దేహాన్నీ, మనసునూ ప్రక్షాళన చేసుకొని నిర్మాలత్వాని పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి. వాటిలో దైవీకమైన గొప్ప ప్రక్రియ ఉపవాసం.
ఉపవాసం అంటే తిండి తిప్పలు మానేసి ఆకలితో అలమటించి పోవడం కాదు. ఎదో ఒక కోరికను మనసులోఉంచుకోనో....లేక దేవుడిపై భయంతోనో బలవంతంగా వేసుకొనే శిక్ష కాదు.
ఉప -అంటే సమీపముగా
వాసం- అంటే వశించడం...ఉండటం
ఉపవాసమంటే.....సమీపంగా ఉండటం అని అర్థం. ఎవరికి సమీపంగా ఉండటం?
భగవంతుడికి సమీపంగా ఉండటం.ఆయనకు సమీపంగా ఉండడం అంటే....ఎలా ఉండడం? ఎలా ఉంటే ఆయనకు సమీపంగా ఉన్నట్లు? భగవంతునియొక్క గుణములందు నివసించడమే. అంటే.....భగవత్ గుణాలను పుణికి పుచ్చుకొని....ఆ రోజంతా...దైవత్వంతో గడపడమే ఉపవాసాని కి అర్థం.
ఆకలితో నకనక లాడుతూ....రుసరుసలతో...కోపంతో ఊగిపోతూ....అల్లాడిపోవడం కాదు ఉపవాసమంటే.
శరీరం నిలబడటానికి అవసరమైనంత సాత్విక ఆహారం(పాలు,పళ్ళు) తీసుకుని, భగవన్నామ జపం చెయ్యగలిగేంత ఓపిక పెట్టుకొని...మనసును పూర్తిగా ఆ పరమేశ్వరుని పాదాల చెంత ఉంచేసి...ఆ రోజంతా...భగవంతుని గురించిన తపనతో గడపడమే ఉపవాసం. అలా ఉన్న ఉపవాసానికే ఫలితం ఉంటుంది.
జీవరాసుల పట్ల అవ్యాజమైన కరుణా, ప్రేమలతో....గుండెల్లో పెల్లుబికే సౌజన్యంతో....మధుర భాషిత్వం తో...పవిత్ర మనస్కులై....భగవంతుడు ఎంతటి దివ్యత్వంతో ఉంటాడో...అలా ఉండటానికి చేసే గొప్ప సాధనే ఉపవాస దీక్ష.
తనువు,మనసూ....పరిశుద్ధమయ్యే ఒక గొప్ప పరిపూర్ణ ప్రక్రియ ఉపవాసం.
If you judge people, you have no time to love them.
Spread love everywhere you go. Let no one ever come to you without leaving happier.
Be faithful in small things because it is in them that your strength lies.
Kind words can be short and easy to speak, but their echoes are truly endless.
There are no great things, only small things with great love. Happy are those.
If we have no peace, it is because we have forgotten that we belong to each other.
If you can't feed a hundred people, then feed just one.
I have found the paradox that if I love until it hurts, then there is no hurt, but only more love.
Peace begins with a smile..
Every time you smile at someone, it is an action of love, a gift to that person, a beautiful thing.
Intense love does not measure, it just gives.
The hunger for love is much more difficult to remove than the hunger for bread.
5 of 7
Do not wait for leaders; do it alone, person to person.
Yesterday is gone. Tomorrow has not yet come. We have only today. Let us begin.
Love begins at home, and it is not how much we do... but how much love we put in that action.
Do not wait for leaders; do it alone, person to person.
Yesterday is gone. Tomorrow has not yet come. We have only today. Let us begin.
Love begins at home, and it is not how much we do... but how much love we put in that action.
6 of 7
I'm a little pencil in the hand of a writing God, who is sending a love letter to the world.
Joy is a net of love by which you can catch souls.
We shall never know all the good that a simple smile can do.
I'm a little pencil in the hand of a writing God, who is sending a love letter to the world.
Joy is a net of love by which you can catch souls.
We shall never know all the good that a simple smile can do.
Let us always meet each other with smile, for the smile is the beginning of love.
Being unwanted, unloved, uncared for, forgotten by everybody, I think that is a much greater hunger, a much greater poverty than the person who has nothing to eat.
God doesn't require us to succeed; he only requires that you try.
శరీరం సురూపం తథా వా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యమ్ | మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 1 ||
అందమైన శరీరము , సుందరియగు భార్య , గొప్ప కీర్తి , మేరుపర్వతము(బంగారుకొండ)తో సమానమైన ధనము ఉన్ననూ గురువు యొక్క పాదపద్మములయందు మనస్సు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము?
ఆరు అంగములతో కూడిన వేదములు , శాస్త్రములు , గద్య-పద్యములు , రచించగల కవితాశక్తి ముఖమునందున్ననూ గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము?
విదేశములలో సన్మానము లభించినది , స్వదేశమున కీర్తి ఏర్పడినది , సదాచార సంపన్నుడు నాకంటే వేరొకడు లేడు. అయినా గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము?
నేను చేయు దానముల ప్రభావము వలన కీర్తి ఎల్లెడల వ్యాపించినది. గురువు అనుగ్రహము వలన ప్రపంచమందలి సమస్త వస్తువులు నాచేతికి వచ్చినవి. కానీ మనస్సు గురువు యొక్క పాదపద్మములందు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము?
న భోగే న యోగే న వా వాజిరాజౌ న కాంతాముఖే నైవ విత్తేషు చిత్తమ్ | మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 7 ||
భోగమునందు-యోగమునందు-గుర్రాలు మొదలైన వాటి యందు-స్త్రీలయందు-ధనమునందు కోరిక లేదు. గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము?
అరణ్యే న వా స్వస్య గేహే న కార్యే న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే | మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 8 ||
అరణ్య నివాసమునందు కానీ, స్వగృహనివాసమునందు కానీ, ఏ కార్యమునందు కానీ నా మనస్సు లేదు, అమూల్యమైన దానిని అది కోరుచున్నది. గురువు యొక్క పాదపద్మములందు మనస్సు లగ్నము కానిచో ఏమి ప్రయోజనము?
సన్యాసి-రాజు-బ్రహ్మచారి-గృహస్థుడు వీరిలో ఎవడైననూ ఈ గుర్వష్టకమును పఠించినచో పుణ్యాత్ముడగును. గురువు చేయు ఉపదేశములందు మనస్సు లగ్నము చేయువాడు పరబ్రహ్మరూపమైన వాంఛితార్థమును పొందును.
కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు కృష్ణ భగవానుని సమాధానం.
ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు.
శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్లారు.
అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలు దేరాడు.
భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండి పోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు.
నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు. నకులుడికి ఆశ్చర్యమేసింది. వెనుదిరిగాడు.
ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు.
నలుగురూ కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు.
ఆయన చెప్పనారంభించాడు.
కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు.
కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు.
కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తలిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తారు.
కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్లుగా పతనం అవుతారు. భగవన్నామమనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడ లేరు.
ఒక పర్యాయం విక్రమాదిత్య మహారాజు తన సైనికులతోను, మంత్రితోను కలిసి వేటకై అడవికి వెళ్ళాడు. వేటాడుతూ వేటాడుతూ అడవిలో ఒకరికొకరు దూరమైనారు.
ఒకచోట చెట్టు క్రింద నీడలో అంధుడు, వృద్ధుడు అయిన ఒక సాధువు కూర్చొని ఉండగా చూచి విక్రమాదిత్యుడు *'సాధు మహరాజ్, ఇటువైపుగా ఎవరైనా ఇంతకుముందు వెళ్ళారా!'* అని అడిగాడు.
ఆ అంధ సాధువు ఇలా అన్నాడు: *'మహారాజా! అందరికంటే ముందు మీ సేవకుడు వెళ్ళాడు. అతని వెనుక మీ సేనా నాయకుడొకడు వెళ్ళాడు. సేనానాయకుని తరువాత మీ మంత్రి కూడా ఇంతకుముందే వెళ్ళాడు'*
అంధుడైన ఆ సాధువు చెప్పిన సమాధానం విని విక్రమాదిత్యుడు ఆశ్చర్యంతో, ఆసక్తితో *'మహాత్మా! మీకు నేత్రాలు కనిపించవు కదా! నా సేవకుడు, సేనానాయకుడు, మంత్రి ఇక్కడినుండి ఇప్పుడే వెళ్లినట్లు ఎలా గ్రహించారు? నేను రాజునైనట్లు కూడా ఎలా కనుగొన్నారు?'*
అంధుడైన సాధువు ఇలా చెప్పాడు: *'మహారాజా! నేనా ముగ్గురినీ, మిమ్ములను మీ మాటలు విని కనిపెట్టాను. అందరికంటే ముందు సేవకుడు వచ్చి నాతో, "ఏమిరా, గుడ్డివాడా! ఇటు ఎవరైనా వచ్చారా?" అని అడిగాడు. కొంతసేపటికి సేనానాయకుడు వచ్చి, "సూర్ దాస్, ఇటు ఎవరైనా వెళ్ళారా?"అని అడిగాడు.* చివరకు మీ మంత్రి వచ్చి *'సూర్ దాస్ జీ ఇటు ఎవరైనా వెళ్ళారా?'* అని అడిగారు మీరు వచ్చి *'సాధు మహరాజ్! ఇటు ఎవరైనా బాటసారి వచ్చి వెళ్ళాడా?* అని అడిగారు. *"మహారాజా! ఒక వ్యక్తి యొక్క వాక్కు ద్వారా అతని పదవి, అతని ప్రతిష్ఠ ఏమిటో గుర్తించవచ్చు"*
ఒక సారి *ఉత్తమ బ్రాహ్మణుడైన చాణిక్యుని*దగ్గరకు అతని మిత్రుడు ఒకడు వచ్చి నీకు తెలుసా నీ మిత్రుడు గురించి నేను ఒక విషయం విన్నాను" అని ఎంతో ఉత్సాహంగా ఇంకేదో చెప్పబోతున్న అతన్ని చాణిక్యుడు ఆపి "నీవు నా మిత్రుడు గురించి చెప్పబోయే ముందు ఒక్క నిముషం సావధానంగా నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం దీన్ని నేను "మూడు జల్లెడ్ల పరీక్ష *(Triple Filter Test)"* అంటాను అని అడగటం మొదలు పెట్టాడు.
మొదటి జల్లెడ *"నిజం"* - "నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా ?" అని అడిగాడు.
అందుకు ఆ స్నేహితుడు "లేదు, ఎవరో అంటుండగా విన్నాను" అని అన్నాడు. "అంటే నీవు చెప్పబోయే విషయం నిజమైనదే అని నీకు తెలీదన్న మాట" అని చాణిక్యుడు అన్నాడు.
సరే రెండో జల్లెడ *"మంచి "* - " నీవు నాకు చెప్పబోయే విషయం నా మిత్రుని గురించిన మంచి విషయమా ?" అని అడిగాడు చాణిక్యుడు,
"కాదు" అన్నాడు చాణిక్యుని స్నేహితుడు .
"అంటే నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు, అది కుడా నీకు ఖచ్చితంగా నిజమని తెలీని విషయం- సరే ఇంక మూడో జల్లెడకు వెళదాం"అన్నాడు చాణిక్యుడు.
మూడో జల్లెడ *"ఉపయోగం"* - "నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం నాకు ఉపయోగమైనదా ? " అని చాణిక్యుడు అడిగాడు.
"లేదు" అన్నాడు ఆ మిత్రుడు.
"అయితే నీవు చెప్పబోయే విషయం *నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది* కానపుడు నాకు చెప్పటం ఎందుకు ?" అని అన్నాడు చాణిక్యుడు
నీతి : మన గురించి, మన వాళ్ళ గురించి చెడు వార్తలను, విషయాలను మోసే వాళ్ళు చాలా మంది వుంటారు. ఒక విషయం (చాడి) వినేముందు ఈ మూడు జల్లెడల పద్ధతి అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి, *మంచి పెంపొందుతుంది. చాడీలు నివారించబడతాయి.* *శుభంభూయాత్ః...*🙏🏻
మానవుడు ఆనంద స్వరూపుడు.అందుకే ఏం చేసినా ఆనందం కోసమే చేస్తాడు.తాను ఆనందంగా ఉండగలనని ఎన్నో వస్తువులను సంపాదించడానికి ప్రయత్నిస్తుంటారు.అవి పాడైనపుడో,పోయినపుడో,దూరం అయ్యినపుడో....దుఃఖిస్తూ ఉంటాడు.ఒక కొత్త కారుని కొని దాన్ని చూస్తూ ఏంతో సంతోషిస్తాడు. అది తనకు ఆనందాన్ని ఇస్తూ ఉందని దాన్ని ప్రేమిస్తాడు. బాగా గమనిస్తే ఆ కారు అతనికి ఆనందాన్ని ఇవ్వడంలేదు.....ఆనందం అతని లొనే పుడుతూఉంది.ఆ కారు పాడైపోగానే ఆనందానికి బదులు చికాకూ, బాధా గల్గుతుంది. మొదట్లో ఆనందాన్నీ ఇచ్చిందని భావించిన కారు...పాతది ఐపోగానే ఎందుకు ఆనందాన్ని దూరం చేస్తోంది?ఎందుకంటే....మనిషి ఆనందంకోసం వస్తువులపై ఆధారపడినందుకు.తన ఆనందం వస్తువులనుండీ వస్తూఉందన్న భ్రమ వలన. సృష్టిలో ఆనందం ఉండగల స్థలం నీలోనే మాత్రమే ఉంది.అది బయట ఉండదు. ఎప్పుడైతే ఆ ఆనందం కోసం తనపై తాను ఆధారపడుతాడో అప్పుడే నిత్యా నందం అతని సొంతం అవుతుంది.ఆనందాన్ని తనలోనే ఎప్పుడైతే పొందగల్గడం నేర్చుకొంటాడో అపుడు వస్తువులపై ఆధారపడటం ఆపేస్తాడు.అప్పుడు మాత్రమే షరతులు లేని,అవధులు లేని పూర్ణ ఆనందాన్ని పొందగల్గుతాడు. నీవు ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమిస్తావు....ఎందుకంటే...అది నీకు ఆనందాన్ని ఇస్తుందని అనుకుంటావు...కానీ ఆ వ్యక్తి...నిన్ను కాదని వేరొకరితో వెళ్ళిపోతే ...వెంటనే ఆ వ్యక్తిపై ద్వేషం మొదలౌతుంది.... నీవు ఆనందం కోసం ఇతరులపై ఆధారపడినంత కాలం ....నీలో దుఃఖం,ద్వేషం,అసూయ....పుడుతూనే ఉంటాయి.... ఎప్పుడైతే ఎవరిమీదా,దేనిమీదా ఆధారపడ కుండా నీలోనే ఆనందాన్ని కనుగొంటావో.....ఇక నీవు ఎవరినీ ద్వేషించలేవు....ఏ వస్తువు దూరమైనా ....బాధపడవలసిన అవసరం రాదు. నీలోనే ఆనందాన్ని పొందగల్గితేనే.....నువ్వు ఇతరులను ప్రేమించగలవు.లోకంలో అన్నింటినీ సమానంగా చూడగలవు. ఆనందం నీలోనే ఉంది....నీపై నువ్వు ఆధారపడు.... నిన్ను నీవు ప్రేమించుకో....... తనని తాను పరిపూర్ణాంగా ప్రేమించుకో గలిగిన వాడే.....ఇతరులని ప్రేమించగలాడు.
నీవు ఎవరినైనా ప్రేమించగలగాలంటే....వారినుండి దేనినీ (ఆనందాన్ని) ఆశించకూడదు.
ఇద్దరు వ్యక్తులు రెండు వేరు వేరు ఇళ్ళలో ఉండే వాళ్ళు. ఆ రెండిళ్ళ మధ్య ఒక గోడ మాత్రం ఉండేది. ఒకరు రిటైర్ అయిన పెద్దమనిషి, మరొకరు ఒక యువకుడు.
ఆ ఇద్దరు ఒకే లాంటి మొక్కలు నాటి ఇంటికి ఇరు వైపులా పెంచడం మొదలుపెట్టారు.
ఆ యువకుడు చెట్లకి చాలా నీళ్ళు ఎరువు ఇవ్వసాగాడు. కాని, ఆ పెద్దమనిషి కాస్తంత ఎరువు కొన్ని నీళ్లు ఇచ్చేవాడు.
కొంతకాలానికి ఆ యువకుడు నాటిన మొక్క పచ్చగా ఆకులతో నిండుగా తయారయింది.
ఇక ఆ పెద్దమనిషి నాటిన మొక్క అంత ఎక్కువగా కాక పోయిన బలంగా నిండుగా అయింది.
ఒక రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది.
మర్నాడు ఉదయం ఆ ఇద్దరు వాళ్ళు నాటిన మొక్కల పరిస్థితి ఎలా ఉందా అని చూడడానికి బయటకు వచ్చ్చారు.
ఆ యువకుడు అంత జాగ్రత్తగా పెంచిన చెట్టు వేళ్ళతో పాటు పడిపోయి ఉండడం చూసాడు. కాని ఆ పెద్దమనిషి అంతంత మాత్రంగా చూసిన చెట్టు మాత్రం అలాగే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు.
దాంతో ఆ యువకుడు అలా ఎందుకు జరిగింది అని ఆ పెద్దాయనను ప్రశ్నించాడు.
ఆయన చెప్పిన సమాధానం మనందరికీ ఒక గుణపాఠం కావాలి.
"* చూడు బాబు, నువ్వు ఒక చెట్టుకి ఏమేమి కావాలో అన్నీ అవసారానికి మించి అందించావు. అందువల్ల దాని వేళ్ళు నీళ్ళ కోసమో పోషకవిలువల కోసమో భూమి లోతుల వరకు వెళ్ళవలసిన అవసరం రాలేదు. నేను చెట్టు బ్రతకడానికి మాత్రం సరిపడే నీళ్ళు ఎరువు ఇఛ్చినందువల్ల ఇతర పోషకాల కోసం అది తన వేళ్ళను భూమి లోతుల వరకు పరిచింది.
నీ వేళ్ళు పైపైన మాత్రమే ఉండడంవల్ల గాలికి తట్టుకుని భూమిలోపల నిలదొక్కుకోలేకపోయాయి.
నా వేళ్ళు భూమి లోతుల వరకు పాకి ఉండటంవల్ల ప్రకృతి విసిరిన సవాలును తట్టుకుని చెట్టు అలాగే నిలబడగలిగింది.*"
ఈ విషయం మనం పెంచే చెట్ల విషయంలోనే కాదు మనం కని పెంచే పిల్లలకు కూడా వర్తిస్తుంది అని అందరం గమనించాలి.
🌳🌲🌴.......Parents should not give everything to their children. ...let them spread their roots and become stronger to fight with any situation in their life
సముద్రంలో 🌊 పెద్ద తుఫాన్ 🌪 ! ఓడ ⛴ బద్దలయిపోయింది ... ఇద్దరే ఇద్దరు 👬 బ్రతికి ఒడ్డుకు చేరారు ... అదొక దీవి 🏝 ఎడారిలా ఉంది. ఏమి చెయ్యాలో తోచ లేదు వారి ఇద్దరికీ.
భగవంతుడిని 🕉🛐 ప్రార్ధన చెయ్యడం తప్ప ఏమీ చెయ్యడానికి లేదు అనుకున్నారు ఇద్దరూ.అయితే వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరి ప్రార్ధనలు 🛐 ఫలిస్తాయో తెలుసుకోవాలంటే ఆ దీవిని రెండు భాగాలు చేసి ఒకరు ఒక వైపు రెండో వారు రెండో వైపు ఉండాలని నిర్ణయించుకున్నారు.
మొదటివాడు రాము. రెండో వాడు సోము. ఆ రోజు రాము భగవంతుడా నాకు ఆహారాన్ని 🌮🍟🌭 ఇయ్యి అని వేడుకున్నాడు. మర్నాడు ఉదయం అతడు చూస్తే అతడికి ఒక అరటిచెట్టు 🍌 మగ్గిన పళ్ళతో కనిపించింది. పాపం సోముకి ఏమీ కనిపించలేదు ...ఇలా ఒక వారం ⏳🕰⌛ గడిచింది.
రాముకి ఒంటరితనం చికాకు అనిపించి నాకు ఒక భార్యను 💃 ఇవ్వు అని దేముడిని ప్రార్ధించాడు. మర్నాడు ఒక ఓడ తమ ఓడలాగే బద్దలయ్యి ఒకే ఒక్క అమ్మాయి 💃 ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చింది. ఇద్దరూ హాయిగా కాపురం చేసుకుంటూ ఉన్నారు. పాపం సోము పరిస్థితి అలాగే ఉంది.
రామూ ఒక ఇల్లు 🏡, బట్టలు 👕👖👗, ఇంకా ఆహారం 🍒🍍🍔🌽🍕🍪 ఇమ్మని దేముడిని ప్రార్దిస్తూనే ఉన్నాడు. దేముడు అడిగిన వన్నీ రామూకు సమకూరుస్తూనే ఉన్నాడు. పాపం సోముకు ఏమీ లేదు
ఆఖరుగా రాము దేముడా నేనూ నా భార్య మా ఊరు వెళ్ళడానికి ఒక ఓడ ⛵ పంపించవా అని ప్రార్ధించాడు. ఆశ్చర్యం ఓడ మర్నాడు వచ్చింది. సోమూ ప్రార్ధన ఒక్కటీ దేముడు వినలేదు కనుక సోమూని తీసుకు వెళ్ళడం అనవసరం అనుకున్నాడు రాము. అవును వాళ్ళిద్దరూ 👫 బయలుదేరారు. సామాను సర్దుకుని ఓడ ఎక్కుతున్నారు ...
ఆకాశం లోనుండి దేముడు అడిగాడు ... సోమూని తీసుకు వెళ్ళవా? అతడిని అలాగే వదిలేస్తున్నావేమి? రాము " నాకు నువ్వు ఇచ్చిన ఆశీస్సులు నావే కదా ! అతడి ప్రార్ధనలు నువ్వు వినలేదు కనుక అతడిని నేను తీసుకు వెళ్ళడం లేదు " అన్నాడు
" అక్కడే నువ్వు తప్పు చేశావు . అతడు ఒకే ఒక్క ప్రార్ధన చేశాడు . అతడి ప్రార్ధన వినే నేను నీకు ఇవన్నీ ఇచ్చాను. అతడు " నా స్నేహితుని ప్రార్ధనలు ఫలించాలి అలా చెయ్యి దేముడా ! " అని ప్రార్ధించాడు ... అందుకే నీకు ఇవన్నీ సమకూరాయి " అన్నాడు దేముడు.
మనకు లభించేవి అన్నీ మన ప్రార్ధనల వలన మాత్రమె మనకు లభించడం లేదు ... మన స్నేహితుల, సన్నిహితుల, సహృదయుల ప్రార్ధనల, దీవెనల వలన మనం దేముని దయను పొందుతున్నాం ... మన ఆత్మీయుల కోసం కూడా మనం ప్రార్ధిద్దాం ... All is well అందరూ బాగుండాలి అందులో మనముండాలి.
ఇద్దరబ్బాయిలు. ఒకడు పదేళ్ల వాడు. ఇంకొకడు ఆరేళ్ల వాడు. ఊరి బయట పొలం దగ్గర పరుగులు పెట్టి అడుకుంటున్నారు. చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు. పెద్దోడు వాడికందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు. ముందు పెద్ద బావి ఉంది. పెద్దోడు చూసుకోలేదు. అందులో పడిపోయాడు. వాడికి ఈత రాదు. బావి చాలా లోతు. చుట్టుపక్కల ఎవరూ లేదు. అరిచినా సాయానికి వచ్చేందుకు నరప్రాణి లేదు. చిన్నోడికి ఒక తాడు కట్టిన బొక్కెన కనిపించింది. తాడును పట్టుకుని బొక్కెనను బావిలోకి విసిరాడు. "అన్నా... దీన్ని పట్టుకో" అన్నాడు. నీట మునిగి తేలుతూ కేకలేస్తున్న పెద్దవాడు తాడును పట్టుకున్నాడు. చిన్నోడు తన శక్తినంతా కూడగట్టుకుని తాడును పైకి లాగడం మొదలు పెట్టాడు. "అన్నా ... భయపడకు... జాగ్రత్తగా పట్టుకో... పడిపోకుండా చూసుకో" అని అరిచాడు. తాడు చివరను ఒక చెట్టుకి కట్టాడు. నెమ్మదిగా లాగుతూనే ఉన్నాడు. ఒక అరగంట పెనుగులాడిన తరువాత పెద్దోడు సురక్షితంగా బయటకి వచ్చాడు. ఆ తరువాత పెద్దోడు చిన్నోడు ఊళ్లోకి పరుగెత్తారు. ఊళ్లో వాళ్లకి జరిగింది చెప్పారు. చిన్నోడు పెద్దోడిని ఎలా కాపాడాడో చెప్పారు. ఊళ్లో ఎవరూ నమ్మలేదు. ఆరేళ్ల వాడేమిటి, పదేళ్ల వాడిని లాగడమేమిటి? అందునా బావి నుంచి లాగడమేమిటి? అసాధ్యం. వాడు చేయలేడని అన్నారు. ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు. సంగతి ఆ నోటా ఈ నోటా పాకింది. దేవాలయం ముసలి పూజారిగారికి విషయం తెలిసింది. "మీరు నమ్ముతారా పూజారి గారూ" "నమ్ముతాను" "ఎలా?" "చిన్నోడు లాగి పెద్దోడిని బావి నుంచి బయటకి తీసి రక్షించాడు." "అదెలా సాధ్యం. అంత చిన్నోడు ఎలా చేయగలడు?" "తనకి అంత బలం లేదన్న సంగతి, వాడు పెద్దోడిని బావినుంచి లాగలేడన్న సంగతి చిన్నోడికి తెలియదు. ఒరేయ్... నీకంత బలం లేదురా... నువ్వు చేయలేవురా... అది నీవల్ల సాధ్యం కాదురా...అని చెప్పేవారెవరూ ఆ పరిసరాల్లో లేరు. కాబట్టి వాడు చేయగలిగాడు. నీవల్ల కాదని చెప్పే వాళ్లుంటే వాడు ప్రయత్నించేవాడే కాదు. ఏడుస్తూ ఊళ్లోకి పరిగెత్తుకు వచ్చేవాడు. మనం బావి దగ్గరికి వెళ్లే సరికి పెద్దోడు శవమై తేలి ఉండేవాడు. " ప్రశ్నవేసిన వాడు మాట్లాడలేకపోయాడు. "నీవల్ల కాదు అని చెప్పేవాడు లేకుంటే మనిషి ఎంత పనైనా చేస్తాడు. అది బావైనా, బతుకైనా అంతే..." అన్నాడు పూజారిగారు. Arise! Awake! and stop not until the goal is reached. -- Swami Vivekananda
ఒక అడవిలోని మర్రిచెట్టుపై రెండు చిలుక పిల్లలు నివసిస్తుండేవి. ఒక బోయవాడు వలపన్ని ఆ రెండు పిల్లలను పట్టుకుని, గోదావరీ తీరంలో ఉండే ఒక సాధువుకి, రెండోదాన్ని ఒక వ్యాపారికి అమ్మివేశాడు. సాధువు కొనుక్కున్న చిలుక పిల్లకు "రామయ్య" అనీ, వ్యాపారి కొనుక్కున్న పిల్లకు "శీనయ్య" అనే పేర్లను పెట్టి, వాటిని పంజరాల్లో పెట్టి పెంచుకోసాగారు.
సాధువు వద్ద పెరుగుతున్న చిలుక మంచి మాటలను, గొప్ప సంస్కారాన్ని అలవర్చుకుంది. సాత్వికమైన ఆహారాన్ని తింటూ, అతిథులను గౌరవించే పద్ధతులను గమనించి, మంచి స్వభావాన్ని నేర్చుకుంది. క్రమంగా అది ఇంటికి వచ్చిన వారినందరినీ మంచి మాటలతో గౌరవిస్తూ సంతోషపరిచేది.
వ్యాపారి పెంచుకుంటున్న చిలుక... ఆ ఇంట్లోవారు మాట్లాడే చెడ్డమాటలను వినడం, హింసతో కూడిన పనులను చూడటం వల్ల రోజురోజుకీ చెడ్డ అలవాట్లకు లోనయ్యింది. వ్యాపారి ఇంటికి వచ్చే వారందరితోనూ అది పరుషంగా మాట్లాడుతూ.. ఇతరులు సహించలేని పనులు చేస్తూ ఉండేది.
ఇలా కొంతకాలం గడిచాక ఈ రెండు చిలుకలూ అదృష్టవశాత్తూ పంజరంలోంచి తప్పించుకుని బయటపడ్డాయి. అలా బయటపడ్డ చిలుకల్లో రామయ్య మామిడిచెట్టుమీదకు, శీనయ్య మర్రిచెట్టు మీదకు వెళ్లి గూడు కట్టుకుని అక్కడే జీవించసాగాయి.
ఒకరోజు మర్రిచెట్టు ఉన్న దార్లో వెళుతున్న బ్రాహ్మణుడొకడు అలసిపోయి, ఆ చెట్టుకింద విశ్రాంతి తీసుకునేందుకు అక్కడ ఆగాడు. ఇంతలో శీనయ్య పేరుతో ఉండే చిలుక వెంటనే తన పక్కనే ఉంటున్నవారందరితో.. "ఎవరో మనిషి ఇక్కడికి వచ్చినట్లు ఉన్నాడు. రండి వాడి శరీరాన్ని పొడిచి, పొడిచి హింసిద్దాం" అని పిలిచింది.
అదంతా విన్న బ్రాహ్మణుడు పారిపోయి, పక్కనే రామయ్య నివసిస్తున్న మామిడి చెట్టు కిందకు వెళ్ళి నిల్చున్నాడు. ఇంతలో బ్రాహ్మణుడిని గమనించిన చిలుక... "ఎవరో అతిథి ఎండవేడికి తాళలేక అలసిపోయి మన చెట్టుకింద విశ్రాంతి తీసుకునేందుకు వచ్చాడు. స్వాగతం పలికి, పండ్లను తుంచి ఆయనకు ఆహారంగా పెట్టండి, తరువాత ఆయనకు సేవ చేసి తరించండి" అని తోటి పక్షులకు చెప్పింది.
ఈ కథలోని నీతి ఏంటంటే:- ఒకే తల్లికి పుట్టిన రెండు పిల్లల ప్రవర్తన వారు పెరిగిన పరిసరాలతో సంబంధం ఉంటుంది. కాబట్టి, చిన్నతనంలో ఎవరైతే మంచివారి స్నేహం, సత్ప్రవర్తన, నీతి నియమాలను అలవాటు చేసుకుంటారో అలాంటి పిల్లలు పెద్దయ్యాక మంచి సంభాషణ, మంచి బుద్ధి, మంచి ఆలోచనలు, మంచి నడవడిక, సద్గుణాలను కలిగి ఉంటారు. కాబట్టి, చిన్నప్పటి నుంచి పిల్లలను సక్రమమైన మార్గంలో పెంచడం ఉత్తమం.