విమానంలోభోజనం



విమానం లో నా సీట్ లో కూర్చున్నాను. ఢిల్లీ కి ఆరేడు గంటల ప్రయాణం . మంచి పుస్తకం చదువుకోవడం, ఒక గంట నిద్ర పోవడం --- ఇవీ నా ప్రయాణం లో నేను చేయ్యాలనుకున్నవి .

సరిగ్గా టేకాఫ్ కి ముందు నా చుట్టూ ఉన్న సీట్ల లో10 మంది సైనికులు వచ్చి కూర్చున్నారు. అన్నీ నిండి పోయాయి. కాలక్షేపంగా ఉంటుందని పక్కన కూర్చున్న సైనికుడిని అడిగాను.
"ఎక్కడకి వెడుతున్నారు?" అని.
" ఆగ్రా సర్ ! అక్కడ రెండు వారాలు శిక్షణ. తర్వాత ఆపరేషన్ కి పంపిస్తారు" అన్నాడు అతను .

ఒక గంట గడిచింది . అనౌన్సమెంట్ వినబడింది . కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని . సరే ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుందనిపించింది . నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దామనుకుంటూ అనుకుంటుండగా మాటలు వినిపించాయి
.
" మనం కూడా లంచ్ చేద్దామా ?" అడిగాడు ఆ సైనికులలో ఒకరు
" వద్దు ! వీళ్ళ లంచ్ ఖరీదు ఎక్కువ. విమానం దిగాక సాధారణ హోటల్ లో తిందాం లే !
" సరే ! "
నేను ఫ్లైట్ అటెండెంట్ దగ్గరకి వెళ్ళాను . ఆమెతో " వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి. " అని మొత్తం అందరి లంచ్ లకి డబ్బులు ఇచ్చాను .

" ఆమె కళ్ళల్లో నీరు " నా తమ్ముడు కార్గిల్ లో ఉన్నాడు సర్ ! వాడికి మీరు భోజనం పెట్టినట్టు అనిపిస్తోంది సర్ ! " అంటూ దణ్ణం పెట్టింది. నాకేదో గా అనిపించింది క్షణ కాలం...
నేను నా సీట్ లోకి వచ్చి కూర్చున్నాను .

అరగంటలో అందరికీ లంచ్ బాక్స్ లు వచ్చేసాయి...
నేను భోజనం ముగించి విమానం వెనక వున్న వాష్రూం కి వెళుతున్నాను .
వెనుక సీట్ లో నుండి ఒక ముసలాయన వచ్చాడు .
నేను అంతా గమనించాను . మీకు అభినందనలు .
ఆ మంచి పనిలో నాకూ భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపారు.
ఆ చేతిలో 500 రూపాయలు నోటు నా చేతికి తగిలింది...
మీ ఆనందం లో నా వంతు అన్నారాయన .

నేను వెనుకకు వచ్చేశాను. నా సీట్ లో కూర్చున్నాను. ఒక అరగంట గడిచింది. విమానం పైలట్ సీట్ నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరకి వచ్చాడు. నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.
" మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు ."
నేను సీట్ బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను .
అతడు షేక్ హేండ్ ఇస్తూ " నేను గతం లో యుధ్ధవిమాన ఫైలట్ గా పనిచేశాను . అపుడు ఎవరో ఒకాయన మీలాగే నాకు భోజనం కొని పెట్టారు .
అది మీలోని ప్రేమకు చిహ్నం . నేను దానిని మరువలేను " అన్నాడు
విమానం లోని పాసింజర్లు చప్పట్లు కొట్టారు . నాకు కొంచెం సిగ్గు గా అనిపించింది . నేను చేసింది ఒక మంచి పని అని చేశానంతే కానీ నేను పొగడ్తల కోసం చెయ్యలేదు.

నేను లేచి కొంచెం ముందు సీట్ల వైపు వెళ్లాను . ఒక 18 సంవత్సరాల కుర్రాడు నా ముందు షేక్ హేండ్ ఇస్తూ ఒక నోటు పెట్టాడు .
ప్రయాణం ముగిసింది .

నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను . ఒకాయన మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టి వెళ్లి పోయాడు . ఇంకో నోటు.

నేను దిగి బయటకు వెళ్లేలోగా నాతో పాటు దిగిన సైనికులు అందరూ ఒక చోట కలుసుకుంటున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరకి వెళ్లి, నాకు విమానం లోపల తోటి పాసింజర్లు ఇచ్చిన నోట్లు జేబులో నుండి తీసి వాళ్ళకు ఇస్తూ " మీరు మీ ట్రైనింగ్ చోటుకి వెళ్ళే లోపులో ఈ డబ్బు మీకు ఏదన్నా తినడానికి పనికి వస్తాయి . మీరు మాకిచ్చే రక్షణ తో పోలిస్తే మేము ఏమి ఇచ్చినా తక్కువే ! మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్య వాదాలు . భగవంతుడు మిమ్మల్ని , మీ కుటుంబాలను ప్రేమతో చూడాలి ! " అన్నాను . నా కళ్ళలో చిరు తడి .
.
ఆ పది మంది సైనికులు విమానం లోని అందరు ప్రయాణికుల ప్రేమను వాళ్ళతో తీసుకు వెళుతున్నారు . నేను నా కారు ఎక్కుతూ తమ జీవితాలను ఈ దేశం కోసం ఇచ్చేయ్యబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడు స్వామీ ! అని దేవుడిని మనస్పూర్తి గా కోరుకున్నాను.

ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని ఇండియా కు చెల్లించే బ్లాంక్ చెక్కు లాంటి వాడు.
" బ్రతికినంత కాలమూ, జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు "

ఇంకా వారి గొప్పతనాన్ని తెలియని వారెందరో ఉన్నారు !
(Soumendra Bandopadhyay గారి పోస్టు అనువాదం)
మీరు షేర్ చేసినా సరే , కాపీ పేస్ట్ చేసినా సరే ! మీ ఇష్టం !

ఎన్ని సార్లు చదివినా కంటతడి పెట్టించేదే ఈ విషయం చదవండి, ఇంకొకరికి పంపండి. ఈ భరత మాత ముద్దు బిడ్డలను  గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించకోవటమే.
                  - జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳



తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

మహాభారతపర్వం

శ్రీ అరుణాచలమ్ మాణిక్యవేల్ గారు చెప్పిన భక్తి కధ.

 మహాభారతం లోని ఒక చిన్న పర్వం.

కలికాలం మెదలయింది......

పంచ పాండవులలో ఒకరైన సహదేవుడు ఒకరోజు గుర్రాలు సంతలోకి  వెళ్లారు. ఆ సంతలో అతను ఒక అందమైన గుర్రాన్ని  చూసారు. అరెరె ఇంత అందమైన గుర్రాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఎలాగైన సరే నేను ఈ గుర్రాన్ని ఎంత దరకైన కొనాలి ఆనుకొని గుర్రం యజమాని గారిని గుర్రం ధర ఎంత అని అడిగారు.

గుర్రాన్ని నేను ఎవరకూ అమ్మను కానీ ఎవరైతే నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెపుతారో వారికి నా గుర్రాన్ని ఉచితంగా ఇస్తాను అని చెప్పారు. సహదేవుడు సరే నన్ను అడుగు ఎటువంటి ప్రశ్నలకైన నేను సమాధానం చెపుతాను అని చెప్పారు.

దానికి గుర్రం యొక్క యజమాని, సరే నేను అడిగే ప్రశ్నలు చాలా జాగ్రత్తగా విని సమాధానాలు చెప్పి గుర్రాన్ని ఉచితంగా తీసుకుని వెళ్లు అని ప్రశ్నలు అడుగుట మెదలుపెట్టారు.

మెదటి ప్రశ్న:
ఒక పెద్ద బావి ఉంది.  ఆ పెద్ద బావి లోని నీరు ని తీసుకుని వెళ్లి ఏడు చిన్న బావులను పెద్ద బావి లోని నీటితో నింపవచ్చు కానీ ఆ ఏడు చిన్న బావులలోని నీటితో పెద్ద బావిని నింపలేము ఎందుకు అని అడిగారు.  మరల
గుర్రం యొక్క యజమాని, బాగా ఆలోచించి నాకు సమాధానం చెప్పండి అని అడిగారు.

సహదేవుడు కొంచెం సమయం దాకా బాగా  ఆలోచించిన కూడా సమాధానం చెప్పలేకపోయారు. చేసేది ఏమి లేక అక్కడే ఉండి పోయాడు.  కొంచెం సమయం తరువాత  నకులుడు సహదేవుడు ను వెతుక్కుంటూ వెతుక్కుంటూ సహదేవుడు ఉన్న గుర్రాలు సంతకు చేరుకున్నారు.

సహదేవుడు ని చూసిన నకులుడు ఎందుకు ఇక్కడ కూర్చుని పోయునావు అని అడిగారు. దానికి సహదేవుడు ఆ గుర్రం మరియు గుర్రం యొక్క యజమాని గురించి నకులుడు కి వివరంగా చెప్పారు.  ఆ గుర్రమును చూసిన నకులుడు ఆశ్చర్యపోతూ , సహదేవ నీవు చెప్పినట్లు ఈ గుర్రం ఎంత అందంగా ఉంది. ఎలగైన సరే దీనిని మనం మన రాజ్యానికి తీసుకుని వెళ్లాలి అని గుర్రం యొక్క యజమానిని నకులుడు కలిసి నన్ను అడుగు ఎటువంటిప్రశ్నలయున నేను నీకు సమాధానం చెప్పి ఆ గుర్రాన్ని మా అన్నయ్య సహదేవుడు కి బహుమతి గా ఇస్తాను అని చెప్పారు.


గుర్రం యొక్క యజమాని సరే నీవైన జాగ్రత్త గా ఆలోచించి ఆలోచించి సమాధానం చెప్పు అని రెండోవ ప్రశ్నను అడిగారు .

రెండోవ ప్రశ్న
మనము బట్టలు కుట్టటం కోసం ఉపయోగించే సూది రంధ్రం ద్వారా పెద్ద ఏనుగు ఇవతలి వైపు నుండి రంధ్రం ద్వారా అవతలి వైపుకు వెళ్లింది కానీ ఆ ఏనుగు తోక మాత్రం ఆ సూది రంధ్రంద్వారా వెళ్ల లేకపోయింది . అది ఏమిటి అని అడిగారు.

ఈ ప్రశ్నకు నకులుడు సమాధానం చెప్పలేకపోయారు.  చేసేదేమీ లేక సహదేవుడు మరియు నకులుడు ఆ సంతలో ఉండి పోయారు.  ఎంతసేపటికి తమ్ముళ్ళిద్దరూ రాజ్యానికి రాక పోయే సరికి కంగారుగా ధర్మరాజు భీముడు ను పిలిచి తమ్ముళ్ళిద్దరు ను వెతుక్కుని ఎక్కడఉన్న రాజ్యానికి తొందరగా తీసుకుని రావాలి అని చెప్పారు.

అన్నగారు మాటలు ప్రకారం భీముడు తమ్ముళ్ళిద్దరను వెతుక్కుంటూ వెళ్ళాడు.
చివరికి తమ్ముళ్ళిద్దరను ఒక సంతలో చూసి
తమ్ముళ్ళిద్దరను ఎందుకు ఇక్కడ కూర్చుని ఉన్నారు అని అడిగారు. అన్నయ్య ధర్మరాజు గారు చాలా కంగారు పడుతున్నారు.  వెంటనే రాజ్యానికి బయలుదేరి వెళ్లదాము అనగానే తమ్ముళ్ళిద్దరను అక్కడ వారు ఎందుకు ఉన్నారో వివరంగా చెప్పారు.

అంతా వినిన భీముడు గుర్రం యొక్క యజమాని గారిని కలిసి నేను మీ ప్రశ్నలకు సమాధానాలు చెపుతాను అన్నారు. గుర్రం యొక్క యజమాని చూడండి నేను వేసిన రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీ
తమ్ముళ్ళిద్దరు ఓడిపోయారు.  కావున నీవు బాగా ఆలోచించి ఆలోచించి సమాధానం చెప్పాలని అన్నారు. దానికి సరే అన్నారు భీముడు.

మూడవ ప్రశ్న
ఒక పొలంలో ధాన్యం బాగా పండింది.  ఆ పొలం చుట్టూ పెద్ద పెద్ద గట్టులు ఉన్నాయి.  ఆ ధాన్యం పంట కోసే సమయంలో ధాన్యం మాయమైంది. అది ఎలా అని అడిగారు.  భీముడు కూడా సమాధానం చెప్పలేకపోయారు.  తమ్ముళ్ళిద్దరను రాజ్యానికి తీసుకుని వెళ్లి జరిగింది జరిగినట్లు అన్ని అన్న ధర్మరాజు గారు కి వివరంగా చెప్పారు.


అన్న ధర్మరాజు గారు ఆ ప్రశ్నలన్నీ వినిన తరువాత చెమటలు పట్టి భయపడ్డారు.  అన్నయ్య ధర్మరాజు గారు లో భయాన్ని చూసిన తమ్ముళ్ళందరూ ఏమిటి అన్నయ్య మీరు సమాధానాలు చెప్పలేక భయపడుతున్నారా అనగానే అన్నయ్య ధర్మరాజు గారు నేను బయటపడుతుంది సమాధానాలు చెప్పలేక కాదు. మిమ్మల్ని ఆ ప్రశ్నలన్నీ అడిగింది కలిపురుషుడు.  అతను కలికాలం లో జరిగే యధార్థ సంఘటనలను ప్రశ్నల రూపంలో మిమ్మల్ని అడిగారు.

మెదటి ప్రశ్నకు సమాధానం.  పెద్ద బావి అనేది తల్లి తండ్రులు.  ఏడు చిన్న బావులనేవి వారి పిల్లలు.  తల్లి తండ్రులు ఎంత మంది పిల్లల కైనా ప్రేమ ఆప్యాయతలతో  పెంచి పోషిస్తారు.
కానీ అదే తల్లి తండ్రులు వృద్ధులు అయినా తరువాత ఆ ఏడుగురు పిల్లలు తల్లి తండ్రులను భారంగా చూస్తారు.


రెండో వ ప్రశ్నకి సమాధానం .  ఏనుగు అంటే పెద్ద పెద్ద అవినీతి పరులు. ఏనుగు తోక అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు.
ఏనుగు రంధ్రం ద్వారా అవతలి వైపుకు వెళ్లిపోతుంది అంటే పెద్ద పెద్ద అవినీతి పరులు చట్టానికి దొరక్కుండా రంధ్రం ద్వారా వెళ్లిపోతారు.  కానీ చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు ఆ రంధ్రం దాటలేక ఆ ఏనుగు తోక లాగా  ఇరుక్కు పోతారు.


మూడవ ప్రశ్నకు సమాధానం. ఇక్కడ ధాన్యం అంటే ప్రజలు.  చుట్టూ ఉన్న పెద్ద పెద్ద గట్టులు అంటే అధికారులు.  ఎంతమంది అధికారులు ఉన్న ప్రజలకు దక్కాల్సిన ఫలాలు అధికారులు స్వాహా చేస్తారు. ఆ విధంగా ధాన్యం మాయమైనట్లు ప్రజల ఫలాలు కూడా అధికారులు మాయం చేస్తారు.  ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు మీకు కలిపురుషుడు ముందుగా తెలియ చేసారు అని ధర్మరాజు గారు తమ్ముళ్ళందరకూ వివరంగా చెప్పారు.


శుభమ్ కలుగుగాక....



తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

ఏడుచేపల కథ(ఆధునిక వివరణ)

****ఏడు చేపల కధలో ****
        అర్ధం పరమార్ధం...

వీలైనంత ఓపికగా 😔😔😔చదవండి...


ఏడు చేపల కథ చిన్న పిల్లలకు ఎంతో పరిచయం ఉన్న కథ మళ్ళీ మళ్ళీ అడిగి చెప్పించుకునే కథ.
అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఏడుగురు కొడు కులు. ఏడుగురు కొడుకులు ఒకనాడు వేటకు వెళ్ళి ఏడు చేపలను వేటాడారు.
వేటాడిన చేపలను ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేపా, చేపా ఎందుకు ఎండలేదు అని అడిగారు. గడ్డిమేటు అడ్డొచ్చింది అంది.
గడ్డిమేటా ❓గడ్డిమేటా ఎందుకు అడ్డొచ్చావ్‌ అని అడిగారు.
ఆవు మేయలేదు అంది.
ఆవా, ఆవా ఎందుకు మేయలేదు ❓అని అడిగారు.

గొల్లవాడు నన్ను మేపలేదు అంది. గొల్లవాడా⁉
గొల్లవాడా ఆవును ఎందుకు మేపలేదు అని అడిగారు.

అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు. అమ్మా అమ్మా ఎందుకు అన్నం పెట్టలేదు❓అని అడిగారు.

పిల్లవాడు ఏడ్చాడు అంది.
పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడ్చావ్‌ ❓అని అడిగారు.

చీమ కుట్టింది అన్నాడు.
చీమా టీమ్ ఎందుకు కుట్టావ్‌❓అన్నారు. నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది.
ఎన్నో అసహజాలు, అసంగతాలు అయిన సన్నివేశాలు ఉన్నా, ...
రీజనింగ్‌ అడగకుండా, ఆలోచించకుండా వినే గొప్ప తెలుగు కథ ఈ ఏడు చేపల కథ.
నిజానికి రాజుగారి కొడుకులకు చేపలు వేటాడాల్సిన కర్మ ఏం పట్టింది. అడవికిపోయి క్రూర మృగాలను వేటాడవచ్చు కదా!

అయినా ఎవ్వరూ ఈ ప్రశ్న వేయరు. చెరువుకు పోయి చేపలు తెచ్చారే అనుకుందాం. వాటిని ఎండబెట్టడానికి, ఎండిన వాటిని ఎత్తిపోసుకోవడానికి వారి దివానుల్లో నౌకర్లే కరువయ్యారా⁉

నిజానికి ఈ ప్రశ్న ఎంతో వ్యాలిడ్‌ ప్రశ్న. అయినా ఎవ్వరూ ఈ కోణం నుంచి ప్రశ్న వేయరు. ఎవ్వరూ అడగలేదు కదా అని రీజనింగ్‌ ఇవ్వకపోవడం ఒక మంచి రచయిత లక్షణం కాదు.

అందుకే ఈ కథను జాగ్రత్తగా గమనిస్తే, చదువుకుంటే అనేక అంతరార్థాలు, పైకి కనిపించని విశేషాలు స్ఫురిస్తాయి.

రాజుగారు అంటే మనిషి. ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు.
కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం. జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం.

రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే మనిషికి ఉండే సప్త వ్యసనాలు. ఏమిటా వ్యసనాలు❓
కామం, వేట, జూదం, మద్యపానం, వాక్పారుష్యం (కఠినంగా, పరుషంగా మాట్లాడడం), దండ పారుష్యం (తీవ్రంగా దండించడం), అర్ధదూషణం (ధనాన్ని దుబారాగా ఖర్చు చేయడం),

వీటన్నిం టిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు. అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.
వీటిని ఎండగట్టాలి అంటే ఎవరికి వారే చేయాలి తప్ప, వేరే ఎవరో చేయ కూడదు. అందుకే కథలో ఏడు చేపలను రాజుగారి కొడుకులే ఎండగట్టినట్టు చెప్పారు.

ఈ నాటి సమాజంలో కామం, వేట, జూదం, మద్యం, దుర్భాష, ధనవ్యయం ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయో అందరం చూస్తూనే ఉన్నాం. పైన చెప్పిన సప్త వ్యసనాలు మనిషిని ఎలా పీడిస్తున్నాయో, సమాజాన్ని ఎలా చెడగొడుతున్నాయో కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం.

రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు. ఏమిటా చేప. అది కామం. దీన్ని జయించడం చాలా కష్టం. ఎంత ప్రయత్నించినా అది ఎండదు. కామం అంటే ఏమిటి❓లోకం అనుకునే సెక్స్‌ కాదు, కోరిక.
కోరిక ఒక పట్టాన చావదు. ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది. మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు. కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.
మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే. అందుకని కోరికలను జయించడం అసాధ్యం. ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు.
ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది❓గడ్డిమేటు.
గడ్డిమేటు అంటే ఏమిటి❓
కుప్పకోసిన అజ్ఞానం. మన అజ్ఞానం కొండలాగా పేరుకుపోతే దాని నీడన ఎన్ని కోరికలైనా బ్రతుకుతాయి. గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించా లంటే ఎలా❓మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు. కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయ కమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే‼
ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు. మనిషి లో నేనున్నాను అన్న అహంకారమే గడ్డిమేటు. దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం. మరి అది పోవాలంటే ఏం చేయాలి❓

ఆవు వచ్చి మేయాలి. ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి❓ఆవు అంటే జ్ఞానం. జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది. లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.

అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు (జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం) జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగినవాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే. మరి సామాన్యుడి పరిస్థితి ఏమిటి❓

సామాన్యుడు జ్ఞానాన్ని గోరూపంలో దర్శించాలి. ఈ గోవును ఎవ్వరు మేపాలి. గొల్లడాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు❓
సమర్ధ సద్గురుడు, జగద్గురుడు.
జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా‼

అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు. ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు. ఏమిరా నాయనా‼ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.

ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు❓
అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.
ఈ జగన్మాత ఒక మంచి గురువును పంపకపోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు. వాడి ఆకలి తీరలేదు అంటే ఏమిటి అర్థం. వాడికి ఇంకా జ్ఞానం పొందే సమయం రాలేదు అని.ఇంకో మాటలో చెప్పాలంటే వాడికి దైవానుగ్రహం కలుగలేదు అని అర్థం.
ఓ జగన్మాతా ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది. ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు❓ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.

ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు❓వాడికి చీమ కుట్టింది. ఎక్కడిది చీమా❓దానికి ఇంకోపేరే సంసారం. సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది.

చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం, మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి. ఈ చీమలు ఆరుబైట బారులు తీరి తిరుగుతూ కనబడతాయా❓
లేదు. చీమలు ఎప్పుడూ పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట❓మనిషికి ఉండే అజ్ఞానం ఒక పుట్ట.
రేపటి రోజును గురించి బంగారు కలలు కనడం మరోపుట్ట.

ఈ రెండు పుట్టలలో ఉన్న వాళ్ళని చేరదీసి, రక్షించడమే భగవంతుడికి తెలిసిన విద్య. ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశారు.

 🙏👏🙏👏🙏👏🙏👏



జాతస్య హి ధృవో మృత్యుః



*'జాతస్య హి ధ్రువో మృత్యుః' అంటుంది మన గీత. పుట్టినవాడు గిట్టక తప్పదని దీని సారాంశం.*

*మరి మన తలరాత ఎలా ఉందో చూద్దాం. పుట్టటం నుంచి గిట్టడం దాకా ఈ 'మాయ'మర్మాన్ని కొద్దిగా తెలుసుకుందాం.*

 *ఈ విశ్వాన్ని ఇంగ్లీషులో యూనివర్స్‌ అంటున్నాం. యూని అంటే ఒకటి, వర్స్‌ అంటే అనేకం. ఏకం, అనేకం కలిసి యూనివర్స్‌ అయింది. అనేక రూపాలలో కనిపించేదంతా ఒక్కటే అని ఈ విశ్వాన్ని అర్థం చేసుకోవాలి.*

*కాబట్టి ఈ బ్రహ్మాండానికీ పిండాండానికీ తేడా ఏమీ లేదు. మనం పిండాండం నుంచి వచ్చాం కాబట్టి దీని గురించి తెలుసుకుందాం.*

 *మనిషి శరీరంలో 72 శాతం నీరు ఉంది. వెన్నెముక నుంచి అన్ని వైపులకూ 72 వేల నాడులు ఉన్నాయి.*

*వీటిలో 14 నాడులను ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ 14 నాడులకూ పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉన్న 14 తిథులకూ సంబంధముంది.*

 *తిథి అంటే నక్షత్రంలో సగం. శుక్ల పక్షంలోని 14 తిథులు, కృష్ణ పక్షంలోని 14 తిథులు కలిపితే 28 నక్షత్రాలు అవుతాయి.*

*మన నక్షత్రాలు 27 అయినా అభిజిత్‌తో కలిపి 28 కదా! మాయ అంటే మనమెవరో తెలియకపోవడం. ఒకటి అనేకం కావడమే సృష్టి. ఆ ఒక్కటిలో అన్నీ చేరడమే ప్రళయం. అదే మరణం కూడా.*

*మనిషి పుట్టుకకు మూలకారణం స్త్రీలకు ప్రతి నెలా జరిగే రుతువు (బహిష్టు). మనుషులలో ఈ బహిష్టు 27 లేదా 28 రోజులకు ఒకసారి జరుగుతుంది. ఈ బహిష్టు ప్రారంభమైన క్షణం నుంచి 24 గంటలు ఒకరోజు.*

*అలాంటి 27 రోజులు లేదా 28 రోజులు ఒక నెల. నెల అంటే చంద్రుడు అని కూడా అర్థం ఉంది. నెలరాజు, నెలపొడుపు అనే పదాలు ఇలా ఏర్పడినవే.*

*బహిష్టుకు 14 రోజుల ముందు అండం విడుదల అవుతుంది. ఈ అండం ఫలదీకరణం చెందితే పిండం గర్భాశయాన్ని చేరుతుంది.*

*శిశుజననంతో రుతుచక్రం ఆగిపోతుంది. దీన్నే మనం నెలతప్పడం అంటుంటాం.*

*భగవంతుడు తన శరీరంలో నాలుగో వంతు భాగంతో సృష్టిచేశాడని పురుషసూక్తం అంటోంది. కాలచక్రానికి సూర్యుడే ఆధారం.*

*సావన సంవత్సరం అంటే 360 రోజులు. ఇదే రాశిచక్రంలోని 360 డిగ్రీలు. దీని ప్రకారం 360 రోజుల్లో నాలుగోవంతు 90 రోజులు అవుతుంది.*

*ఈ 90 రోజులు పోగా 270 లేదా 280 (40 వారాలు) రోజుల్లో శిశువు జన్మిస్తుంది.*

*120 నెలలను పరమాయువు అంటారు. దీని ఆధారంగానే సూర్య సిద్ధాంతం రూపొందింది. ఉత్తరాషాఢ, శ్రవణాల మధ్య అభిజిత్‌ నక్షత్రం ఉంటుంది.*

*ఈ 28 నక్షత్రాల ఆధారంగా హోరాశాస్రాన్ని పరాశరమహర్షి రూపొందించారు. సౌర అంటే 72, హోర అంటే 82. వీటిని తిరగేస్తే 27, 28 వస్తాయి.*

*27 నక్షత్రాల ఆధారంగా సూర్యసిద్ధాంతం, 28 నక్షత్రాల ఆధారంగా హోరాశాస్త్రం రూపొందాయి. అందువల్ల దీన్ని పరాశర హోరాశాస్త్రం అన్నారు.*

*నక్షత్ర మానం ప్రకారం 27.321 రోజులు ఒక నెల. అలాంటి 12 నెలలు ఒక సంవత్సరం. అలాంటి 120 సంవత్సరాలు మనిషి ఆయువు.*

*జ్యోతిష శాస్త్రం ప్రకారం దశలన్నీ కలిపితే 120 సంవత్సరాలు వస్తుంది. దీన్ని బట్టి మనిషి పూర్ణాయువు 120 సంవత్సరాలని అనుకోవలసి వస్తోంది.*


*120 సంవత్సరాలు బతకాల్సిన మనిషి అందులో సగం కూడా బతకడం లేదు ఎందుకు అనే ప్రశ్న చాలా మందిలో ఉదయిస్తుంటుంది. దీనికి కారణం మనిషి తీసే శ్వాసలే.*

*ముఖ్యంగా మనిషి పూర్ణ శ్వాసలు తీయడం లేదు. అర్ధశ్వాసలతో కాలం గడిపేస్తున్నాడు.*

 *మనిషి నిమిషానికి తీసే శ్వాసలు 15. రోజుకు 1440 నిమిషాలు. 1440ని 15తో హెచ్చిస్తే 21,600 శ్వాసలు వస్తాయి. 12 రాశులు, 12 నెలలు, పూర్ణాయువు 120 సంవత్సరాలు, కలియుగం 1200 దివ్య సంవత్సరాలు, మహాయుగం 12000 దివ్య సంవత్సరాలు... ఇలా ఒకదానితో ఒకటి సంబంధం కనిపిస్తూనే ఉంటుంది.*

 *తక్కువ శ్వాసలు తీసే జీవి ఎక్కువ కాలం బతుకుతుంది. ఎక్కువ శ్వాసలు తీసే జీవి తక్కువ కాలం బతుకుతుంది.*

 *మనం యోగశాస్త్రాన్ని అభ్యసిస్తే పూర్ణాయువు సంపాదించుకోవడం పెద్ద కష్టం కాదు.*

 *మరణం అంటే శరీరం మార్పునకు లోనవడం.*

 *ఆత్మ ఈ శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది. కాబట్టి మరణం గురించి భయపడాల్సిన అవసరం లేదు.*

*ఇక ఈ జన్మలో అనుభవిస్తున్న కర్మ ఫలితాల గురించి అంటారా... సత్కర్మ ఉన్న వారికి సరైన పరిహార క్రియలు తప్పనిసరిగా అందుబాటులోకి వస్తాయి.*

 *ఆ సత్కర్మ బలం లేనివారు ఎక్కడెక్కడో తిరుగుతూ వేల రూపాయల్ని పరిహార క్రియల పేరిట వదిలించుకుంటారు.*

 *అణువుకూ ఆత్మకూ తేడా ఏమీ లేదు.*

*ఇదంతా సూర్యకాంతి శక్తి. మన జీవితాలన్నీ సూర్యకాంతి శక్తితో ప్రేరణపొంది నడుస్తున్నాయి. ఈ సూర్యకాంతే సృష్టి, స్థితి, లయలకు మూలం.*

ఈ అనంత సూర్య శక్తిని సాధించి మనమే పూర్తిగా సూర్యకాంతిగా మారి అందులోనే లయం కావాలని గాయత్రీ మంత్రం కూడా చెబుతోంది.
వన్నీ మన వేదాలు,ఇతిహాసములు,
పురాణములు, స్మృతులు  తెలుపుతున్నాయండీ
         〰〰〰➰〰〰〰

తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

మనసు

మనం మనసును జయించాలి అని తీవ్ర తపన పడుతుంటాం. ...
మనం ఎంత అమాయకులమో...!

నామనసును ఎలా జయించాలి?...అని ఈ ఆలోచన చేస్తున్నది ఎవరో తెలుసా.....?

"నామనసే"

నామనసే....నామనసును జయించాలి  అని పిచ్చి కలలు కంటూవుంటుంది.

నీ కంట్లో నువ్వే పొడుచుకుంటావా?

అసాధ్యం కదా....!

ఇదీ అంతే....నీ మనసుతో ...మనసును చంపాలని ఆలోచిస్తున్నావు చూడూ....ఇదీ అసాధ్యమే.

దొంగను పట్టుకొమ్మని ఆ దొంగకే తాళం ఇచ్చినట్టు ఉంటుంది ఈ పని.

అసలు మనసు అంటే ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి. నువ్వొక ఏనుగును నీ ఊహల్లో చూస్తూ....దాన్ని ఎలా సవారీ చెయ్యాలా అని ఇప్పుడు ఆలోచిస్తున్నావనుకో.....ఇప్పుడు నీ మనస్సనే పదార్థం పనిచేస్తోందని అర్థం. మనస్సంటే తలంపుల సమూహమే....మరేమీ కాదు.

నీకు ఆలోచనలు కలిగేది...ఈ విశ్వంలోని వస్తువుల గురించే కదా....

మీ మనసును ఈ విశ్వాన్ని దాటి ఆవలకు తీసుకెళ్లండి....ఆ సూన్యంలో ఇక ఆలోచించడానికి ఏదీ ఉండదు. ఆలోచనలు లేకపోతే మనసే ఊరకుండిపోవడానికి సిద్ధమవుతుంది...


ఇది సాధనతో చాలా సాధ్యమైన విషయమే


సాగర్



తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

భాద్రపదమాస విశిష్టత



చంద్రమాన రీత్యా చంద్రుడు  పౌర్ణమి నాడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వాళ్ళ ఇది భాద్రపద మాసం.
ఈ మాసం లో ఒంటి పూట భోజనం చేస్తే ధన సమృద్ది ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. ఉప్పు మరియు బెల్లం దానాలు కూడా ఈ మాసం లో విశేష ఫలితాన్నిస్తాయి. కొన్ని ప్రదేశాలలో

స్త్రీలు భాద్రపద శుక్ల తదియ రోజున హరితాళిక వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించి, ఉపవాసం జాగరణ చేస్తారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరిస్తే కష్టాలు తొలగి, అష్టైశ్వర్యాలతో తులతూగుతారు.

భాద్రపద శుద్ద చవితి నాడు ఆది దేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు, ఈ రోజున గణపతి పూజ ఉపవాసం వంటివి విశేష ఫలితాన్నిస్తాయి. ఈ పండుగ ఆదివారం రోజు కాని, మంగళవారం రోజు కాని రావడం మరింత విశేషాన్ని సంతరించుకొంటుంది.

భాద్రపద శుద్ద పంచమి నాడు ఋషి పంచమి జరుపుకొంటారు. ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయోశ్చితాత్మకమైన వ్రతం. ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు ఋతుశ్రావ సమయం లో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్య ఫలితం లభిస్తుంది అని భావిష్యపురాణం లో చెప్పబడింది.  ఈ వ్రతం లో ముఖ్యం గా ఆచరించవలసినది, బ్రహ్మహణుడికి అరటి పళ్ళు, నెయ్యి, పంచదార, దక్షిణ ఇవ్వాలి. ఒంటి పూట భోజనం చేయాలి. అంతే గాక ఆ భోజనం ధాన్యం, పాలు, పెరుగు, ఉప్పు, పంచాదారలతో తయారైనదవకుండా ఉండాలి. పళ్ళని స్వీకరించడం శ్రేయస్కరం.

 బౌద్ద జయంతి ని కూడా ఈ రోజునే జరుపుకొంటారు. బుద్దుని భోధనలు మానవుని ధర్మబద్దమైన, పవిత్రమైన జీవనానికి వెలుగు బాట వేసాయి. ప్రపంచం లోని ధర్మమతస్తాపనకు బుద్దుడు అత్యున్నత స్థానం వహించాడనే విషం లో ఏమాత్రం భేదాభిప్రాయాలు లేవు.

 భాద్రపద శుద్ద షష్ఠి /సూర్య షష్ఠి , సప్తమి కలసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం, ఈరోజున సూర్యుడిని ఆవుపాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రం తో ప్రాశనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే ఎక్కువఫలం కలుగుతుందని శాస్త్రం లో చెప్పబడింది. షష్ఠి తో కూడిన సప్తమి కనుక ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి ని పూజిస్తే ఎటువంటి పాతకాలైన నశిస్తాయి.

భాద్రపద శుద్ద అష్టమి నాడు కేదారవ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని సంప్రదాయ సిద్దం గా ఆచరిస్తుంటారు

భాద్రపద శుద్ద దశమి నాడు దశావతార వ్రతం ఆచరించడం, దేవ, ఋషి, పితరులకు తర్పణాలు చేయడం ముఖ్యమైన విధులు.

భాద్రపద శుద్ద ఏకాదశి, దీన్నే పద్మ పరివర్తన ఎకాదసిఅని కూడా అంటారు. తోలి ఏకాదశి రోజున పాల సముద్రం లో శేషతల్పం పై శయనించిన శ్రీమహావిష్ణువు, ఈ ఏకాదశి రోజున ప్రక్కకు పొర్లి పరివర్తనం చెందుతాడు, అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కరువు కాటకాలు తొలగి పోతాయి, ముఖ్యం గా సంధ్యాసమయం లో శ్రీ మహావిష్నువుని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

భాద్రపద శుద్ద ద్వాదశి వామన జయంతి గా  చెప్పబడింది, ఈ రోజున వామనున్ని ఆరాదిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుంది. ముఖ్యం గా ఈ రోజున బ్రాహ్మణులకు పెరుగును దానం చేస్తే మంచి ఫలితాలని పొందవచ్చు.
 భాద్రపద మాసం లో శుద్ద చతుర్దశి నాడు అనంత పద్మనాభ చతుర్దశి అంటారు. శేషతల్పసాయిగా నాభికమలం తో శ్రీమహాలక్ష్మి సమేతుడైన శ్రీమహావిష్ణువు ని పూజించి, వ్రతమాచరిస్తే దారిద్ర్యం తొలగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.
భాద్రపద పూర్ణిమ రోజు ఉమామహేశ్వర వ్రతం  జరుపుకొంటారు, భక్తి శ్రద్దలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.
భాద్రపద పూర్ణిమ తో మహాలయపక్షం ఆరంబమవుతుంది, అమావాస్య వరకు గల ఈ కాలాన్ని పితృ పక్షం అని కూడా అంటారు. మృతులైన పితరులకు, పూర్వీకులకు తప్పనిసరిగా తర్పణలివ్వాలి. శ్రాద్దాన్ని యధాశక్తి గా ఈ దినాలలో చేయాలి.
భాద్రపద బహుళ తదియ ని ఉండ్రాళ్ళ తద్దేగా చెప్పబడింది. ఇది  స్త్రీలు చేసుకొనే పండుగ, ముఖ్యం గా కన్నె పిల్లలు గౌరీ దేవి ని పూజించి, ఉండ్రాళ్ళను నివేదిస్తే మంచి భర్త వస్తాడని చెప్పబడింది. స్త్రీలకూ అయిదవతనం వృద్ది చెందుతుంది.
భాద్రపద కృష్ణ ఏకాదశి /అజ ఏకాదశి దీన్ని ధర్మప్రభ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతమాచరించి నూనె గింజలను దానం చేస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు.
 భాద్రపద కృష్ణఅమావాస్య /పొలాల అమావాస్య/మహాలయమావాస్య, ఈ రోజున పితృ తర్పణాలు, దానధర్మాలు చేయడం ఆచారం. ఈ రోజున స్త్రీలు పొలాల అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారు ముఖ్యం గా సంతానం కొరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

ఆత్మశక్తి

*ఓ రోజు బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు*
*ప్రపంచాన్ని సృష్టించాను*
*పసుపక్ష్యాదులను సృష్టించాను*
*అయినా తృప్తిగా లేదెందుకని*

*ఓ చిన్న ఆలోచన చేసి*
*తనని తాను తిరిగి సృష్టించుకున్నాడు*


*మనిషి*
*అని నామకరణం చేశాడు*
*అన్ని తెలివితేటలను,*
*సకల సామర్థ్యాలనూ ఇచ్చాడు.*
*ధైర్యం,*
*సాహసం,*
*నమ్మకం,*
*ముందుచూపు,*
*ఆత్మ విశ్వాసం*
*నిండా నింపేశాడు.*

*భూమి మీద*
*వదిలేటప్పుడు బ్రహ్మకి భయం పట్టుకుంది.*

*వీడు*
     *కాలాంతకుడు,*
     *ప్రాణాంతకుడు,*
     *దేవాంతకుడు*
     *అయిపోతాడేమో..*

 *వీడి బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు.*

*"నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను. నాకివ్వు" అంది గద్ద.*

*"మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు.*
*ఆ రోజు మళ్లీ తీసేసుకుంటాడు."*
*అన్నాడు బ్రహ్మ.*

*"పోనీ ...*
*నేను నీటి అట్టడుగున దాచేస్తాను," అంది చేప.*

*"మనిషి ఏదో ఒక రోజు నీటిని జయిస్తాడు."*

*"నేను నేల పొరల్లో దాచేస్తాను." అంది ఎలుక.*

*"మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు."*

*అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకు వచ్చింది.*

*"సర్వ శక్తులనీ మనిషి లోపలే దాచేద్దాం.." అంది.*

*"భేష్....*
*మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు.*
*అన్నిటినీ గెలుస్తాడు.*

*కానీ*
*తన లోపలికి వెళ్లడు.* *తనను తాను గెలిచే ప్రయత్నమే చేయడు. అక్కడే దాచేద్దాం,"*
*అన్నాడు బ్రహ్మ.*

*అప్పటి నుంచీ బలం*
*మనిషి తనలోనే ఉంచుకుని..*
*బయట వెతుకుతూనే ఉన్నాడు.*

*So search For*
*OUR INNER POWER..*

*Every one is UNIQUE.*

🙏
*నమ్మకం మించిన శక్తి లేదు*
*శక్తి ఉంటే అపజయం లేదు*
             🌹 అందుకే🌹
    కృషి తో నాస్తి దుర్బిక్షం
     జపతో నాస్తి పాతకం
   సాధన చేస్తే అన్నీ సాధించగలరు

     👍   విజయోస్తు    👍✌💪

తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

రామనామ మహిమ



త్రేతాయుగంలోనే శ్రీ రాములవారు రాజ్యం చేస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు. నిరంతర ‘శ్రీ రామ’ నామ జపం చేసేవాడు. ఎక్కడ రామనామం, రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమ ఉంటారు కదా! అలా ఒకరోజు ఆ భక్తుని వెనక అదృశ్యంగా అతనితోపాటే తిరుగుతూ అరమోడ్పు కన్నులతో రామనామ పారవశ్యంలో మునిగితేలుతున్నారు హనుమ. ఐతే కొంత సమయానికి ఆ భక్తునికి లఘుశంక తీర్చుకోవలసి వచ్చి ఆ సమయంలో కూడా రామనామ జపం సాగిస్తూనే ఉన్నాడు. అది చూసిన హనుమంతులవారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపుమీద ఒక్క దెబ్బ కొట్టారు. ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక ‘రామా’ అని ఆర్తితో అరిచాడు. అలా అనగానే ఆశ్చర్యంగా ఆనొప్పి తగ్గిపోయింది. అదే సమయంలో ఇటువంటి వాడి చుట్టూనా నేను రామనామం కోసం తిరిగింది!? అని హనుమ అక్కణ్ణుంచి తిరిగి రాజ ప్రసాదానికి చేరుకున్నారు.

 రాజ ప్రాసాదంలో అంతా ఒకటే కోలాహలం గా ఉంది. రాములవారికి ఆరోగ్యం బాలేదు, ఉన్నట్టుండి విరుచుకు పడిపోయారు. వారిని శయనాగారంలోకి తీసుకెళ్ళి పడుక్కోపెట్టారు. ఎవ్వరినీ లోపలకి పంపట్లేదు. కేవలం సీతమ్మ, లక్ష్మణ భరత శత్రుఘ్నులే ఉన్నారు. రాముల వారు హంసతూలికా తల్పం మీద వెల్లకిల్లా పడుక్కుని ఉన్నారు. వారి వీపుమీద ఒక పెద్ద వాత ఉన్నది. సీతమ్మ ఆ వాత వల్ల కలిగిన నొప్పి, మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూఉన్నది. హనుమ వచ్చారని తెలియగానే లక్ష్మణాదులు సీతమ్మ "లోపలికి ప్రవేశపెట్టండి ఆయనే మళ్ళీ ఏ హిమాలయాలకో వెళ్ళి ఏ మూలికో తీసుకొచ్చి రాములవారి నొప్పి తగ్గించగలరు" అని చెప్పగా హనుమను లోపలకి అనుమతించారు. లోనికి వచ్చి చూసిన హనుమ ఆగ్రహోదగ్రుడై అసలెవరు ఈ పని చేసింది ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహావతారం ఎత్తి రుద్రుడై తాండవం చేయసాగారు. అప్పుడు నొప్పితోఉన్న శ్రీరాములవారు ’నువ్వే కదా హనుమా ఆ భక్తుని నీ తోకతో కొట్టావు. అతడు ఆ నొప్పి భరించలేక రామా అని అరిచాడు. ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే నీ దెబ్బకి బ్రతకగలిగేవాడా!? నేనే ఇంత బాధపడుతున్నాను’ అని అనగా, హనుమ జరిగిన అనర్థాన్ని తెలుసుకుని క్షమించమని రామపాదాలని ఆశ్రయించి నమస్కరించి, స్వామీ మీ నొప్పికి మందుకూడా తెలిసింది అని ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరికి వెళ్ళి ఆ భక్తుని జరిగింది సూక్ష్మంగా చెప్పి, ఆ భక్తుని నిరతిశయ భక్తికి మెచ్చి, అతనిని తీసుకుని వెంటనే స్వామి వద్దకు వచ్చి, అమ్మవారు వ్రాస్తున్న ఔషధపు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకుని, ఆ భక్తునికి కొద్దిగా ఇచ్చి శ్రీరాములవారికీ సీతమ్మకూ నమస్కరించిన తరవాత  రామ నామ గానం చేస్తూ.. ఇద్దరూ కలిసి ఆ వాతకు ఆ వెన్నపూస పూత పూయగా రాములవారి నొప్పి మంట వారి వీపు మీద వాత అన్నీ పోయాయి.

ఇక హనుమ ఆ భక్తుని ఆనందంతో ఆలింగనం చేసుకుని "చూసావా నాయనా రామ నామ మహిమ! ఏ రామనామం భక్తుడు పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకుని తానే బాధ పడ్డాడో, అటువంటి రాముని బాధనుకూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటియందుండే రామనామమే" అని చెప్పి అతనిని ఆశీర్వదించి పంపారు.
కనుక ఇటువంటి రామనామన్ని మనం చేస్తూ నలుగురి చేతా చేయిస్తూ పునీతులమౌదాం!


తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

శ్రీకృష్ణ కుచేలమైత్రి




శ్రీకృష్ణ పరమాత్మ ఒకనాడు రుక్మిణీదేవి మందిరంలో కూర్చుని ఉన్నాడు. ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడితో చదువుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కుచేలుడు.
కుచేలుడు గొప్ప తేజస్సు ఉన్న వాడు. విజ్ఞాని. ఆయన అనుబంధములకు అతీతంగా ఉంటూ నిరంతరమూ బ్రహ్మమునందు రమించే మనస్సు ఉన్నవాడు. లోకమునందు ఈశ్వరుని దర్శనము చేయగలిగిన సమర్థుడు. మహానుభావుడికి ధర్మం అంటే మహాయిష్టం. విశేషించి ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని. తనకు ఏమీలేకపోయినా దరిద్రంలో అన్నీ ఉన్నాయని తృప్తిగా ఉన్నవాడు. ఈశ్వరుడు తనకు ఫలానిది ఇవ్వలేదు అని అనడం తెలియనివాడు. అంతటి మహాభక్తుడు. గోవింద సఖుడు. అటువంటి కుచేలుడు అంత దరిద్రం అనుభవిస్తున్నా ఎన్నడూ కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్లి చెయ్యి చాపి ‘కృష్ణా, నాకు సహాయం చేస్తావా’ అని అడగలేదు.

కుచేలుని భార్య అనురక్త. కుచేలుడు ఎలా ప్రవర్తిస్తాడో తానుకూడా అలా ప్రవర్తించే సహధర్మచారిణి. గొప్ప భాగవత ధర్మమూ తెలిసి ఉన్న తల్లి. ఆవిడ ఒకరోజున భర్తతో అంది ‘మహానుభావా, ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు. నేను ఓర్చుకుంటాను. పిల్లలు ఆకులతో చేసిన డొప్పలు చేత పట్టుకుని పదిమాట్లు ఆకలేస్తోంది అమ్మా అని అంటే అన్నం పెట్టలేక పోయానే అని అమ్మ బాధ పడుతుందేమోనని ఆకలితో నావంక చూస్తూ నాలుకతో పెదవులు తడుపుకున్తున్నారు. నీకు ఐశ్వర్యం భ్రాంతి లేదు. కానీ బిడ్డలను పోషించాలి కదా. కాబట్టి మీరు పాటిస్తానంటే ఒక సలహా చెప్తాను. మీ సఖుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా. మీరు ఒకసారి ఆయన వద్దకు వెళ్లి ఒక్కమాట చెప్పినట్లయితే అందరినీ ఆదుకోగలిగిన మహానుభావుడు ఆ వాసుదేవుడు మనలను ఆదుకుంటాడు. ఆయనను భక్తితో ఏమి అడిగినా యిస్తాడు. ఎందుకు వచ్చిన దరిద్రం మనకి. పిల్లల కోసమయినా ఆయన దగ్గరకు ఒక్కసారి వెళ్ళవలసింది’ అని చెప్పింది.

భార్య అలా చెప్పేసరికి ఆయన అన్నాడు ‘పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పుడు స్నేహితుని దగ్గరకు వెళ్ళేటప్పుడు, రోగుల దగ్గరకు వెళ్ళేటప్పుడు వృద్ధుల దగ్గరకు వెళ్ళేటప్పుడు గురువుల దగ్గరకు వెళ్ళేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళలేము కదా! స్నేహితుడికి ఏదయినా కానుక పట్టుకెళ్ళాలి కదా! ఆయనకు పట్టుకు వెళ్ళడానికి మనింట్లో ఏమి కానుక ఉంది?” అని అడిగాడు. అపుడు ఆవిడ “మనకి ఉన్నదే మనం యిద్దాము. మన యింట్లో గుప్పెడు అటుకులు ఉన్నాయి. అవి మూట కట్టి యిస్తాను తీసుకువెళ్ళండి’ అన్నది. కుచేలుడి జీవితకాలంలో ఆయనను ఆ ఊళ్ళో చిరుగులేని పంచెను కట్టుకోవడం చూసిన వాడు లేదు. అందుకని ఆయనకు కుచేలుడు అని పేరుపెట్టి పరిహాసం ఆడేవారు. చేలము అనగా వస్త్రము. కుచేలము అనగా చిరిగిపోయిన బట్ట. చిరగని బట్ట కట్టడం కుచేలునికి తెలియదు. కుచేలుని బార్య అటుకులను చిరిగిపోయిన ఉత్తరీయంలో పోసి జాగ్రత్తగా ముడి వేసి కుచేలునికి ఇచ్చింది. దానిని తీసుకుని కుచేలుడు కృష్ణుని వద్దకు బయలుదేరాడు. కుచేలుడు చిరిగిపోయిన బట్టలతో చెమట కంపుతో, రథములనుండి వస్తున్న ధూళి అంతా వంటిమీద పడిపోయి దుర్వాసన వచ్చే స్థితిలో ఆయన నడిచి నడిచి, చివరకు ద్వారకా నగరం చేరుకున్నాడు. ఏమి తిన్నాడో, ఏమి తినలేదో ఈశ్వరునికి ఎరుక. ద్వారకా పట్టణ సౌందర్యం చూసి ఆశ్చర్యపోయాడు. తన సఖుడయిన గోవిందుడు ఎక్కడ ఉన్నాడోనని వాకబు చేసి కృష్ణ భగవానుడు ఉన్న యింటిని తెలుసుకున్నాడు. యింటిముందర పెద్ద పెద్ద శూలములు పట్టుకొని భటులు కాపలా కాస్తున్నారు. తన స్థితిని చూసి లోపలికి రానిస్తారో రానివ్వరో, కృష్ణ పరమాత్మ తనని గుర్తు పడతాడో పట్టాడో అనుకున్నాడు. రాజభటులకు ఏదైనా కానుక యిచ్చి లోపలికి వెళదాము అంటే తన దగ్గర కృష్ణునికి యివ్వడానికి తెచ్చిన అటుకులు తప్ప వేరొకటి లేదు. కాబట్టి యిపుడు వాసుదేవుడిని చేరడానికి తనకు వాసుదేవుడే ఆధారం అని అనుకుని సౌధం దగ్గరికి వెళ్లి తెరతీసి భటులను చూశాడు. భటులు ‘ఎవరు కావాలి అని అడిగారు. నేను కృష్ణ పరమాత్మ స్నేహితుడిని అని చెప్పాడు. అపుడు వాళ్ళు ఆయనను ఎగాదిగా చూశారు. పాపం ఆయన చాలా దయనీయమయిన స్థితిలో కనపడ్డాడు.

కానీ ద్వారకానగరంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ వున్న ద్వారపాలకులకు తెలుసు. అందుకని వారు వెళ్లి కృష్ణ పరమాత్మతో ‘అయ్యా మీ కొరకని చాలా పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుడనని చెప్పి మిమ్మల్ని కలుసుకునేందుకు ద్వారం దగ్గర నిరీక్షిస్తున్నాడు’ అని చెప్పారు.

 అప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవి మందిరంలో అమ్మవారితో హాస్యోక్తులాడుతూ ఉన్నాడు. తెర తీసేసరికి దూరంగా రాజద్వారం దగ్గర నిలబడి ఉన్న కుచేలుడు కనిపించాడు. కుచేలుని అంతదూరంలో చూసి ‘కుచేలా ఎప్పుడు వచ్చావు?’ అని పలకరిస్తూ ఒక్కసారి మంచం మీద నుంచి క్రిందకు దూకి పరుగెత్తుకుంటూ వెళ్లి కుచేలుడిని గట్టిగా కౌగలించుకున్నాడు. కుచేలా ఎన్నాళ్ళకు చూశానయ్యా నిన్ను లోపలికి రావలసింది’ అని కుచేలుని చేయి పట్టుకుని గబగబా లోపలికి తిన్నగా తన శయన మందిరంలోకి తీసుకువచ్చాడు. అక్కడ ఒక పాన్పు ఉంది. రుక్మిణీ దేవి, తానూ తప్ప అన్యులు ఆ పాన్పును ముట్టరు. అటువంటి హంస తూలికా తల్పం మీద కుచేలుని కూర్చోబెట్టాడు. రుక్మిణీదేవిని పిలిచి బంగారు చెంబుతో నీళ్ళు తెప్పించి ఆయన కాళ్ళకింద పళ్ళెం వుంచి ఆదిలక్ష్మియైన రుక్మిణీదేవి నీళ్ళు పోస్తుండగా కృష్ణ పరమాత్మ కుచేలుని కాళ్ళు కడిగాడు. ఏ తల్లి కనుచివరి చూపు తగిలితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో ఆ లక్ష్మీదేవి నీళ్ళు పోస్తుండగా, సమస్త బ్రహ్మాండములకు ఆధారభూతమయిన కృష్ణ పరమాత్మ కాళ్ళు కడుగుతున్నాడు. శిరస్సు వంచి ఆ నీళ్ళు తన శిరస్సు మీద కిరీటం మీద చల్లుకున్నాడు. రుక్మిణీదేవి తలమీద చల్లాడు. అక్కడ ఉన్న వాళ్ళందరి మీద చల్లాడు.
ఆయన ఎంతో దూరం నుంచి నడిచి వచ్చి అలసిపోయాడని ఆయన ఒంటినిండా గంధం రాశాడు. ఒక విసనకర్ర పట్టుకొని విసురుతున్నాడు. కృష్ణ పరమాత్మ చేసిన హడావుడికి రుక్మిణీ దేవి తెల్లబోయింది. ఆమె కూడా తామరపువ్వులతో చేసిన విసనకర్రను తెచ్చి కుచేలునికి విసురుతున్నది. ఆ గాలి ఒంటికి తగిలి ఆయన సేదతీరాడు. మంచి ధూపమును ఆయనకు చూపించాడు. మణులతో కూడిన దీపములతో ఆయనకు నీరాజనం యిచ్చాడు. తరువాత ఎంతో సంతోషంగా కుచేలునికి దగ్గరగా కూర్చున్నాడు. పరమ ఆప్యాయంగా కుచేలుని చేతులు తన చేతులలో పెట్టుకుని స్నేహితుని వంక చూసి యోగక్షేమములు అడిగాడు.

కృష్ణ పరమాత్మ అలా ప్రవర్తించడం ఇంతకు పూర్వం ఎవరూ చూడలేదు.
ఏమి తపంబు సేసెనొకొ! యీ ధరణీదివిజోత్తముండు తొల్
బామున! యోగివిస్ఫుర దుపాస్యకుఁడై తనరారు నీ జగ
త్స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసియించి యున్నవాఁ
డీ మహనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్?

ఏమి ఆశ్చర్యము! ఇంతకు పూర్వం నారదుడు వచ్చినప్పుడు చూశాము, ఎందఱో మహర్షులు వచ్చినప్పుడు చూశాము. అందరినీ దర్బారు హాలులో కూర్చోబెట్టి మాట్లాడేవాడు. అంతేకానీ ఈ బ్రాహ్మణుడు చూస్తే దరిద్రుడిలా ఉన్నాడు. ఏమి తపస్సు చేశాడో! మహా యోగులైన వారు తపస్సు చేస్తే తప్ప దొరకని పరమాత్మ ఈవేళ ఈ బ్రాహ్మణునకు ఎంత సేవ చేశాడు. ఆ తల్పం మీద రుక్మిణీ కృష్ణులు తప్ప అన్యులు కూర్చోవడం మనం యింతవరకు చూడలేదు. ఈ బ్రాహ్మణుడు దానిమీద కూర్చోవడమా! అసలు ఈయన ఎవరు? అని వాళ్ళు ఆశ్చర్య పోతున్నారు.

అపుడు కృష్ణ పరమాత్మ కుచేలునితో ఓ బ్రాహ్మణోత్తమా! నీవు వివాహం చేసుకున్న స్త్రీ చాలాకాలం వేదం నమ్ముకును వేదపాఠం చెప్పుకున్న బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించిన పిల్ల అని నేను విన్నాను. అట్టి కుటుంబంలో పుట్టిన పిల్ల భర్తను అనుసరించి సుశీలయై ఉంటుంది. నిన్ను చూస్తుంటే నీ మనస్సు భార్యయందు బిడ్డలయందు భ్రాంతి లేకుండా కేవలం సంసారంలో ఉండాలి కాబట్టి మాత్రమే ఉండి విహిత కర్మాచరణముగా భార్యాబిడ్డలను చూడాలి కాబట్టి చూస్తూ సంతతము బ్రహ్మమునందు రమిస్తున్న వాడిలా నాకు కనపడుతున్నావు. అవునా?” అని అడిగాడు. పిమ్మట ఇద్దరూ కలిసి భోజనం చేశారు. భోజనానంతరం మరల ఇద్దరూ వచ్చి కూర్చున్న పిమ్మట కృష్ణుడు కర్పూర తాంబూలమును తానే స్వయంగా చేసి తెచ్చి వేసుకోమని కుచేలునికి ఇచ్చాడు. ఆరోజున కృష్ణుడు పూర్తిగా కుచేలునితోనే గడిపాడు. కృష్ణ పరమాత్మ తాను కుచేలునితో గడిపిన చిన్ననాటి ముచ్చట్లను తలుచుకున్నాడు. కృష్ణ పరమాత్మ చూపిస్తున్న ఈ ప్రేమను కుచేలుడు జీర్ణం చేసుకోలేక పోతున్నాడు. కుచేలా ఎవరి దగ్గరికయినా వెడితే ఏమయినా పట్టుకు వెళ్ళాలని మన గురువుగారు సాందీపని అంటూ ఉండేవారు కదా! మరి నువ్వు నాకు ఏమిటి తెచ్చావు?” అని గబగబా కుచేలుడిని తడిమేస్తున్నాడు. కుచేలుడు సిగ్గు పడిపోయాడు. ఆయన లక్ష్మీనాథుడు. గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయనకు తాను ఏమి యిస్తాడు? చిరిగిపోయిన ఉత్తరీయం మూట కట్టి ఉన్న అటుకులను చూశాడు. కుచేలా, చాలా ఐశ్వర్య వంతుడనని నాకు చాలామంది కానుకలు పట్టుకువచ్చి ఇస్తుంటారు. అవి వాళ్ళందరూ నాయందు ప్రీతితో నేనే తినాలని తెచ్చినవి కావు. తమకు ఉన్నాయని ఆడంబరమునకు తెచ్చి యిచ్చిన వాళ్ళు ఉన్నారు వాటిని నేను ముట్టుకోను. ఒక ఆకు కాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, కొబ్బరి నీళ్ళను గాని ఎవరయినా భక్తితో తెచ్చి యిస్తే వాటిని నేను పుచ్చుకుంటాను. భక్తితో తెచ్చిన వాటికి పెద్ద పీట వేస్తాను. ఆడంబరమునకు తెచ్చిన వాటిని పక్కన పెట్టేస్తాను. అని కుచేలుని వద్ద ఉన్న అతుకుల మూటను తీసుకొని విప్పి పిడికెడు అటుకులు తీసుకుని నోట్లో పోసుకున్నాడు.

 అలా పోసుకునే సరికి 14 భువనభాండములలో వున్న సమస్త జీవరాసుల కడుపునిండి బ్రేవుమని త్రేన్చాయి. కృష్ణుడికి యింకా ప్రీతి ఆగక మరియొక పిడికెడు తీసి పోసుకుంటున్నాడు. దీనిని రుక్మిణీదేవి చూసింది. వెంటనే వచ్చి కృష్ణ పరమాత్మ చేయి పట్టుకుని, కృష్ణా, మీరు తిన్నది చాలు. యిహలోకమందు పదితరములు తినడానికి కావలసిన ఐశ్వర్యము భక్తి జ్ఞానము మోక్షము అన్నీ కుచేలునికి ఇచ్చేశారు. ఇంకొక పిడికెడు నోట్లో పోసుకుంటే నన్ను మిమ్ములను కూడా కుచేలునికి దాసులుగా ఇచ్చేస్తారు. ఇంకచాలు’ అంది. ఆ తల్లికి అన్నీ తెలుసు.

పరమాత్మ కుచేలుడు యిచ్చిన అటుకులను ఎందుకు స్వీకరించాడు? గత జన్మలో కుచేలుడు ఎంతో భక్తితో భగవంతునికి ఎన్నో సేవలు చేశాడు. ఎన్ని సేవలు చేసినా ఎన్నడూ కూడా తన మనస్సులో ఈ కోరిక నాకు తీరితే బాగుండును అన్న కోరిక మాత్రం ఆయనకు లేదు. ఈశ్వరుని సేవ చేయడమే తన జీవితమునకు ధన్యము అని చేశాడు. దానివలన బ్రహ్మజ్ఞాని అయ్యాడు తప్ప ఆయనకు మనస్సులో మాత్రం కోరిక లేదు. తాను యింత దరిద్రంలో ఉన్నా ఈశ్వరుని సేవించి ఐశ్వర్యం పొందాలని భ్రాంతి కుచేలునికి లేదు. కానీ ఆయన భార్య ఐశ్వర్యం కావాలని అడిగింది. స్వామి మహాభక్తుల కోరిక తీర్చకుండా ఉండలేడు.

కుచేలుడు తెల్లవారు ఝామున లేని మరల తనకి వున్న మాసిపోయిన దుస్తులనే ధరించి ‘కృష్ణా, నేను వెళ్ళివస్తాను’ అని చెప్తే కృష్ణ పరమాత్మ గడపదాటి బయటకు వచ్చి కుచేలునికి వీడ్కోలు చెప్పాడు. కుచేలుడు తన యింటి దారిపట్టి నడిచి వెళ్ళిపోతూ ఏమి నా భాగ్యం. ఏ పరమాత్మ దర్శనం కొన్ని కోట్లమంది అడుగుతారో అటువంటి వానితో కలిసి నేను కూర్చున్నానా. నేను తెచ్చిన అటుకులు తిన్నాడా. నా సఖుడిది ఏమి సౌజన్యం. నాకు ఇంతకన్నా జీవితంలో ఏమి భాగ్యం కావాలి అని అనుకున్నాడు. అప్పుడు తన భార్య కృష్ణ పరమాత్మను సంపద అడగమని పంపించిందని గుర్తుకు వచ్చింది. కానీ కృష్ణుడు తన బట్టలను చూసి అయినా తాను మిక్కిలి బీదవానిగా ఉన్నాడని గ్రహించి సంపదను ఇవ్వవచ్చు కానీ అలా యివ్వలేదు’ అని అనుకున్నాడు. ఇంత దరిద్రంలో ఉన్నాను కాబట్టి ఆ కృష్ణుడు నాకెప్పుడూ గుర్తు ఉంటున్నాడు. ఒకవేళ ఐశ్వర్యం ఇచ్చేస్తే ఆయనను నేను మరిచిపోయి పాడయిపోతానేమోనని దరిద్రమునే ఉంచి ఆయన నా మనస్సులో ఉండి పోయేటట్లు నాకు వరమును యిచ్చాడు-అని అనుకున్నాడు.

తన ఇల్లు ఉన్నచోటికి వెళ్ళి చూశాడు. అక్కడ సూర్యుడు చంద్రుడు ఏకకాలమునందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాంటి సౌధం ఒకటి కనపడింది. ఆ సౌధమునకు చుట్టుప్రక్కల పెద్ద ఉద్యానవనములు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎంతోమంది పరిచారికలు అటుఇటూ తిరుగుతున్నారు. ఎక్కడ చూసిన రత్నరాశులు ప్రోగుపడి ఉన్నాయి. ఇటువంటి ఇల్లు ఎ మహాపురుషునిదో తన పూరి యింటి స్థానంలో అత పెద్ద సౌధం ఎక్కడి నుంచి వచ్చినదా అనుకుని ఆశ్చర్యపోతూ అక్కడ ద్వారం దగ్గర నిలబడ్డాడు.
ఈయనను చూడగానే పరిచారికలు గబగబా బయటకు వచ్చి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి ఆయనను మేళతాళములతో లోపలికి తీసుకువెళ్ళారు. అది తన యిల్లేనని తెలుసుకున్నాడు. తన భార్య పట్టు వస్త్రములను కట్టుకుని అనేకమైన బంగారు ఆభరణములను ధరించి ఎదురువచ్చి భర్త కాళ్ళకు నమస్కరించి వారి పూరి గుడిసె స్వామి కృప వలన యిలా అయిపొయింది అని చెప్పింది. కృష్ణ పరమాత్మ అంత ఐశ్వర్యమును యిచ్చాడని చెప్తే పొంగిపోయి వాళ్ళు యింట్లో ఐశ్వర్యమును అనుభవించినా మనస్సులు మాత్రం ఎప్పుడూ కృష్ణుడి దగ్గరే పెట్టుకుని హాయిగా గోవింద నామము చెప్పుకుంటూ పరవశించి పోతూ యిహము నందు సమస్త ఐశ్వర్యమును అనుభవించి, అంత్యమునందు జ్ఞానము చేత మోక్షసిద్ధిని కుచేలుని భార్య బిడ్డలు పొందారు.


ఇంట పరమపవిత్రమయిన కుచేలోపాఖ్యానమును ఎవరు వింటున్నారో వారికి గొప్ప ఫలితం చెప్పబడింది. ఎవరు దరిద్రుడయిన కుచేలుని సంపత్తి కలవానిగా కృష్ణ పరమాత్మ చేసినట్టి ఈ ఆఖ్యానమును వింటున్నారో వాళ్ళందరికీ కూడా కృష్ణ పరమాత్మ పాదములయందు భక్తికలిగి, వారందరికీ కూడా కీర్తి యశస్సు నిలబడి అంత్యమునందు మోక్షమును పొందుతారు” అని ఈ ఆఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పబడింది.
ఓమ్

తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

ఆస్తి పంపకం



ఒకరోజు కంచిలో మహాస్వామి వారి దర్శనానికి కేరళలోని ఒక ఉన్నతమైన కుటుంబం నుండి దంపతులొకరు వచ్చారు. అతని ప్రకారం వారి కుటుంబ ఆస్తి వారిరువురు అన్నదమ్ముల మధ్య స్నేహపూర్వకంగా పంచుకోవడం సాధ్యపడదు. అతని అభిప్రాయంలో తన తమ్ముడు చాలా మొండివాడు. తన మాటకు విలువ ఇవ్వకుండా వేరుకాపురం పెట్టాడు. తను సమానంగా అస్తిని పంచి ఇద్దాము అని అనుకున్నా తను చెప్పే మాటలకు విలువ ఇవ్వడు. కాబట్టి ఆస్తి పంపకాల కోసం కోర్టులో దావా వెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అదే విషయమై స్వామివారిని కలిసి వారి ఆశీస్సుల కోసం వచ్చాడు.

అంతా విన్న స్వామివారు, “సరే నువ్వు దావా వేస్తే ఎంత డబ్బుకి స్టాంప్ప్ పేపర్స్ కొనవలసి ఉంటుంది?” అని అడిగారు.

ఆ మొత్తం కొన్ని వేలల్లో ఉంటుందని చెప్పాడు. ”మరి న్యాయవాదికి ఎంత ఇవ్వాలి?”

అదీ కొంచం పెద్ద మొత్తం చెప్పాడు.

”అది పూర్వీకుల ఆస్తి కాబట్టి చాలా ప్రభుత్వ శాఖలనుండి వాటికి సంబంధించిన కొన్ని పత్రాలను తెచ్చుకోవలసి ఉంటుంది. మరి దానికి కొంచం ఖర్చు అవుతుంది కదా? మరి ఆ ఖర్చు ఎంతవుతుంది?”

అవును అని అందుకు కొంచం మొత్తం అవుతుందని చెప్పాడు.

”సరే! సమాన్యంగా ఇటువంటి దావాలు తొందరగా పూర్తి కావు. కాబట్టి ఈ దావా ఎంత కాలానికి ముగుస్తుంది అని అనుకుంటున్నావు?”

“అది చాలా కాలం పట్టవచ్చు”

”అవును. అది చివరికి ముగిసినా, తీర్పు నీకు అనుకూలంగా ఉందకపోవచ్చు కదా?”

“అలా అవుతుందని నేను అనుకోవడం లేదు”

“సరే! నీకు అనుకూలంగానే వచ్చింది అనుకుందాము. నీ తమ్ముడు పైన్యాయాలయానికి వెళ్ళవచ్చు కదా?”

“అవును. వెళ్ళవచ్చు”

“మరి అప్పుడు ఎంతో ఉన్నతమైన మీ కుటుంబం విషయం ప్రముఖ పత్రికల్లో ప్రచురించబడి అందరికి తెలియబడుతుంది. అవును కదా?”

అప్పుడు అతను కొంచం అలోచిస్తున్నట్టుగా చిన్నగా అవును అన్నాడు. ”కాబట్టి ఈ విషయమై న్యాయస్థానానికి వెళ్తే డబ్బు, సమయం, శక్తి వృధా. మీ ఇంటి గౌరవ మర్యాదలు, మీ అన్నదమ్ముల పరువు ప్రతిష్టలు దిగజారిపోతాయి. మరి దాని గురించి ఆలోచించావా?”

“ఏమి జరిగినా పర్వాలేదు నాకు సమ్మతమే అంటావా?. ఇదేనా నీకు కావాల్సింది”

ఆ భక్తుడు మనసులో ఏ ఆలోచనతో అయితే వచ్చాడో ఇప్పుడు అది మాయమైపోయింది. కాని ఇప్పుడు ఏమి చేయాలో అతనికి అర్థం కావటం లేదు.

“పెరియవ మీరుచెప్పినట్టు దావా వెయ్యడం సరికాదు. నేను ఇప్పుడు ఏమి చెయ్యలో నా తక్షణ కర్తవ్యం ఏంటో మీరే సెలవివ్వాలి” అని వేడుకున్నాడు.

”ఏదో కారణానికి అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయినంత మాత్రాన అలాగే ఉండిపోవాలని లేదు కదా? నువ్వు ఎవరు? తను ఎవరు? మీ మధ్య గొడవ ఎంత పెద్దదైనా కావచ్చు ఇద్దరూ మళ్ళా కలవాల్సిందే. ఎందుకు మీరు ఇలాంటి మనస్థత్వాన్ని పెంపొందించుకోకూడదు?”

మహాస్వామి వారు కొద్దిసేపు అలోచించి, “సరే మీరిద్దరు ఏమి చెయ్యాలో నేను చెప్తాను. చాలా పళ్ళు, పూలు కొనుక్కుని నేరుగా మీ తమ్ముడి ఇంటికి వెళ్ళు. అతనిపై గుండెలనిండా ప్రేమతో వెళ్ళు. అతను తన భార్యతో కలిసి నిన్ను ఆదరంతో స్వీకరిస్తాడు. ప్రేమతో గుండేల్లోనుండి ఈ మాటలు చెప్పు ‘ఏదో జరిగినదేదో జరిగిపోయింది. నువ్వు ఎవరు? నేను ఎవరు? మొత్తం ఆస్తి అంతా నీ దగ్గరే ఉన్నా అది నా వద్ద ఉన్నట్టే. నాకూ సంసారం ఉంది కాబట్టి నీకు ఎంత ఇవ్వలనిపిస్తే అంత ఇవ్వు. ఈ జన్మకే మనం అన్నదమ్ములం. చక్కగా ఉందాం’ అని చెప్పమని” చెప్పారు.

మహాస్వామి వారి మాటలననుసరించి, తమ్ముని ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుని స్వామి వారి వద్ద సెలవు తీసుకున్నారు.

వారు వెళ్ళిన తరువాత స్వామి వారు అక్కడున్నవారితో, “తనకుతానుగా వచ్చిన అన్నను చూసినవెంటనే వాళ్ళ శతృత్వం సగం పోతుంది. ప్రేమతో పలకరించిన అన్న మాటలను విన్న వెంటనే మొత్తం మరచిపోయి ఇతణ్ణి ఆదరిస్తాడు. కోర్టుకు వెళ్ళకుండానే వారు సంతోషంగా ఆస్తిని పంచుకుంటారు. మనం మంచి అలోచనలతో ప్రేమతో వెళ్తే, వారు కూడా మనల్ని అలానే ఆదరిస్తారు”

పరమాచార్య స్వామి వారి సలహా పనిచేసింది. కొన్నిరోజులతరువాత అంతా సవ్యంగా జరిగినదనే వార్త శ్రీమఠానికి వచ్చింది.

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

నేనే కామాక్షి



పరమాచార్య స్వామివారు మకాం చేసిన ఊర్లో ఉన్న ఒకావిడకి స్వామివారంటే అనన్యమైన భక్తిప్రపత్తులు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆవిడ తరచూ ఇంటినుండి బయటకు వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండేది కాదు. ఒకరోజు ఎలాగో ఇంటినుండి బయటకు వచ్చి మహాస్వామి వారు బస చేసిన చోటికి వచ్చింది.

అది మద్యాహ్న సమయం. పూజావేదిక పైనుండే కూర్చుని పరమాచార్య స్వామివారు భక్తులతో మాట్లాడుతున్నారు. ఈమె చేతిలో హారతి పళ్ళెంతో మహాస్వామి వారి దగ్గరకు వెళ్ళి హారతివ్వడానికి స్వామివారికేసి చూసింది. వెంటనే స్వామివారు ముఖాన్ని మరోవైపుకు తిప్పుకున్నారు. రెండు మూడు సార్లు ప్రయత్నించినా పరమాచార్య స్వామివారు ఆమెకు వారి ముఖ దర్శనం ఇవ్వలేదు.

ఆవిడకు చాలా బాధవేసింది. మహాస్వామివారు తన వైపు తిరిగినట్టనిపించి హారతిపళ్ళెంలో కర్పూరాన్ని వెలిగించింది. ముందుకు వెళ్ళి హారతి ఇచ్చే లోపల స్వామివారు లేచి లోపలికి వెళ్ళిపోయారు. ఆవిడ నిచ్చేష్టురాలై మనసులో “అమ్మా అంబికా! ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? నేను చేసిన పాపం ఏమిటి?” అని రోదించసాగింది. తరువాత తమాయించుకొని “సరే! నేను ఈ హారతిని నీకే సమర్పిస్తాను” అని పూజా వేదికపైన ఉన్న త్రిపురసుందరి అమ్మవారికి హారతిచ్చి చాలా నిరాశతో ఇంటికి వెనుతిరిగింది.

ఆ పందిరి నుండి బయటకు రాగానే, ఒకరు ఆవిడ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, “అమ్మా! పెరియవ నిన్ను పిలుస్తున్నారు” అని చెప్పాడు. “నన్ను పిలుస్తున్నారా? నన్ను కాదేమో” అని సంశయంగా చెప్పింది. “అవును అమ్మా మిమ్మల్నే. లోపలికి రండి” అని చెప్పాడు. అనుమానంగా లోపలికి వెళ్ళింది. వేదికపైన కూర్చున్న మహాస్వామి వారు ఆవిడతో, “నాకు ఇవ్వాల్సిన హారతి అమ్మవారికి ఇచ్చానని ఏమి మధనపడకు. ఇప్పుడు నాకు హారతి ఇవ్వు” అని చెప్పారు.

ఉద్వేగంతో కర్పూరాన్ని పళ్ళెంలో పెట్టింది. చేతులు వణుకుతుండగా కర్పూరాన్ని వెలిగించింది. కొద్దిగా ధైర్యము తెచ్చుకుని స్వామివారి ముందుకు వెళ్ళి హారతి ఇస్తూ మహాస్వామి వారి ముఖంలోకి చూసింది. ఆవిడ కళ్ళకి మహాస్వామి వారు ఒకచేతిలో చెరుకు విల్లుతో, మరొక చేతిలో పరాంకుశముతో మందస్మితయై సాక్షాత్ కామాక్షి అమ్మవారిలాగా కనపడ్డారు. స్వామివారిని అలా చూడగానే ఆవిడ గట్టిగా లెంపలేసుకుంటూ భక్తితో “అమ్మా! అమ్మా!” అని అరవసాగింది. వేదికపైన ఉన్న కామాక్షి, పరమాచార్య స్వామివారు ఒక్కటే అన్న విషయం ఈ సంఘటన వల్ల మనకు తెలుస్తుంది.

[కాల్చి పుటం పెడితేనే వన్నె చేకూరుతుంది బంగారానికి. భగవంతుడు పెట్టే పరీక్షలకు తట్టుకుని నిలబడితేనే భక్తుని భక్తి, ఆర్తి తెలిసేది. కష్టాలలో కూడా భగవంతుని నమ్మి నిలిచినవాడే నిజమైన భక్తుడు. అటువంటి వారికి ఉన్నదే నిజమైన భక్తి. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి తిట్టడం సరికాదు. సుఖాలు ఇచ్చినప్పుడు పొగిడావా? లేదు కదా!!

పరమాచార్య స్వామివారు అలా చెయ్యకపోయి ఉంటే ఆవిడకు స్వామివారిలో కామాక్షి దర్శనం అయ్యుండేది కాదు. స్వామివారు అలా చెయ్యడం వల్ల ఆవిడ మనస్సు క్లేశపడి పురాకృత పాపం శేషం పోయి అమ్మవారి దర్శనం అయ్యింది. మహాత్ములు ఏమి చేసినా అది లోకకళ్యాణానికే!!]

--- నాగలక్ష్మి, తిరుచ్చి. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 2


తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

బంధాలు-టెక్నాలజీ

మంచి సందేశం...


ఒక కుర్రాడు, వాళ్ళ నాన్నతో ఒక గంట సేపటి పాటు కొంచెం డబ్బు పంపటం కోసం బ్యాంకులో వేచి ఉన్నాడు. తను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు....

"నాన్నగారు, మీరు internet banking ఎందుకని activate చేసుకోరు?"

"ఎందుకు చేయించుకోవాలి" అని తండ్రి తిరుగు ప్రశ్నించారు.

"ఇలా ఇక్కడ గంట సేపు transfer కోసం ఎదురు చూడనక్కర్లేదు, ఇంకా సామాన్లు కూడా online లో ఇంటికే తెప్పించుకోవచ్చు".

తండ్రిని internet banking ప్రపంచంలోకి తీసుకురావాలని కొడుకు ప్రయత్నిస్తున్నాడు.

తండ్రి : "అలా చేస్తే నేను ఇంట్లో నుండి బయటకు రావాల్సిన అవసరం లేదు కదా??"

"హ హ, ఆవును అవును", అని కొడుకు జాబిచ్చాడు. "ఇంకా ఇంటికి కిరాణా సామాన్లు, ఇంటికి కావాల్సిన వస్తువులు ఇలా ఎన్నో తెప్పించుకోవచ్చు, amazon flipkart లాంటి ఎన్నో కంపెనీలు ఎంతో సులువుగా, కచ్చితంగా సామాన్లు ఇంటికి అందజేస్తున్నాయి", అని వివరించే ప్రయత్నం చేసాడు.

అంతా విన్న తండ్రి ఇచ్చిన సమాధానానికి ఆ కొడుకుకి ఇంక మాటల్లేవ్ !!!

"నేను ఈరోజు బయటకి రావటం వల్ల, నా పాత స్నేహితులని నలుగురిని కలిసాను. ఇక్కడ పని చేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడాను.

నీకు తెలుసు నేను ఒంటరివాడిని. నాకు ఈ సమయంలో కావాల్సిన స్నేహం ఇటువంటిదే. నాకు కావాల్సినంత సమయం ఉంది. నేను ధీమాగా తయారయ్యి ఇలాంటి పరిచయాల్ని పెంచుకుంటాను.

రెండు సంవత్సరాల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, నేను ఎప్పుడూ పళ్ళు కొనే కొట్టు వాడు నన్ను చూడటానికి వచ్చి, నాకోసం బాధపడి, కన్నీళ్లు కార్చి, నేను బాగు అవ్వాలని కోరుకున్నాడు.

కొన్ని రోజుల క్రితం...
అమ్మ పొద్దున్నే, మార్నింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు మనం ఎప్పుడూ సామాన్లు కొనే కిరాణా కొట్టువాడు, తన బండి తీసుకుని అమ్మని ఇంటికి చేర్చాడు.

నువ్వన్నట్టు online లో shopping లు అవి చేస్తే, నాకు ఈ మానవ సంబంధాలు ఉండేవా? పళ్ళ కొట్టువాడు నా బాధను పంచుకునేవాడా? అమ్మని కిరాణా కొట్టువాడు ఇంటికి చేర్చగలిగేవాడా???

ఒక computer లేదా mobile phone తో సావాసం చేసి ఇంటికే అన్ని తెప్పించుకుని నాకు దొరికే స్నేహితుడు ఎవడు, ఒక electronic పరికారమా!!!

నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడటం ఇష్టం. నాకు ఇవన్నీ నువ్వనే ఆ amazon flipkart లో దొరుకుతాయా, కేవలం నీకు సామాను పంపే seller పేరు తప్ప. మనిషి మనీషి కలిసిన నాడే సత్సంబంధాలు ఏర్పడతాయి, బంధాలు బలమవుతాయి.

టెక్నాలజీ ఉండాలి కానీ...
అది మాత్రమే జీవితం కాకూడదు !

మనుషులతో జీవించండి.....
పరికరాలను వాడుకోండి.....

"ప్రేమించల్సిన మనుషుల్ని వాడుకొని,
వాడుకోవాల్సిన పరికరాలతో జీవించకండి"....

('తెగిపోతున్న మానవ సంభందాల' గురించి ఒక్క సారి అలోచించండి) 🙂🙂🙂🙂

తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

పులి-బాటసారి

సీతమ్మ చెప్పిన పులి – బాటసారి కధ
చాలా చక్కటి గొప్ప నీతి కధ
తప్పక చదవండి.

రావణసంహారం అనంతరం ఆ కబురు సీతమ్మ తల్లికి చెప్పేందుకు హనుమంతుడు అశోకవనానికి చేరుతాడు. “అమ్మా ఇకపై ఈ లంకా రాజ్యాన్పి ఏలేది విభీషణుడే. రావణ సంహారం జరిగినది. మీరు ఇక్కడి నుండి బయలుదేరేముందు ఒక్క ఆఙ్ఞ ఇవ్వండి తల్లి.. మిమ్ములను ఇంతకాలం ఈ చెరలో చిత్రహింసలు పెట్టిన వీరందరిని సంహరిస్తాను”అంటాడు.
అప్పుడు ఆ మహాతల్లి హనుమా! నీకు ఓ కధ చెబుతా విను. ఒకానొక కాలంలో ఓ బాటసారి అడవిగుండా వెలుతున్నాడు. ఇంతలో ఆకలిగొన్న ఓ పులి తనపైకి రాబోగా తన ప్రాణాలను అరచేతబట్టుకుని పరుగులు పెడతాడు. పులికూడా వెంబడిస్తుంది. ఇంతలో ఓ చెట్టు పైకి ఎక్కి ఆ చెట్టుకొమ్మను ఆశ్రయిస్తాడు. అయితే బాటసారి వున్న కొమ్మ పై కొమ్మలో ఓ ఎలుగుబంటి వుంటుంది. అది చూసిన పులి “ఇదిగో మిత్రమా ఆ మనిషిని కిందికి తోసేయ్.. తినేసి వెల్లిపోతాను” అంటుంది.
వెంటనే ఎలుగు “ఇతడు నేను వున్న చెట్టును ఆశ్రయించాడు అంటే నన్ను ఆశ్రయించినట్టే కనుక నేను అతన్ని రక్షిస్తాను కాని కీడు చేయను” అనడంతో పులి నిరాశ చెందుతుంది. అయినా ఆ రోజంతా మనిషి దిగకపోడా అంటూ ఎదురు చూస్తుంది. రాత్రి అవుతుంది. ఎలుగు గాఢ నిద్రలో వుంది. కాని మనిషికి ప్రాణ భయం ఒకటి వుంది కాబట్టి చూసీ చూడనట్టు క్రిందనున్న పులి వైపు చూస్తాడు. పులి మెల్లగా ఇలా అంటుంది “ఇదిగో ఓ మనిషి నీకో గొప్ప అవకాశం. పైన నిద్రలో వున్న ఆ ఎలుగును తోసెయ్ నేను నా ఆకలి తీర్చుకుని ఇక్కడి నుండి వెళ్లిపోతాను” అంటుంది. అంతే మనిషి మారు ఆలోచన చేయకుండా ఎలుగును తోసేస్తాడు. వెంటనే కోలుకుని ఎలుగు వేరొక కొమ్మను ఆనుకుని కింద పడకుండా ఆపుకుంటుంది. అప్పుడు పులి.. ఎలుగుతో ఇలా అంటుంది “చూశావా ఈ మనిషి బుధ్ది ఇప్పటికైనా వాడ్ని తోసెయ్ నేను తినెల్లిపోతాను” అంటుంది.
అప్పుడు ఎలుగు ఇలా అంటుంది “చూడు మిత్రమా.. ఇతడు నన్ను ఆశ్రయించాడు. ఇతడిని రక్షించడం.., అపకారికి కూడా ఉపకారము చేయడమే ధర్మం”  అంటూ అనడంతో ఇక లాభం లేదని పులి అక్కడినుండి వెల్లిపోతుంది.
ఇదీ కధ..
కనుక హనుమా మనకు వీరు అపకారము తలపెట్టారు కదా అని ఇప్పుడు బలహీనులయిన ఈ జాతికి హాని చెయ్యటం అక్కర్లేని పని మరియు అధర్మం కూడాను అనడంతో... అమ్మ మాటలకు ముగ్ధడయిన హనుమ మోకరిల్లి నమస్కరిస్తాడు.
శత్రువులో కూడా శతృత్వాన్ని ఎంతవరకో అంతవరకే చూడాలి కాని ధర్మాన్ని వీడకూడదన్నది అమ్మ మాట. అందుకే అమ్మ మాట ఆచరిద్దాం.


తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

పిల్లల పెంపకం-తల్లిదండ్రుల ఆవశ్యకత


*పిల్లలకు మంచి విలువలు  పెద్దలే నేర్పాలి.
ఒక సాయింత్రం పరమాచార్య స్వామి వారు ఒక పెద్ద సభలో ప్రసంగించవలసి ఉంది. ఆ సభలో రాజాజి లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు. స్వామివారు ఏ విషయం గురించి మాట్లాడాలా అని ఆలోచిస్తూ వేదిక పక్కన నిలబడి ఉన్న ప్రొ. శంకరనారాయణ అయ్యర్ ని పిలిచి ఒక సంస్కృత శ్లోకంలో రెండు పాదాలు చెప్పి, మిగిలిన శ్లోకం ఏమైనా గుర్తున్నదా అని అడిగారు. ఆయన తన అజ్ఞానాన్ని మన్నించమని అడిగి తెలియదని చెప్పి వేదిక దిగి వచ్చేసారు. 

ఈ సంభాషణ అంతా మైక్ ముందు జరగడం వల్ల సభికులందరికి దీని గురించి తెలిసింది.  డా. సి.ఆర్. స్వామినాథన్ కూడా ఆ శ్లోకం పాదాలు విన్నారు. ఆయనకు ఈ శ్లోకం పూర్తిగా వచ్చు కాబట్టి, వెంటనే శంకరనారాయణ అయ్యర్ దగ్గరికి వెళ్ళి మిగిలిన రెండు పాదాలు చెప్పారు. 

అయ్యర్ గారు మరలా వేదికపైకి వెళ్ళి మహాస్వామి వారి ముందు ఆశ్లోకాన్ని చెప్పి,“సభికులలో ఒకరు గుర్తుతెచ్చుకుని నాకు చెప్పారు పెరియవ” అని కూడా చెప్పారు.

మహాస్వామివారు అతని గురించిన వివరాలు కనుక్కొని, డా. స్వామినాథన్ ను వేదిక పైకి పిలిపించి, అతని పేరు, వృత్తి మొదలైన వివరములు అడిగి, “ఎక్కడ చదివావు?” అని అడిగారు.

అతని విద్యా సంబంధమైన విషయములు అడుగుతున్నారు అనుకుని స్వామినాథన్ మద్రాసు ప్రెసిడెన్సి కాలేజిలో అని చెప్పారు. అందుకు స్వామివారు ”అది కాదు. ఈ శ్లోకం ఎక్కడ నేర్చుకున్నావు?” అని అడిగారు.

*తన చిన్నతనంలో తన తాత వద్ద ఈ శ్లోకం నేర్చుకున్నానని* స్వామినాథన్ బదులిచ్చారు. మహాస్వామి వారు స్వామినాథన్ స్వస్థలం, వారి తాతగారి పేరు, వారి కుటుంబ వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నారు. ఈ మొత్తం సంభాషణ అంతా మైకు ముందు జరగడం వల్ల అక్కడున్నవారు మొత్తం విన్నారు. ఆ శ్లోకం ఇదే: 

*అర్థాతురాణాం న గురుర్ న బంధుః* 
*క్షుధాతురాణాం న రుచికి న పక్వం* 
*విద్యాతురాణాం న సుఖం న నిద్ర*
*కామాతురాణాం న భయం న లజ్జ* 

*ధనార్జన చేయువానికి గురువు, బంధువులు అన్నది ఉండదు. ఆకలిగొన్నవాడికి రుచి, పక్వం పట్టింపు ఉండదు. నేర్చుకోవాలి(చదువుకోవాలి) అన్న ధృతి ఉన్నవాడికి నిద్ర, సుఖము తెలియదు. కోరికలతో సతమతమయ్యేవాడికి భయము, సిగ్గు ఉండవు* 

తరువాత పరమాచార్య స్వామివారి అనుగ్రహ భాషణంలో కేనోపనిషత్తు గురించి చెబుతూ, పార్వతీ దేవి గురు స్వరూపిణియై దేవతలకు పరబ్రహ్మం గురించి ఎలా విశదపరచిందో చెప్పారు. ఉపన్యాసం ముగిస్తూ చివర్లో ఇలా అన్నారు. 

”ఉపన్యాసం మొదలుపెట్టక ముందు ఒక వ్యక్తిని వేదికపైకి పిలిచి నేను సగం చెప్పిన ఈ సుభాషితాన్ని ఎక్కడ నేర్చుకున్నావు అని అడిగాను. అతను ఎవరో నాకు తెలుసు. కాని ఎందుకు పిలిచి మరీ అడిగాను అంటే ఇక్కడున్న మీకందరికి తెలియాలి అది *ఏదో పాఠశాలలోనో, కళాశాలలోనో నేర్చుకున్నది కాదు. బాల్యంలో అతని తాత వద్ద నేర్చుకున్నది*. పిల్లలకు మంచి విషయాలు, విలువలు ఇంట్లోని పెద్దల ద్వారానే సమకూరుతాయి తప్ప *ఆధునిక పాఠశాలలోనో, కళాశాలలోనో కాదు”*

*పాఠశాల విద్యార్థులకి చదువుతో పాటు సంస్కారము, విలువలు నేర్పడం పెద్దలు(నాన్నమ్మలు తాతయ్యలు) ఉన్న ఒక ఉమ్మడి కుటుంబం వల్ల మాత్రమే సాధ్యం*. 
*పెద్దలు కూడా వారి విలువైన సమయాన్ని పిల్ల్లకు మంచి విషయాలు మంచి కథలు చెప్తూ గడపవచ్చు.* 
*ఆ వయసులో నేర్చుకున్న విషయాలు వారి జ్ఞాపకాల పొరలలో పదిలంగా ఉండి వారిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి*

తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

తథాస్తు దేవతలు



తధాస్తు దేవతలు సాయం సంధ్యవేళల్లో సంచరిస్తుంటారని ప్రతీతి. చెడుమాటలు లేదా చెడు ఆలోచనలను తరచూ పునరుక్తం చేస్తూంటే ఆ మాటే జరిగిపోతుందట. ఈ తధాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. మనిషి తన ధర్మానికి విరుద్ధంగా అనకూడని మాట పదే పదే అనుకుంటూ ఉంటే దేవతలు వెంటనే తధాస్తు అంటూ ఉంటారు. వీరినే తధాస్తు దేవతలు అంటారు.
ఆలాంటి సమయాలలో స్వసంబంధమైన విషయాలను ఎక్కువ సార్లు అన్నపుడు ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు తధాస్తు అంటూ ఉంటారు. ధనం ఉండి కూడా తరచూ డబ్బు లేదు లేదు అని పలుమార్లు నటిస్తూ ఉంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యం బాగుండి కూడా అనారోగ్యంతో వున్నామని తరచూ అంటూ వుంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. అందువలన తనకున్న స్థితిగతుల గురించి అసత్యాలు, చెడుమాటలు పలుకడం మంచిది కాదు.
ముఖ్యంగా ఇక్కడ మనం ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. చాలా సందర్భాల్లో మనం వైద్యుల దగ్గరికి వెళుతుంటాం. ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి అందరు వైద్యులూ చదువుకున్నది ఒకే శాస్త్రం. మరి ఒక వైద్యుడి హస్తవాసే బాగోవడమేమిటి ? అంటే ఈ హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే అనుకుంటూ ఉండటం, తధాస్తు దేవతలు ఆశీర్వదించడం జరుగుతుంటూంది. దాని ప్రకారమే అతని వద్దకు వచ్చే రోగులకు రోగాలు నయం కావడం, తద్వారా మంచి పేరు రావడం వంటివి చోటు చేసుకుంటుంటాయి.
ఇదే విషయం చెడుకూ వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని అనుకోవడం లేదా మనకు చెడు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తధాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలించడం జరుగుతుంది. తద్వారా మరికొన్ని దుష్పలితాలు చోటుచేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతుంటాయి. అందుకే మంచినే తల్చుకుంటే మనందరికీ మంచే జరుగుతుమది. తధాస్తు దేవతలూ ఆశీర్వదించండి.

తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media