Pages

🐥 *ఉపయోగకరమైన కథలు*🐥-6

మానవుడు ఆనంద స్వరూపుడు.అందుకే ఏం చేసినా ఆనందం కోసమే చేస్తాడు.తాను ఆనందంగా ఉండగలనని ఎన్నో వస్తువులను సంపాదించడానికి ప్రయత్నిస్తుంటారు.అవి పాడైనపుడో,పోయినపుడో,దూరం అయ్యినపుడో....దుఃఖిస్తూ ఉంటాడు.ఒక కొత్త కారుని కొని దాన్ని చూస్తూ ఏంతో సంతోషిస్తాడు. అది తనకు ఆనందాన్ని ఇస్తూ ఉందని దాన్ని ప్రేమిస్తాడు. బాగా గమనిస్తే ఆ కారు అతనికి ఆనందాన్ని ఇవ్వడంలేదు.....ఆనందం అతని లొనే పుడుతూఉంది.ఆ కారు పాడైపోగానే ఆనందానికి బదులు చికాకూ, బాధా గల్గుతుంది.
మొదట్లో ఆనందాన్నీ ఇచ్చిందని భావించిన కారు...పాతది ఐపోగానే ఎందుకు ఆనందాన్ని దూరం చేస్తోంది?ఎందుకంటే....మనిషి ఆనందంకోసం వస్తువులపై ఆధారపడినందుకు.తన ఆనందం వస్తువులనుండీ వస్తూఉందన్న భ్రమ వలన. సృష్టిలో ఆనందం ఉండగల స్థలం నీలోనే మాత్రమే ఉంది.అది బయట ఉండదు. ఎప్పుడైతే ఆ ఆనందం కోసం తనపై తాను ఆధారపడుతాడో అప్పుడే నిత్యా నందం అతని సొంతం అవుతుంది.ఆనందాన్ని తనలోనే ఎప్పుడైతే పొందగల్గడం నేర్చుకొంటాడో అపుడు వస్తువులపై ఆధారపడటం ఆపేస్తాడు.అప్పుడు మాత్రమే షరతులు లేని,అవధులు లేని పూర్ణ ఆనందాన్ని పొందగల్గుతాడు.
నీవు ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమిస్తావు....ఎందుకంటే...అది నీకు ఆనందాన్ని ఇస్తుందని అనుకుంటావు...కానీ ఆ వ్యక్తి...నిన్ను కాదని వేరొకరితో వెళ్ళిపోతే ...వెంటనే ఆ వ్యక్తిపై ద్వేషం మొదలౌతుంది....
నీవు ఆనందం కోసం ఇతరులపై ఆధారపడినంత కాలం ....నీలో దుఃఖం,ద్వేషం,అసూయ....పుడుతూనే ఉంటాయి.... ఎప్పుడైతే ఎవరిమీదా,దేనిమీదా ఆధారపడ కుండా నీలోనే ఆనందాన్ని కనుగొంటావో.....ఇక నీవు ఎవరినీ ద్వేషించలేవు....ఏ వస్తువు దూరమైనా ....బాధపడవలసిన అవసరం రాదు.
నీలోనే ఆనందాన్ని పొందగల్గితేనే.....నువ్వు ఇతరులను ప్రేమించగలవు.లోకంలో అన్నింటినీ సమానంగా చూడగలవు.
ఆనందం నీలోనే ఉంది....నీపై నువ్వు ఆధారపడు.... నిన్ను నీవు ప్రేమించుకో.......
తనని తాను పరిపూర్ణాంగా ప్రేమించుకో గలిగిన వాడే.....ఇతరులని ప్రేమించగలాడు.

నీవు ఎవరినైనా ప్రేమించగలగాలంటే....వారినుండి దేనినీ (ఆనందాన్ని) ఆశించకూడదు.



తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

No comments:

Post a Comment