ఒక గ్రామంలో ఊరి బైట ఒక రామాలయం ఉన్నది.
గుడికి ఆనుకొని కోనేరు, పంచవటి గా పిలువబడే వృక్ష సముదాయం ఉన్నవి. ఏ ఊరో,పేరో, ఎక్కడివాడో తెలవదు కాని షుమారు 30 సం#ల వయసు ఉన్న ఒక యువకుడు కట్టు బట్ట లతో వచ్చి ఆ పంచవటిలో నివాసం ఏర్పరుచు కున్నాడు. నిరంతరం రామ నామ జపం,ఎక్కువ సమయం జప,ధ్యానాదు లలో గడపటం ,మధ్యాన్న, సాయం సమయాలలో మధూకరం చేసి కడుపు నింపుకోటం ఇదీ ఆతని దినచర్య. ఊరి ప్రజలు ఆయనను భోలే బాబా అని సంబోధించేవారు. ఒక రోజు బాబా యధా ప్రకారం మధ్యాన్న మధూ కరి కొరకు ఒక ఇంటి ముందు రామ భజన చేస్తూ నిలబడ్డాడు. ఆ సమయంలో ఆ ఇల్లాలు స్నానం ముగించి తలార పెట్టుకుంటూ ఉండగా భజన వినపడింది. మరో
ఆలోచనకు తావు లేకుండా తను తుడుచుకుంటున్న అంగ వస్త్రంతో వక్షోజాలను మరుగు పరుస్తూ భిక్ష తీసుకొచ్చింది. భిక్ష స్వీకరి స్తున్న బాబా దృష్టి అనుకోకుండా,ఎత్తుగా కనిపిస్తున్న వక్షస్థలి మీద పడింది. అతను అమాయకంగా,
అక్కడ గడ్డలైనాయా అమ్మా? నెప్పిగా ఉందా ? అని పరామర్శించాడు.జవాబుగా ఇల్లాలు ,గడ్డలు కావు నాయనా! పుట్టబోవు శిశువు కొరకు ముందస్తుగా పరమాత్మ ఆహారం ఏర్పాటు చేశాడు అని చెప్పింది.తిరుగు ప్రయాణంలో ఆమె మాటలు తనను తీవ్ర ఆవేదనకు గురి చేశాయి.నేనెంత మూర్ఖుణ్ణి. రాముని సేవలో తరించవలసిన ఈ అమూల్య సమయాన్ని పొట్టనింపుటకొరకా నేను వినియోగిస్తున్నది?పుట్ట బోయే శిశువు కొరకు ముందుగానే ఆహారం ఏర్పాటు చేసేదేవుడు నాకు కూడా ఏర్పాటు చేసిఉంటాడుగా! ఇప్పటి
నుండి భిక్షకు వెళ్ళను అని తీర్మానించుకొని గుడివరకే పరిమితమయ్యాడు.
ఆ నోటా ఈనోటా విషయం గ్రామస్థులకు చేరింది.వారే ఆ భక్తుడికి ఆహారం తను ఉన్న చోటికే అందివ్వటం మొదలు పెట్టారు. నిజమైన సాధకులకు,వారు ఆయా మార్గాలలో పురోగ మించేకొద్ది, బ్రతుకు భయం అధిగమిస్తారు.
"అనన్యాశ్చింతయంతోమాం............యోగ క్షేమం
వహామ్యహం"
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
సేకరణ : Social Media
No comments:
Post a Comment