THE STORY OF 3 KIDS:


హాస్పిటల్ లో మామూలుగా మధ్యాహ్నం  2:30 కి ఓపీ కట్టేసి ఇంటికి వెళ్లి అన్నం తిని కాసేపు కునుకు తీసే సమయం..
సీసీ కెమరా లో ముగ్గురు పిల్లలు ఓపిలోకి రావడం చూసాను..వాళ్ళ వయసు ఒక 7-8 సంవత్సరాలు ఉండచ్చు...తల్లి తండ్రులు ఏమన్నా వస్తున్నారేమో అని చూసా..ఎవ్వరూ లేరు..కాసేపటికి ఒక ఆయన వచ్చాడు..టీచర్ అనుకుంటా..వచ్చి గమ్మున వైటింగ్ హాల్లో కూర్చున్నాడు...

ఆ ముగ్గురిలో ఒక్కడు వచ్చి రిసెప్షన్ లో ఓపీ తీస్కోవడం గమనించా...ఒక పిల్లాడు సైలెంట్ గా ఉన్నాడు..వాడి మోచేతికి  గుడ్డ కట్టి ఉంది..

నా టేబుల్‌ మీద ఉన్న బెల్ వేసి పిల్లలని లోపలకి పంపమని చెప్పా.. ముగ్గురు కలిసి లోపలకి వచ్చారు...దెబ్బ తగిలిన కుర్రాడు వచ్చి దైర్యంగా  స్టూల్ మీద కూర్చున్నాడు...వాడి కంటిలో ఒక్క కన్నీటి చుక్క కూడా చూడలా నేను..నేను చేతిని గమనించి కాస్త ముట్టుకుని పరీక్ష చేసే సమయంలో కాస్త నొప్పి అని చెప్పాడు...వెంటనే వాడి పక్కన ఉన్న ఇద్దరు వాడి బుజం మీద చెయ్యి వేసి ..ఏమి కాదులే రా..మేము ఉన్నాం కదా అని చెప్పారు... సరే అని నేను X రే స్లిప్ రాసి ఇచ్చాను..

ఒక 5 నిమిషాల్లో X రే రిపోర్ట్ వచ్చింది ..మోచెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది..టీచర్ ని పిలిచి చెప్పాను..చేతిని రెఢీ చేసి పిండి కట్టు వేయాల్సి ఉంటుంది అని...టీచర్ కన్నా ముందు ఆ ఇద్దరు పిల్లలు జవాబు చెప్పారు...సరే సార్ కట్టేయండి..అని..

కాసేపటికి మా స్టాఫ్ కట్టు రెఢీ చేసి పిలిచారు ..నేను లోపలకి వెళ్ళా.వాడిని అడిగా ఏరా కట్టేయమంటావా  అని..రండి సార్ కట్టేయండి అని..జవాబు ఇచ్చాడు.. కాస్త విరిగిన ఎముకను లాగి సరి చేసి పిండి కట్టు కట్టే సమయం లో కూడా వాడు చిన్న అరుపు కూడా అరవలేదు...వాడిని మామూలుగా అందరూ అడిగే ప్రశ్నే   అడిగాను...పెద్దయక ఏమవుతావు రా అని...?? ఏమో తెలీదు సార్ అన్నాడు...మరి పెద్ద అయ్యాక డబ్బులు కావాలా అన్నా...బ్రతకాలంటే కావాలి కదా అన్నాడు...

ముగ్గురు ఒకరిని ఒకరు పట్టుకొని లోపలికి ఎలా వచ్చారో...అలానే కలిసి వెళ్ళిపోయారు..నవ్వుకుంటూ..

సో నేను ఇప్పుడు ఎందుకు ఈ సోది మొత్తం చెప్తున్నాను...

(1) ఈ మొత్తం కథ లో పిల్లాడు ఎక్కడ అమ్మ నాన్న అని ఎడవలేదు
(2) వాడి మానసిక దైర్యం పీక్స్ లో ఉంది కనుకనే ఎముక విరిగినా కూడా వాడు నొప్పి అని ఏడవలేదు..
(3) వాడితో కలిసి వచ్చిన పిల్లలు ముచ్చటగా ఉన్నారు వీడికి దైర్యం చెప్తూ..ఓదారుస్తూ..

8 సంవత్సరాల వయసులోనే ముగ్గురు పిల్లలు మానసికంగా గెట్టిగా ఉన్నారు..ఎవరి మీద ఆధారపడకుండా...

(4) పెద్ద అయ్యాక ఏమవతావురా  అంటే.ఏమో సార్ తెలీదు అన్నాడు..అంటే వాడు ఈరోజుని ఎంజాయ్ చేస్తున్నాడు రేపటి గురించి ఆలోచించకుండా.

ఇప్పుడు ఈ మొత్తం సీన్ ప్రైవేటు స్కూల్  పిల్లాడు & చదువుకున్న పేరెంట్స్ తో కంపేర్ చేసి చూద్దాం.. ఎలా ఉంటుందో

బోరు మని ఏడుస్తున్న పిల్లాడు అమ్మ ఒళ్ళో కూర్చొంటాడు...కనీసం వాడ్ని.... వాడి చేతిని తాకనివ్వరు....తల్లి కూడా వాడితో పాటూ ఏడుస్తూ ఇంక ముద్దులన్ని వాడికి ఈరోజే పెట్టేయాలన్నట్లు వాడి బుగ్గలు కొరికి పెడుతూ ఉంటుంది...

బయట చూస్తే నాన్న ఏమో స్కూల్ యాజమాన్యం తో పీక్స్ లో రచ్చ గొడవ వేసుకుంటూ ఉంటాడు...

ఇప్పుడు దీనికి డబ్బులు ఎవరు కడతారు..
.నా పిల్లాడు చేతికి గ్యారంటీ ఎవర ఇస్తారు అని.. మా పిల్లాడికి ఏమన్నా అయితే మిమ్మల్ని వదిలి పెట్టను అని..

ఆ గొడవ సర్ధుమనిగాక లోపలకి వచ్చి ఒక 100 క్వశ్చన్ లు వేస్తారు ఒక్కేసారి...

చెప్పండీ Dr ఎంటి ప్రాబ్లం?
మీరు చెయ్యగలుగుతారా లేదా??
బెంగళూర్ కి తీసుకెళ్ళాలా??
మా పిల్లాడు చేతికి గ్యారంటీ ఇస్తారా??

నా నోట్లో నుంచి ఒక్క మాటే వస్తుంది..

X ray తీస్కొని రండి చూద్దాము అని...

ఆ X ray తీసి తెల్ల డబ్బాలో పేట్టి చూసే లోపు దాన్ని ఒక పది మంది చూస్తూ ఉంటారు..ఇంక నేను ఇలా ఫ్రాక్చర్ ఉంది అనగానే ...అయ్యో  ఫ్రాక్చర్ అహ్...లేక క్రాక్ అహ్ అంటారు..

మీరు గారంటీ ఇస్తే చెయ్యండి లేదంటే లేదు అంటారు ఓ పెద్ద మనిషి.. కాస్త ఓపిక కూడగట్టుకొని ..పిండి కట్టుకి రాసిస్తా…

అంత మంది వచ్చినా కూడా ఎవరూ ఆఆ పిండి కట్టు కట్టేదానికి డబ్బులు మాత్రం బయట తియ్యరు...

కట్టు కట్టాలని వెళ్తే వాడు అమ్మ ఒళ్ళో నుంచి ఇంకా కిందకి దిగుండడు...బయట కూర్చోండి అని వాళ్ళకి చెప్తే ..అయ్యయో చిన పిల్లాడు అని స్టార్ట్ చేస్తారు..

అలా ఇలా చేసి కట్టు కట్టేసి నా రూం కి వచ్చి కూర్చుంట....

పిల్లలకు మన ఎమోషనల్ డ్రామాలు ఆపి కాస్త మానసికంగా గెట్టిగా తయారయ్యే పద్దతి ఆలోచించాలి మనం...నీ గారబామే పిల్లలని చేడ్పేస్తుంది.....10 సంవత్సరాలు దాటాక వాడు ఫోన్ పట్టుకుంటాడు...ఇంకా మళ్ళీ మీరే వాడిని తిట్టడం మొదలెడతారు...

పెంపకం అనేది ముఖ్యమే కానీ అది అతి గారాబం తో కాకుండా వీలైనంత తొందరగా పిల్లాడు సొంతంగా

 ఆలోచించే విధంగా ఉండాలి అనేది నా ఆలోచన...


https://www.facebook.com/groups/2058733140940134/permalink/2540997562713687/


తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

No comments: