Pages

నమ్మకం




అనగనగా ఒక చెట్టు, పచ్చని ఆకులతో, తెల్లటి పూలతో అందంగా ఉండేది.. దారిన పోయేవాళ్ళకు ఆ చెట్టు నీడనిచ్చేది, విశ్రాంతినిచ్చేది.. ఎంత వైరాగ్యం ఉన్నవాడికైన సరే నిండుగా ఉన్న ఆ చెట్టుని చూస్తే చాలు మళ్ళి జీవించాలనే ఆశ కలిగేది... 

అలా కొన్నాళ్ళు గడిచాక చెడుగాలులు వీయడంతో పూలు రాలిపోయాయి.. ఎండకు ఆకులు ఎండిపోయి కొమ్మనుండి వేరైపోయాయి... చెట్టు బోసిపోయింది.. అటుగా వెళ్తున్న వాళ్లందరు చెట్టును జాలి చూపులు చూశారు., ఇక దీని ఆయుష్షు ఐపోయిందని మాట్లాడుకున్నారు...

అది విన్న ఆ చెట్టు మాత్రం నిరుత్సాహ పడలేదు., తనకు మళ్ళి గత వైభవం రాకపోతుందా! అనే నమ్మకంతో బతుకుతుంది..

కొన్నాళ్ళకి ఒక వర్షపు చుక్క ఆ చెట్టు వేరుపై పడింది.., అంతే చెట్టులో చలనం మొదలైంది.. కొన్ని లక్షల చినుకులు కలిసి ఆ చెట్టును తడిపేశాయి... కొన్ని రోజులకి ఆకులు చిగురించాయి , పూవ్వులు వికసించాయి.. మళ్ళి పది మందికి నీడనివ్వటం మొదలుపెట్టింది, వాళ్ళకు జీవతం మీద ఆశను కలిగేలా చేసింది... ఆ చెట్టు...!

మనిషి జీవితము అంతే...,

ఒక్కొక్కసారి కొన్ని 'అనర్ధాల' వల్ల నవ్వులు అనే పూలు మాయమౌతాయి..

కొన్ని అపార్ధాల వల్ల కావాల్సినవాళ్ళే ఎండిపోయిన ఆకులు లా వీడిపోతారు...

అయిన సరే నిరుత్సాహ పడకూడదు.. ఏదో రోజు ఆ అనర్ధాలు, అపార్దాలు అనే అడ్డుతెరలు తొలగిపోతాయి..

 ఏ నమ్మకంతో నువ్వు ఉదయాన్నే లేస్తావని అలారం పెట్టుకుంటున్నావో.. అదే నమ్మకంతో ఏదో ఒకరోజు నీ జీవితం నువ్వు కోరుకున్న విధంగా మారుతుంది అని గట్టిగా నమ్ము...

అలా జరగాలంటే నీకు కావాల్సిందల్లా ఓర్పు, సహనం..

గొంగలి పురుగు ఒక్క రాత్రిలోనే సీతాకోక చిలుకగా మారలేదు అన్న నిజం నువ్వు గ్రహించాలి...

కాలం పెట్టిన సహన పరిక్షలో నువ్వే నెగ్గాలి..

ఎందుకంటే మంచి విషయాలు అంత తేలికగా పూర్తి కావు..  కాబట్టి నీ కర్తవ్యాన్ని పూర్తి చేసి, సహనానికి ఆశ్రయం ఇవ్వు... బద్ధకానికి కాదు..

గుర్తుంచుకో.,

నువ్వు త్వరగా లేచినంత మాత్రాన  సూర్యుడు ముందుగా ఉదయించడు., దానికి సమయం రావాలి.. మనకు సహనం ఉండాలి...!!



తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

గమ్యం-బరువు



ఓసాధువు ఒకసారి తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, 'ఈరోజు మీరిద్దరూ యాభైకోసుల దూరంవెళ్ళాలి' అన్నాడు.

 ఒక శిష్యుడికి ఓసంచిలో తినుబండారాలు నింపి ఇచ్చి 'ఎవరైనా వీటి అవసరమున్నవారు దారిలో కనిపిస్తే వారికి పంచుకొంటూ వెళ్ళ'మన్నాడు.

రెండవ శిష్యుడికి ఖాళీసంచి ఇచ్చి 'దారిలో విలువైనవేవైనా కనిపిస్తే  వాటిని సంచిలో వేసుకొంటూ వెళ్ళ'మన్నాడు.

ఇద్దరూ ఇచ్చిన సంచులను భుజాలకి తగిలించుకొని, ప్రయాణం మొదలుపెట్టారు, నెమ్మదిగా నడచుకొంటూ.

ఖాళీసంచివాడు ఆడుతూ పాడుతూ నడుస్తున్నాడు. కొంతదూరం వెళ్ళాక అతనికి ఒక బంగారురాయి దొరికింది. దాన్నితీసి సంచిలో వేసుకున్నాడు. మరికొంత దూరంవెళ్ళాక మరొకటి కనిపించింది. దాన్నీ తీసి సంచిలో వేసుకున్నాడు.

అలా ఎక్కడెక్కడ బంగారురాయి కనిపిస్తే, దాన్ని తీసుకొని సంచిలో వేసుకొంటూ నడక సాగించాడు.

దాంతో సంచి బరువెక్కసాగింది. నడక భారంగా మారింది. శ్వాస తీసుకోవడంకూడ ఇబ్బందిగా మారింది. అడుగు తీసి అడుగేయడం చాలా కష్టమైపోయింది.

ఇక రెండో శిష్యుడు వెళ్తూవెళ్తూ ఉంటే, దారిలో ఆకలితో కనిపించినవారికి తన సంచిలోని తినుబండారాలను కొంచెంకొంచెంగా పంచుకొంటూ వెళ్ళాడు. క్రమక్రమంగా సంచి బరువు తగ్గసాగింది.
అతని నడక సులభం అయింది.

*ఎవరు పంచుకొంటూ వెళ్ళారో*, అతను తన గమ్యాన్ని చేరుకోవడం సులభమైంది.

*ఎవరు పోగేసుకొంటూ వెళ్ళారో*, అతను తన గమ్యాన్ని చేరుకోలేక పోయాడు.ఎన్నో కష్టాలు అనుభవించాడు.

_మరి మీరూ మనసు పెట్టి ఆలోచించండి... *ఏమి పంచారో, ఏమి పోగేసుకున్నారో* గమ్యాన్ని ఎలా చేరుకో దలచుకొన్నారో._
🙏



తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media