ఉపవాసం అంటే....(Fasting)
🌺🌺🌺🌺🌺
దేహాన్నీ, మనసునూ ప్రక్షాళన చేసుకొని నిర్మాలత్వాని పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి. వాటిలో దైవీకమైన గొప్ప ప్రక్రియ ఉపవాసం.
ఉపవాసం అంటే తిండి తిప్పలు మానేసి ఆకలితో అలమటించి పోవడం కాదు. ఎదో ఒక కోరికను మనసులోఉంచుకోనో....లేక దేవుడిపై భయంతోనో బలవంతంగా వేసుకొనే శిక్ష కాదు.
ఉప -అంటే సమీపముగా
వాసం- అంటే వశించడం...ఉండటం
ఉపవాసమంటే.....సమీపంగా ఉండటం అని అర్థం. ఎవరికి సమీపంగా ఉండటం?
భగవంతుడికి సమీపంగా ఉండటం.ఆయనకు సమీపంగా ఉండడం అంటే....ఎలా ఉండడం? ఎలా ఉంటే ఆయనకు సమీపంగా ఉన్నట్లు? భగవంతునియొక్క గుణములందు నివసించడమే. అంటే.....భగవత్ గుణాలను పుణికి పుచ్చుకొని....ఆ రోజంతా...దైవత్వంతో గడపడమే ఉపవాసాని కి అర్థం.
ఆకలితో నకనక లాడుతూ....రుసరుసలతో...కోపంతో ఊగిపోతూ....అల్లాడిపోవడం కాదు ఉపవాసమంటే.
శరీరం నిలబడటానికి అవసరమైనంత సాత్విక ఆహారం(పాలు,పళ్ళు) తీసుకుని, భగవన్నామ జపం చెయ్యగలిగేంత ఓపిక పెట్టుకొని...మనసును పూర్తిగా ఆ పరమేశ్వరుని పాదాల చెంత ఉంచేసి...ఆ రోజంతా...భగవంతుని గురించిన తపనతో గడపడమే ఉపవాసం. అలా ఉన్న ఉపవాసానికే ఫలితం ఉంటుంది.
జీవరాసుల పట్ల అవ్యాజమైన కరుణా, ప్రేమలతో....గుండెల్లో పెల్లుబికే సౌజన్యంతో....మధుర భాషిత్వం తో...పవిత్ర మనస్కులై....భగవంతుడు ఎంతటి దివ్యత్వంతో ఉంటాడో...అలా ఉండటానికి చేసే గొప్ప సాధనే ఉపవాస దీక్ష.
తనువు,మనసూ....పరిశుద్ధమయ్యే ఒక గొప్ప పరిపూర్ణ ప్రక్రియ ఉపవాసం.
సాగర్.
మహర్షి సత్సంగ్.
సేకరణ : Social Media

No comments:
Post a Comment