Pages

గురువు


*👌 గురువు 👌*

👉. *డబ్బు,  పేరు, పదవులు ఇవన్నీ... అర్థాలు మాత్రమే...*

👉. *పరమార్థాన్ని తెలుసు కోవడానికి, జీవన గమ్యంని చేర్చగలిగేవాడు గురువు'*
*'మాత్రమే అని చెప్పే కధ ఇది...*

👉. *ఓ సారి చదవండి...*

👉. *ఓ మహానగరంలో          ఓ గురువు గారు తన వద్దకు వచ్చేవారికి ఆధ్మాత్మిక శిక్షణ ఇస్తూ, ధర్మప్రబోధం చేస్తుండేవారు...*

👉 *మహా సంపన్నుడొకడు ఈ గురువుగారి దగ్గరకు వచ్చి...*

*👉అసలు గురువు అవసరమా?*

*👉గురువు లేకుంటే వచ్చిన నష్టమేమిటి?*

అని ప్రశ్నించాడు...

👉 *గురువుగారు నవ్వుకుని,*
*మీరేం చేస్తుంటారని అడిగారు.*

👉నాకు అతిపెద్ద సూపర్ బజార్ ఉంది. అని సమాధాన మిచ్చాడు సంపన్నుడు.

👉అయితే!
ఒకసారి మీ సూపర్ బజార్ కు నన్ను తీసుకు వెళ్లండని గురువుగారు అడిగారు.

👉 ఇద్దరూ కలిసి సూపర్ బజార్ కు వెళ్లారు.
ఆ రోజు సెలవు కావడంతో నిర్మానుష్యంగా ఉంది.

👉ఏడంతస్థుల పెద్ద భవంతి.
 అందులో దొరకని దంటూ ఉండదు. దానిని చూసిన గురువుగారు నవ్వుకున్నారు.

👉అక్కడే ఈ సంపన్నుడు ఆవులను,
కుక్కలను పెంచు తున్నాడు.

👉 ఆ మంద లోంచి ఒక ఆవును సూపర్ బజార్ లోపలికి వదల వలసిందిగా గురువుగారు కోరారు.

👉కోరినట్లుగానే ఆవును లోపలికి ప్రవేశపెట్టారు.

అది అన్నీ తిరుగుతూ, తిరుగుతూ చివరకు ఒక మూల ఆకుకూరలు, కూరగాయలు,
పండ్లు ఉన్న పండ్ల దుకాణం లోకి వెళ్లింది. కడుపు నిండా ,
తృప్తిగా మేసింది.
రెండు గంటల వ్యవధిలో తిరిగి వచ్చేసింది.

👉తదుపరి తను పెంచుతున్న కుక్కను లోపలికి వదల మని కోరారు గురువుగారు. దానిని కూడా లోపలికి పంపారు.

అది కూడా తిరుగుతూ, తిరుగుతూ వాసన చూస్తూ, మూడవ అంతస్థులో మాంసం అమ్మే దుకాణం లోకి వెళ్లింది.

తృప్తిగా తినేసింది. మూడు గంటల వ్యవధిలో అది కూడా తోక ఊపు కుంటూ.... యజమాని దగ్గరకు వచ్చేసింది.

👉 ఈ సారి ఒక సామాన్యుడిని పిలిచి, నీకు నచ్చిన దానిని తీసుకో అని చెప్పి పంపారు గురువు.

👉ఉత్సాహంతో లోపలికి ప్రవేశించిన మనిషి అన్నింటినీ చూసి, ఉక్కిరి బిక్కిరై పోయాడు.

ఏం తీసు కోవాలో అర్ధం కావటం లేదు.

👉రెండు, మూడు, నాలుగు గంటలు గడిచి పోయినా... బయటకు రావడం లేదు.
 అందరూ ఆశ్చర్య పోయారు.
గురువుగారు యజమానిని కలిసి అతడున్న చోటకి చేరుకున్నాడు.

 నెత్తిమీద చేతులు పెట్టుకుని దిక్కులు చూస్తున్న ఆ వ్యక్తికి ఏం కావాలో అర్ధం కావడం లేదు.

ఈ వస్తులన్నింటినీ చూస్తుంటే పిచ్చెత్తి పోతోంది.

అన్నాడు ఆ వ్యక్తి.

👉దీనిని విన్న... సంపన్నుడు అవాక్కయ్యాడు.

👉ఆవుకీ, కుక్కకీ పిచ్చెక్కలేదు.

వాటికి ఏం కావాలో... వెతుక్కుని తృప్తిగా... ఆరగించి వచ్చాయి.

👉. *మనిషి మాత్రం ఏం కావాలో తనకే తెలియదు.*

*తనకే అన్ని తెలుసను కుంటాడు.*

👉. *పాపం! అందుకే... వీడికి... గురువు కావాలి.*

👉 *ఎలా జీవించా లో జీవిత ఔన్నత్యాన్ని ఎలా పొందా లో తెలుసు కోవాలి.*

👉. *అందుకే వాటిని తెలియ జెప్పే గురువు అత్యంత అవసర మని గురువు గారు చెప్పడం తో... యజమానికి ధనగర్వం తొలగింది.*

👍. *గురువు తోనే గమ్యం సాధ్యమని తెలుసు కున్నాడు*

తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

సమయస్ఫూర్తి



ఒక కప్పను తీసుకొని “వేడి నీటిలో” పడేస్తే, అది
వెంటనే బయటకి దూకేస్తుంది! అదే కప్పను చల్ల నీటి గిన్నెలో వేయండి. అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు మెల్లగా నీటిని వేడి చేయండి. కప్ప సహజగుణం ఏంటి అంటే, వేడి పెరిగే కొద్దీ దానంతట అదే తన శరీరాన్ని ఆ వేడికి అడ్జస్ట్ చేసుకోగలదు. కానీ ఒకసారి నీరు
మరగడం మొదలైతే “కప్ప” అందులో ఉండలేదు. బయటకి దూకేయాలని చూస్తుంది. కానీ అప్పుడు అది
దూకలేదు. ఎందుకంటే నీటి వేడికి అప్పటిదాకా అడ్జస్ట్అవ్వడంతో తన శక్తి అంతా కోల్పోతుంది. ఇక బయటకి దూకే శక్తి లేక అందులోనే ఉండిపోయి చివరికి
మరణిస్తుంది.

ఇది కేవలం కథ కాదు.
ఇందులో చాలా నీతి ఉంది!

ఇప్పుడు ఒకటి ఆలోచించండి! కప్ప ఎలా
చనిపోయింది? — చాలా మంది వేడి నీటి వల్ల
అంటారు!

కానీ నిజానికి వేడి నీటి వల్ల కప్ప చనిపోలేదు. నీటిలో
నుండి బయటకి ఎప్పుడు దూకేయాలో నిర్ణయించుకోలేక చనిపోయింది. కొద్దిగానే వేడిపెరిగింది కదా ,సర్దుకుపోదాంలే అనుకుంటూ వేడి నీటిలోనే ఉండి
పోయింది. చివరికి నీరు మరిగే సరికి అది బయటకి
దూకలేకపోయింది!

అలాగే మనం కూడా జీవితంలో అడ్జస్ట్ అవ్వాలి.
కానీ అడ్జస్ట్ అవుతూనే ఉండి జీవితంలో పైకి ఎదగకుండా అక్కడే ఉండిపోవద్దు. ఎదుటి వాడికి మనల్ని మానసికంగా, శారీరకంగా,ఆర్థికంగా హింసించే అవకాశం ఇచ్చాము అనుకోండి. వాడు హింసిస్తూనే
ఉంటాడు. మనం మొదట్లో భరించగలము.
కానీ చివరికి వచ్చేసరికి భరించలేము. అందుకే
మనకి శక్తి ఉన్నప్పుడే సమస్యనుండి బయటకి వచ్చేయాలి. పర్లేదులే అనుకుంటూ భరిస్తూ ఉంటే, చివరికి సమస్యల వలలో చిక్కుకొని మరణించాల్సి
వస్తది!.
జీవితంలో ఎలాంటి పరిస్థితిలో అయినా తగిన సమయంలో నిర్ణయం తీసుకోడం చాలా
ముఖ్యం..

తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

పిప్పలాద మహర్షి


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

పిప్పలాద మహర్షి

శనిగ్రహాన్ని నిగ్రహించిన మహర్షి "పిప్పలాదుడు"
పిప్పలాదుడు కౌశికమహర్షి కుమారుడు. కౌశికుడు తన కుమారుడిని పోషించలేక ఒకరోజు అడవిలో వదిలేసి వెళ్లిపోతాడు. తల్లిదండ్రుల ప్రేమకి దూరమైన ఆ పిల్లవాడు అక్కడి రావిచెట్టు నీడలో తలదాచుకుంటూ . ఆ చెట్టు పండ్లు తింటూ అక్కడికి దగ్గరలో గల చెరువులోని నీళ్లు తాగుతూ కాలం గడపసాగాడు. ఈ కారణంగానే ఆ పిల్లవాడికి " పిప్పలాదుడు" అనే పేరు వస్తుంది.
ఆ పిల్లవాడి పరిస్థితి బాధకలిగించడంతో నారద మహర్షి అతని దగ్గరికి వస్తాడు. 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ నామం అతని జీవితానికి వెలుగును చూపిస్తుందని చెప్పి వెళ్లిపోతాడు. పిప్పలాదుడు అనుక్షణం ఆ మంత్రాన్ని జపిస్తూ మహర్షిగా మారిపోతాడు.ఆ తరువాత పిప్పలాదుడిని కలిసిన నారద మహర్షి ఆయన సాధించిన తపోశక్తిని గురించి ప్రస్తావిస్తూ అభినందిస్తాడు.
పిప్పలాదుడు బాల్యంలో తాను కష్టాలు పడటానికి కారణమేమిటని నారద మహర్షిని ఆయన అడుగుతాడు. శనిదేవుడే అందుకు కారణమని నారదుడు చెప్పడంతో, ఆ మహర్షి ఆగ్రహావేశాలతో శనిదేవుడిని గ్రహమండలం నుంచి కిందకి లాగి బాల్యదశలో ఎవరినీ పీడించవద్దని హెచ్చరిస్తాడు.

ఇంతలో దేవతలంతా అక్కడికి చేరుకొని పిప్పలాదుడికి నచ్చజెబుతారు. ఆయన శాంతించి శనిదేవుడిని తిరిగి గ్రహమండలంలో ప్రవేశపెడతాడు. అందుకు సంతోషించిన బ్రహ్మ దేవుడు శనివారం రోజున ఎవరైతే 'పిప్పలాద మహర్షి' నామాన్ని స్మరిస్తారో, వాళ్లకి శని సంబంధమైన దోషాలు బాధలు ఉండవని వరాన్ని ఇస్తాడు. అందువలన శని దోషంతో బాధలుపడే వాళ్లు పిప్పలాద మహర్షి నామాన్ని స్మరించడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది.

పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం

నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే ||

నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో ||

నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం కురు దేవేశ, దీనస్య ప్రణతస్య చ ||
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

దానకర్ణ


కర్ణుడిని దానకర్ణుడని ఎందుకంటారు

ఒకనాడు శ్రీకృష్ణుడు పొద్దున పొద్దున్నే కర్ణుని భవనానికి వెళ్ళాడట.
అప్పుడు కర్ణుడు అభ్యంగన స్నానానికి తయారవుతున్నాడు.
తలకు నూనె రాసుకుంటున్నాడు. కర్ణునికి ఎడమ వైపు రత్నాలు పొదిగిన బహువిలువైన గిన్నె నూనెతో వున్నది.
కృష్ణుడు వస్తూనే కర్ణా ఆ గిన్నె చాలా బాహున్నది నాకిస్తావా? అని అడిగాడు.
వెంటనే కర్ణుడు తీసుకో కృష్ణా అంటూ ఎడమ చేత్తో ఆ గిన్నె యిచ్చాడు. కృష్ణుడు అదేమిటి కర్ణా ఎడమచేత్తో యిస్తున్నావు? కుడిచేత్తో యీయరాదా? అన్నాడు.
అందుకు కర్ణుడు,

"క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవిత మావయో:
యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతి:"

అర్థము:-- కృష్ణా!ఎడమ చేతిలోని గిన్నె కుడిచేతి లోకి తీసుకునే లోపే ఏమవుతుందో తెలియదు. లక్ష్మి
చంచల మైనది. యముడా దయలేనివాడు. మనస్సా మరు క్షణంలో ఎలా మారుతుందో తెలియదు. కనుక గిన్నె ఈ చేతినుంచు ఆ చేతికి పోయే లోపలే ఏ మార్పైనా రావచ్చు.
అందుకనే ధర్మ కార్యాన్ని ఆ క్షణమే చెయ్యాలనే హితోక్తి ననుసరించి యిలా చేశాను అన్నాడు.
అప్పుడు కృష్ణుడు కర్ణుని వివేచనకు సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నాడు.
అందుకు కర్ణుడు,

"దేహేతి వచనం కష్టం నాస్తీతి వచనం తదా
దేహీ నాస్తీతి మద్వాక్యం మా భూజ్జన్మ జన్మనీ"

అర్థము:- కృష్ణా! యాచించడం ఎంత కష్టమో, లేదని చెప్పడం కూడా అంతే కష్టం.అంతే కాదు నీచం కూడా కనుక ఏ జన్మ లోనూ దేహీ(అని యాచించే) , నాస్తి(లేదు) అనే మాటలు నా నోటివెంట రాకుండు నట్లు అనుగ్రహించు. అని కోరాడు.
దీన్ని బట్టి కర్ణుడి వ్యక్తిత్వం ఎంతటి మహోన్నత మైనదో అర్థమవుతుంది.
దానం విషయం లో సదా సాత్వికమే ప్రధానం చెయ్యాలనే సంకల్పం కలుగ గానే ఆదరణ తో భగవదర్పణ బుద్ధితో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రెండవ చేతికి కూడా తెలియనంత రహస్యంగా దానం చెయ్యాలి.
దానం చేసి నేను చేశానని డప్పు కొట్టుకోకూడదు.
ఏదైనా మంచి పని చెయ్యాలని అనిపించిన వెంటనే చేసెయ్యాలి ఆలస్యం విషం లాంటిది. అంటారు జ్ఞానులు.

మనము కర్ణుడి లాగా వ్యవహరించ లేకపోయినా మన శక్త్యానుసారం సత్పాత్ర దానం చేయడం అలవరుచుకోవాలి. ...

కర్ణుడిని కృష్ణుడు ఎప్పుడు పడితే అప్పుడు  దానకర్ణుడని అభివర్ణించడం అర్జునుడికి నచ్చలేదు. కృష్ణుడితో అర్జునుడు వాదనకు దిగుతాడు. ఈ విషయమై వీరి మధ్య చాలాసేపే మాటలు సాగాయి. ఇక లాభం లేదనుకున్న కృష్ణుడు వెంటనే ఒక బంగారు పర్వతం సృష్టించాడు. అర్జునుడితో కృష్ణుడు ఆ బంగారు పర్వతాన్ని ఈ రోజు సాయంత్రం లోపల ఒక్క ముక్క మిగల్చకుండా దానం చెయ్యాలి. అలా నువ్వు చేస్తే నేను నిన్ను దానం చేయడంలో కర్ణుడి కన్నా  గొప్ప వాడిగా చెప్తాను. కొనియాడుతాను. సరేనా అని అంటాడు. అర్జునుడు ఈ విషయాన్ని ఊరు ఊరంతా ప్రచారం చేయిస్తాడు. తాను బంగారు పర్వతాన్ని దానం చేయబోతున్నాను అని అంటాడు. అందరినీ రమ్మంటాడు. అలాగే అందరూ వస్తారు. బంగారాన్ని ముక్కలు చేసి దానం చెయ్యడం ప్రారంభిస్తాడు అర్జునుడు.  అలా ఇస్తూనే ఉంటాడు అర్జునుడు. అయినా వరస తగ్గుతోంది కాని బంగారం ఇంకా మిగిలే ఉంది. కృష్ణుడు చెప్పినట్టు ఆ రోజు సాయంత్రం లోపల అర్జునుడు దానం చెయ్యలేకపోతాడు. సగం కూడా దానం చెయ్యలేదు. ఇంతలో ఆవైపుగా కర్ణుడు వస్తాడు. కృష్ణుడు కర్ణుడిని పిలిచి "కర్ణా...ఈ బంగారు పర్వతాన్ని రేపు ఉదయం లోపు దానం చెయ్యాలి...నీ వల్ల అవుతుందా" అని అడుగుతాడు. కర్ణుడు "అదేం పెద్ద పని కాదే...ఇది దానం చెయ్యాలి అంతేగా... " అంటూ కర్ణుడు అటు వచ్చిన ఇద్దరిని పిలిచి "ఈ బంగారు పర్వతాన్ని మీ ఇద్దరికీ దానం చేస్తున్నాను...దీనిని మీరిద్దరూ సరిసమానంగా పంచుకుని ఉపయోగించుకోండి" అని వారిద్దరికీ ఆ బంగారాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కర్ణుడు. అప్పుడు కృష్ణుడు అర్జునుని చూసి "ఇప్పుడు నీకు, కర్ణుడికి మధ్య ఉన్న తేడా తెలిసిందా...? ఈ బంగారు పర్వతాన్ని పూర్తిగా ఇచ్చేయ్యాలనే ఆలోచన రానే లేదు. మరి నిన్ను  దానం చేయడంలో కర్ణుడిని మించిన వాడివని ఎలా కొనియాడను" అని ప్రశ్నిస్తాడు. అర్జునుడి నోటంట మరో మాట లేదు. ఒక్కొక్కరి గుణం ఒక్కొక్కలాంటిది. ఎవరి ప్రత్యేకత వారిది. కర్ణుడు  దానం చేయడంలో దిట్ట. ఈ విషయంలో అతనిని మించిన వారు లేరు అని చెప్పడానికి కృష్ణుడు ఆడిన నాటకమిది.

కృష్ణుడు ఓ వ్యక్తి కోసం కన్నీళ్లు పెట్టాడంటే ఆ వ్యక్తి ఎంతటి ఉన్నతమైన వ్యక్తి అయ్యుండాలి 

అవునండి కృష్ణయ్య కర్ణుడి కోసం కన్నీళ్లు పెట్టాడు 
యుద్ధం లో మరణంతో పోరాడుతున్న కర్ణుడిని చూసి కన్నీళ్లు పెట్టాడు కిట్టయ్య 

కర్ణుడు చేసిన దానధర్మాలు అతడిని మృత్యువు ధరి చేరకుండా ఉండడంతో కృష్ణుడు కర్ణుడిని వెళ్ళి ఒక కోరిక అడిగాడు 

కర్ణా నువ్వు దానం చేయగా పొందిన పుణ్యఫలాలన్నీ నాకు దానం చేయవా అని అడిగాడు 
కర్ణుడు కృష్ణుడు అడగగానే దానం చేసేసాడు 

అప్పుడు కృష్ణుడు కర్ణుడి తలను తన చేతులతో పట్టుకుని నీకో వరమిస్తాను ఏమి కావాలో అడుగు అన్నాడు 

అందుకు కర్ణుడు నాకు ఇంకో జన్మ వద్దు 
ఒకవేళ అలా ఉంది అంటే అప్పుడు కూడా ఎవరు ఏమి అడిగినా లేదు అని చెప్పకుండా ఇచ్చేటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు అని అడిగాడు 

ఆ మాట వినగానే కృష్ణయ్య కళ్ళు కన్నీటి ధారలై పొంగాయి 
ఇంతమంచి వాడి వేంటయ్యా కర్ణా నువ్వు అని గట్టిగ కర్ణుడి దేహాన్ని తన హృదయానికి హత్తుకున్నాడు కృష్ణుడు 

మనం మంచి మనసున్న వారిమైతే చాలండి 
దేవుడి మోక్షం కోసం తపస్సు చేయాల్సిన అవసరం లేదండీ 
జీవితం ముక్తి పొందడం కోసం దైవదర్శనాలు అంటూ తిరగక్కరలేదండి 

మంచి మనసుంటే చాలండి ఆ భగవంతుడే దిగి వచ్చి తన గుండెలకు మనల్ని హత్తుకుంటాడు 

కర్ణుడంత కరుణామయులం కాకపోయినా ఏదో ఆయన చిటికిన వేలంత మంచిగా బతికేద్దాం అండి 
కృష్ణుడు మనకోసం రాకపోయినా నెమలి పింఛాన్నైనా రప్పించేసుకుందాం అండి మనం 
🙏🙏🙏🙏 


తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

పట్టుదల




ఇంద్రుడు ఒక రోజు ఆకాశ మార్గాన వెళ్తుండగా ఒక పేద రైతు పొలం దున్నుతూ కనిపించాడు..
నేను ఈరోజు ఇక్కడ వర్షం కురవాలని చెప్పలేదే ? మరి ఎందుకు ఈ రైతు దున్నుతున్నాడు అని సందేహము కలిగినది.
వెంటనే మారు వేషం లో రైతు దగ్గరకు వెళ్ళి అడిగాడు.
రైతు నాకెందుకో ఈ రోజు వర్షం కురుస్తుంది అనిపించింది, అందుకే దున్నుతున్నాను అన్నాడు.
ఇంద్రుడు విని ఇక దున్నవద్దు, వర్షం రాదని చెప్పి వెళ్ళిపోయాడు.
కాని రైతు దున్నడము మానలేదు.

ఇంద్రునికి కోపము వచ్చింది.
వరుణుడి ని పిలిపించి అక్కడ వర్షం పడకూడదు అని చెప్పాడు.
వరుణుడు సరే కానీ చల్లని గాలి వీస్తే మాత్రమ్ నేను ఏమీ చేయ్యలేనన్నాడు..
పవనుడి ని పిలిపించి అక్కడ చల్లని గాలి వీచకూడదు అని చెప్పాడు.
దానికి పవనుడు సరే కానీ అక్కడ కప్పలు అరిస్తే మాత్రమ్ నేను ఏమీ చెయ్యలేను అన్నాడు.
ఇంద్రుడు కప్పల నాయకుడిని పిలిపించి విషయం చెప్పాడు , కప్పల నాయకుడు మేము ఈ రోజు అస్సలు అరవము...కానీ మినణుగురు పురుగులు మిణుకు మిణుకు మని కనిపిస్తే మాత్రమ్ మేము ఏమీ చెయ్యలేము అన్నాడు..
ఇంద్రుడు వాటిని పిలిపించి ఈ రాత్రి మీరు బయటకు రాకూడదు అని చెప్పాడు,
అవి సరే మేము అస్సలు ఈ రాత్రి బయటకు రామని చెప్పాయి.
ఇంద్రుడు ఇంక వర్షం ఎలా కురుస్తుందో చూద్దామ్ అనుకొన్నాడు..
కానీ ఆ రాత్రి వర్షం కురిసింది..
ఇంద్రునికి అవమానంతో పట్టరాని కోపము వచ్చింది.
అందరినీ పిలిపిన్చాడు.
వరుణుడు చల్లగాలి వీచిన్ది మహారాజ అన్నాడు..
పవనుడు కప్పలు అరవడం వల్లే వీచానన్నాడు...
కప్పలు మిణుగురులు మిణుకు మిణుకు మని మెరవడమ్ వల్లే అరిచాము అన్నవి..
మిణుగురు పురుగులు మేము మాత్రమ్ అస్సలు బయటకు రాలేదు అన్నవి...
ఇంద్రునికి ఏమి జరిగిందో పాలుపోలేదు..
నారదునికి విన్నవించారు.
నారదుడు రాత్రి జరిగినది చెప్పాడు.
ఆ రైతు రాత్రి పోలములో తన పని పూర్తి కాకపోతే తన భార్యా పిల్లలతో కలసి దీపాలు వెలిగించుకొని దున్నుతూ ఉన్నారు..
ఆ దీపాల మిణుకు మనే వెలుగు చూసి కప్పలు మిణుగురు పురుగులనుకొని పొరపాటు పడ్డాయి..
కప్పలు అరవడం తొ చల్లటి గాలి వీచింది..
దానితో వర్షం కురిసింది అని చెప్పాడు......

" నమ్మకం తో ప్రయత్నం చేసినవారు వారు ఎన్నడూ నష్టపోరు."

ప్రయత్నం చేస్తే  తప్పకుండ పలితం వస్తుంది .........🌸🌸🌸🌸🌸

తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

అల్లూరి సీతారామరాజు


జాతికోసం తమ ప్రాణాలనే త్యాగం చేసిన అమర వీరులను స్మరించుకుందాం .....
పేరు : అల్లూరి సీతారామరాజు
తండ్రి పేరు : శ్రీ వెంకట రామరాజు
తల్లి పేరు : శ్రీమతి సూర్యనారాయణమ్మ
పుట్టిన తేది : 4-7-1897.
పుట్టిన ప్రదేశం :పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు ఆరు మైళ్ళ దూరంలో మోగల్లు అనే గ్రామంలో జన్మించాడు.
చదివిన ప్రదేశం : రాజమండ్రి, నర్సాపురం, కాకినాడ.
చదువు : నాల్గవ ఫారం.
గొప్పదనం : బ్రిటీషు వారిని ఎదిరించి దేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు.
స్వర్గస్తుడైన తేది : 7-5-1924.
నేటి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం తాలూకా, నాడు కృష్ణాజిల్లా లోనిది. భీమవరంకు ఆరు మైళ్ళ దూరంలో మోగల్లు అనే గ్రామం వుంది. ఆ గ్రామమే రామరాజు స్వగ్రామం. సీతారామరాజు ముత్తాత గోపాల కృష్ణం రాజు. తాత వెంకట కృష్ణం రాజు. సూర్యనారాయణమ్మ పూర్వీకులు అనకాపల్లి దగ్గర "పాండ్రంకి"లో స్థిరపడిపోయారు. 1902 లో వారి కుటుంబం రాజమహేంద్రవరంలో స్థిరపడిపోయింది. ఫోటోగ్రాఫర్ గా వెంకట రామరాజుగారికి మంచి పేరు వచ్చింది. ఆదాయం కూడా క్రమంగా పెరుగ సాగింది. ఫోటోలు తీసేవారు చాలా తక్కువమంది కావడం చేత ఆయనకు చేతినిండా పనివుండేది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ఫోటోలను ఆయనే తీసేవారు. అప్పుడే తిలక్, లాలాలజపతిరాయ్ వంటి ప్రముఖుల ఫోటోలను తీయడం జరిగింది. 1905 లో వంగ రాష్ట్రవిభజన జరిగింది. స్వదేశీ ఉద్యమం ప్రారంభమయింది. వెంకట రామరాజుని కూడా ఈ ఉద్యమం ఆకర్షించినా ఆయన పాల్గొనలేదు. దేశభక్తి ఆయనను ఆవరించినా కుటుంబ పోషణభారం వల్ల ఆయన స్టూడియోలోనే ఉండేందుకు నిర్ణయించుకొన్నాడు. కానీ జాతీయ భావంతో కూడిన నినాదాలు ఇంటిలో చేస్తూనే, "వందేమాతరం" అని పాడుతూనే ఉండేవాడు. 1906లో రామరాజుకు, సోదరుడు సత్యనారాయణ రాజు జన్మించాడు. ఆయన ప్రభావం కుమారుడైన రామరాజు మీద పడింది. రామరాజు చిన్నతనం నుండే ఎంతో అందంగా వుండేవాడు. బంగారు రంగుతోనున్న అతని శరీరంలో ఆకర్షణీయమైన తేజస్సు వుండేది. చిన్ననాటినుండి రామరాజులో ఓ ప్రత్యేకత కనిపించేది. జీవరాసులపట్ల ప్రేమ, దయ చూపేవాడు. చిన్నప్పటి నుండే రామరాజులో స్వతంత్ర భావం, జాతీయ భావం ఉండేది. దానికి కారకుడు తండ్రే.. రామరాజుకు తల్లిదండ్రులే మార్గదర్శకులు. ఒక రోజు సాయంత్రం రాజమహేంద్రవరంలో రామరాజు తండ్రితో కలిసి వీధిలోకి వెళ్ళే సమయంలో ఓ తెల్లదొర గుర్రం మీద ఎదురు రావడం జరిగింది. చుట్టు నున్న వారు నమస్కరించేందుకు చేతులెత్తడం చూచి రామరాజు కూడా యెత్తబోయాడు. కాని తండ్రి ఆ చేతులపై కొట్టి "తెల్లవాడికి నమస్కరింపరాదు" అని మందలించాడు. ఆ పసి హృదయంలో ఆ మాటలు నిలచిపోయాయి. మోగల్లులో వున్నప్పుడే రామరాజుకు అయిదవ సంత్సరంలోనే విద్యాభ్యాసం జరిగింది. చిన్న తరగతుల్లోనే ఎంతో తెలివిగా మెలిగేవాడు. అందుచేత ప్రాధమిక పాఠశాలలో మూడవ తరగతి నుండి అయిదులో వేశారు. రాజమహేంద్రవరంలో స్థిరపడిన తరువాత దేశ పరిస్థితులలో మరింత మార్పు కనిపించింది. స్వాతంత్ర సమరం మరింత వేగం పుంజుకుంది. 1907లో బెంగాలులో ఉద్యమాలు ప్రారంభం అయ్యాయి.



Pages: 1 2 3 4 5 6

తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

ప్రార్థన


ఒక అద్భుతమైన కథ...!
స్టీఫెన్ అనే ఒక ప్రఖ్యాత డాక్టర్,
వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప అవార్డును అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు.
రెండూ గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది.
కాన్‌ఫరెన్సుకు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒకా కారు అద్దెకు తీసుకుని ప్రయాణం కొనసాగించాడు.
మళ్ళి కొంతసేపు అయిన తరువాత, విపరీతమైన గాలివాన, వర్షం . . .
దానితో ఈ వాతావరణంలో ముందుకు సాగలేకఆగిపోయాడు.
భరించలేని ఆకలి, అలసట, వేళకు వెళ్ళలేకపోతున్నాను అనే చికాకులతో ఉన్నాడు ఆ డాక్టరు, కొంతదూరం ముందుకు వెళ్ళాక, అతనికి ఒక చిన్న ఇల్లు కనిపించింది.
ఆ ఇంట్లోకి వెళ్ళి వారి ఫోను ఉపయోగించుకుందాము అనుకున్న ఆ డాక్టరుకు
ఆ ఇంటి తలుపు తీసిన ఒక ముసలామె తన ఇంట్లో కరంటు, ఫోను సౌకర్యాలు లేవు అని, బాగా వర్షంలో తడిసిపోయినందున తన ఇంట్లో కొంత సేపు విశ్రాంతి తీసుకోమని, వెచ్చగా ఉండేందుకు టీ, కొంత ఆహారం తేబుల్ మీద పెట్టి తను ప్రార్ధన చేసుకోవడానికి వెళ్ళింది.
ఆమె పక్కన ఉయ్యాలలో ఒక పసివాడు ఉన్నాడు. ఆమె గురించిన వివరాలు తెలుసుకుందామనుకున్నా, ఆమె ప్రార్ధనలు ఎంతకీ పూర్తి అవటం లేదు.
ఎట్టకేలకు ఆమె ప్రార్ధనలు ముగించి వచ్చిన తరువాత, ఆమె మంచి మనసుకు ఆమె చేసిన ప్రార్ధనలు అన్నీ ఆ భగవంతుడు వింటాడు అని భరోసా ఇచ్చాడు.
ఆ ముసలామె చిరునవ్వు నవ్వి, భగవంతుడు నేను కోరిన అన్ని కోరికలూ తీర్చాడు ఒక్కటి తప్ప, ఎందుకనో ఈ కోరిక మాత్రం తీర్చడం లేదు అని చెప్పింది.
ఆమెకు అభ్యంతరం లేకపోతే, ఆమెకు కల కోరిక ఏమిటో చెప్పమని,
తాను సాధ్యమైనంత సహాయపడతానని చెప్పాదు వైద్యుడు.
ఆమె ఇలా చెప్పటం ప్రారంభించింది.
"ఈ ఉయ్యాలలో ఉన్నవాడు నా మనుమడు.
అతనికి ఒక అరుదైన క్యాన్సర్ వ్యాధి సోకింది.
ఎంతో మంది వైద్యులకు చూపించాము.
ఎవ్వరూ నయం చేయలేకపోయారు.
ఒక్క స్టీఫెన్ అన్న ఆయన మాత్రమే ఈ వ్యాధి తగ్గించగలడు,
ఆయన ఇక్కడికి చాలా దూరంలో ఉన్నాడు.
అందుకే వైద్యం మీద ఆశ వదిలేసి,
భగవత్ ప్రార్ధనలతో జీవితం గడిపేస్తున్నాను అని చెప్పింది.
వింటున్న డాక్టరు కళ్ళల్లో నీళ్ళు "భగవంతుడు దయామయుడు.
ఆయన మీ ప్రార్ధనలు వినడమే కాదు, ఆ డాక్టరును మీ వద్దకే తీసుకువచ్చాడు కూడా. విమానం పాడయ్యి గాలివానలో చిక్కుకుని నేను మీ ఇంటికి వచ్చాను.
కాదు కాదు ఈ పరిస్థితి సృష్టించి ఆయనే నన్ను మీ వద్దకు పంపాడు.
ఆ డాక్టర్ స్టీఫెన్ ను నేనే." అని బదులిచ్చాడు.
అప్పుడు ఆ క్షణం అతను అందుకోవలసిన అవార్డు అతనికి గుర్తు రాలేదు.
ప్రార్ధన లోని మహత్యం అదే. మనం వెళ్ళలేని చోటుకు కూడా దాని శక్తి వెళుతుంది. కావలసినది నమ్మకం అంతే.
1.అడగడం,
2. నమ్మడం,
3.అందుకోవడం...
ఇవే ప్రార్ధనకు కావలసిన అంశాలు.

భగవంతుని నమ్మి మనం ప్రార్ధిస్తే,
మనకు కావలసినది ఆయన తప్పక మనకు లభింపచేస్తాడు..

తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

వదంతి-పరిణామం


‘RUMOURS’

Once upon a time an old man spread rumors that his neighbor was a thief. As a result, the young man was arrested. Days later the young man was proven innocent.
After been released he sued the old man for wrongly accusing him. In court the old man told the Judge : They were just comments, didn't harm anyone..
The judge, before passing sentence on the case, told the old man : Write all the things you said about him on a piece of paper. Cut them up and on the way home, throw the pieces of paper out. Tomorrow, come back to hear the sentence.
The next day, the judge told the old man : Before receiving the sentence, you will have to go out and gather all the pieces of paper that you threw out yesterday. The old man said : I can't do that ! The wind spread them and I won't know where to find them. The judge then replied : The same way, simple comments may destroy the honor of a man to such an extent that one is not able to fix it. "If you can't speak well of someone, rather don't say anything."
Let's all be masters of our mouths, so that we won't be slaves of our words.


                                                                                                                                                                                              Author: Unknown


తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

కర్తవ్యం



అద్భుతమైన నీతి కథ

ఒక అడవి లో ఒక లేడి 🐺భారంగా అడుగులు వేస్తూ వెడుతోంది . అది నిండు గర్భిణి....దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి .అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది .ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది . దానికి అటుపక్క నది 🌊☄☄ ప్రవహిస్తోంది . అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది . నొప్పులు మొదలయ్యాయి . నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది🐺 .....అప్పుడే దట్టమైన మబ్బులు☁☁ కమ్మాయి . ఉరుములు , పిడుగులు ⚡💥. పిడుగు పడి కొద్ది దూరం లోనే గడ్డి అంటుకుంది🔥🔥🔥 . దూరంగా తన ఉనికిని గమనించి కుడి వైపు నుండి ఒక సింహం 🦁వస్తోంది . ఎడమవైపు నుండి ఒక వేటగాడు👺 బాణం సరి చూసుకుంటున్నాడు. ఇంకో వైపు నది వెళ్ళనివ్వదు ...!
🔴భగవాన్ ! ఆ లేడి 🐺ఇప్పుడు ఏమి చెయ్యాలి ?.
🔴ఏమి జరగబోతోంది ?
🔴లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా ? 🔴బిడ్డ బతుకుతుందా?
🔴 సింహం🦁 లేడిని తినేస్తుందా ?
🔴వేటగాడు👺 లేడిని చంపెస్తాడా ?
 🔴నిప్పు 🔥లేడి 🐺వరకూ వచ్చి లేడి కూనను చంపేస్తుందా?
ఒక వైపు నిప్పు 🔥,
రెండో వైపు నది🌊 , మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపం లో వేటగాడు👺🦁 , సింహం.  కానీ లేడి మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు.
అది తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది..... అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి.......పిడుగు కాంతికి వేటగాడి👺 కళ్ళు చెదిరాయి. గురి తప్పి బాణం సింహానికి🦁 తగిలింది. వర్షం⛈🌧 పడి సమీపిస్తున్న మంటలు 🔥🔥 ఆరిపోయాయి. లేడి పిల్ల తల్లి గర్భం లో నుండిబయటకు వచ్చింది. అది ఆరోగ్యం గా ఉంది.......ఏదైతే జరగనీ , నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అని అదిఅనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి ఉండి వుంటే ..... ఏమి జరిగేది????....మన జీవితాలలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టూ ముడుతూనే ఉంటాయి . నెగటివ్ ఆలోచనలతో సతమవుతూనే ఉంటాము . మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము .భగవంతుడిపై భారం వేసి మన పని మనం చెయ్యడమే మనం చెయ్యవలసినది.

తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

తెలుగువ్యాకరణం-ప్రాచీన కవుల మాటలచమత్కారం



వ్యాకరణం (తెలుగు) తెలిసిన వారికి విందు భోజనం:-

ఈ సంఘటన చాలా పాతకాలం నాటిది. ఒక పండితుడు వేరొక పండితుడి గ్రామానికి బస్సులో వస్తున్నానని కబురు చేశాడు. తన ఇంటికి వస్తున్న పండితుడిని ఆహ్వానించి, ఇంటికి తీసుకెళ్లడానికి ఎడ్లబండి కట్టుకొని బస్సు వచ్చే చోటికి వెళ్లాడు.

బస్ స్టాండ్ గ్రామానికి 3, 4 మైళ్ళ దూరంలో ఉంది. అందునలన, వేరే బండివాడిని తీసుకరాకుండా, తానొక్కడే ఎద్దులను కట్టి, బండి తోలుకుంటూ బస్టాండ్ కు వచ్చాడు. బస్సు దిగిన సోదర పండితుడిని సాదరంగా ఆహ్వానించి, బండిలో కూర్చోబెట్టుకొని తన గ్రామానికి బయలుదేరాడు.

పల్లెటూరుకు వెళ్లే త్రోవ కాబట్టి, అంత బాగా ఉండదు. నల్లేరు మీద బండి నడక కాకుండా, ఎగుడు దిగుడు బండల మీద త్రోవ వల్ల, ఎద్దుల బండి బాగా కుదుపులతో వెళుతూవుంది. కుదుపులు ఎక్కువ ఉండడం వలన పోరుగూరి నుంచి  వచ్చిన పండితుడు 'అబ్బబ్బ వెధవ బండి' అన్నాడు.

దానికి, బండి యజమానియైన పండితుడు, ఏమండీ మీరంటున్నది షష్టీ తత్పురుషమా! లేక కర్మధారయమా! అన్నాడు నవ్వుతూ. షష్టీ తత్పురుషము అయితే 'వెధవ యొక్క' బండి అనే అర్థము వస్తుంది. అదే కర్మధారయమైతే 'వెధవ (యైన) బండి' అనే అర్థము వస్తుంది. (బండి యొక్క యజమాని వెధవనా? బండి వెధవదా?).

దానికి పొరుగూరి పండితుడు నవ్వుతూ, "యేదీ కాదు చతుర్థీ తత్పురుషము లెండి" అన్నాడు. (అంటే వెధవ కొఱకు బండి) అని. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. ఆ కాలంలో పండితులు మాటల్లో కూడా అలాంటి చెణుకులు విసురుకొని ఆనందించేవారు.

                                    *****


ఇంకొక చమత్కార సంభాషణను ఆస్వాదిద్దాం.

ఒక శిష్యుడు, గురువుగారి దగర విద్య అభ్యసించి,
పెళ్ళి చేసుకొని ఊరికి వెలుపల ఇల్లు కట్టుకొని స్థిరపడ్డాడు. ఒకరోజు గురువుగారు ఎడ్లబండి మీద శిష్యుడి గ్రామం దారిలో వెళుతూ, ఒకసారి చూసి వెళ్దామని, శిష్యుడి యింటికి వచ్చాడు.

రాక రాక వచ్చిన గురువు గారికి, శిష్యుడూ, అతడి భార్య చక్కని ఆతిథ్య మిచ్చి, తాంబూల సహిత పంచలచాపు యిచ్చి పాదాలకు నమస్కారం చేశారు. అప్పుడు గురువు గారు, ఒక శార్దూల వృత్తంలో (పద్యము), వేదమంత్రము వచ్చేట్టుగా చెప్పి ఆశీర్వదించారు.

అప్పుడు చమత్కారియైన శిష్యుడు నవ్వుతూ, "గురువుగారూ, ఆతిథ్యం స్వీకరించి మా యింట శార్దూలమును (పులిని) విడిచి వెళ్ళుట మీకు న్యాయమేనా?" అన్నాడు.

దానికి గురువుగారు నవ్వుతూ, "ఆ శార్దూలమును మంత్రించి వదిలేశాను. నీకు ఏలాంటి అపకారం చేయదు. అదీగాక, నీవు ఊరి వెలుపల ఇల్లు కట్టుకున్నావు. పంచమీ తత్పురుషము లేకుండా ఈ షష్టీని కాపలాగా పెట్టానని" అన్నారు.

పంచమీ తత్పురుషానికి అందరూ చెప్పే ఉదాహరణ 'దొంగవలన భయము'. షష్టీ తత్పురుషానికి 'కుక్క యొక్క కాపలా'. అంటే, గురువుగారు, దొంగ వలన భయము లేకుండా శార్దూలాన్ని కాపలా పెట్టారన్నమాట.

ఆ కాలం వాళ్లు, ఈ కాలం వాళ్ల లాగా, గుమ్మం దగ్గర నుండే టాటా, బై బై చెప్పేవారు కాదు. గురువుగారిని బండిలో ఎక్కించి, "మీరు మళ్ళీ మా యింటికి దయచేయాలి అని మర్యాద పూర్వకంగా అనేవారు". శిష్యుడు కూడా అలాగే అన్నాడు.

అందుకు గురువు గారు నవ్వుతూ, "నీవు ద్వంద్వా తీతుడయిన తర్వాత వస్తానులే" అన్నాడట. ద్వంద్వ సమాసమునకు ఉదాహరణ, 'భార్యా భర్తలు', 'తలిదండ్రులు', 'అక్కాచెల్లెళ్లు' అని ఉంటుంది.

ద్వంద్వాతీతుడంటే మీ భార్యాభర్తలు తలిదండ్రులు అయినప్పుడు, అంటే, "మీకు సంతానం కలిగినప్పుడు మళ్ళీ వస్తానని" అర్థము. పూర్వకాలము పండితులు కలిసినప్పుడు, ఇంత చమత్కారముగా మాట్లాడేవాళ్ళు.
అలాగా, మనం ఎలాగూ మాట్లాడలేము. కనీసం విని ఆనందిద్దామని మీకు ఈ వ్యాసంలో తెలియజేస్తున్నాను.

చదివినందులకు ధన్యవాదాలు.

తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

మహరాజ రాణాప్రతాప్


* వియత్నాం దేశంవారికాదర్శం మహారాజ రాణాప్రతాప్ *
ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి. ప్రపంచంలో అత్యంత బలశాలి అయిన అమెరికా తలని వంచింది. కనీసం 20 సంవత్సరాలు సాగిన యుద్దంలో ఆకరికి అమెరికాని ఓడించింది. అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అద్యక్షుడికి ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు.
విలేకరి: ఇప్పటికీ అర్థంకాని  విషయమేమిటంటే,అమెరికాని ఓడించి యుద్దంలో ఎలా గెలిచారు.
ఆ విలేకరి అడిగిన ప్రశ్నకి సమాధానం విని మీరు చాలా గర్వంగాచ ఫీల్ అవుతారు.
అన్నీ దేశాలలోకెల్ల శక్తిశాలి అయిన అమెరికాని ఓడించడానికి నేను మహామహుడు ,శ్రేష్టమైన దేశభక్తిగల భారతీయ రాజు చరిత్రను చదివాను.అతని జీవనంనుండి ప్రేరణపొంది యుద్దనీతి ,ఇతరత్రా ప్రయోగాలతో మేము యుద్దంలో గెలిచాము.
విలేకరి అడిగాడు: ఎవరా భారతీయ మహారాజు?
వియత్నాం అద్యక్షుడు నిలబడి గర్వంతో ఇలా సమాధానం చెప్పాడు. ”అతడే రాజస్తాన్లోని మేవాడ్ మహారాజు రాణా ప్రతాప్ సింహ్”
మహారణా ప్రతాప్ సింహ్ పేరు చెప్పెటప్పుడు అతని కళ్ళలో వీరత్వం నిండి వెలుగు ఉన్నది.
అలాగే ఇలా అన్నాడు
“ఒకవేళ అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించేవారం.”
^కొన్ని రోజుల తరువాత వియత్నాం అధ్యక్షుడు చనిపోయాడు అయితే అతని సమాధి మీద ఇలా రాశి ఉంది “ఇది మహారణా ప్రతాప్ యొక్క శిష్యుడిది” అని రాసి పెట్టారు.
కాలాంతరంలో వియత్నాం విదేశాంగమంత్రి భారత పర్యటనకి వచ్చాడు.మహామహుల శ్రద్ధాంజలి ఘటించడానికి మొదట గాంధీ సమాధి అతనికి చూపించారు ఆ తరువాత ఎర్రకోట,ఇంకా,ఇంకా ఇలా చూపించారు. ఇవన్నీ చూపించేటప్పుడు ఆ విదేశాంగమంత్రి ఇలా అన్నాడు “ మహారణా ప్రతాప్ సమాధి ఎక్కడ?”.
ఇవన్నీ చూపిస్తున్న భారత అధికారి అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయి ఉదయపూర్లో ఉన్నదని చెప్పాడు. విదేశాంగమంత్రి అక్కడనుండి ఉదయ్ పూర్ వెళ్ళి సమాధిని దర్శించి అక్కడనుండి పిడికడు మట్టిని తీసుకొని అతని బ్యాగ్ లో పెట్టుకున్నాడు.ఇది చూసిన భారత అధికారి మట్టిని బ్యాగ్ లో పెట్టుకోవడానికి కారణం అడిగాడు....”ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులను కన్నది, ఈ మట్టిని తీసుకెళ్లి మాదేశం మట్టిలో కలుపుతా. మా దేశంలో కూడా ఇలాంటి రాజు ప్రేరణతో దేశభక్తులు జన్మిస్తారు. మహారణా ఈ దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ రాజు” అని అన్నాడు
మహారణా ప్రతాప్ సింహ్ గురించి వివరిస్తాను అందరూ షేర్ చేయండి.

పేరు-కుంవర్ ప్రతాప్ జి(శ్రీ మహారాణా ప్రతాప్ సింహ్)
జన్మదినం-9 మే,1540
జన్మభూమి-రాజస్థాన్ కుంబల్ ఘడ్
పుణ్యతిది-29 జనవరి,1597
తండ్రి – మహారణా ఉదయ్ సింహ్ జి
తల్లి-రాణి జీవత్ కాంవర్ జి
రాజ్య సీమ-మేవాడ్
శాశన కాలం -1568-1597(29 సంవత్సరాలు)
వంశం –సూర్యవంశం
రాజవంశం-సిసోడియ రాజపుత్రులు
ధార్మికం-హిందూధర్మం
ప్రసిద్ధ యుద్దం- హల్ది ఘాట్ యుద్దం
రాజధాని-ఉదయ్ పూర్. 


ఇంకా తెలుసుకోవాల్సినవి-
 శ్రీ మహారణా ప్రతాప్ దగ్గర అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు “చేతక్”.
అబ్రాహిం లింకన్ భారతపర్యటన నిమిత్తం భారత్ కి వచ్చేది ఉండే అప్పుడు తన తల్లి భారత్ నుండి ఏమి తీసుకొనిరావాలి అని అన్నాడట. దానికి అతని తల్లి “రాజస్థాన్లోని మేవాడ్ నుండి పిడికెడు మట్టి తీసుకొనిరా , అక్కడి రాజు ఎంత విశ్వశాపాత్రుడగా ఉండేవాడు అంటే సగం భారత్ ను ఇస్తా అని ప్రలోభపెట్టిన తన రాజ్య సుఖ శాంతి ప్రయోజనాలనే కోరుకొని తన మాతృభూమినే కోరుకున్నాడు” అని చెప్పిందట. కానీ కొన్ని కారణాల రీత్యా అతని పర్యటన రద్దు అయ్యింది. ఈ విషయాలు “బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యు ఎస్ ఏ” లో చదువొచ్చు.
*మహారణా ప్రతాప సింహ్ యొక్క ఈటె 80 కిలోలు ఉంటుంది.చేతి కవచం,శరీర కవచం కలిసి మరొక 80 కిలోలు ఉంటాయి. అతని చేతిలోని కత్తితో కలిపి మొత్తం 207 కిలోలు ఉంటాయి. ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్ రాజవంశస్తుల సంగ్రహణాలయంలో ఉన్నాయి.
*డిల్లీ బాద్షాహ్ అయినటువంటి అక్బర్ మహారణా ప్రతాప్ ని ఒకసారి తల దించి నా కాళ్ళ మీద పడుతే సగం హిందూస్థాన్కి రాజుని చేస్తా అని ప్రలోభపెట్టాడు కానీ మహారణా ప్రతాప్ దాన్ని తుచ్ఛమైనదిగా తిరస్కరించాడు.
*హల్దిఘాట్ యుద్దంలో మేవాడ్ సైన్యం 20000 సైనికులతో ఉంటే అక్బర్ సైన్యం 85000 సైనికులతో సమీకరించబడాయి
* మహారణా ప్రతాప్ ఇష్టమైన గుర్రంకి తన త్యాగానికి గుర్తుగా ఒక గుడిని కూడా కట్టారు ,ఆ గుడి ఇప్పటికీ సురక్షితంగా ఉంది.
* మహారణా యుద్దంలో తన అభేద్యమైన దుర్గం లను వదులుకున్నప్పటినుండి కంసాలి వాళ్ళు వేల సంఖ్యలో వాళ్ళ ఇళ్ళను వదిలి రాణా కోసం ఆయుధాలు తయారు చేసేవారు.వాళ్ళ దేశ భక్తికి నా తల వంచి ప్రణమిల్లుతున్నాను అన్నాడు.
* హల్ది ఘాట్ యుద్దం జరిగి 300 సంవత్సరాల తరువాత కూడా అక్కడి నెలలో కత్తులు లభించాయి. చివరి సారిగా 1985 లో ఒక ఆయుదం దొరికింది.
* మహారణా ప్రతాప్ సింహ్ దగ్గర యుద్ద శిక్షణ శ్రీ జైమల్ మేడతీయ ఇచ్చేవాడు. 8000 మంది రాజపుత్రుల వీరులతో కలిసి 60000 మంది మొఘలులతో యుద్దం చేశారు. ఆ ఆయుద్దంలో 48000 మంది చనిపోయారు.ఇందులో 8000 మంది రాజపుత్రులు 40000 మంది మొఘలులు
* మహారణా ప్రతాప్ సింహ్ చనిపోయాక అక్బర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడట.
* హల్ది ఘాట్ యుద్దంలో మేవాడ్ భీల్ అనే ఆదివాసీలు వారి యొక్క అభేద్యమైన బాణాలతో మొఘలులతో పోరాడారు .వాళ్ళు మహారాణాను వారి పుత్రుడిగా భావించేవారు.మహారాణా కూడా వారిపట్ల భేదభావం చూపించేవారు కాదు. ఇప్పటికీ మేవాడ్ రాజచిహ్నం లో ఒకపక్క రాజపూత్ మరొక పక్క భీల్ ఉంటారు.
* రాణా గుర్రం అయిన చేతక్ మహారణాను 26 అడుగుల కందకాన్ని దుమికి అది దాటిన తరువాత చనిపోయింది. అంతకంటే ముందే దానికి ముందరి ఒక కాలు విరిగి ఉన్నప్పటికి ఆ కందకాన్ని దుమికింది.అది ఎక్కడైయతే చనిపోయిందో అక్కడే ఒక చింత చెట్టు పెరిగింది.అదే ప్రదేశంలో దాని గౌరవార్దం చేతక్ మందిరం కట్టారు.
*చేతక్ ఎంత బలమైనదంటే ఎదుట ఏనుగుమీద ఉన్న సైనికుణ్ణి అందుకోవటానికి ఎంత ఎత్తు ఎగరాలోఅంత ఎత్తు గాలిలో ఎగిరేది అది కూడా మహారణాతో పాటుగా
*మహారణా చనిపోవడానికి ముందు తాను కోల్పోయిన వాటిలో 85% తిరిగి గెల్చుకున్నాడు.
*శ్రీ మహారణా ప్రతాప్ యొక్క బరువు 110 కిలోలు మరియు అతని పొడవు 7’5’’. ఇరువైపుల దారు ఉన్నటువంటి కత్తి, 80 కిలోల ఈటె తన వద్ద వుంచుకునే వాడు.
*మిత్రులారా మహారణా ప్రతాప్ ,అతని గుర్రం గురించి విన్నారు , అతనికి ఒక ఏనుగు కూడా ఉండేది.దాని పేరు రాంప్రసాద్.
*అల్ బదౌని అనే రచయిత రాంప్రసాద్ ఏనుగు గురించి తన గ్రంధంలో రాసుకున్నాడు.
* అక్బర్ బాద్షాహ్ మేవాడ్ మీద యుద్దం చేసేటప్పుడు తన సైన్యానికి ఏమని ఆదేశించాడంటే.మహారణా ప్రతాప్ తోపాటుగా రాంప్రసాద్ ఏనుగుని కూడా బందీగా పట్టుకుంటే సరిపోద్ది అని చెప్పాడట.
* రాంప్రసాద్ ఎంత బలం కలిగినదంటే ఒక్కత్తే మొఘలుల 13 ఏనుగులని చంపిండట.అలాగే దాన్ని పట్టుకోవడానికి 7 పెద్ద ఏనుగులమీద 14 మంది నైపుణ్యం కలిగిన మావటిలు కూర్చుని ఒక చక్రవ్యూహం ప్రకారంగా దాన్ని బందీ చేశారట అని అల్ బదౌని తన రచనల్లో పేర్కొన్నాడు.
*బందీని చేసిన రాంప్రసాద్ ని అక్బర్ ముందు నిలబెట్టగా దానికి పీర్ ప్రసాద్ అని నామకరణం చేశాడు.ఆ ఏనుగు ఎంత స్వామి భక్తి కాలదంటే 18 రోజులవరకు దాణా తినకుండా,నీళ్ళు తగకుండా తన ప్రాణాలు కోల్పోయింది.తరువాత ఈ దృశ్యాన్ని చూసిన అక్బర్ నా ముందు ఈ ఏనుగుని వంచ లేకపోయాను మహారాణాను ఎలా వంచగలుగుతా అని అన్నాడట.




భారత్ మాతా కి జై

తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

దేవుడిపై నమ్మకం


🔯✴❇✴🔯✴❇✴🔯


దైవం మీద నమ్మకమే మోక్షానికి దారి

       త్రిలోకసంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణుభక్తులను పలకరించేందుకు బయల్దేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్లాడు.
‘అయ్యా! వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు. విష్ణుభగవానుడు ఎలా ఉన్నారు?
ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా?’ అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని.

‘విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు. నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను,’ అంటూ బదులిచ్చారు నారదులవారు.
‘అయితే స్వామీ! ఈసారి మీరు వైకుంఠానికి వెళ్లినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి’ అని వేడుకున్నాడు ఆ ముని.

సరేనంటూ నారదులవారు ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు.
‘మిమ్మల్ని చూస్తే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామీ! ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?’ అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుని ముంచెత్తాడు.

 ‘స్వామి బాగానే ఉన్నారు.
నేను మళ్లీ అక్కడికే వెళ్తున్నాను.
నీ గురించి ఏమన్నా అడగమంటావా!’ అన్నారు నారదులవారు.
‘అడగడానికి ఇంకేముంది తండ్రీ! ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు’ అని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు.
అలాగేనంటూ నారదులవారు తిరిగి వైకుంఠానికి బయల్దేరారు.
వైకుంఠంలో నారదులవారు స్వామిని చూసిన వెంటనే, తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు.

 ‘నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి.
కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ’ అన్నారు విష్ణుమూర్త

స్వామివారి మాటలు విన్న నారదులవారు అయోమయంలో పడిపోయారు.
నిత్యం హరినామస్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావడం ఏంటి? అన్న ఆలోచనలో మునిగిపోయాడు.

నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి. ‘నీ అనుమానం తీరే ఉపాయం ఉంది.
నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు,

‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని వాళ్లు అడుగుతారు కదా! అప్పుడు
‘ఆయన సూది బెజ్జంలోచి ఏనుగుని పంపిస్తున్నారు’ అని చెప్పు.
 వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది. ఎవరు గొప్ప భక్తులో!’ అన్నారు స్వామి.
విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయల్దేరాడు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు.

 ఎప్పటిలాగే నారదులవారిని కుశలప్రశ్నలు అడుగుతూ, పనిలో పనిగా ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని అడిగాడు ముని.
 ‘ఆ ఏముంది! వేలెడంత సూది బెజ్జంలోంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘భలేవారే! సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం. మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు’ అన్నాడు ముని చిరునవ్వుతో.

నారదులవారు అక్కడి నుంచి సాగిపోయారు. మరికొంత దూరం వెళ్లాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు.



      ‘అయ్యా! దయచేయండి! ఎక్కడి నుంచి రాక? ఈ మధ్య కాలంలో వైకుంఠానికి వెళ్లారా? స్వామివారు ఎలా ఉన్నారు?’ అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను. ‘అంతా బాగానే ఉందయ్యా!

నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూదిబెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘మంచిది మంచిది. స్వామివారు తల్చుకుంటే సాధ్యం కానిది ఏముంది!’ అన్నాడు భక్తుడు.

 ‘అదేంటీ! స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా!’ అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు. ‘భలేవారే భగవంతునికి అసాధ్యం అంటూ ఏముంటుంది. ఇదిగో ఈ మర్రి పండుని చూడండి.

ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా! ఆ గింజలన్నీ మళ్లీ మర్రి చెట్లుగా మారతాయి కదా! పోనీ అక్కడితో ఆగుతుందా…

ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసినదానిలో ఆశ్చర్యం ఏముంది. సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా!’ అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు.

పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదులవారికి అర్థమైంది. మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలిసివచ్చింది.

*💟❇ మంచిని పంచండి ❇💟*

తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media