వరనుచు
బెదరక వనితల జెరచుచు భీతిని గొలుపే
మదమెక్కిన కుక్కలనిక
పదపదమని కాటివరకు పరిగెత్తించెన్

(ప్రియాంకరెడ్డి హత్య నిందితులకు మరణశిక్ష)
(11-12-2019)

మితిమీరిన కోపంబున
మతిపోయిన మరకటములె మహిళలు గనుకే
సుతిమెత్తగ పలికినచో
అతికించిన తప్పులైన అతివలు పొంగున్
(20-11-2019)

సాహిత్యామృత ధారలె
దాహార్తుల గొంతికలను తడపగ, తనువే
బాహ్యపు అందాలను విడి
ఆహాయని తేలెనంట ఆనందముగన్

అంగడి సరుకాయె చదువు
లొంగెను పిల్లల భుజమ్ము లోర్వగ బరువుల్
మింగుచు చక్కని విద్యను
భంగము చేసిరి చదువుల భవితము యంతన్.


- 11 -

నాలుక జూపును రుచులను
మేలును కీడును తెలుపును మెదడే మనకున్
నీలా కాశము నేర్పును
కాలా తీతమ గుశక్తి గాంచిన మదితో

చెప్పకు తప్పుడు మాటలు
మెప్పును పొందెద యనిజన మెల్లరి గూర్చిన్
నిప్పుగ మారుచు నినుయిక
యెప్పుడు మసిచే యునొమరి యెవ్వరి కెరుకన్

పాపం బేదో జేయగ
లోపం బగుకాయమొసగె లోకేశుడనిన్
కోపం బేలర నరుడా
లోపంబే లేనివార లుర్విన్ లేరే

చక్కగ గాచిన పాలను
దక్కిన ప్రియసఖి కొలువును తగదుర వీడన్
మొక్కిన దొరకదు మరిమరి
అక్కున జేకొని నిలిచెడి ఆడది యిలనన్

కాయము ఎవ్వరి దయినను
మాయక యుండవు వలువలు మరిమరి తొడగన్
తీయటి మదిగల జనులిక
చేయగ చెలిమిని ఖలునితొ చెరుగును గుణముల్.


- 12 -

వాడుక భాషలొ కవితలు
నాడిని చేరును గనుకనె నయమగు రాయన్
వాడిని పెంచేటి తెనుగు
వేడుకలిక సాగవలెను వెయ్యేండ్లైనన్

కుక్కలె మేలాయె గదర
లెక్కలు చూడక మనఃస్సు లీనమె జేస్తూ
మిక్కిలి ప్రేమను పంచగ
దక్కదు యటువంటి ప్రేమ ధరిలో యెపుడున్

గురువులె యెల్లపు డునుమన
బరువగు జీవిత ముయొక్క భాద్యత తెలుపున్
మరువక గుర్తుం చుకొనుము
గురువులె దైవం బులిలన గొల్వుము మదితో

కంటికి యింపై నదనుచు
ఇంటికి మనువా డిదెచ్చి యింతిగ గొనగన్
వుండున పరువా లుయెపుడు
యెండక నిండుగ గనుకనె యెరుగుము మనసున్

తాగనిదే మనసాగదు
తాగినచో తనువెయాగ దాశ్చర్యముగా
దాగక నిజములు యెల్లను
రాగములై నోటినుండి రాలును సుమ్మీ


- 13 -

వయసది మీరిన పిమ్మట
నయనము చక్షువు లలసిన నంతటపుట్టే
భయముతొ భగవంతుడిని వి
నయముగ పూజించునట్టి నరుడే శవమౌ

కత్తిని నేనని పలుకకు
చెత్తగ రాముడి గురించి చెల్లదు సుమ్మీ
నెత్తిన గొట్టుచు జనులిక
చిత్తును జేయగ తమకిక చితియే మిగులున్.
కత్తి మహేష్ 🐷 వ్యాఖ్యల గురించి....😠😠😠

నిండని వుదరము కెప్పుడు
మెండగు నొకపూ టకూడె మిక్కిలి సుఖమౌ
నిండిన వుదరము కెపుడును
కొండల తీరగు తలపులె గూర్చును చింతల్.

కరములెపుడు వరములడుగ
కొరకుయనుచు జనులుపలికి గుడివర కెడలన్
నరులనొదలి హరహరులిక
చరచరముల చెరనుగొనిరి జనులవి డుచుచున్.

బంధము లనుబం ధములవి
ఎందుల కికయని పలుకుచు యెటకారముగా
చిందులు వేయుచు సాగిన
వందల జనులిక జగమున ఒంటరు లాయెన్


- 14 -

చెప్పక చెప్పక నొకపరి
నిప్పును తలపించునట్టి నిజమున్ జెప్పన్
ఒప్పుగ జెప్పెద చూడుము
ముప్పును తెప్పించికనిను ముంచును యిలలో

ఇంపగు సంపాదనతో
సొంపుగ భవనాలగట్టి సుఖముగ బతికీ,
నింపుము ననుయని పలికెడి
గంపెడు ఆశల మనసును గగనమె గెలువన్.

జవసత్వ ముండినప్పుడె
శివతత్వం బెరిగి నడిన చింతలె తొలగున్
శివనా మస్మర ణెరుగక
అవహేళన జేయువాడు అంతమె నొందున్

చిన్నారులు దైవసమం
బన్నా వినకుండ వారి బతుకుల జెరచీ
చిన్నాభిన్నము జేసెడి
ఉన్మాదుల చెరనుబట్టి ఉరితీయ దగున్.

ఏనాటికి యేనాటికొ
ఏనాటికి మారిజనులు నెరుగును నిక్కం
బానాటికి యీనాటికి
నానాటికి తరిగిపోయె నరుల గుణంబుల్.


- 15 -

మౌనమె యొకసరి దీర్చును
మానని మది గాయములను, మరియొక సరియా
మౌనమె దీయును ప్రాణము
మౌనమునే మించుశక్తి మహిలో లేదే.

శౌర్యము యుండిన జనులకు
కార్యము ఏదైనగూడ కష్టము గాదే
భార్యే గయ్యా ళైనచొ
ధైర్యపు ధీశాలికైన తలబడు తరమా!!

నెయ్యితొ కొవ్వులె పెరుగని
నెయ్యమె నెయ్యితొ తగదని నేర్పిన వారి
న్నుయ్యిలొ తొయ్యగ తగునిక
నెయ్యే లేనట్టి కూడు నెన్నడు గొనకున్.

అడ్డమె ఆయెను కలిలో
బిడ్డల కేతల్లిదండ్రి విడ్డూరముగా
రోడ్డున వదిలే కొడుకుల
నడ్డియి రగదన్నినంత నడతే మారున్.

ఏదేవిని తమమదిలో
నాదేవత యనిగొలిచెడి నరులిక యేడ్చెన్
శ్రీదేవే లేదనెడీ
భాదే బరువాయయనుచు పగలగ గుండెల్
(శ్రీదేవి మరణించిన సందర్భంలో)


- 16 -

సమస్యా పూరణం - నా పూరణలు

సమస్య: “ఆంగ్లమ్మే తల్లియగును ఆంధ్రమ్మునకున్”

ఆంగ్ల శునక పాలనలో
ఆంగ్లముతో కలిసితెలుగు అశువులు బాసెన్
ఆంగ్లమ్మున మమ్మియనగ
ఆంగ్లమ్మే తల్లియగును ఆంధ్రమ్మునకున్!!
(30-12-2019)

సమస్య : “చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్”

మొట్టిన తనసతి మెదలగ
పుట్టిన ఆవేశమందు పురుషుడి మదిలో
తట్టిన ఆ నీతిపదమె
చుట్టల్ గాల్చిన లభించు సుఖసంపత్తుల్

సమస్య: మీసములన్ గనగ గలమె మేదిని యందున్!

కాసులు ఎన్నున్నను మా
దాసులె దైవంబులనుచు దయతో జూచే
ఆసాములె దైవంబులు
మీ సములన్ గనగ గలమె మేదిని యందున్.


- 17 -

ఎంతో జేసిన కూడను
కొంతైనసుఖము నొసగని కొలువుల కన్నన్
సుందర మైనట్టి వనము
చెంతనె నివసిం చిజపము జేయుటె సుఖమున్

నాలాగని నీలాగని
ఏలాగో తెలియదనుచు యేలయు చింతల్
కాలాన్నే వృధ జేయక
నీలాగే నువుబతికిన నిరతము సుఖమే.

పక్కలొ పెండ్లాముండగ
పక్కింట్లో తొంగిజూడ పరువే బోవున్
నిక్కము తెలియగ నీసతి
మక్కులిరగగొట్టుచు నిను మట్టున బెట్టున్!

ఎగతాళిని చేజాలదు
పగవారిని గూడయెపుడు పదువురి యందున్
తగువారెవ్వరొ మరియిక
తగనోళ్ళెవ్వరొ కనుగొన తరమా మనకున్

అర్థమె పరమార్థమని
వ్యర్థము జేయగ సమయమె వయసే బోవున్
అర్థము నెరిగే లోపే
వ్యర్థం బాయెను బతుకని వగచుట యేలన్


- 18 -

మోడీ తెచ్చిన పథకాల్
పాడెను గట్టెను గదయిక బ్యాంకుల కెల్లన్
కేడీలను వదిలేయుచు
తోడేళ్ళై బ్యాంకుధనము దోచన్ దగునా!

చేసేది బ్యాంకుననిన
చూసే వీలుండదుగద సూర్యాస్తములన్
మోసే భారము గొలవ
త్రాసే లేదన్నమనకు తగవీ బ్యాంకుల్

ఉద్యోగం బ్యాంకుననిన
ఉద్వాసన యుండదనుచు మురిసిన నీకే
ఉద్యోగము తొలగించగ
ఉద్వేగము తోటిమనసు వుడుకుచు పొంగెన్.

ఏనగవున విరయునొమరి
ఆనింగిన పారిజాత మాహ్లాదంగా
ఆనవ్వే వరలక్ష్మిది
తానా నాదేవతనుచు తపములె జేస్తిన్.

మందారమె నీముదమని
కందామని నాకనులతొ కదిలిన నన్నే
హుందాగా వలచిననిను
యెందా కైనను విడువక వెంటే నడుతున్


- 19 -

నేరము జేసిన ధనికుల
బేరము జేయుచు విడిచిక పేదలపై మీ
భారము జూపుట కన్నను
ఘోరమె యింకోటిగలద గొర్రెలె మేలున్.

భావం: ధనికులు నేరాలు చేస్తే డబ్బులకు అమ్ముడుపోయి వదిలేసి, పేదవారిపై మీ ప్రతాపము చూపించే మీకన్న గొర్రెలు మేలు కదరా.

మధురా న్వితమగు గాత్రమె
మధుగారికి సొంతమనుచు మరిమరి వింటిన్
అధరామృతము నుగోరుచు
మధులత నామమె జపించ మనసే పొంగెన్

లెక్కకు యందని ధనముతొ
దక్కును యానందమనకు ధరమున తగదున్
అక్కున జేకొని గాంచుము
దిక్కే లేనట్టి వారి దీనపు గాథల్

స్నేహమె జేయుము యిలలో
ద్రోహమె తెలియని జనులతొ తోడై నిలుతుర్
మోహమె తగదో యివినుము
బాహ్యపు అందా లమీద భవితమె పోవున్.


- 20 -

గ్రక్కున వీడుము నీపై
నక్కసు తోజే సినట్టి నమ్మక ద్రోహం
దొక్కును వారిని దైవము
మొక్కిన నీదై వమెనిను బ్రోచును వినుడీ

అరువది నొకసరి అడిగిన
మరిమరి అడుగని మనసిక మాయను జేయున్
తరగని అరువులె నినుయిక
పరువది నిడమని పలుకుచు ప్రాణమె దీయున్

భావం:అప్పు అనునది ఒక్క సారి తీసుకోవడం మొదలు పెడితే, ఇక మనసు మళ్ళీ మళ్ళీ తీసుకోమని లాగుతుంది.అప్పులు పెరిగిపోయి, పరువు అను దానిని వదిలి చావమని మనసు చెబుతుంది.

నమ్మకు అమ్మడి పలుకులు
కమ్మనియా పలుకులందు కపటమె యుండున్
రమ్మని పిలచిన పలుకులె
పొమ్మని వెలివేయ నీకు బూడిదె మిగులున్.

అందమె జూచిక నీవే
ముందడుగును వేయబోకు మూర్ఖుడ వోలెన్
తొందర పడకుండ వినుము
కొందరికే యుండుమనసు కుసుమము రీతిన్.


- 21 -

వెచ్చని కౌగిలి ముంగిట
తుచ్చములే తక్కినవని తొందర పడకున్
పచ్చిగ జెప్పెద విను,నీ
ఇచ్చములే పెరిగినిన్ను యిరుకున బెట్టున్

అమ్మాయిలెకరు వైరని
అమ్మో తనయుడి వివాహ మదియెటు లనిమా
యమ్మా నాన్నల దిగులుకు
అమ్మాయిలతల్లిదండ్రు లాశలె అడ్డౌ

ధూపంబులు దీపములతొ
పాపంబులు తొలగుననుచు ప్రార్థించంగా
రూపంబుల నిచ్చు విభుడు
ఆపండని సకలప్రాణి ఆత్మలొ నిలచెన్

భావం: ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తే పాపములు తొలగి పోతాయని భావించి ప్రార్థించగా, ప్రాణముల నిచ్చు ఆ భగవంతుడు ఆపండి ఈ పూజలు అని అన్ని జీవరాశుల ఆత్మలో నిలచి అన్ని జీవములలో నేనే వున్నాను కావున జీవులను పూజించమని తెలిపాడు.

కాసుల రాశులు బెంచుచు
దాసుల దోషుల ననకుము, దైవము గాంచున్
త్రాసున దూచును పాపం
కాసుల వీడుచు మనుజుల గాంచుము నరుడా.


- 22 -

సర్వము నీవే జీవిత
మర్మము నీవే కరుణతొ మన్నిం చుహరా
కర్మమె తెలియక జేసితి
ధర్మము తోదయ నుజూప ధన్యుడ నౌదున్

కాపాడుము మమునీవే
ఓపార్వతి పుత్రనీకు మొక్కెద మికమా
పాపాలను తొలగించెడి
నీపాదమె శరణమాయె నీవే దిక్కున్

కష్టము నెరుగని పురుషుడు
ఇష్టము చూపం గలేని యింట్లో సతియున్
నష్టము తెచ్చెడి బేరము
అష్టమ శనివలె విడువక కష్టము లిచ్చున్.

(నా సహచర వుద్యోగి రామకృష్ణ గురించి)

రీజన లాఫీసులొ మా
భోజనమగు నీపలుకుల మోజేతీరే
రోజన్నది లేదనినే
రాజీ పడకుండ యనెద రమణీ యముగా

మాటల మాంత్రికు డవునీ
బాటయె బంగా రగునని బలుకగ మేమే
ఓటమి నినుచే రదుయిక
ధీటుగ ముందడు గువెయ్యు ధీరుడ వోలెన్.


- 23 -

వద్దన్నా వచ్చునులే
నిద్దుర మరి సోమరులకు నిలుపన్ దగునా
బద్దలు కానీ భువియే
నిద్దుర వదలము యనెదరు నిజమిది సుమ్మీ

తెల్లని గడ్డము నాదని
పళ్ళను ఇకిలించి నీవు పలుకకు మోయీ
చల్లని మనసున్న జనుల
కెల్లరి కొచ్చేను తెలుపు కేశమ్ములురా

ప్రైవేటు యాసుపత్రుల
పైవేటును వేయకున్న పైకము యంతన్
నైవేద్యమె వైద్యులకును
చావేయిక శరణమగును జనులందరికిన్

చేసే పనియొకటి మనసు
చూసే దింకోటి కలలు జూచుట వరకే
మోసే భాద్యత లనడుమ
పూసే లోగా మనసును పూడ్చెద రుజనుల్

మోకాలికి రోగమనిన
టీకాతోమా నుయనుచు ఠీవీ గానీ
బైకం ముట్టిన పిమ్మట
పైకేనీ పయనమనెటి పైత్యపు వైద్యుల్


- 24 -

వచ్చును లేయవ కాశము
గాచును లేదైవమనిన కాలమె వ్యర్థం
ఇచ్చిన యవకాశములను
మెచ్చక వదిలే సిదైవ మెక్కడ యనకున్

కొంటానని తెగనీల్గకు
తింటానికె లేనినీకు దినమొక గండమ్
వెంటాడే ఋణ భాదలు
ఇంటా బయటా, సుఖములు ఇంకెక్కడివిన్

మారెనుగద మనిషి గుణము
జారెనుగద జాలికరుణ చలనమె లేనీ
భారపు జీవనమున మన
బారెడు యాశలె రగుల్చు నారని మంటల్

రావోయీ బామరిదీ
తేవోయీ బీరుసీస తెరదిం చేద్దాం
నావో టేనీ కెపుడూ
కవ్విం చేబీ రుతాగి కారెక్కేద్దాం

ధీటగు మాటలు వాడకు
మాటుగ దప్పిదముజేసి మానం బిడకున్
దాటకు చేసిన బాసలు
మేటిప లుకులివి విడువక మేలగు వినుడీ


- 25 -

అందములా యివి మాటల
కందని యెన్నో సుమధుర కావ్యములై,యా
నందంబున మది కూర్గుకు
బందీయవగా తలొంచి వందన మిడితిన్.
(కూర్గ్ ప్రయాణము గురించి.)

కాబోకు వతిథి యెపుడు
న్నీబో వింటిజ నులెమరి నిరుపే దలనిన్
ఈబోకుమాటనిచ్చిన
పోబోకు ముదా టిమరణ మొచ్చిన గూడన్

తిన్నావా లేదానువు
కన్నాయని యడుగునట్టి కాంతయె తల్లిన్
వున్నావా పోయావా
యన్నప్రశ్న నడుగునది యాలియె యనెదన్

పూచిన నోటికి రుచులను
దాచిన సొమ్ముతొ నొసగని దానము రీతిన్
నీచపు మనసుతొ చేసెడి
పూజకు పూలెన్ని యున్న పుణ్యము రాదే

పద్యము రాయగ తెలుగున
చోద్యంబుగ జనులుజూచి జోరుగ తిట్టున్
ఉద్యమమిక తేదలచిన
విద్యల నెల్లను తెలుగున వివరించ దగున్


- 26 -

ముండకు ముచ్చట దీర్చుచు
అండగ వుంతునని యేల దండగ పలుకుల్
నిండుగ పెండ్లాడి తనతొ
నుండిన తనబతుకునిండ నుండును సుఖముల్

ఎందని వెదుకుదు కృష్ణా!
నందనవన సుందరవదనాయని నేనా
నందంబున పిలువగ నీ
సుందర వదనంబుజూపి శుభముల నిడుమా.

పదమిది బలికితి తెనుగున
పదములు గలుపుచు బలికిన కదనము లొచ్చున్
పదములు బలుకుము తెనుగున
పదపదమని బలుకునుమది పదనిస ములుగన్

నిండగు పున్నమివెన్నెల
కండ్లార గనినమనసున కాంతులు నిండున్
మెండగు యాలోచనలతొ
నిండుచు నినుకవి నిజేయు నిజమిది సుమ్మీ

వరము లొసగు మాలక్ష్మీ
కరము లొసగుసా యములను కడవరక నెదన్
కరుణా రసమయి ఈమా
వరలక్ష్మిని తలచుకొనగ వదనము వెలుగున్.
(వరలక్ష్మి గురించి)


- 27 -

(మా రీజియన్ అసిస్టెంట్ జనరల్ మేనేజరు శ్రీ బి యస్ రాజా గారి గురించి)

వీడము మీమార్గంబును
వీడము మీయాశయముల వీడము యనుచున్
వీడము మీభాష్యములను
వీడము మీజ్ఞాపకముల వీడము సుమ్మీ.

రాజాలదు ఈరోజని
బేజారున మామనసులు బెంబేలెత్తన్
రాజాలా మముగాచిన
“రాజా”గారే నిజమగు రాజని యనెదన్.

ఎక్కడి కన్నడ రాష్ట్రము
ఎక్కడి యాంధ్రము,ముదమున విరిసిన నగుతోన్
యిక్కడి కేగిన మీకును
ఎక్కడ దక్కని యశమది ఇచ్చట దక్కెన్.

(నా సహచర వుద్యోగి షౌకత్ సారు గురించి)

ఎవ్వాని పలుకులు వినిన
పువ్వోలె విరయు నుజనుల ముదములు యెల్లన్
అవ్వాని సభాపరమున
సవ్వాలుగ నిలుచుదెవరు షౌకతు గార్కిన్.