Pages

దానకర్ణ


కర్ణుడిని దానకర్ణుడని ఎందుకంటారు

ఒకనాడు శ్రీకృష్ణుడు పొద్దున పొద్దున్నే కర్ణుని భవనానికి వెళ్ళాడట.
అప్పుడు కర్ణుడు అభ్యంగన స్నానానికి తయారవుతున్నాడు.
తలకు నూనె రాసుకుంటున్నాడు. కర్ణునికి ఎడమ వైపు రత్నాలు పొదిగిన బహువిలువైన గిన్నె నూనెతో వున్నది.
కృష్ణుడు వస్తూనే కర్ణా ఆ గిన్నె చాలా బాహున్నది నాకిస్తావా? అని అడిగాడు.
వెంటనే కర్ణుడు తీసుకో కృష్ణా అంటూ ఎడమ చేత్తో ఆ గిన్నె యిచ్చాడు. కృష్ణుడు అదేమిటి కర్ణా ఎడమచేత్తో యిస్తున్నావు? కుడిచేత్తో యీయరాదా? అన్నాడు.
అందుకు కర్ణుడు,

"క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవిత మావయో:
యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితా గతి:"

అర్థము:-- కృష్ణా!ఎడమ చేతిలోని గిన్నె కుడిచేతి లోకి తీసుకునే లోపే ఏమవుతుందో తెలియదు. లక్ష్మి
చంచల మైనది. యముడా దయలేనివాడు. మనస్సా మరు క్షణంలో ఎలా మారుతుందో తెలియదు. కనుక గిన్నె ఈ చేతినుంచు ఆ చేతికి పోయే లోపలే ఏ మార్పైనా రావచ్చు.
అందుకనే ధర్మ కార్యాన్ని ఆ క్షణమే చెయ్యాలనే హితోక్తి ననుసరించి యిలా చేశాను అన్నాడు.
అప్పుడు కృష్ణుడు కర్ణుని వివేచనకు సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నాడు.
అందుకు కర్ణుడు,

"దేహేతి వచనం కష్టం నాస్తీతి వచనం తదా
దేహీ నాస్తీతి మద్వాక్యం మా భూజ్జన్మ జన్మనీ"

అర్థము:- కృష్ణా! యాచించడం ఎంత కష్టమో, లేదని చెప్పడం కూడా అంతే కష్టం.అంతే కాదు నీచం కూడా కనుక ఏ జన్మ లోనూ దేహీ(అని యాచించే) , నాస్తి(లేదు) అనే మాటలు నా నోటివెంట రాకుండు నట్లు అనుగ్రహించు. అని కోరాడు.
దీన్ని బట్టి కర్ణుడి వ్యక్తిత్వం ఎంతటి మహోన్నత మైనదో అర్థమవుతుంది.
దానం విషయం లో సదా సాత్వికమే ప్రధానం చెయ్యాలనే సంకల్పం కలుగ గానే ఆదరణ తో భగవదర్పణ బుద్ధితో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా రెండవ చేతికి కూడా తెలియనంత రహస్యంగా దానం చెయ్యాలి.
దానం చేసి నేను చేశానని డప్పు కొట్టుకోకూడదు.
ఏదైనా మంచి పని చెయ్యాలని అనిపించిన వెంటనే చేసెయ్యాలి ఆలస్యం విషం లాంటిది. అంటారు జ్ఞానులు.

మనము కర్ణుడి లాగా వ్యవహరించ లేకపోయినా మన శక్త్యానుసారం సత్పాత్ర దానం చేయడం అలవరుచుకోవాలి. ...

కర్ణుడిని కృష్ణుడు ఎప్పుడు పడితే అప్పుడు  దానకర్ణుడని అభివర్ణించడం అర్జునుడికి నచ్చలేదు. కృష్ణుడితో అర్జునుడు వాదనకు దిగుతాడు. ఈ విషయమై వీరి మధ్య చాలాసేపే మాటలు సాగాయి. ఇక లాభం లేదనుకున్న కృష్ణుడు వెంటనే ఒక బంగారు పర్వతం సృష్టించాడు. అర్జునుడితో కృష్ణుడు ఆ బంగారు పర్వతాన్ని ఈ రోజు సాయంత్రం లోపల ఒక్క ముక్క మిగల్చకుండా దానం చెయ్యాలి. అలా నువ్వు చేస్తే నేను నిన్ను దానం చేయడంలో కర్ణుడి కన్నా  గొప్ప వాడిగా చెప్తాను. కొనియాడుతాను. సరేనా అని అంటాడు. అర్జునుడు ఈ విషయాన్ని ఊరు ఊరంతా ప్రచారం చేయిస్తాడు. తాను బంగారు పర్వతాన్ని దానం చేయబోతున్నాను అని అంటాడు. అందరినీ రమ్మంటాడు. అలాగే అందరూ వస్తారు. బంగారాన్ని ముక్కలు చేసి దానం చెయ్యడం ప్రారంభిస్తాడు అర్జునుడు.  అలా ఇస్తూనే ఉంటాడు అర్జునుడు. అయినా వరస తగ్గుతోంది కాని బంగారం ఇంకా మిగిలే ఉంది. కృష్ణుడు చెప్పినట్టు ఆ రోజు సాయంత్రం లోపల అర్జునుడు దానం చెయ్యలేకపోతాడు. సగం కూడా దానం చెయ్యలేదు. ఇంతలో ఆవైపుగా కర్ణుడు వస్తాడు. కృష్ణుడు కర్ణుడిని పిలిచి "కర్ణా...ఈ బంగారు పర్వతాన్ని రేపు ఉదయం లోపు దానం చెయ్యాలి...నీ వల్ల అవుతుందా" అని అడుగుతాడు. కర్ణుడు "అదేం పెద్ద పని కాదే...ఇది దానం చెయ్యాలి అంతేగా... " అంటూ కర్ణుడు అటు వచ్చిన ఇద్దరిని పిలిచి "ఈ బంగారు పర్వతాన్ని మీ ఇద్దరికీ దానం చేస్తున్నాను...దీనిని మీరిద్దరూ సరిసమానంగా పంచుకుని ఉపయోగించుకోండి" అని వారిద్దరికీ ఆ బంగారాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కర్ణుడు. అప్పుడు కృష్ణుడు అర్జునుని చూసి "ఇప్పుడు నీకు, కర్ణుడికి మధ్య ఉన్న తేడా తెలిసిందా...? ఈ బంగారు పర్వతాన్ని పూర్తిగా ఇచ్చేయ్యాలనే ఆలోచన రానే లేదు. మరి నిన్ను  దానం చేయడంలో కర్ణుడిని మించిన వాడివని ఎలా కొనియాడను" అని ప్రశ్నిస్తాడు. అర్జునుడి నోటంట మరో మాట లేదు. ఒక్కొక్కరి గుణం ఒక్కొక్కలాంటిది. ఎవరి ప్రత్యేకత వారిది. కర్ణుడు  దానం చేయడంలో దిట్ట. ఈ విషయంలో అతనిని మించిన వారు లేరు అని చెప్పడానికి కృష్ణుడు ఆడిన నాటకమిది.

కృష్ణుడు ఓ వ్యక్తి కోసం కన్నీళ్లు పెట్టాడంటే ఆ వ్యక్తి ఎంతటి ఉన్నతమైన వ్యక్తి అయ్యుండాలి 

అవునండి కృష్ణయ్య కర్ణుడి కోసం కన్నీళ్లు పెట్టాడు 
యుద్ధం లో మరణంతో పోరాడుతున్న కర్ణుడిని చూసి కన్నీళ్లు పెట్టాడు కిట్టయ్య 

కర్ణుడు చేసిన దానధర్మాలు అతడిని మృత్యువు ధరి చేరకుండా ఉండడంతో కృష్ణుడు కర్ణుడిని వెళ్ళి ఒక కోరిక అడిగాడు 

కర్ణా నువ్వు దానం చేయగా పొందిన పుణ్యఫలాలన్నీ నాకు దానం చేయవా అని అడిగాడు 
కర్ణుడు కృష్ణుడు అడగగానే దానం చేసేసాడు 

అప్పుడు కృష్ణుడు కర్ణుడి తలను తన చేతులతో పట్టుకుని నీకో వరమిస్తాను ఏమి కావాలో అడుగు అన్నాడు 

అందుకు కర్ణుడు నాకు ఇంకో జన్మ వద్దు 
ఒకవేళ అలా ఉంది అంటే అప్పుడు కూడా ఎవరు ఏమి అడిగినా లేదు అని చెప్పకుండా ఇచ్చేటువంటి హృదయాన్ని నాకు ఇవ్వు అని అడిగాడు 

ఆ మాట వినగానే కృష్ణయ్య కళ్ళు కన్నీటి ధారలై పొంగాయి 
ఇంతమంచి వాడి వేంటయ్యా కర్ణా నువ్వు అని గట్టిగ కర్ణుడి దేహాన్ని తన హృదయానికి హత్తుకున్నాడు కృష్ణుడు 

మనం మంచి మనసున్న వారిమైతే చాలండి 
దేవుడి మోక్షం కోసం తపస్సు చేయాల్సిన అవసరం లేదండీ 
జీవితం ముక్తి పొందడం కోసం దైవదర్శనాలు అంటూ తిరగక్కరలేదండి 

మంచి మనసుంటే చాలండి ఆ భగవంతుడే దిగి వచ్చి తన గుండెలకు మనల్ని హత్తుకుంటాడు 

కర్ణుడంత కరుణామయులం కాకపోయినా ఏదో ఆయన చిటికిన వేలంత మంచిగా బతికేద్దాం అండి 
కృష్ణుడు మనకోసం రాకపోయినా నెమలి పింఛాన్నైనా రప్పించేసుకుందాం అండి మనం 
🙏🙏🙏🙏 


తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

No comments:

Post a Comment