Pages

ఆత్మవిశ్వాసం(self confidence)


ఆత్మవిశ్వాసం మనోబలం విడవ కుండా ఉన్నవాడు ఎప్పుడూ విజయం సాధిస్తాడు - .---
ఈవిషయంలో మీకొక కధ చెబుతాను వినరూ ! --

ఒక మహారాజు దగ్గర, ఒక మదగజం, చాలా ఏళ్ళు ఎంతో విశ్వాసంతో, ఎన్నోయుద్ధాలలో పాల్గొని ఆమహారాజుకు ఎన్నో విజయాలు సమకూర్చింది. వయస్సు మళ్ళి ఆ ఏనుగు శక్తిహీనమై పోరాట పటిమ తగ్గిందని గ్రహించిన ఆరాజు, ఆ ఏనుగును అడవిలో స్వేచ్చగా జీవించడానికి, విడిచి, సైకులను దానికి కాపలా ఉంచాడు. ఆఏనుగు, అలా అడవిలో తిరుగుతూ, ఒకరోజు ఒక కొలనులో దిగి,వూబిలొ దిగబడి, రాలేక, శక్తిలేక దీనంగా ఉండడం గమనించి, సైనికులు ఆవిషయం రాజుగారికి చెప్పారు. రాజుగారు సేనానాయకులను, పిలిచి, ఆ అడవికి దగ్గరలో, యుద్ధభేరిలు శంఖనాదాలు చేయమని చెప్పి తాను ఆహార్యంధరించి ఆ వూబి చెరువు వొడ్డున నిలబడ్డాడు. ఏనుగు ఆది గమనించి,.రాజు యుద్ధానికి బయలు దేరాడని, తన అవసరం వచ్చిందని, యుద్ధంలో పాల్గొనడం తనకర్తవ్యమని భావించి, బలం అంతా కూడగట్టుకొని, ఒక్క ఉదుటన వూబిలొ లోనుంచి బయటకు వచ్చింది. - అది ఆత్మవిశ్వాసం మనోబలం గొప్పతనం.. ....

తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

No comments:

Post a Comment