Pages

దేవుని లీల



వీధులు ఊడ్చేవాడికి పని చేసి చేసి విసుగొచ్చింది. దేవుడితో మొరపెట్టుకున్నాడు.
"రోజూ హాయిగా పూజలందుకుంటూ ఉంటావు నా బతుకు చూడు ఎంత కష్టమో? ఒక్కరోజు...ఒక్కటంటే ఒక్కరోజు నా పనిని నువ్వు చెయ్యి నీ పనిని నేను చేస్తా"  అని సవాలు విసిరాడు. దేవుడు వినీ వినీ సరేనన్నాడు.                           "అయితే ఒక్క షరతు నువ్వు ఎవరేమన్నా నువ్వుమాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదు నోరు మెదప కూడదు" అన్నాడు దేవుడు.
"సరే" అన్నాడు మనోడు తెల్లారికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు. కాసేపటికి ఓ ధనిక భక్తుడు వచ్చాడు.
"దేవా నా కొత్త బిజినెస్ మొదలుపెడుతున్నాను ఇబ్బడి ముబ్బడిగా లాభాల వర్షం కురిపించు" అంటూ ముందుకు వంగి దణ్ణం పెట్టాడు. ముందు జేబులోని పర్సు కింద పడిపోయింది అతను చూడకుండా వెళ్లిపోయాడు.
మనోడు "ఒరేయ్.. పర్సు వదిలేశావు చూసుకోరా" అందామనుకున్నాడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకు తెచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు. ఇంకాస్సేపటికి ఓ పేదవాడు వచ్చాడు.
"దేవా...నా దగ్గర ఒక్కరూపాయి మాత్రమే ఉంది. అది నీకు సమర్పించుకుంటున్నాను. దయచూడు తండ్రీ" అంటూ మోకరిల్లాడు. కళ్లు తెరిచేసరికి డబ్బులతో నిండిన పర్సు కనిపించింది. "ఇలా దయ చూపించావా తండ్రీ" అని ఆ పర్సును తీసుకుని వెళ్లిపోయాడు.
"ఒరేయ్ దొంగా" అని అరుద్దామనుకున్నాడు మనోడు. కానీ దేవుడు చెప్పింది గుర్తుకొచ్చి ఎలాగోలా తమాయించు కున్నాడు. ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు.
"దేవా రేపు సముద్ర ప్రయాణం ఉంది నన్ను చల్లగా కాపాడు స్వామీ" అన్నాడు. అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు. "నా తరువాత వచ్చింది ఇతడే కాబట్టి ఇతడే నా పర్సును దొంగిలించి ఉంటాడు పట్టుకొండి" అన్నాడు.
పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ అన్యాయాన్ని చూసి మనోడు ఉండబట్టలేకపోయాడు.
"ఆగండ్రా...ఇతను నిర్దోషి. అసలు దొంగ ఇంకొకడు వాడు పర్సును తీసుకెళ్లాడు" అని అరిచేశాడు. దేవుడే చెబుతుంటే ఇంకా సాక్ష్యాలెందుకని నావికుడిని వదిలేసి పేదోడిని పట్టుకుని వెళ్లిపోయారు పోలీసులు. సాయంత్రానికి వీధులు ఉడ్చే వాడు దేవుడి డ్యూటీ నుంచి దిగేశాడు. దేవుడు వీధులు ఉడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు.
"దేవా... ఇవాళ్ల ఎంత మంచిపని చేశానో తెలుసా...నేను ఒక నిర్దోషిని అరెస్టు కాకుండా కాపాడాను. ఒక దోషిని అరెస్టు చేయించాను" అన్నాడు మనోడు.
దేవుడు "ఎంతపని చేశావోయ్. నిన్ను అసలు స్పందించొద్దన్నానా...ఎందుకలా చేశావు" అన్నాడు నిష్ఠూరంగా.
"అదేమిటి? నువ్వు నన్ను మెచ్చుకుంటావనుకున్నాను" అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా.
"ధనవంతుడు మహాపాపాత్ముడు వాడు అందరినీ దోచుకుంటాడు. వాడి డబ్బు కొంత పేదోడికి అందితే వాడికి కొంచమైనా పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను. పేదోడికి కష్టాలు తీరేవి. వాడు కొన్నాళ్లైనా ఆకలి దప్పులు లేకుండా ఉండేవాడు. ఇక నావికుడు తెల్లారితే సముద్రయానం చేయబోతున్నాడు. దారిలో పెనుతుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు. వీడు అరెస్టై జైల్లో ఉంటే బతికిపోయేవాడు. ఇప్పుడు చూడు...పేదోడు జైల్లో ఉన్నాడు. ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు. నావికుడు చావబోతున్నాడు. ఎంత పని చేశావు నువ్వు” అన్నాడు దేవుడు.
దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవరికీ తెలియదు.  కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు. తప్పులా కనిపించేంది నిజానికి ఒప్పై ఉండచ్చు. ఆయన ఆలోచనల లోతు, అవగాహన ఎత్తు అందుకోవడం ఎవరికీ సాధ్యం?



తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

వెంట వచ్చేది

వెంట వచ్చేది ?!

పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తుండేవారు. అటువంటి ఊళ్లో ఒకనాడు ఒక సాధుపుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగుమీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు. "ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి" అని తలచి, స్వామి! ఈ ఇంటి యజమాని వూళ్లో లేడు. మీరింక వెళ్లవచ్చును అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది. 'అలాగా! పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే! ప్రాప్తం లేదన్నమాట! అంటూ వెనుదిరిగాడు. అపుడతను పరుగున వెళ్లి సన్యాసితో 'స్వామి! నేనే ఈ ఇంటి యజమానిని. నన్ను క్షమించండి. లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి' అని ప్రార్థించాడు.

లోపలికి తీసుకొని వెళ్లాక ఆ సన్యాసి అతనికి ధర్మసూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని 'స్వామి! నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు.

అపుడా సన్యాసి యజమానితో ఇలా అన్నాడు. 'నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది'
ఇదేనా ఆ గొప్ప ఉపకారం? అన్నాడు ధనికుడు అసహనంగా. సన్యాసి అతనికొక సూది ఇచ్చి 'ఇది చాలా మహిమగల సూది. దీనిని నీ దగ్గర భద్రంగా దాచి, నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు.

ధనికునికి కోపం తారాస్ధాయినంటింది. 'నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను' అని అరిచాడు.

ఆ సాధుపుంగవుడు శాంతంగా 'నాయనా! మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేనివాడివి ఈ లక్షలు, కోట్లు తీసుకొని పోగలవా? అని ప్రశ్నించాడు. ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. ఆసన్యాసి కాళ్లపై బడి 'స్వామీ! ఇప్పటి వరకూ అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేసాను! ఇప్పటి నుండి దానధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను' అన్నాడు.

ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసికొనండొహో!! అని. ఇంకేం? బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టికెళ్లినవారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు. ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవయ్యేసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు.

గుమాస్తా చదవడం ప్రారంభించాడు.
1వ వాడు: ఇంకో 20 నాణాలిస్తే వీడిసొమ్మేం పోయింది? పిసినారి పీనుగ!
2వ వాడు: ఇంకో పదినాణాలు వేస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యంరాదు. ఆ పదీ కూడా ఇవ్వచ్చు కదా.
3వవాడు: అయ్యో! దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగ కొందును కదా?
అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు.. అని సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు. స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది.. అంటూ వాపోయారు.

సాధువతనిని ఓదార్చి 'బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు' అని బోధించాడు.

ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్లీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు.
1వ వాడు: అన్నదాతా సుఖీభవ!
2వ వాడు: ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి.
3వ వాడు: అమ్మయ్య ! ఆకలి చల్లారింది. అయ్యగారు ఆరి బిడ్డలు, అందర్నీ దేవుడు చల్లగా చూడాలి.

దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు. కోట్లు సంపాదించినపుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో  అతడు గుర్తించాడు. ఆరోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి , పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు తరించాడు.


నీతి:- జీవుని వెంట వచ్చేది తాను చేసిన కర్మయే.
పుణ్యం వలన సుఖము,
పాపము వలన దుఃఖము,
జ్ఞానము వలన మోక్షము
కనుక జీవుడు పుణ్యకర్మల ద్వారా పాపకర్మలను నిర్మూలించి , చిత్తమును శుద్ధము చేసుకొని , ధ్యానాదిసాధన ద్వారా మోక్షరూప పరమశాంతిని, శాశ్వతఆనందమును పొందవలసియున్నది.



తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

భజగోవింద శ్లోకాలు తాత్పర్యసహితముగా

*భజగోవిందం సాహిత్యం...*

భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే 
నహి నహి రక్షతి డుకృణ్ కరణే ||1||


భావం: భజించు గోవిందుడిని భజించు గోవిందుడిని... ఓ బుద్ధిహీనుడా గోవిందుడినే భజించు. మరణసమయం ఆసన్నమైనప్పుడు ఈ (డుకృణ్ కరణే లాంటి ) వ్యాకరణ  సూత్రాలు నిన్ను రక్షించవు గాక రక్షించవు. 



మూఢ జహీహి ధనాగమతృష్ణాం

కురు సద్బుద్ధిం మనసివితృష్ణాం

యల్లభసే నిజకర్మోపాత్తం

విత్తం  తేన వినోదయ చిత్తం ||2||


భావం: ఓ మూర్ఖుడా! ధనసంపాదన ఆశ విడిచిపెట్టు. మనసులో ఆశలు పెంచుకోకుండా మంచి ఆలోచనలు కలిగి ఉండు. నీ కర్తవ్య కర్మల ద్వారా ఎంత ధనాన్ని సంపాదిస్తావో దానితో సంతోషంగా ఉండు. 



నారీస్తనభర నాభీదేశం

దృష్ట్వా  మాగామోహావేశం

ఏతన్మామ్సావసాది వికారం

మనసి విచింతయ వారం వారం ||3||


భావం: స్త్రీల వక్షోజ సౌందర్యాన్ని చూచి మోహావేశం చెందవద్దు. అవి నిజంగా మాంసం, కొవ్వు మొదలైన అసహ్యకర పదార్థములతో కూడినవని నీ మనస్సులో మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తూ ఉండు.



నళినీ దళగత జలమతి తరళం

తద్వజ్జీవితమతిశయచపలం 

విద్ధి వ్యాద్యభిమానగ్రస్తం

లోకం శోకహతం చ సమస్తం ||4||


భావం: తామరాకు మీద నీటిబొట్టు ఎంత చెంచలమైనదో ఈ మానవ జీవితం కూడా అంత అస్థిరమైనది, అల్పమైనది. అంతేకాదు ఈ మానవ జీవితం అంతా రోగాలతోనూ 'నాది' అన్న మమకారంతోనూ కూడుకున్నట్టిదై సమస్త దుఃఖాలకు ఆలవాలమైందని తెలుసుకో.



యావద్విత్తోపార్జన సక్తః

తావన్నిజ పరివారో రక్తః

పశ్చాజీవతి జర్జర దేహే

వార్తాం కోపి న పృచ్చతి గేహే ||5||


భావం: ఎంతవరకు ధన సంపాదన చెయ్యగలుగుతారో అంతవరకే తనవారంతా ప్రేమగా ఉంటారు. దేహం కాస్త సడలిపోయి, ఏ పని చేయగల శక్తి లేనివారైతే ఇక ఇంటిలో ఎవరూ పట్టించుకోరు. కుశల ప్రశ్నలు కూడా వేయరు.



యావత్పవనో నివసతి దేహే

తావత్పృచ్చతి కుశలం గేహే

గతవతి వాయౌ దేహాపాయే

భార్యా బిభ్యతి తస్మిన్కాయే ||6||


భావం: ఎంతవరకైతే ఈ దేహం లో ప్రాణం ఉంటుందో  అంతవరకే ఇంట్లోనివారు క్షేమాన్ని అడుగుతారు. శరీరానికి అపాయం కలిగి ప్రాణం పోతే ఆకాయాన్ని  చూసి భార్య కూడా భయపడుతుంది.




బాలస్తావత్క్రీడాసక్త

తరుణస్తావత్తరుణీసక్తః |

వృద్ధస్తావాచ్చింతాసక్తః

పరే బ్రహ్మణి కో పి నసక్తః ||7||


భావం: మానవుడు - బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు, యౌవనం లో స్త్రీల  పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతుంటాడు. కానీ ఆ పరమాత్మ యందు ఆసక్తిని చూపే వారెవరూ లేరు కదా!!!




కా తే కాంతా కస్తే పుత్రః

సంసారో యమతీవ విచిత్రః |

కస్య త్వం కః కుత ఆయాతః

తత్వం చింతయ తదిహ భ్రాతః ||8||


భావం: నీ భార్య ఎవరు? నీ కుమారుడు ఎవరు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నీవు ఎవరు? ఎవరికి చెందినవాడవు? ఎక్కడ నుంచి వచ్చావు? ఓ సోదరా! ఆ తత్వాన్ని ఇక్కడే - ఈ దేహం లో ఉండగానే ఆలోచన చేయి.




సత్సంగత్వే నిస్సంగత్వం

నిస్సంగత్వే నిర్మోహత్వం |

నిర్మోహత్వే నిశ్చలతత్వం

నిశ్చలతత్వే జీవన్ముక్తి: ||9||


భావం: సత్పురుషులతో సాంగత్యం  చేయడం వల్ల  ఈ ప్రాపంచిక విషయాల మీద సంగభావం తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది. మోహం పోతే మనసు భగవంతుడి మీద చలించకుండా నిలిచిపోతుంది. అప్పుడు సకల కర్మ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం, జీవన్ముక్తి.



వయసి గతే కః కామవికారః

శుష్కే నీరే కః కాసారః |

క్షీణే విత్తే కః పరివారః

జ్ఞాతే తత్వే కః సంసారః ||10||


భావం: వయస్సు మళ్ళిపోతే కామవికారాలుండవు.  నీరంతా ఇంకిపోయిన తర్వాత సరస్సు ఉండదు. డబ్బు పోయిన తర్వాత పరిచారకులు ఉండరు. అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు.



మా కురు ధన జన యవ్వన గర్వం 

హరతి నిమేషాత్కాలః సర్వం |

మాయామయమిదమఖిలం హిత్వా

బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా  ||11||


భావం: ధనమున్నదని, అనుచరగణం ఉన్నదని, యౌవనం ఉన్నదని గర్వించకు. ఈ మొత్తం ఒక్క నిముషంలో హరించిపోతుంది. ఈ ప్రపంచమంతా భ్రమతో కూడుకున్నది, మాయాజాలమని తెలుసుకొని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడకు చేరుకో. ఆత్మానుభూతిని చెందు.



దినయామిన్యౌ సాయం ప్రాతః

శిశిరవసంతవ్ పునరాయాతః |

కాలః క్రీడతి గచ్ఛత్యాయుః 

తదపి న ముంచత్యాశావాయుః  ||12||


భావం: రాత్రింబవళ్ళు, ఉదయం సాయంత్రాలు, శిశిర వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి; పోతుంటాయి. కాలచక్రం అలా ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయుష్కాలం కూడా అలాగే వెళ్లిపోతుంటుంది. అయినప్పటికీ మానవుడు ఆశ అనే గాలిని మాత్రం వదలడు గాక వదలడు.




కాతే కాంతా ధనగతచింతా

వాతుల కిం తవ నాస్తి నియంతా |

త్రిజగతి సజ్జనసంగతిరేకా

భవతి భవార్ణవతరణే నౌకా  ||13||


భావం: ఓరి వెఱ్ఱివాడా! ఎందుకు నీ భార్య గురించి, ధన సంబంధ విషయాల గురించి ఆలోచిస్తావు? అన్నిటిని, అందరిని నియమించే సర్వజ్ఞుడైన ప్రభువు లేడనుకున్నావా? ఈ ముల్లోకాలలో చావు పుట్టుకలనే భవసాగరాన్ని దాటడానికి సజ్జన సాంగత్యమే సరైన నౌక.



ద్వాదశమంజరికాభిరశేషః

కథితో వైయాకరణస్యైషః .

ఉపదేశో భూద్విద్యానిపుణైః

శ్రీమచ్ఛన్కరభగవచ్ఛరణైః  ॥13.అ॥


భావం: ఈ పన్నెండు (2-13) శ్లోకాలు శ్రీ శంకర భగవత్పాదులవారు ఒక వ్యాకరణకర్తకి ఉపదేశంగా ప్రసాదించారు.



జటిలో ముండీ లుంఛితకేశః

కాషాయాంబరబహుకృతవేషః |

పశ్యన్నపి చన పశ్యతి మూఢః

హ్యుదరనిమిత్తం బహుకృతవేషః ||14||


భావం: జడలు కట్టుకొని, గుండు గీయించుకొని, జుట్టు పీకివేసుకొని, కాషాయ వస్త్రాలు ధరించి  వేషాలు వేస్తుంటారు. ఈ వేషాలన్నీ పొట్టకూటికోసమే గాని, వీరు కళ్ళతో చూస్తూ కూడా సత్యాన్ని దర్శించలేని మూర్ఖులు.



అంగం గలితం పలితం ముండం

దశనవిహీనం జాతం తుండం |

వృద్ధో యాతి గృహీత్వా దండం

తదపి న ముంచత్యాశాపిండం ||15||


భావం: శరీరం కృశించిపోయింది, తల నెరసిపోయింది, నోటిలో పళ్ళు ఊడిపోయినవి. ముసలితనం పైబడి కఱ్ఱ చేతికొచ్చింది. ఐనా సరే ఆశల - కోరికల మూట మాత్రం వదిలిపెట్టడు.



అగ్రే వహ్నిః పృష్ఠేభానుః

రాత్రౌ చుబుకసమర్పితజానుః |

కరతలభిక్షస్తరుతలవాసః

తదపి న ముంచత్యాశాపాశ: ||16||


భావం: ఎదురుగా చలిమంట పెట్టుకొని,  వీపుపై సూర్యుని కిరణాలు పడేలా కూర్చొని, రాత్రిళ్ళు మోకాళ్ళకి గడ్డాన్ని ఆనించుకుని కూర్చుంటాడు; తిండి తినడానికి రెండు చేతులూ దొప్పలుగా చేసుకొని అందులో తింటాడు. చెట్టు నీడన ఉంటాడు. ఐనా ఆశలు మాత్రం వదలడు.



కురుతే గంగాసాగారగమనం

వ్రత పరిపాలన మథవా దానం |

జ్ఞానవిహీనః సర్వమతేన

ముక్తిం న భజతి జన్మశతేన ||17||


భావం: తీర్థయాత్రలు చేయవచ్చు; పూజలు, నోములు, వ్రతాలు చేయవచ్చు; దానధర్మాలు చేయవచ్చు. కాని ఆత్మజ్ఞానము పొందనివాడు నూఱు జన్మలెత్తినా సరే ముక్తిని పొందలేడని సర్వమతముల విశ్వాసం.



సుర మందిర తరు మూల నివాసః

శయ్యా భూతలమజినం వాసః |

సర్వ పరిగ్రహ భోగ త్యాగః

కస్య సుఖం న కరోతి విరాగః ||18||


భావం: దేవాలయాల్లోనూ, చెట్ల మొదళ్ళలోనూ నివసిస్తూ; కటిక నేల మీద నిద్రిస్తూ; చర్మాన్ని వస్త్రంగా ధరిస్తూ; దేనినీ గ్రహించకుండా - ఏమీ కావాలని కోరుకోకుండా అన్ని భోగాలను విడిచిపెట్టిన ఏ విరాగికి సుఖం లభించదు? తప్పక లభిస్తుంది.



యోగరతో వా భోగరతో వా

సంగరతో వా సంగవిహీనః |

యస్య బ్రహ్మణి రమతే చిత్తం

నందతి నందతి నందత్యేవ ||19||


భావం: ఒకడు యోగిగా జీవించవచ్చు, భోగిగా జీవించవచ్చు; ఈ ప్రపంచంలో అందరితో కలిసి మెలిసి జీవించవచ్చు లేదా ఒంటరిగా అందరికీ దూరంగా జీవించవచ్చు. కాని ఎవరైతే తమ మనసును బ్రహ్మతత్వమునందే నిలిపి తమను తాము బ్రహ్మగా భావిస్తూ ఉంటారో అట్టివారే ఆనందిస్తారు. ముమ్మాటికీ అట్టివారికే ఆనందం.




భగవద్గీతా కించిదధీత

గంగా జలలవ కణికాపీతా |

సకృదపి యేన మురారి సమర్చా

క్రియతే తస్య యమేవ న చర్చ ||20||


భావం: ఎవరైతే భగవద్గీతని కొంచమైనా అధ్యయనం చేస్తారో, గంగా జలాన్ని కొద్దిగా ఐనా తాగుతారో, కొంచమైనా శ్రీకృష్ణుని పూజిస్తారో అట్టివారికి యమునితో వివాదం ఉండదు.



పునరపి జననం పునరపి మరణం

పునరపి జననీ జఠరే శయనం |

ఇహ సంసార బహు దుస్తారే

కృపయా పారే పాహి మురారే ||21||


భావం: మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం; మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఉండడం - ఈ అంతులేని సంసార జనన మరణ చక్రబంధం నుండి తప్పించుకోవడం కష్టమైన పని. కనుక ఓ కృష్ణా! దయచేసి మమ్ములను రక్షించు.



రథ్యా చర్పట విరచిత కంథః

పుణ్యాపుణ్య వివర్జిత పంథః |

యోగి యోగనియోజిత చిత్తో

రమతే బాలోన్మత్తవదేవ ||22||


భావం: దారిలో దొరికే గుడ్డ పీలికలతో తయారైన గోచిని ధరించిన వాడై; ఇది పుణ్యమని, అది పాపమని ఏ మాత్రం ఆలోచించక, నిరంతరం మనసుని యోగమునందే నిలిపిన యోగిపుంగవుడు ఈ లోకంలో బాలునిలాగ, పిచ్చివానిగా ప్రవర్తిస్తూ ఉంటాడు.



కస్త్వం కోహం కుత ఆయాతః

కా మే జనని కో మే తాతః |

ఇతి పరభావయ సర్వమసారం

విశ్వం త్యక్త్వా స్వప్న విచారం ||23||


భావం: నీవెవరు? నేనెవరు? ఎక్కడ నుండి వచ్చాను? నా తల్లి ఎవరు? నా తండ్రి ఎవరు? ఇదీ నువ్వు విచారణ చెయ్యవలసినది. ఈ ప్రపంచం సారహీనమైనది; కేవలం కలలో కనిపించు దృశ్యం లాంటిదే అని దీనిని విడిచిపెట్టు.



త్వయి మయి చాన్యత్రైకో విష్ణు:

వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణు: |

భవ సమచిత్తః  సర్వత్ర త్వం

వాంఛస్యచిరాద్యది విష్ణుత్వం ||24||



భావం: నీలోను, నాలోను, ఇతరులలోను ఉన్నది ఏకమైన సర్వవ్యాపక చైతన్యమే. సహనం లేనివాడివి కనుక నాపై కోపగించుకుంటున్నావు. నీవు బ్రహ్మత్వం (మోక్షం) ను పొందగోరితివా! అంతటా - అన్నివేళలా సమబుద్ధిని కలిగి ఉండు.



శత్రౌ మిత్రే పుత్రే బంధవ్

మా కురు యత్నం విగ్రహ సంధవ్ |

సర్వస్మిన్నపి పశ్యాత్మానం

సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం ||25||


భావం: శత్రువు గాని, మిత్రుడు గాని, పుత్రుడు గాని,  బంధువు గాని - వీరిపట్ల శత్రుత్వమో, స్నేహమో చేసే యత్నం మానుకో. అందరిలోను ఆత్మను చూస్తూ, భేదభావాన్ని అన్ని సందర్భాలలోనూ విడిచిపెట్టు.




కామం క్రోధం లోభం మోహం

త్యక్త్వా త్మానం భావయ కోహం |

ఆత్మజ్ఞాన విహీనా మూడాః

తే పచ్యంతే నరకనిగూడః ||26||


భావం: కోరిక, కోపం, లోభం, భ్రాంతి - వీటన్నిటిని విడిచిపెట్టిన సాధకుడు "ఆ పరమాత్మను నేనే " అనే సత్యాన్ని దర్శిస్తాడు. ఆత్మజ్ఞానం లేనివారు మూఢులు. అట్టివారు ఈ సంసార జనన మరణ చక్రం అనే నరకంలో బంధింపబడి హింసించబడతారు.



గేయం గీతా నామ సహస్రం

ధ్యేయం శ్రీపతి రూపమజస్రం |

నేయం సజ్జన సంగే చిత్తం

దేయం దీనజనాయ చ విత్తం ||27||


భావం: భగవద్గీత, విష్ణు సహస్రనామాలను గానం చెయ్యాలి. ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ధ్యానించాలి. సజ్జన సాంగత్యంలో మనసుని నడపాలి. దీనులైన వారికి ధనాన్ని దానం చెయ్యాలి.


సుఖతః క్రియతే రామాభోగః

పశ్చాద్ధంత శరీరే రోగః |

యద్యపి లోకే మరణం శరణం

తదపి న ముంచతి పాపాచరణం ||28||


భావం: సుఖాన్ని పొందాలని స్త్రీ పురుషులు రతి కార్యంలో నిమగ్నమవుతారు. దాని కారణంగా శరీరం రోగాలపాలవుతుంది. చివరికి మరణం అనేది ఎవరికి తప్పదు. ఐనా సరే మానవుడు పాప కార్యములను వదలనే వదలడు.



అర్థమనర్థం భావయ నిత్యం

నాస్తితతః సుఖలేశః సత్యం |

పుత్రాదపి ధన భాజాం భీతి:

సర్వత్రైషా విహితా రీతి: ||29||


భావం: డబ్బు దుఃఖాన్ని ఇస్తుందని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో. దాని వల్ల కొంచం సుఖం కూడా లేదు అనే మాట సత్యం. ధనవంతునికి తన కుమారిని వల్ల కూడా భయమే. అన్ని చోట్ల డబ్బు యొక్క పద్ధతి ఇంతే.



ప్రాణాయామం ప్రత్యాహారం

నిత్యానిత్య వివేకవిచారం |

జాప్యసమేత సమాధివిధానం

కుర్వవధానం మహదవధానం ||30||


భావం: క్రమపద్ధతిలో శ్వాసను నియమించడం; విషయాల నుండి మనసుని వెనక్కి మళ్లించడం; నిత్య వస్తువేదో, అనిత్య వస్తువేదో నిరంతరం బుద్ధితో విచారించడం; జపంతో కూడుకున్న ధ్యాననిష్ఠను సాగించి సర్వ సంకల్పాలను విడిచిపెట్టడం అనే సాధనలను ఎంతో జాగ్రత్తగా అనుష్ఠించు.



గురుచరణా౦బుజ నిర్భర భక్తః

సంసారాదచిరార్భవ ముక్తః |

సేంద్రియమానస నియమాదేవం

ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం ||31||


భావం: గురుచరణ కమలములనే సర్వస్వంగా భావించిన ఓ భక్తుడా! నీ ఇంద్రియాలను, మనసుని నిగ్రహించడం ద్వారా మాత్రమే ఈ చావు పుట్టుకులతో కూడిన సంసార సాగరం నుండి ముక్తుడవై, నీ హృదయంలోనే ఉన్న పరమాత్మ సాక్షాత్కారం పొందెదవు గాక!



మూఢః కశ్చన వైయాకరణో

డుకృన్కరణాధ్యయన ధురిణః .

శ్రీమచ్ఛమ్కర భగవచ్ఛిష్యై

బోధిత ఆసిచ్ఛోధితకరణః ॥32॥


భావం: వ్యాకరణ నియమాలతో తనను తాను కోల్పోయి మూఢుడైన వ్యాకరణకర్త, శంకర భగవత్పాదులవారి బోధనలతో కడిగివేయబడ్డాడు.



భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే

నామస్మరణాదన్యముపాయం

నహి పశ్యామో భవతరణే ॥33॥


భావం: భజించు గోవిందుని! భజించు గోవిందుని! ఓ మూఢుడా  గోవిందుడినే భజించు. సంసార సాగరాన్ని దాటడానికి గోవింద నామస్మరణకి మించినది లేదు

|| ఇతి భజగోవిందం సంపూర్ణం ||

సేకరణ : Social Media
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

Journey of life


*Our Journey Together Is So Short* :

 A Beautiful Message for all of us....

A young lady sat in a bus. At the next stop a loud and grumpy old lady came and sat by her. She squeezed into the seat and bumped her with her numerous bags.

The person sitting on the other side of the young lady got upset, asked her why she did not speak up and say something.

The young lady responded with a smile:


"It is not necessary to be rude or argue over something so insignificant, the journey together is so short. I get off at the next stop."

This response deserves to be written in golden letters:

*"It is not necessary to argue over something so insignificant, our journey together is so short"*

If each one of us realized that our time here is so short; that to darken it with quarrels, futile arguments, not forgiving others, discontentment and a fault finding attitude would be a waste of time and energy.

Did someone break your heart? *Be calm, the journey is so short.*

Did someone betray, bully, cheat or humiliate you? *Be calm, forgive, the journey is so short.*

Whatever troubles anyone brings us, let us remember that *our journey together is so short.*

No one knows the duration of this journey. No one knows when their stop will come. *Our journey together is so short.*

Let us cherish friends and family. Let us be respectful, kind and forgiving to each other. Let us be filled with gratitude and gladness.

If I have ever hurt you, I ask for your forgiveness. If you have ever hurt me, you already have my forgiveness.

After all,
*Our Journey Together is so Short!*



తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

స్త్రీ



మగాడితోసహా సర్వ జీవులను పుట్టించేసిన దేవుడు చివరగా ఒక స్త్రీని సృష్టించడం మొదలుపెట్టాడు. ఒక రోజూ రెండు రోజులూ కాదు. ఏకంగా వారంరోజులు తీసుకున్నాడు స్త్రీ సృష్టికోసం. మిగిలిన పనులన్నీ మానుకుని తన నాథుడు స్త్రీ సృష్టికోసం ఇంతగా తలమునకలైపోవడం చూసిన దేవత అడిగింది...
"స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకున్నారని?".

ఆప్పుడు దేవుడు "ఏం చెయ్యను మరి...ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా...ఇష్టాయీష్టాలకతీతంగా ఉండాలీ సృష్టి. వివక్ష తగదు. మొండికేసే
పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి. చిన్న చిన్న గాయాలు మొదలుకుని ముక్కలయ్యే మనసులవరకూ ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా...ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పని చేయాలో తెలుసా...ఆమెకు ఆరోగ్యం బాగులేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి. అడిగేవారు ఉండరూ ఉండకపోవచ్చు...రోజుకు పద్దెనిమిది గంటలు పని చేయాలి. ఇన్ని రకాల పనులు చెయ్యాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే...." అన్నాడు.

"ఏంటీ? ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులేనా?" అని ఆశ్చర్యపోతూ దేవత ఆమెను మెల్లగా తాకింది.
"ఇదేంటీ ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం" అని ప్రశ్నించింది.

ఆప్పుడు దేవుడు "ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజూకుగా ఉండొచ్చు. కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు. అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు. అంతేకాదు, ఆమె అన్ని భారాలనూ తట్టుకోగలదు. ఇష్టం,  కష్టం, ప్రేమ, కోపం, తాపం, అంటూ అన్ని భావోద్వేగాలనూ ఆమె చవిచూడాలి. అవసరమైతే దిగమింగాలి. కోపమొస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకుండాలి. తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుపట్టడమూ తెలుసు. ఇతరుల దగ్గర ఆశించేది ప్రేమానురాగాలను...." అన్నాడు.

"ఓహో. ఈమె ఆలోచించగలదా" అని దేవత అడిగింది.

అప్పుడు దేవుడు "ఎందుకాలోచించదు? అన్ని విషయాలూ ఆలోచించడమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు..." అన్నాడు.

దేవత ఆమె చెక్కిళ్ళను తాకి "ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటీ? కన్నీరు కారుస్తోందిగా....ఏంటిది? " అని అడిగింది.

అప్పుడు దేవుడు "అదా...కన్నీరది. ఆ కన్నీటిలో ఆనందమూ ఆవేదనా దుఃఖమూ దిగులూ ఆశ్చర్యమూ భయమూ అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులూ ఉంటాయి. ఆ కన్నీటికున్న  శక్తి అనంతం....పైగా మరో జీవీకి ప్రాణంపోసి పది నెలలూ పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది" చెప్పాడు.

దేవత ఆశ్చర్యపోతూ "మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే. .." అని చెప్పింది.

అయితే దేవుడు "అంతా బాగానే ఉన్నా ఆమెకు తన విలువా శక్తీ తెలిసినా వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు. అప్పటివరకూ తెలియనట్టే ఉంటుంది..."
చెప్పి భూమ్మీదకు పంపాడు స్త్రీని.




తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

నిరాడంబరం



*ఆమె ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్.*
*ఆరోజు ఆమె ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.*
ఆమె రోజులాగే ఆఫీసులో అన్ని గదులు ఊడ్చి సిబ్బందితో రోజు మాదిరే సంతోషంగా గడుపుతూ ఉంది,సిబ్బంది మాత్రం మమ్మల్ని విడిచి పోతున్నావు అంటూ భావోద్వేగాలతో కళ్ళు చెమర్చుతున్నాయి.
సాయంత్రం 5 గంటలయ్యింది,సిబ్బంది బొకేలతో హడావుడిగా వున్నారు,
అంతలో జిల్లా కలెక్టర్ కారు వచ్చి ఆగింది,కలెక్టర్ కారు దిగి నేరుగా అస్వీపర్ వద్దకు వెళ్లి ఆమె కాళ్లకు దండం పెట్టాడు,మరో పెద్దకారు వచ్చి ఆగింది,ఆకారులో పెద్ద పేరున్న సివిల్ ఇంజనీర్.ఆయన కూడా వచ్చి అస్వీపర్ కాళ్లకు దండం పెట్టాడు.మరో కారు వచ్చింది,ఆకారులో పేరున్న గుండె వైద్య నిపుణులు వచ్చి రాగానే ఆస్వీపర్ కాళ్ల మీద నన్ను క్షమించమ్మా 5నిమిషాలు ఆలస్యంగా వచ్చాను అని ప్రాధేయపడ్డాడు.ఈ ముగ్గురూ(కలెక్టర్,సివిల్ ఇంజనీర్,గుండె వైద్య నిపుణులు)అస్వీపర్ కుమారులట. అక్కడ వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారింది.అందరి కళ్ళలో కన్నీళ్లే.స్వీపరుగా పని చేస్తూ కుమారులను చదివించానని,నాకష్టాన్ని పిల్లలు వృధా చేయలేదని,స్వీపరుగా నాఉద్యోగం ఆనందంగా నిర్వహించానని ఇంతకంటే నాకు మాటలు రావటం లేదంటూ, ఇక్కడి అఫిససుని, సిబ్బందిని వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందని కన్నీళ్ళు తుడుచుకుంటూ ప్రసంగాన్ని ముగించారు.(బీహార్ లోని ఓప్రభుత్వ కార్యాలయంలో జరిగిన యదార్థ సంఘటన).



తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

ప్రసాదం


దేవుడు మనం పెట్టే నైవేద్యం తింటాడా...!                     
 ఒక పిల్లవాడి కి సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు
మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు” అని ప్రశ్నించాడు .... గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా, పాఠాలు చెప్పసాగారు.
ఆరోజు పాఠం
“ ఓం పూర్ణమద: పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” అనే శ్లోకం .
పాఠం చెప్పడం పూర్తయిన తరువాత, అందరిని పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు. కొద్దిసేపటి తరువాత , నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగారు. నేర్చుకున్నాను అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు. శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు గారు తల అడ్డంగా ఆడించారు . దానికి ప్రతిగా శిష్యుడు, కావాలంటే పుస్తకం చూడండి అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు. శ్లోకం పుస్తకం లోనే ఉందిగా… నీకు శ్లోకం ఎలా వచ్చింది అని అడిగారు గురువు గారు. శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువు గారే మళ్ళీ అన్నారు. పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితి లో ఉంది… నువ్వు చదివినప్పుడు నీ బుర్ర లోకి అది సూక్ష్మ స్థితిలో ప్రవేశించింది. ఆదే స్థితి లో నీ మనస్సులో ఉంది. అంతే కాదు, నువ్వు చదీవి నేర్చుకోవడం వల్ల పుస్తకం లో స్థూల స్థితి లో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగూ జరగలేదు. అదే విధం గా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితి లో గ్రహించి, స్థూలరూపం లో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు . దాన్నే మనం ప్రసాదం గా తీసుకుంటున్నాం. అని వివరణ చేశారు.💐
“పేరు దేవుడిది-పొట్ట మనది”అని హేళనచేసేవారికి సరియైన సమాధానం కదా…



తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

వృద్ధాప్యం




What a superb piece of analysis by Sri Gollapudi Maruthi Rao about the advent of old age everyone has to go thru in their lifetime !

Please go through the below masterpiece !!!

_వృద్ధాప్యానికి ఆహ్వానం_
-శ్రీ గొల్లపూడి మారుతీరావు

    చమకం యజుర్వేదంలోని శ్రీరుద్రంలో ఒక భాగం.   చమకంలో ఒకచోట -ఈ   విచిత్రమైన కోరిక ఉంది. *''వృద్ధం చమే, వృద్ధిశ్చమే'*' అని. ఇదేమిటి? నాకు వృద్ధినియ్యి అన్నంతవరకూ బాగానే వుంది. నాకు వృద్ధాప్యాన్ని యివ్వమని అడుగుతాడేమిటి? అని ఆశ్చర్యం. కోరికలనుంచీ, ఈ జీవితంలో సుఖాల నుంచీ బయటపడలేని జీవుడు -అలా బయటపడేసే మానసిక స్థితిని, ఆ దశని ప్రసాదించు స్వామీ -అంటూ ఆ కోరికల వెల్లువలోనే ఒక విచిత్రమైన కోరికని జతచేశాడు. అన్ని కోరికలనుంచీ విముక్తం చేసే -లేదా విరక్తిని కలిగించే వృద్ధాప్యాన్ని ప్రసాదించు -అని వేడుకోవడం బహుశా ఏ మతంలోనూ ఏ భక్తుడూ ఏ దేవుడినీ యింత పరిణతితో, యింత గంభీరమైన కోరిక కోరలేదేమో!

''ఈ మనస్సు కోతి స్వామీ! దానికి ఉన్న చాపల్యాలుల అన్నీ తీర్చు. తప్పదు. చేసేదీ లేదు. కాని ఏదో ఒకనాడు ఈ చాపల్యాలన్నింటినీ వదులుకొనే దశనీ, స్థాయినీ, వయస్సునీ -వృద్ధాప్యాన్ని ప్రసాదించు'' అంటున్నాడు జీవుడు.

వృద్ధాప్యం ఒక మజిలీ. ప్రతీ వ్యక్తీ కోరుకు న్నా కోరుకోక పోయినా తప్పనిసరిగా చేరుకునే మజిలీ. వయస్సులోని కోరికలన్నింటికీ సెలవిచ్చి, అలసిపోయిన అనుభవాలనీ, ఆరిపోయిన అనుభూతులనూ నెమరువేసుకునే చలివేంద్రం. వృద్ధాప్యం ఒక అవకాశం. వెనక్కి తిరిగి చూసుకుని చేసిన తప్పిదాలకు నవ్వుకుని, దాటిన అడ్డంకులను పరామర్శించి, ఇక దాటనక్కరలేని స్థితికి వచ్చినందుకు ప్రశాంతంగా నిట్టూర్చే ఆటవిడుపు.
ముసిలితనం కొడుకు కంటె ఒక అడుగు వెనక నడిపిస్తుంది. మనవరాలి భుజాన్ని ఆసరా చేసుకుంటుంది. జీవితమంతా కొరుకుడుపడని నిజాలతో ఆనందంగా రాజీపడేటట్టు చేస్తుంది. పిల్లలు ''నీకేం తెలీదు నాన్నా!'' అంటే కోపం రాదు. ఒక జీవితకాలాన్ని తెలీనితనానికి తాకట్టు పెట్టిన కొడుకుని చూసి నవ్వుకుంటుంది. తనకి తెలీదని పక్కకి తప్పించే తరాన్ని చూసి గర్వపడుతుంది. అవలీలగా అర్థం చేసుకుంటుంది. ''వాడికి తోచినట్టే చెయ్యనివ్వండి'' అనే భార్య హితవుకి గంభీరంగా తలవొంచుతుంది. ఏ విమర్శా అవమానం అనిపించదు. ఏ నిందకీ కోపం రాదు.
వృద్ధాప్యాన్ని అందరూ గౌరవిస్తారు. నీ జీవితకాలంలో సాధనల్ని పక్కనపెట్టి కేవలం వయస్సు కారణంగానే పెద్దరికాన్ని అంగీకరిస్తారు. అదొక అంతస్థు.

అతని హితవుని నలుగురూ వింటారు. నీ ఆలోచనని గౌరవిస్తారు. దాన్ని పాటించరని అర్థమవుతున్నా కోపం రాదు. వయస్సు అర్థం చేసుకునే సంయమనాన్ని నేర్పుతుంది.
''మా రోజుల్లో...'' అని చెప్పుకోవడంలో చిన్న 'సాకు'ని వృద్ధాప్యం మప్పుతుంది. ''ఈ కాలం కుర్రాళ్లు...'' అన్న వెక్కిరింతకి అర్హతని సంపాదించి పెడుతుంది. తన గురించి తన పెద్దలూ అలనాడు -అలాగే అనుకొని ఉంటారని అప్పుడు జ్ఞాపకం వస్తుంది.

వేసిన ప్రతీ అడుగూ తెలిసి వేసే నమ్మకాన్నిస్తుంది. చేసే ప్రతీ పనీ యిబ్బంది లేని, శ్రమ అనిపించని మార్గం వేపే ప్రయాణం చేయిస్తుంది. తన 'రేపు' క్రమక్రమంగా కురుచనయిపోతోందని అర్థమవుతూంటుంది. దక్కిన చిన్న తప్పుల్ని వృద్ధాప్యం భద్రంగా అలంకరించుకుంటుంది. ''మనకి చేతకాదు'' అని చెప్పడం పెద్ద అర్హతగా కనిపిస్తుంది. అసాధ్యానికి 'అనవసరం' అంటూ గడుసుదనం చిన్న ముసుగు వేస్తుంది. దానికి ఊతం వృద్ధాప్యం.
జీవితంలో చాలా ప్రశ్నలకు సమాధానాలు అర్థమవుతూంటాయి. ఇప్పుడా సమాధానాలకూ వేళ మించిపోయిందని అర్థమవుతుంది. ఈ సమాజంలో అవినీతి అనే కుళ్లు ఎప్పుడు తొలగుతుంది? ప్రతీక్షణం దోపిడీకి గురవుతున్న ఈ పర్యావరణం ఒక్కసారి ఎదురు తిరిగితే ఏమవుతుంది? ఏమయినా తనకేం బాధలేదు. ఆ సమయంలో తను ఉండడు. ఈ జీవిత నుంచి శలవు తీసుకోవడమే తనకి ఉపశమనం.

దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎలా వుంటాడు? మృత్యువు తరువాత ఏమవుతుంది? సమాధానాలు అర్థమయే క్షణాలు దగ్గరవుతున్నాయి. చుట్టూవున్న జీవితాన్ని క్రమంగా ఖాళీ చేసుకుంటుంది వృద్ధాప్యం. చిన్నకేక తుళ్లిపడేటట్టు చేస్తుంది. చిన్న నిశ్శబ్దం ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పటిలాగే తెల్లారి, వృద్ధులతో కలిసి నడిచి, రెండుముద్దల అన్నం తిని, అరగంట సేదతీరి, వేడి టీ తాగి, సాయంకాలం పార్కు బెంచీ దగ్గర ''ఈ దేశం తగలడిపోతోంద'ని తిట్టుకుని, శాంతపడి -కీళ్ల నొప్పులకు మాత్రలు మింగి, రాని నిద్రనీ, నిన్నటి జ్ఞాపకాలనీ నెమరు వేసుకోవడం -వృద్ధాప్యం వ్యసనం.


ఇప్పుడు విచారం దగ్గరకు రాదు. వెళ్లిపోయిన హితులూ, సన్నిహితులూ దిగులుగా జ్ఞాపకం వస్తారు. ముగింపు భయపెట్టదు. ఎందుకంటే భయపడినా రాకతప్పదు కనుక. అన్నిటినుంచీ, అందరినుంచీ తనని కుదించుకుని -మెల్లగా అంతర్ముఖుడు కావడం వృద్ధాప్యం.

ఇప్పుడు అన్ని దురదృష్టాలకూ కారణాలు అర్దమౌతాయి. చేసిన తప్పిదాలు, మాటతప్పిన కప్పదాట్లూ, మనసు నొప్పించిన చిన్న చిన్న జ్ఞాపకాల ముళ్లూ -అవన్నీ ఓ జీవితకాలం ఆలస్యంగా కళ్లముందు కదుల్తాయి. ఈ అనుభవాల్ని హెచ్చరికలు చెయ్యబోతే పిల్లలు వినరు. వినినట్టు నటిస్తారు. నటిస్తున్నారని తనకీ తెలుసు. విన్న తృప్తిని తానూ నటిస్తాడు. వారికీ వృద్ధాప్యం ఒకనాడు పాఠాలు చెప్తుందని తెలుసు. కాని వృద్ధాప్యం ఒక వరమని ఇప్పుడు చెప్పి ఒప్పించలేడు. వారు ఒప్పుకునే వేళకి తను ఉండడు. జీవితం ఎంత విచిత్రం! నవ్వుకుంటాడు. ఆ నవ్వు ఖరీదు ఒక జీవితం.'చమకం' ఏ రుషి, ఏ మహానుభావుడు ఎప్పుడు సృష్టించారో -ఎంత ముందుచూపు, ఎంత వినయసంపద, జీవుని నిస్సహాయత, నిర్వేదం -అందులో నిక్షిప్తమయివుందో -ఆనాటి కోరిక సంపూర్ణమయిన స్వరూపంతో కళ్లముందు దర్శనమిచ్చేనాటికి -తాను జీవితమంతా కోరుకున్న 'వృద్ధాప్యం' తనని ఆవరించుకుని ఉంటుంది.ఈ దేశపు వేద సంపద, సాంస్కృతిక వైభవం, జాతి దర్శనం అపూర్వం, అనన్యసామాన్యం.

చమకంలో 'వృద్ధం చమే' అనే ఒక్క కోరికా ఈ జాతినీ, మతాన్నీ, ఆలోచనా స్రోతస్సునీ అత్యద్భుతంగా ఆవిష్కరించే అభిజ్ఞ. వరం. భగవంతుడిని కోరడంలోనే భగవంతుడు ప్రసాదించిన తన ఆలోచనా పరిణతిని అలంకరించే భగవద్దత్తమైన ఆశీర్వాదం. అదీ వృద్ధాప్యం.🙏🏼



తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

Reflection



Three people were laying bricks. A passerby asked them what they were doing.
The first one replied, "Don't you see I am making a wall?"
The second one said, "Don't you see I am lying bricks?"
The third one said, "I am building a beautiful monument with my efforts and expertise"
Here were three people doing the same thing who had totally different perspective on what they were doing.
They had three very different attitudes about their work. And would their attitude affect their performance? The answer is clearly yes.
REFLECTION
Excellence comes when the performer takes pride in doing his best. Every job is a self-portrait of the person who does it.


తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

నమ్మకం




అనగనగా ఒక చెట్టు, పచ్చని ఆకులతో, తెల్లటి పూలతో అందంగా ఉండేది.. దారిన పోయేవాళ్ళకు ఆ చెట్టు నీడనిచ్చేది, విశ్రాంతినిచ్చేది.. ఎంత వైరాగ్యం ఉన్నవాడికైన సరే నిండుగా ఉన్న ఆ చెట్టుని చూస్తే చాలు మళ్ళి జీవించాలనే ఆశ కలిగేది... 

అలా కొన్నాళ్ళు గడిచాక చెడుగాలులు వీయడంతో పూలు రాలిపోయాయి.. ఎండకు ఆకులు ఎండిపోయి కొమ్మనుండి వేరైపోయాయి... చెట్టు బోసిపోయింది.. అటుగా వెళ్తున్న వాళ్లందరు చెట్టును జాలి చూపులు చూశారు., ఇక దీని ఆయుష్షు ఐపోయిందని మాట్లాడుకున్నారు...

అది విన్న ఆ చెట్టు మాత్రం నిరుత్సాహ పడలేదు., తనకు మళ్ళి గత వైభవం రాకపోతుందా! అనే నమ్మకంతో బతుకుతుంది..

కొన్నాళ్ళకి ఒక వర్షపు చుక్క ఆ చెట్టు వేరుపై పడింది.., అంతే చెట్టులో చలనం మొదలైంది.. కొన్ని లక్షల చినుకులు కలిసి ఆ చెట్టును తడిపేశాయి... కొన్ని రోజులకి ఆకులు చిగురించాయి , పూవ్వులు వికసించాయి.. మళ్ళి పది మందికి నీడనివ్వటం మొదలుపెట్టింది, వాళ్ళకు జీవతం మీద ఆశను కలిగేలా చేసింది... ఆ చెట్టు...!

మనిషి జీవితము అంతే...,

ఒక్కొక్కసారి కొన్ని 'అనర్ధాల' వల్ల నవ్వులు అనే పూలు మాయమౌతాయి..

కొన్ని అపార్ధాల వల్ల కావాల్సినవాళ్ళే ఎండిపోయిన ఆకులు లా వీడిపోతారు...

అయిన సరే నిరుత్సాహ పడకూడదు.. ఏదో రోజు ఆ అనర్ధాలు, అపార్దాలు అనే అడ్డుతెరలు తొలగిపోతాయి..

 ఏ నమ్మకంతో నువ్వు ఉదయాన్నే లేస్తావని అలారం పెట్టుకుంటున్నావో.. అదే నమ్మకంతో ఏదో ఒకరోజు నీ జీవితం నువ్వు కోరుకున్న విధంగా మారుతుంది అని గట్టిగా నమ్ము...

అలా జరగాలంటే నీకు కావాల్సిందల్లా ఓర్పు, సహనం..

గొంగలి పురుగు ఒక్క రాత్రిలోనే సీతాకోక చిలుకగా మారలేదు అన్న నిజం నువ్వు గ్రహించాలి...

కాలం పెట్టిన సహన పరిక్షలో నువ్వే నెగ్గాలి..

ఎందుకంటే మంచి విషయాలు అంత తేలికగా పూర్తి కావు..  కాబట్టి నీ కర్తవ్యాన్ని పూర్తి చేసి, సహనానికి ఆశ్రయం ఇవ్వు... బద్ధకానికి కాదు..

గుర్తుంచుకో.,

నువ్వు త్వరగా లేచినంత మాత్రాన  సూర్యుడు ముందుగా ఉదయించడు., దానికి సమయం రావాలి.. మనకు సహనం ఉండాలి...!!



తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

గమ్యం-బరువు



ఓసాధువు ఒకసారి తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, 'ఈరోజు మీరిద్దరూ యాభైకోసుల దూరంవెళ్ళాలి' అన్నాడు.

 ఒక శిష్యుడికి ఓసంచిలో తినుబండారాలు నింపి ఇచ్చి 'ఎవరైనా వీటి అవసరమున్నవారు దారిలో కనిపిస్తే వారికి పంచుకొంటూ వెళ్ళ'మన్నాడు.

రెండవ శిష్యుడికి ఖాళీసంచి ఇచ్చి 'దారిలో విలువైనవేవైనా కనిపిస్తే  వాటిని సంచిలో వేసుకొంటూ వెళ్ళ'మన్నాడు.

ఇద్దరూ ఇచ్చిన సంచులను భుజాలకి తగిలించుకొని, ప్రయాణం మొదలుపెట్టారు, నెమ్మదిగా నడచుకొంటూ.

ఖాళీసంచివాడు ఆడుతూ పాడుతూ నడుస్తున్నాడు. కొంతదూరం వెళ్ళాక అతనికి ఒక బంగారురాయి దొరికింది. దాన్నితీసి సంచిలో వేసుకున్నాడు. మరికొంత దూరంవెళ్ళాక మరొకటి కనిపించింది. దాన్నీ తీసి సంచిలో వేసుకున్నాడు.

అలా ఎక్కడెక్కడ బంగారురాయి కనిపిస్తే, దాన్ని తీసుకొని సంచిలో వేసుకొంటూ నడక సాగించాడు.

దాంతో సంచి బరువెక్కసాగింది. నడక భారంగా మారింది. శ్వాస తీసుకోవడంకూడ ఇబ్బందిగా మారింది. అడుగు తీసి అడుగేయడం చాలా కష్టమైపోయింది.

ఇక రెండో శిష్యుడు వెళ్తూవెళ్తూ ఉంటే, దారిలో ఆకలితో కనిపించినవారికి తన సంచిలోని తినుబండారాలను కొంచెంకొంచెంగా పంచుకొంటూ వెళ్ళాడు. క్రమక్రమంగా సంచి బరువు తగ్గసాగింది.
అతని నడక సులభం అయింది.

*ఎవరు పంచుకొంటూ వెళ్ళారో*, అతను తన గమ్యాన్ని చేరుకోవడం సులభమైంది.

*ఎవరు పోగేసుకొంటూ వెళ్ళారో*, అతను తన గమ్యాన్ని చేరుకోలేక పోయాడు.ఎన్నో కష్టాలు అనుభవించాడు.

_మరి మీరూ మనసు పెట్టి ఆలోచించండి... *ఏమి పంచారో, ఏమి పోగేసుకున్నారో* గమ్యాన్ని ఎలా చేరుకో దలచుకొన్నారో._
🙏



తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media