Pages

రతన్ టాటా (వ్యక్తిత్వంలో వజ్రం)

వ్యక్తిత్వం లో వజ్రం 

మన జాతికి దొరికిన రత్నం 

డ్రైవరు కాకుండా నలుగురు ప్రయాణిస్తున్న ఆ కారు దిల్లీ వైపు వెళ్తోంది. ఆ నలుగురూ ఒక మీటింగ్ కు హాజరవ్వాలి. ఇంతలో ఒక టైరు పంచరు ఆయ్యింది. అందరూ దిగారు. డ్రైవరు మరో టైరును బిగించేపని చూస్తున్నాడు , ముగ్గురిలో ఒకరు సిగరెట్టు వెలిగించాడు , ఒకాయన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు , మరొకాయన వెంట తెచ్చుకొన్న ఫ్లాస్కులోని కాఫీ తాగుతున్నాడు. రెండు నిమిషాయలయ్యాక ఆ ముగ్గురికీ నాల్గవ వ్యక్తి గుర్తుకొచ్చాడు , అపుడు ఆ ముగ్గురూ ఆయన వంక చూసి ఆశ్ఛర్యపోయారు. ఎందుకంటే ఆయన తన చొక్కా స్లీవ్ పైకి అనుకొని , టై ను భుజం వెనక్కి వేసుకొని , జాకీ , స్పానర్ తీసుకొని డ్రైవర్ కు సహాయపడుతున్నాడు. ఈ ముగ్గురూ అవాక్కయ్యారు.  కారణం ఆ నాల్గవ వ్యక్తి రతన్ టాటా.  '' సార్ , మీరు ? '' '' మనం మీటింగ్ కు వెళ్ళాలి , టైరు మార్చడానికి డ్రైవర్ కు 15 ని. సమయం పడుతుంది , కానీ నేను సహాయపడితే 8 నిమిషాల్లో అతను ఆ పని పూర్తీచేస్తాడు. మనకు 7 ని. కలిసొస్తాయి కదా ? ''  అన్నారు రతన్ టాటా. [ Respect to Time is Respect to Life ] 

TATA Group ఎందుకు ఆ స్థాయికి ఎదిగిందో దాని అధినేత అయిన రతన్ టాటాను చూస్తే తెలుస్తుంది ! 

బాల్యంలో  ఆయన తల్లి తండ్రులు విడిపోయారు , అవ్వ పెంచిపెద్ద చేసింది. 

యవ్వనం లో ఆయన girl friend  మోసం చేసింది. 

ఆతరువాత కంపెనీ కి విపరీతమైన నష్టాలు , సవాళ్ళు ఎదురయ్యాయి. 

కానీ ఆయన తన మంచితనాన్ని , దయను , లక్ష్యాన్ని , నిజాయితీని , సమయపాలనను , క్రమశిక్షణను , కఠోర పరిశ్రమను మరవచిపోలేదు. TATA సంస్థను ఆయన ఏ స్థాయికి తీసుకొచ్చాడో క్రింద వివరాలు చదివితే తెలుస్తుంది : 

టాటా సంస్థ అయిన TCS  యొక్క స్టాక్ మార్కెట్ విలువ పాకిస్తాన్ దేశపు  మొత్తం స్టాక్ మార్కెట్ విలువతో సమానం.  

భారతదేశపు GDP కి TATA సంస్థ ఒక్కటే 4 % కాంట్రిబ్యూట్ చేస్తుంది. 

ప్రతి ఏటా  అస్సాం , ఒడిషా , హిమాచల్ ప్రదేశ్ , గోవా లు కలిపి ఎంత tax కడతాయో అంత tax ను ఒక్క TATA సంస్థనే దేశానికి చెల్లిస్తుంది. [ 50 000 + కోట్లు ]  

నవంబరు 26 , 2008 లో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మనం ముంబై నగరంలోని TATA సంస్థ యొక్క Taj Hotel మీద [ కింద ఫోటోలో కనిపిస్తుంది ]  ఆత్మాహుతి దాడి చేసి వందలమందిని చంపిన సంఘటనలో , చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి  ఒక్కొక్కరికీ 25 నుండీ 50 లక్షల దాకా సహాయం అందించారు రతన్ టాటా ; ఆ సమయం లో తమ హోటల్ లో డ్యూటీలో వుండి మరణించిన  , గాయపడిన ప్రతి పోలీసు , ప్రతి ఇతర ఉద్యోగి కుటుంబం లో ఒక్కొక్కరికి తన సంస్థలో ఉద్యోగం ఇచ్చాడు , వాళ్ళ పిల్లల చదువు , పెళ్ళిళ్ళ  బాధ్యత ను తానే తీసుకొన్నాడు ; అంతకంటే ఆశ్చర్యమేమంటే ఆ దాడి సమయంలో దేవిక అనే చిన్న పాప హోటల్ కు వచ్చివుంటూంది , ఆమెను గది బయటపెట్టి ఆమె తండ్రి , మామయ్య toilet లోకి వెళ్ళివుంటారు , అప్పుడే ఆ దాడి జరిగింది , వాళ్ళిద్దరూ మరణించారు. ఆ చిన్న పాప బ్రతికింది , తరువాత ఆనాడు హోటల్లో చిన్నపిల్లలు , స్త్రీలు , వృద్ధులు అని చూడకుండా కాల్పులు జరిపి వందలమందిని చంపిన నరరూప రాక్షసుడు అజ్మల్ కసబ్ ను గుర్తుపట్టింది ఆ చిన్న పాపనే. ఆ చిన్న పాపను ఆసుపత్రిలో చేర్పించి , కోలుకొనేలా చేసి , ఆమె చదువుకు ఏర్పాట్లు చేసి , ఉద్యోగం కూడా తన కంపెనీలోనే ఇస్తానని చెప్పి , ఆమె పెళ్ళి బాధ్యతను కూడా కూడా రతన్ టాటా నే తీసుకొన్నారు. మరో ఆశ్చర్యమంటే ఆ దాడి సమయంలో రోడ్డు మీద వెళుతున్న , అక్కడ చిన్న చిన్న వ్యాపారాలు [చేపలు పట్టడం ,  పావ్ బాజీ , పానీపూరి , భేల్ పూరి , పాన్ బీడా , చాయ్ దుకాణాల ]  నడుపుకొనేవారికెవ్వరికీ TATA సంస్థతో ఏ సంబంధాలు లేకపోయినా , వారందరికీ నష్టపరిహారం అందించారు రతన్ టాటా. అన్నిటికంటే పెద్ద ఆశ్చర్యమేమంటే ఈ అన్ని పనులనూ రతన్ టాటా దాడి జరిగిన తరువాత కేవలం 20 రోజుల్లో పూర్తీచేసేసారు. అప్పుడు [ 2008 లో]అధికారంలో వుండిన రాష్ట్రప్రభుత్వం [ దాడిజరిగి 12 ఏళ్ళు అయినా ]  ఇంకా అందరికీ నష్టపరిహారం చెల్లించలేదు. రతన్ టాటా కేవలం 480 గంటల్లో చెల్లించేసాడు. అందుకే ఆయన గురించి ఒక స్నేహితుడు ఇలా వ్రాసాడు :  Don't mess with him ; if you give him Deep insults , he will transform then into Deep results.
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

THE STORY OF 3 KIDS:


హాస్పిటల్ లో మామూలుగా మధ్యాహ్నం  2:30 కి ఓపీ కట్టేసి ఇంటికి వెళ్లి అన్నం తిని కాసేపు కునుకు తీసే సమయం..
సీసీ కెమరా లో ముగ్గురు పిల్లలు ఓపిలోకి రావడం చూసాను..వాళ్ళ వయసు ఒక 7-8 సంవత్సరాలు ఉండచ్చు...తల్లి తండ్రులు ఏమన్నా వస్తున్నారేమో అని చూసా..ఎవ్వరూ లేరు..కాసేపటికి ఒక ఆయన వచ్చాడు..టీచర్ అనుకుంటా..వచ్చి గమ్మున వైటింగ్ హాల్లో కూర్చున్నాడు...

ఆ ముగ్గురిలో ఒక్కడు వచ్చి రిసెప్షన్ లో ఓపీ తీస్కోవడం గమనించా...ఒక పిల్లాడు సైలెంట్ గా ఉన్నాడు..వాడి మోచేతికి  గుడ్డ కట్టి ఉంది..

నా టేబుల్‌ మీద ఉన్న బెల్ వేసి పిల్లలని లోపలకి పంపమని చెప్పా.. ముగ్గురు కలిసి లోపలకి వచ్చారు...దెబ్బ తగిలిన కుర్రాడు వచ్చి దైర్యంగా  స్టూల్ మీద కూర్చున్నాడు...వాడి కంటిలో ఒక్క కన్నీటి చుక్క కూడా చూడలా నేను..నేను చేతిని గమనించి కాస్త ముట్టుకుని పరీక్ష చేసే సమయంలో కాస్త నొప్పి అని చెప్పాడు...వెంటనే వాడి పక్కన ఉన్న ఇద్దరు వాడి బుజం మీద చెయ్యి వేసి ..ఏమి కాదులే రా..మేము ఉన్నాం కదా అని చెప్పారు... సరే అని నేను X రే స్లిప్ రాసి ఇచ్చాను..

ఒక 5 నిమిషాల్లో X రే రిపోర్ట్ వచ్చింది ..మోచెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది..టీచర్ ని పిలిచి చెప్పాను..చేతిని రెఢీ చేసి పిండి కట్టు వేయాల్సి ఉంటుంది అని...టీచర్ కన్నా ముందు ఆ ఇద్దరు పిల్లలు జవాబు చెప్పారు...సరే సార్ కట్టేయండి..అని..

కాసేపటికి మా స్టాఫ్ కట్టు రెఢీ చేసి పిలిచారు ..నేను లోపలకి వెళ్ళా.వాడిని అడిగా ఏరా కట్టేయమంటావా  అని..రండి సార్ కట్టేయండి అని..జవాబు ఇచ్చాడు.. కాస్త విరిగిన ఎముకను లాగి సరి చేసి పిండి కట్టు కట్టే సమయం లో కూడా వాడు చిన్న అరుపు కూడా అరవలేదు...వాడిని మామూలుగా అందరూ అడిగే ప్రశ్నే   అడిగాను...పెద్దయక ఏమవుతావు రా అని...?? ఏమో తెలీదు సార్ అన్నాడు...మరి పెద్ద అయ్యాక డబ్బులు కావాలా అన్నా...బ్రతకాలంటే కావాలి కదా అన్నాడు...

ముగ్గురు ఒకరిని ఒకరు పట్టుకొని లోపలికి ఎలా వచ్చారో...అలానే కలిసి వెళ్ళిపోయారు..నవ్వుకుంటూ..

సో నేను ఇప్పుడు ఎందుకు ఈ సోది మొత్తం చెప్తున్నాను...

(1) ఈ మొత్తం కథ లో పిల్లాడు ఎక్కడ అమ్మ నాన్న అని ఎడవలేదు
(2) వాడి మానసిక దైర్యం పీక్స్ లో ఉంది కనుకనే ఎముక విరిగినా కూడా వాడు నొప్పి అని ఏడవలేదు..
(3) వాడితో కలిసి వచ్చిన పిల్లలు ముచ్చటగా ఉన్నారు వీడికి దైర్యం చెప్తూ..ఓదారుస్తూ..

8 సంవత్సరాల వయసులోనే ముగ్గురు పిల్లలు మానసికంగా గెట్టిగా ఉన్నారు..ఎవరి మీద ఆధారపడకుండా...

(4) పెద్ద అయ్యాక ఏమవతావురా  అంటే.ఏమో సార్ తెలీదు అన్నాడు..అంటే వాడు ఈరోజుని ఎంజాయ్ చేస్తున్నాడు రేపటి గురించి ఆలోచించకుండా.

ఇప్పుడు ఈ మొత్తం సీన్ ప్రైవేటు స్కూల్  పిల్లాడు & చదువుకున్న పేరెంట్స్ తో కంపేర్ చేసి చూద్దాం.. ఎలా ఉంటుందో

బోరు మని ఏడుస్తున్న పిల్లాడు అమ్మ ఒళ్ళో కూర్చొంటాడు...కనీసం వాడ్ని.... వాడి చేతిని తాకనివ్వరు....తల్లి కూడా వాడితో పాటూ ఏడుస్తూ ఇంక ముద్దులన్ని వాడికి ఈరోజే పెట్టేయాలన్నట్లు వాడి బుగ్గలు కొరికి పెడుతూ ఉంటుంది...

బయట చూస్తే నాన్న ఏమో స్కూల్ యాజమాన్యం తో పీక్స్ లో రచ్చ గొడవ వేసుకుంటూ ఉంటాడు...

ఇప్పుడు దీనికి డబ్బులు ఎవరు కడతారు..
.నా పిల్లాడు చేతికి గ్యారంటీ ఎవర ఇస్తారు అని.. మా పిల్లాడికి ఏమన్నా అయితే మిమ్మల్ని వదిలి పెట్టను అని..

ఆ గొడవ సర్ధుమనిగాక లోపలకి వచ్చి ఒక 100 క్వశ్చన్ లు వేస్తారు ఒక్కేసారి...

చెప్పండీ Dr ఎంటి ప్రాబ్లం?
మీరు చెయ్యగలుగుతారా లేదా??
బెంగళూర్ కి తీసుకెళ్ళాలా??
మా పిల్లాడు చేతికి గ్యారంటీ ఇస్తారా??

నా నోట్లో నుంచి ఒక్క మాటే వస్తుంది..

X ray తీస్కొని రండి చూద్దాము అని...

ఆ X ray తీసి తెల్ల డబ్బాలో పేట్టి చూసే లోపు దాన్ని ఒక పది మంది చూస్తూ ఉంటారు..ఇంక నేను ఇలా ఫ్రాక్చర్ ఉంది అనగానే ...అయ్యో  ఫ్రాక్చర్ అహ్...లేక క్రాక్ అహ్ అంటారు..

మీరు గారంటీ ఇస్తే చెయ్యండి లేదంటే లేదు అంటారు ఓ పెద్ద మనిషి.. కాస్త ఓపిక కూడగట్టుకొని ..పిండి కట్టుకి రాసిస్తా…

అంత మంది వచ్చినా కూడా ఎవరూ ఆఆ పిండి కట్టు కట్టేదానికి డబ్బులు మాత్రం బయట తియ్యరు...

కట్టు కట్టాలని వెళ్తే వాడు అమ్మ ఒళ్ళో నుంచి ఇంకా కిందకి దిగుండడు...బయట కూర్చోండి అని వాళ్ళకి చెప్తే ..అయ్యయో చిన పిల్లాడు అని స్టార్ట్ చేస్తారు..

అలా ఇలా చేసి కట్టు కట్టేసి నా రూం కి వచ్చి కూర్చుంట....

పిల్లలకు మన ఎమోషనల్ డ్రామాలు ఆపి కాస్త మానసికంగా గెట్టిగా తయారయ్యే పద్దతి ఆలోచించాలి మనం...నీ గారబామే పిల్లలని చేడ్పేస్తుంది.....10 సంవత్సరాలు దాటాక వాడు ఫోన్ పట్టుకుంటాడు...ఇంకా మళ్ళీ మీరే వాడిని తిట్టడం మొదలెడతారు...

పెంపకం అనేది ముఖ్యమే కానీ అది అతి గారాబం తో కాకుండా వీలైనంత తొందరగా పిల్లాడు సొంతంగా

 ఆలోచించే విధంగా ఉండాలి అనేది నా ఆలోచన...


https://www.facebook.com/groups/2058733140940134/permalink/2540997562713687/


తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

70+ aged thoughts

I asked one of my friends who has crossed 60 & is heading to 70. 
What sort of change he is feeling in him?
He sent me the following 
very interesting lines, 
which i would like to share 
with you all.....
1) After loving my parents, 
    my siblings, my spouse, 
    my children, my friends, 
    now I have started loving   
    myself.
2) I just realised that I am not 
     “Atlas”. 
     The world does not rest on 
      my shoulders.
3) I now stopped bargaining 
     with vegetables & fruits 
     vendors. 
     After all, a few Rupees more 
     is not going to burn a hole in 
     my pocket but it might help 
     the poor fellow save for his 
     daughter’s school fees.
4) I pay the taxi driver without 
     waiting for the change. 
     The extra money might 
      bring a smile on his face. 
      After all he is toiling much 
      harder for a living than me
5) I stopped telling the elderly 
     that they've already 
     narrated that story many 
     times. 
     After all, the story makes 
      them walk down the 
      memory lane & relive 
      the past.
6) I have learnt not to correct 
     people even when I know 
     they are wrong. 
     After all, the onus of making 
     everyone perfect is not on 
     me. 
     Peace is more precious than 
     perfection.
7) I give compliments freely & 
     generously. 
     After all it's a mood 
     enhancer not only for the 
     recipient, but also for me
8) I have learnt not to bother 
    about a crease or a spot on 
    my shirt. 
    After all, personality speaks 
    louder than appearances.
9) I walk away from people 
     who don't value me. 
     After all, they might not 
     know my worth, 
     but I do.
10) I remain cool when 
       someone plays dirty 
       politics to outrun me in the 
       rat race. 
      After all, I am not a rat & 
      neither am I in any race.
11) I am learning not to be 
      embarrassed by my 
      emotions. 
      After all, it's my emotions 
      that make me human.
12) I have learnt that its better 
      to drop the ego than to 
      break a relationship. 
      After all, my ego will keep 
      me aloof whereas with 
      relationships I will never 
      be alone*.
13) I have learnt to live each 
      day as if it's the last. 
      After all, it might be the last.
14) I am doing what makes me 
       happy. 
      After all, I am responsible 
      for my happiness, and 
      I owe it to me.
 ☘ 🥒

I decided to send this to many, because why do we have to wait for so long, 
why can't we practice this at any stage and age.......
Best wishes for all my 
grown-up friends & relatives
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

కోడలి ప్రేమ

#ఒక పెద్దాయన మాటలు :.....

నాకు77 ఏండ్లు. నా భార్య చనిపోయి 10 సంవత్సరాలు అవుతోంది. నాకు 4గురు కొడుకులు.. ఒక్కొక్క నెల ఒక్కో కొడుకు ఇంట్లో నా జీవనం...ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వారిలో నేనూ ఒకడిని...ఇంక 4 రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి..ముడతలుపడ్డ తన వేళ్ళతో రోజులు లెక్కపెట్టుకుంటున్నాడు ఆ పెద్దాయన.
చిన్నకోడలి దగ్గరికి పోవడానికి ఇంక కొన్ని గంటలే సమయం ఉంది.పోయిన దీపావళికి 2వ కొడుకు పంచలు తీసిచ్చాడు.. అవి బాగా పాతబడిపోయాయి.పెద్దకొడుకు కొనిచ్చిన అద్దాలు పగిలిపోయి 3 వారాలు అయింది.కొడుక్కి చెపితే విసుక్కుంటాడని అద్దాలు పెట్టుకోవడం మానేశాను.కోడలితో చెప్తే గొడవ అవుతుందని చెప్పలేదు.
ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది.
చిన్నకోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి. ఇంకా 4 రోజులుంది.అందరూ ఆఫీస్ కు వెళ్ళాక ఆ పంచలు ఉతుక్కోవాలి..నల్లగా ఉంటే చిన్నకొడలు కొప్పడుతుంది.

4 రోజులు గడిచిపోయాయి...హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లవాడిలా ఆనందం నాకు..కొడుకు బస్ ఎక్కించి వెళ్ళిపోయాడు...బస్ దిగగానే నా చిన్నకొడలు నాకోసం స్కూటీ తెచ్చింది...నన్ను చూడగానే ' అద్దాలు ఏమయ్యాయి మామయ్యా?' అని అడిగింది...బ్యాగ్ లో ఉన్నాయి పదమ్మా! అన్నాను.తీసి పెట్టుకోమని ఆర్డర్ వేసింది...పగిలిపోయాయని చెప్పాను.కోపంగా నా వంక చూసింది. తలవంచుకున్నాను.
'సరే!జాగ్రత్తగా నా వెనుక కూర్చోండి' అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది...నాకు ఇష్టమైన బాదంపాలు త్రాగించి,అద్దాల షాపు దగ్గరికి వెళ్లి అద్దాలు ఆర్దరు చేసి ఇంటికి బయలుదేరింది కోడలు.

దారి మధ్యలో ఇలా అంది.
'అందుకే మామయ్యా!మిమ్మలి ఎక్కడికీ పంపడం నాకు ఇష్టముండదు...ఆ అద్దాలు కూడా తీసి ఇవ్వలేనంత బిజినా నీ కొడుకు..ఆ పంచ ఎలా ఉందో చూడరా వాళ్ళు. మిమ్మల్నే అనాలి'

పోనిలేమ్మా!ఎవ్వరినీ ఏమి అనకు.'అన్నాను... స్కూటీలో వెళ్తుండగా ' మామయ్యా!జాగ్రత్తగా కూర్చోండి. కావాలంటే నా భుజంపై తల వాల్చుకోండి.' అంది కోడలు.

అన్నదే తడవుగా ఆమె భుజంపై తల వాల్చుకున్నాను.
కుతురిలా చూసుకునే కోడలు భుజంపై తల వాల్చగానే కళ్ళల్లో కన్నీరు...ఇంటికి చేరగానే నా బ్యాగ్ తీసి బట్టలన్నీ తీసింది...ఇలా అడిగింది...
' నిజం చెప్పండి ! మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు కదా!'
'లేదమ్మా! వాషింగ్ మెషిన్ లో వేస్తారు..'అన్నాను.
అబద్ధం చెప్పేసి తలవంచుకున్నాను...నన్ను ఒక టీచరులా సీరియస్ గా చూసింది..తలవంచుకున్న నన్ను చూసి పక్కున నవ్వేసింది...
'నా బాధ మీకు అర్థం అవుతోందా.. మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్నవారి ఇంటికి మీరు ఎందుకు వెళ్లడం.ఇక్కడ నేను మీ చిన్నకొడుకు సరిగ్గా చూసుకోవడం లేదా చెప్పండి మామయ్యా!' అంది.
కోడలి రెండు చేతుల్లో నా ముఖాన్ని ఉంచి వెక్కి వెక్కి ఏడ్చాను...
'నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తానమ్మా!మరు జన్మ ఉంటే నీకు బిడ్డనై పుట్టాలని ఉంది తల్లీ!' ప్రేమగా నువ్వు చూసుకునే ఈ నెల రోజుల అనుభూతి మిగితా అన్ని నెలలకు సరిపోతుంది...నీ రుణం ఎలా తీర్చుకోను తల్లీ!
ఇలా అన్న నన్ను ప్రేమతో ఓదార్చింది నా కోడలు... కాదు కాదు నా కూతురు...నాకు మరొక దైవం

పెద్దవారు పసిపిల్లలతో సమానం.. వారికి ఆకలి వేసి
అడిగేదాకా చూడకండి...పిల్లలకు ఆకలివేస్తుందని తెలుసుకుని అన్నం పెడతాం కదా !వీరుకూడా అంతే!
పెద్దవారు మనకు మార్గదర్శనం.....🙏🙏

ఇలా కూతురు లా చూసుకునే కోడళ్ళు ఉన్నంత కాలం వృద్దాశ్రమాలతో పనివుండదు.👍👍🙏🙏

సేకరణ ✒️AVB సుబ్బారావు
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

నా Certificate కథ

నా Certificate కథ(1992 లో కొలిమిగుండ్లలో జరిగిన యదార్థ సంఘటన) 



1992 వ సంవత్సరం…..
కొలిమిగుండ్ల గ్రామం....
మండల రెవెన్యూ అధికారి కార్యాలయం (MRO Office) ....
మధ్యాహ్న సమయం…
ఓ పది మీటర్ల దూరంలో..MRO Office ఎదురుగా ఓ ఫారం చెట్టు ....prosopis juliflora ( కంప చెట్టు. దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు) 
దాని కింద వున్న చిన్న అరుగులాంటి బండమీద కూర్చుని ఉన్నాడు, ఓ పదకొండు సంవత్సరాల అబ్బాయి.
ఆ కంపచెట్టు తెరిపెలు తెరిపెలుగా వుంది. ఎక్కువ నీడను కూడా ఇవ్వలేకపోతుంది.
అది తప్ప ఇంక అక్కడ నీడ వున్న ప్రదేశం ఏదీ లేదు. దాని క్రిందనే తలదాచుకోవాలి, లేదంటే ఎండలో మాడాలి. వేరే మార్గం లేదు.
ఆ అబ్బాయి ఆ చెట్టు కింద వున్న గజం రాయి మీద కూర్చొని MRO Office వైపు చూస్తూ వున్నాడు.
 
ఏమైనా పిలుపు వస్తుందేమోనని.
---------------------------------
దాదాపు పదకొండున్నర – పన్నెండు ప్రాంతంలో వచ్చాడు అక్కడికి.
అక్కడ కార్యాలయంలో వున్న అధికారిని అడిగితే “వేచి వుండు, MRO (Mandal Revenue Officer) గారు వచ్చిన తర్వాత నీ పని చూస్తారు” అని చెప్పాడు.

ఆ MRO రాక కోసం...
ఆ కార్యాలయ అధికారి పిలుపు కోసం ...

చూస్తూ అక్కడే పడిగాపులు కాస్తూ కూర్చున్నాడు ఆ అబ్బాయి.
ఇంకో పెద్దాయన వచ్చి ఆ బండ మీద కూర్చుంటూ ఆ అబ్బాయిని అడిగాడు,
“ఏం నాయనా! ఇక్కడ కూర్చున్నావు? ఏం పని కోసం వచ్చావు?”
“Caste Certificate కోసం వచ్చాను పెద్దాయన”
 
“దాదాపుగా నెల రోజుల పైనే అయింది అప్లికేషన్ పెట్టి, ఈరోజు ఇస్తామన్నారు, అందుకే వచ్చాను.”
“ఎవరు చెప్పారు?”
“మా ఊరి తలారి (Village Revenue Assistant) చెప్పాడు.”
“ఒక్కడివే కనపడుతున్నావ్? పెద్దలెవరూ రాలేదా , నీతో పాటు?”
“లేదు, పెద్దాయన. మా అమ్మానాన్న పనికి వెళ్లారు. నన్ను వెళ్లి Certificate తెచ్చుకోమన్నారు”
“ఏం చదువుతున్నావ్?”
“ఐదవ తరగతి చదువుతున్నాను. అది అయిపోవచ్చింది. నవోదయ స్కూల్కు పరీక్ష వ్రాశాను. Select అయ్యాను. అన్ని Certificates తీసుకుని రమ్మని letter వచ్చింది.” 
Caste Certificate MRO Office లో ఇస్తారు కదా! దాని కోసం చాలా రోజులయ్యింది apply చేసుకొని. ఇప్పుడు ఇస్తారు వెళ్లి తీసుకోమని మావూరి తలారి చెప్పాడు, అందుకే వచ్చాను.
------------------------
“నాన్న, నాకు Caste Certificate మరియు ఇతర Certificates అన్నీ originals తీసుకొని రమ్మన్నారు, నవోదయ స్కూలుకు.”
ఆరో తరగతి లో join అవ్వాలంటే అన్ని certificates తీసుకొని వెళ్లాలంట!”
“సరే మరి, నేనైతే రాలేను, నేను పనికి వెళ్ళాలి. ఇంతకు ముందు photo తీసుకోవడానికి వెళ్ళా వ్ కదా! వారు వెళ్లినప్పుడు వెళ్లు మరి.”
“వాళ్లు select కాలేదంట, వాళ్ళు ఇప్పుడు Certificate తీసుకోవడానికి రారు.”
“సరే మొన్ననే కదా! నువ్వు వాళ్లతో కలిసి కొలిమిగుండ్ల వెళ్లి వచ్చావు, బస్సుల రూటు తెలుసుకదా! ఒక్కడివి వెళ్లిరాలేవా”
“నువ్వు రాలేకపోతే నేను వెళ్లి వస్తాను. నాకు చార్జీకి డబ్బులివ్వు మరి.”
“ఎంత?”
“పేరుసోముల నుండి తిమ్మనాయుని పేటకు రూపాయిన్నర అక్కడి నుండి కొలిమిగుండ్ల కు రెండు రూపాయిలు... మొత్తం మూడున్నర. 
మూడున్నర రాను, మూడున్నర పోను మొత్తం ఏడు రూపాయలు అవుతుంది.”
“సరే, ఇదిగో! ఈ పది రూపాయలు తీసుకో!”
మధ్యాహ్నం పూట అక్కడే కొలిమిగుండ్లలో ఏదో ఒకటి కొనుక్కుని తిను.”
అంటూ తీసి పది రూపాయలు చేతిలో పెట్టారు.
“డబ్బులు జాగ్రత్త. అజాగ్రత్తగా వుండి డబ్బులు పోగొట్టుకున్నావంటే అంతే సంగతులు”
పది రూపాయలు తీసుకొని జాగ్రత్తగ, పొద్దున్నే వేసుకోవాల్సిన నిక్కర్ జేబులో పెట్టుకొని పడుకున్నాను
మరుసటి రోజు పొద్దున్నే లేచి, తయారయ్యి భోంచేసి ఎనిమిది కల్లా బయలు దేరాను.
అంగీ (Shirt) నిక్కరు(half pant) వేసుకొని పది రూపాయల నోటును జాగ్రత్తగా పెట్టుకొని, పేరుసోముల దగ్గర వున్న బస్సు ఆగే స్ధలంలో వచ్చి నిలబడ్డాను.
పేరుసోముల నుండి తిమ్మనాయుని పేట, అక్కడి నుండి కొలిమిగుండ్ల వచ్చేసరికి జేబులో ఒక అయిదు రూపాయల నోటు, ఒకటిన్నరూపాయల చిల్లర మిగిలింది. కండక్టర్ ఇచ్చిన డబ్బులు అంగీ జేబులో పెట్టుకొని, బస్సు దిగి సరాసరి MRO Office కి వెళ్లి అక్కడ వున్న Junior Assistant ను కలిసి వచ్చిన పని చెప్పగానే
MRO గారు బయటికి వెళ్లారు. వచ్చిన తరువాత కలువు అని చెప్పడంతొ, నేను ఫారం (ముళ్లకంప) చెట్టు కింద కూర్చుని wait చేస్తూ వున్నాను.
అక్కడికి ఓ మాదిరిగా జనాలు వస్తూ పోతూ వున్నారు. MRO Office ఎదురుగా ఒకాయన తెల్ల బట్టలు వేసుకొని
కుర్చీ మీద కూర్చొని వచ్చిపోయే వారితో మాట్లాడుతూ వున్నాడు. కాలి మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చున్నాడు కుర్చీలో. వచ్చిన వారు చేతులు కట్టుకుని నిలబడి మాట్లాడుతూ వున్నారు
“ఏం కావాలి నీకు?”
“Certificate కోసం వచ్చాను.”
“ఆ గదిలో clerk (Junior Assistant) వుంటాడు. ఆయన్నివెళ్లి అడుగు.”
ఆయన చూపించిన వైపున వున్న రూమ్ దగ్గరికి వెళ్లి అక్కడ వున్న వారిలో ఒకరితో అడిగాను – “సర్, నాకు Caste Certificate కావాలి apply చేసి చాల రోజులయింది. ఈ రోజు వస్తే ఇస్తామని చెప్పారు.
“ఏం పేరు?”
“గంధం చంద్రుడు”
“ఏ ఊరు”
“కోటపాడు”
“సరే, wait చెయ్యి MRO గారు సంతకం చేయ్యాల్సి వుంది. సార్ వచ్చి సంతకం చేసిన తరువాత ఇస్తాం
“అలాగే సర్.”
-----------------
MRO గారు ఎప్పుడు వస్తారో తెలియదు. ఎప్పుడు వెళతారో తెలియదు. ఒక వేళ నేను తినడానికి బయటికి వెళ్తే, ఆయన వచ్చి వెళ్లిపోతే?
లేదు లేదు, నేనెక్కడికి వెళ్లకూడదు. Certificate తీసుకొని కావాలంటే అప్పుడు తింటాను ఏమైనా...

పన్నెండు…
ఒకటి…
రెండు…
మూడు…
నాలుగు గంటలు గడిచిపోయాయి.
ఆ ముల్లకంప చెట్టు కింద, అటూ ఇటూ తిరుగుతూ వచ్చిపోయేవారిని గమనిస్తూ.... వున్నాను. చెట్టు కింద వున్న బండ కాలుతూ వుంది, ఎండకు కాళ్లు కాలుతూ వున్నాయి, చెప్పులు లేక.
 
అటూ ఇటూ తిరుగుతూ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ వున్నాను.

దాదాపు మూడున్నర ప్రాంతంలో వచ్చారు MRO గారు. సరాసరి ఆయన room లోకి వెళ్లిపోయారు.
అప్పటు వరకు అక్కడ దర్జాగా తెల్ల బట్టలు వేసుకొని, కూర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న వ్యక్తి*, MRO గారు రాగానే ఒక్క ఉదుటున లేచి, కుర్చీని పక్కకు జరిపి, వంగి ఆయన నమస్కారం పెట్టి, ఎక్కడలేని వినయం ప్రదర్శించాడు.
నాకు అది చూసి ఆశ్చర్యం అనిపించింది. మళ్లీ clerk వున్న రూమ్ లోకి వెళ్లి ఆయనకు గుర్తు చేశాను. MRO గారు వచ్చారు అని. సరే, నేను తీసుకొని వెళ్తాను files అన్ని, నువ్వు wait చెయ్యి అన్నట్లు చూపించాడు నాకు. మళ్లీ పదినిమిషాలు అటూ ఇటూ తిరిగి మళ్లీ దగ్గరికి ‌వెళ్లాను. ఈ సారి బిళ్ల బంట్రోతు అడిగాడు.
 
 
“నీ పని కూడా అయిపోయిందిలే! ఏమన్నా తెచ్చావా?” నన్ను చూస్తూ అన్నాడు బిళ్ల బంట్రోతు.
నాకు అర్ధం కాలేదు
 
“ఏమన్నా తెచ్చావా? అంటే చాలా చూస్తావేం?”
“డబ్బులున్నాయా?”
లేవని కానీ, వున్నాయనీ కానీ చెప్పకుండా అలా వుండిపోయాను నేను.
నేను ఏమీ చెప్పక పోయేసరికి, ఆయన నా file ను పక్కన పెట్టి మిగతా Certificate/Files మీద ఎక్కడయితే MRO గారు సంతకం చేశారో, దాని కింద అధికారిక stamp వేస్తూ, వచ్చిన వారికి వచ్చినట్టు certificates ఇస్తూవున్నాడు. వారు ఆయనకు ఏదో ఇస్తున్నారు. చేతిలో చెయ్యి కలుపుతూ
ఒక్కొక్కరి నుండి ఒక్కో పద్ధతి…
ఒకరికేమో గోడ చాటుకు వెళ్ళి ఏదో చేతిలో చెయ్యి పెట్టి తీసుకొని, వెంటనే certificate తెచ్చి ఇస్తున్నాడు. ఇంకొకరితో అలా పది అడుగుల దూరం నడిచి, మళ్లీ లోపలికి వెళ్లి వాళ్ల certificate/Documents వాళ్లకి ఇస్తున్నాడు. 
మద్యమద్యలో నా వైపు చూస్తూ వున్నాడు.
ఇదంతా నాకు అర్ధం కావడం లేదు. అందరికీ Certificate/documents ఇస్తూవున్నాడు. నాకు మాత్రం ఇవ్వట్లేదు.
ఒకవైపు ఎండ...
ఒకవైపు ఆకలి...
బంట్రోతేమో certficate ఇవ్వడం లేదు.
వుండబట్టలేక మళ్లీ అడిగాను, “ నా certificate ఇవ్వండి.”
“సరే, ఇటు రా”
దగ్గరికి వెళ్లాను.
నా చొక్కా జేబులో చెయ్యి పెట్టాడు. అందులో అయిదు రూపాయిల నోటు చిల్లర ఆయన చేతికి చిక్కాయి.
నేను వెనక్కి జరగబోయాను, చేతిని అడ్డు పెట్టబోయాను.
కానీ రెండూ జరగలేదు. అంత వేగంగా జేబులో చెయ్యి పెట్టడం, డబ్బులు తీసుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి.
లోపలికి వెళ్లి certificate బయటికి తెచ్చి, అక్కడ వున్న stool మీద దాన్ని వుంచి నా ఎదురుగానే దాని మీద MRO గారి designation stamp, office stamp (Round stamp) వేసి…
“ఇదిగో నీ certificate తీసుకో.”
నాకు certificate ఇచ్చినందుకు సంతోషం కంటే, జేబులో నుండి ఉన్న డబ్బు మొత్తం లాక్కునందుకు ఎక్కువ బాధ కలిగింది. కొద్ది సేపు ఆగాను, ఆయన ఏమన్నా కనికరించి నా డబ్బులు నాకు తిరిగి ఇస్తాడేమోనని. ఆయనకు అటువుంటి ధ్యాసే లేదు. ఆయన మిగతా certificates కు stamp వెయ్యడం, వాటికోసం వారితో పక్కకు వెళ్లడం, వారితో చెయ్యి కలపడంలో busy గా ఉన్నాడు.
అప్పటికి దాదాపు అయిదున్నర కావస్తుంది టైం.
ఏం చెయ్యాలో కొద్ది సేపు పాలుపోలేదు నాకు. కొద్ది సేపటికి మా అత్తగారి ఊరు - బెలుం - గుర్తుకువచ్చింది. అది కొలిమిగుండ్ల నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
------------------------x------------------------------x-----------------------------------------------
చిన్న సుబ్బమ్మ- మా మేనత్త, బెలుం లో ఉంటారు. ఆవిడంటే నాకు చాలా ఇష్టం. తను కూడా చిన్న అల్లుడినైన నన్ను చాలా మురిపెంగా చూసుకుంటుంది. బెలుం కు బస్సులో వెళ్లాలన్నా రూపాయిన్నర కావాలి. అది కూడా లేకుండా తీసుకున్నాడు ఆ బిళ్ల బంట్రోతు. ఇంక ఎక్కువసేపు ఆలోచించలేదు. వేగంగా నడుచుకుంటూ వెళ్తే ఒక గంట - గంటన్నర లో బెలుం చేరుకోవచ్చు.
 
అనుకున్నదే తడవుగా, కాళ్లకి పని చెప్పాను. కడుపు ఆకలితో నక నక లాడుతూవుంది. ఎండకు దుమ్ము, ధూళి కొట్టుకు పోయి ఉన్నాను. Certificate ను జాగ్రత్తగా ఒక పేపర్ లో చుట్టి రౌండుగా చేసి జేబులో పెట్టుకున్నాను.
కొలిమిగుండ్ల నుండి బెలుంకు సింగల్ రోడ్డు. ఎప్పుడూ పాడయిపోయి గతుకులు గతుకులుగా ఉంటుంది. ఆ దారిలో నాపరాళ్ల గనులు చాలా వున్నాయి. అందులో పని చేసేవారు మూడు నాలుగు లోపు పనులు ముగించి ఇళ్లకు వెళ్తారు. ఐదు వరకు ఎవ్వరూ ఉండరు. అంతా నిర్మానుష్యంగా ఉంటుంది.
రోడ్డు మీద ఒక్కడినే నడవడం మొదలు పెట్టాను, భయపడుకుంటూనే. చిన్న అడుగులు ఎంతగా వెయ్యాలనుకున్న ఎక్కువ దూరం పడవు. వేగంగా వెళ్లడం ఒక్కటే మార్గం. ఇక లాభం లేదనుకుని పరిగెత్తడం మొదలు పెట్టాను . ఆయాసం వచ్చేంత వరకు పరిగెత్తడం, ఆయాసం తగ్గేంత వరకు నడివడం తర్వాత మళ్లీ పరిగెత్తడం - మళ్లీ నడవడం
- పరుగు 
- నడక - 
ఇలా సాగింది నా ప్రయాణం. కొద్ది కొద్దిగా సూర్యకాంతి తగ్గుతూ ఉంది. ఆ పెద్ద కొండల వలన సూర్యుడు పూర్తిగా కనిపించకుండా అయిపోయాడు. దాదాపు చీకటిపడిపోయింది.
భయం భయంగా, వేగంగా వెళ్లాలన్న ఆతృతతో రొప్పూతూ certificate ను, గుండెను అరచేతిలో పెట్టుకుని వెళ్లాను. దాదాపు పూర్తిగా చీకటిపడుతున్న సమయానికి ఆరున్నర ప్రాంతంలో బెలుం లో ఉన్న మా అత్తగారింటికి చేరిపోయాను. బయట నవారు మంచం మీద మా మామ కూర్చుని వున్నాడు. ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నన్ను గమనించలేదు. నాకు ఆగి ఆయన్ని పలకరించే పరిస్ధితి లేదు. సరాసరి ఇంటిలోపలికి ‌వెళ్లాను.
ఇంటి లోపలికి అడుగు పెట్టేటప్పుడు గమనించింది మా అత్త.
“ఏం నాయనా! బాగున్నావా?”
“ఈ టైములో వచ్చారేమి?” పెద్ద వాళ్లతో కలిసి వచ్చాననుకుని ఇంకా బయటకి చూస్తూ వుంది.
మిగతా వారు ఎక్కడా అన్నట్టు. ఎవరూ వెనక లేకపోయెసరికి అప్పుడు అడిగింది -
“ఒక్కడివే వచ్చావా?”
“అవును, ఒక్కడినే వచ్చాను”
కాళ్లంతా దుమ్ము పట్టిపోయి వున్నాయి. మాటలు రావడం లేదు. నోరు ఎండిపోయి ఉంది. నీళ్లు ఇవ్వమన్నట్టు సైగ చేసాను. సూరి - మా అత్త కొడుకు - నాకంటే నెల రోజులు చిన్నవాడు - వెంటనే నీళ్లు తెచ్చి ఇచ్చాడు. గబగబా నీళ్లు తాగి మంచం మీద కూర్చున్నాను, కాళ్లు నొప్పి పెడుతుంటే.

“తిన్నావా?”

“లేదు”
“ఎలా వచ్చావు?”
“కొలిమిగుండ్ల నుంచి నడుచుకుంటూ...”

అప్పుడు అర్ధం అయ్యింది మా అత్తకు ఏదో పొరపాటు జరిగింది అని. వచ్చి పక్కన కూర్చింది. తల మీద చెయ్యి వేసి నిమురుతూ అడిగింది - ఏం జరిగిందని - మొత్తం జరిగిందంతా చెప్పాను. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా.
గట్టిగా హత్తుకుని మంచం మీద నుంచి లేచి వంట గదిలోకి వెళ్లి పళ్లెం లో అన్నం, పప్పు పెట్టుకుని వచ్చి - తినమని ఇచ్చింది. నా పక్కనే పడుకుని రాత్రి కాళ్లు పిసుకుతూ పడుకుంది. వాళ్లను శాపనార్ధాలు పెడుతూ.
పొద్దునే లేచి అత్త తో డబ్బులిప్పించుకుని కోటపాడుకు బయలుదేరాను.
------
వచ్చిన తర్వాత ముందు రోజు రాత్రి మా ఇంట్లో జరిగిన విషయం తెలిసింది.
“చిన్నోడు వచ్చాడా?” పనిముగించుకుని తిరిగి వచ్చి, కాళ్లు కడుక్కుంటూ అడిగాడు నాన్న, అమ్మని. అప్పటికి దాదాపు ఏడు గంటలు అవుతుంది. ఇంకా రాలేదా? సరే నేను bus stop దగ్గరికి వెళ్లి తీసుకుని వస్తాను అని, అమ్మ - భోజనం తిని వెళ్లు అని అంటూ వున్నా వినకుండా గబగబా వెళ్లిపోయాడు.
పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేసి బాగా అలసి పోయి ఉన్నాడు. కాళ్లు, చేతులు కడుక్కుని, భుజం మీద towel వేసుకుని bus stop కి వెళ్లాడు.
పేరుసోములలో తిమ్మనాయుని పేట నుండి కోవెలకుంట్ల వళ్లే బస్సులో రావాలి అబ్బాయి. చివరి బస్సు దాదాపు రాత్రి ఏడున్నర - ఎనిమిది మద్య వస్తుంది. దారిలో వేరేవాళ్లు ఎదురైతే వాళ్లను అడిగాడు - మా చిన్నబ్బాయిని ఏమన్నా చూసారా అని.
చివరి బస్సు ఎనిమిది గంటలకు వచ్చింది. అందులో కోటపాడు వాళ్లు ఒకరిద్దరు దిగారు - నేను కనపడలేదు. దిగిన వారిని ఆత్రంగా అడిగాడు - మా చిన్నబ్బాయిని ఎక్కడైనా చూసారా? అని. అందరి నుండి లేదు/చూడలేదు అన్న సమాధానమే వచ్చింది.
bus stop లో దాదాపు ఒక గంట సేపు - అంటే తొమ్మిది వరకు వేచిచూసి, ఏం చెయ్యాలో దిక్కుతోచలేదు ఆయనకు, నాన్నకు భయం పట్టుకుంది. ఏమన్నా అయ్యిందా అబ్బాయికి. లేదా పని జరగక అక్కడే ఆగిపోయాడా? ఎవరైనా ఏమైనా చేశారా? ఏం చెయ్యాలో పాలుపోక బాధపడుకుంటూ తిరిగి ఇంటికి వచ్చాడు.
ఆ కాలంలో ఫోన్ లు లేవు - atleast మా గ్రామంలో ఎవరికీ landline కూడా లేదు.  
ఏమైపోయాడు, ఎలావున్నాడు తెలుసుకునే మార్గమే లేదు. పోనీ కొలిమిగుండ్ల కి వెళ్దామంటే బస్సులు లేవు ఆ టైములో... ఇతర వాహనాలు అద్దెకు తీసుకొని వెళ్లడానికి కూడా దొరకవు. దొరికినా వాటిని అద్దెకు తీసుకునేంత స్థోమత లేదు.
ఇంటికి వచ్చీ రాగానే అమ్మ భయంగానే అడిగింది - ఎక్కడ పిల్లోడు అని. రాలేదు అని చెప్పగానే ఒకటే ఏడుపు.
నాన్న లోలోపల ఏడుస్తున్నాడు. అమ్మ బయటకి ఏడుస్తూ ఉంది గట్టిగా. వండిన భోజనం అలానే ఉంది. నాన్న బస్టాండుకు వెళ్లాడు కదా - పిల్లోడిని తీసుకు వస్తాడు కదా - అప్పుడు అందరం కలిసి తిందాం అని అమ్మ కూడా తినలేదు. నాన్న ఒక్కడే తిరిగి వచ్చేసరికి ఇద్దరికీ తినాలనిపంచలేదు.
రాత్రంతా ఒకటే ఏడుపులు.... మధ్యమధ్యలో నాన్న ధైర్యం చెప్తున్నాడు అమ్మకు – “ఆ! ఏమి అయ్యింటాది. పని అయ్యిండదు. అక్కడే ఉంటాడు. పొద్దున్నేవచ్చేస్తాడులే.”
అన్ని దేవతలను వేడుకుంది అమ్మ మనసులో - వాళ్లతో వీళ్లతో మాట్లాడాడు నాన్న - ఏం చేద్దాం ఇప్పుడు అని. ఉదయం ఒకటి రెండు బస్సులు వచ్చేవరకు వేచి చూడడం తప్ప మార్గము లేదని చెప్పారు వాళ్ళు.
గుండెను అరచేతిలో పట్టుకుని రాత్రంతా ఏడుస్తూ, మేలుకుని ఉన్నారు. అమ్మ, నాన్న - ఇద్దరూ మరుసటి రోజు మధ్యాహ్నం నేను వచ్చిన తర్వాత కానీ భోజనం చెయ్యలేదు.
అలా ముగిసింది నా certificate కథ.

https://www.gandhamchandrudu.com/post/%E0%B0%A8-certificate-%E0%B0%95%E0%B0%A5-my-certificate-story

https://www.gandhamchandrudu.com/post/the-struggle-for-a-photograph
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

సుమంగళి

...సుమంగళి కోరిన వైధవ్యం

ఒక నాడు కంచి పరమాచార్య స్వామి వారి దగ్గరకు ఓ వృద్ధ సువాసిని వచ్చి, స్వామి వారిని ఓ విచిత్రమైన కోరిక కోరింది.

"స్వామీ ఒకవేళ నా భర్తకు ఏదైనా జరగరానిది జరిగి ఆయువు చెల్లితే, అది నేను ఉండగానే జరిగేలా ఆశీర్వదిoచoడి. నా కన్నా ముoదు, నా కళ్ళ ముందు ఆయన వెళ్ళిపోయేటట్టు అనుగ్రహించండి" అని ఆర్తితో వేడుకుంది.

వెంటనే మహాస్వామి వారు చిరునవ్వుతో, "అలాగే అవుగాక" అని దీవించి పంపారు. కానీ అక్కడ ఉన్నవారందరూ ఈ మాటలను విని నిశ్చేష్టులైపోయారు.

ఆమె అలా వెళ్ళిన వెంటనే స్వామివారితో, “స్వామీ! పెళ్ళి కాక ముందు చేసే నోములూ వ్రతాలు మంచి భర్త రావాలని, పెళ్ళైన తరువాత చేసే సమస్త పుణ్యకర్మలూ భర్త ఆయురారోగ్యాలతో ఉండి ఆయన చేతుల్లో తను పుణ్య స్త్రీ గా పోవాలనీ కదా! మరి ఈవిడ ఇoత విపరీతమైన కోరిక కోరడమేమిటి? మీరు కూడా అలాగే అని దీవించడం. . .” అని ఆశ్చర్యoగా అడిగారు.

అందుకు స్వామివారు చిరునవ్వుతో "వారిది అన్యోన్య దాంపత్యం. భర్త మీద వల్లమాలిన ప్రేమ ఆవిడకి. ప్రారబ్ధమో లేక శాపమో వారికి పిల్లలు లేరు. వృద్ధాప్యం మరో బాల్యం అంటారు కదా! ఈ వృద్ధాప్యంలో ఆ భర్తకు ఈవిడే అన్నీ. ఆయన్ని చoటి పిల్లాడిలా సాకుతోంది. పైగా ఆయనకు జిహ్వచాపల్యo కాస్త ఎక్కువ. మరి ఆవిడే ముందు కాలo చేస్తే ఆయన్నెవరు చూసుకుoటారు, ఆయన అవసరాలను పట్టిoచుకోనేదేవరు అని బెoగ ఆ తల్లికి. అందుకే ఆ కోరరాని కోరిక కోరింది" అని సెలవిచ్చారు.

భర్తకోసం పద్నాలుగేళ్ళు కారడవులను సైతం లెక్కచేయక ఆయన తోడిదే నా స్వర్గం అని సమస్త భోగాలను త్యజించి ఆయన్ని అనుసరిoచిన సుకుమారియైన రాకుమారి మన సీతమ్మ తల్లి. ఇప్పటికీ అటువంటి ఎoదరో మహాతల్లులకు సీతమ్మ తల్లి ఆదర్శం.

భర్తే తన దైవoగా భావిoచి "శ్రీవారు" అని పిలుస్తూ గృహస్థాశ్రమంలోనే తరిoచిన అనేక మహాతల్లులు నడయాడిన నేల ఇది. వారoదరినీ సీతమ్మవారి అoశగాగాక మరెలా పరిగణిoచగలo?

అందుకే స్వామి వారికి అంతటి అపార కరుణి ఆ తల్లిపై.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

సేకరణ :
https://www.facebook.com/groups/2058733140940134/permalink/2522221247924652/
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

గర్వభంగం

🦚గర్వభంగం 🦚
🍁🍁🍁🍁🍁🍁🍁

ఒకసారి సత్య భామ శ్రీకృష్ణునితో
‘స్వామీ.. రామావతారం లో సీత మీ భార్యకదా! 
ఆమె నాకంటే అందంగా ఉండేదా?’ 
అని అడిగింది. 

ఆ సమయం లో అక్కడే ఉన్న గరుడుడు
‘ప్రభూ, 
నాకంటే వేగంగా ఈ ప్రపంచం లో ఎవరైనా ప్రయాణించ గలరా?’ 
అన్నాడు.

పక్కనే ఉన్న సుదర్శనుడు
(సుదర్శన చక్రం) 
కూడా.. ‘పరంధామా, 
అనేక యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాన్ని తెచ్చి పెట్టాను.
నాతో సరి తూగు వారెవరు స్వామి’
అన్నది.

ముగ్గురి మాటలూ విన్న నంద గోపాలుడు వారికి గుణపాఠం చెప్పాలను కున్నాడు.

దీర్ఘంగా ఆలోచించి..

‘సత్యా, నువ్వు సీతగా మారిపో.
నేను రాముణ్నవు తాను.
గరుడా నువ్వు ఆంజనేయుని దగ్గరికి వెళ్లి సీతా రాములు నిన్ను తీసుకు రమ్మన్నారని చెప్పి తోడ్కనిరా.

చక్రమా, 
నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించ కుండా చూడు’ 
అంటూ ముగ్గురి కీ మూడు బాధ్యతలు అప్పగించాడు. 

గరుత్మంతుడు హనుమంతుని వద్దకు వెళ్లి.. 
సీతా రాములు రమ్మన్నారని చెప్పాడు. 

హనుమ ఆనందంతో పుల కించిపోతూ..
‘నేను నీ వెనుకే వస్తాను. 
నువ్వు పద’ 
అని గరుత్మంతు ని సాగ నంపుతాడు. 

ఈ ముసలి వానరం రావడానికి ఎంత కాలమవు తుందో కదా అను కుంటూ గరుడుడు రివ్వున ఆకాశానికి ఎగురు తాడు. 
కానీ.. 
ఆయన కంటే ముందే హనుమ ద్వారక చేరడం తో గరుత్మంతునికి మతి పోతుంది. సిగ్గుతో తలదించు కొని మౌనంగా ఉండి పోతాడు.

ఇంతలో..
‘హనుమా’
అన్నపిలుపు తో పులకించిన ఆంజనేయుడు తన రాముని వైపు చూశాడు. 
‘లోనికి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేదా?’
అని అడగ్గా..
హనుమ తన నోటి నుండి చక్రాన్ని తీస్తూ
‘ప్రభూ, 
ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు.
ఎన్ని చెప్పినా వినక పోవడం తో ఇక లాభం లేదని భావించి నోట్లో పెట్టుకొని మీ ముందు వచ్చి నిలిచాను’
అన్నాడు సుదర్శనుడు కూడా గరుడని వలె అవమానం తో నేల చూపులు చూస్తూ ఉండి పోయాడు. 

ఇంతలో హనుమంతు ని చూపు తన రాముని పక్కన కూర్చున్న స్ర్తీ 
పై పడి 
‘స్వామీ, 
మీ పక్కనుండ వల్సింది నా తల్లి సీతమ్మ కదా! 
ఎవ రీవిడ ప్రభూ’ అన్న మాటలు విన్నదే తడువు గా సత్య భామకు కూడా గర్వ భంగమై ప్రభువు కాళ్ళ మీద పడింది. 
అలా కృష్ణపర మాత్ముడు, ముగ్గురిలో మొగ్గ తొడిగిన గర్వాన్ని తుంచి వేసి వినయాని కున్న విలు వేమిటో తెలియ చెప్పాడు.

"ఈ రోజులలో కూడా కొంతమంది బంగారు గరిట(గోల్డెన్ స్పూన్), వెండి గరిట (సిల్వర్ స్పూన్).. నోట్లో పెట్టుకొని పుట్టినట్లు. తామే గొప్పవారము అని, మిగిలినవారు హీనులు ..అని భ్రమలలో బ్రతుకుతున్నారు... వాళ్లకు తత్వం బోధపడాలి అంటే, ఆ పరమాత్ముడు మళ్ళీ పుట్టాలేమో... 

🌹నీతి:- ఎవరైనా గతాన్ని మరచిపోరాదు,
 వర్తమానాన్ని విస్మరించరాదు,
 భవిష్యత్తును అతిగా ఊహించరాదు... 
ఇవి ఏవీ మనచేతి లోనివి కాదు అని మాత్రం గుర్తించాలి...

     💥సర్వేజనాః సుఖినోభవంతు💥
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

మానవసేవే మాధవసేవ

నిధి ఉన్న బిచ్చగాడు 🙏



ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు. చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు. 

ప్రతి రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు.
ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే. ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది......

బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు. చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది. తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు.

తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు. ఆ భక్తుడు సరేనన్నాడు.

ఆ ఘడియ రానే వచ్చింది.
బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు. భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు.

ఆశ్చర్యం ......! దాని నుండి నిధి బయటపడింది.
వెండి, బంగారు నాణేలు దానిలో ఉన్నాయి.
అవన్నీ అతడి సొంతమయ్యాయి.

మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు.
అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది. జరిగిన దానికి సంతోషపడ్డాడు.

కానీ, ఒక సందేహం అతడిని పీడించింది.

నిధి మీదే కూచున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడి గానే ఉండిపోయాను.

దారిన పోయే దానయ్య కోటీశ్వరుడు అయ్యాడు. ఏమిటయ్యా ఇది! అని దేవుణ్ణి ప్రశ్నించాడు. 

అతడికి దేవుడు సమాధానం చెబుతూ.....నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూచుని, భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ గడిపావు. అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది. 

అతడు రోజూ భగవత్సేవ చేస్తూ, నీకు యదా శక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు. నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అందుకే అతనికి సిరిసంపదలు లభించాయి అన్నాడు దేవుడు.

మానవ సేవే మాధవ సేవ 

వ్యక్తి తనలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానిని విస్మరించి, గుడ్డి వాడిలా బయటే ఏదో ఉందని పరిభ్రమించడం ఆగాలి. తప్పక అంతర్ముఖుడు కావాలి!🙏
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

సజ్జన సాంగత్యం - కర్మ ఫలం

*సజ్జన సాంగత్యం - కర్మ ఫలం.* 

చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి , రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది.
ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది.


ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు.ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.
కొద్దిసేపటి తరువాత బస్సు మళ్లి బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు.

ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.
ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దగ్గరలో కొట్టింది.ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.
అందులోంచి ఒక పెద్దమనిషి ఇలా అన్నాడు.”చూడండీ! మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ‘ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది.
నేను చేప్పేది జాగ్రత్తగా వినండి!

ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి, అదిగో! ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు! ఒక్కరి కోసం అందరు చస్తారో ? అందరి కోసం ఒక్కరు చస్తారో? ఆలోచించుకోండీ! ” అన్నాడు.
చివరకు ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు.

మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు.ఏమీ జరగలేదు.
అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు….
ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు.
చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు.ఇక మరణించేది అతడే! అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది.
చాలా మంది అతని వైపు అసహ్యంతో,కోపంతోచూడసాగారు.కొందరు జాలి పడుతూ చూడసాగారు.అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు.

కాని, బస్సులోని ప్రయాణికులందరు”నీవల్ల మే మందరం మరణించాలా? వీల్లేదు అంటూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు.
చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు.వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది.కాని పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు!
బస్సుపై…అవును.. బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు.
నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సు కు ప్రమాదం జరగలేదు. ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుష్షు వారినందరిని కాపాడింది.
ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఆ క్రెడిటంతా మనదే అనుకుంటాము.
కాని, ఆ పుణ్యఫలం
🔸మన తల్లిదండ్రులది కావచ్చు
🔸జీవిత భాగస్వామిది కావచ్చు
🔸పిల్లలది కావచ్చు
🔸తోబుట్టువులది కావచ్చు
🔸మన క్రింద పని చేసే వారిది కావచ్చు లేదా
🔸మన శ్రేయస్సును కోరే స్నేహితులది – బంధువులది కావచ్చు!
మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు.
ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి.🙏
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

కర్మఫలం

🙏కర్మఫలం 🙏

పూర్వం ఒక రాజు ఉండేవాడు...పరమక్రూరంగా , దయ లేకుండా అందరినీ బాధపెట్టేవాడు..
అలాంటి రాజు ఒకరోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన మంత్రులు అధికారులు ప్రజలు అందరినీ సమావేశపరిచి ఒక ప్రమాణం చేసాడు "నేను ఈ రోజు నుంచి ఎవ్వరినీ బాధపెట్టను , అందరితో మంచిగా ఉంటాను , దయగా ప్రవర్తిస్తాను" అని...మాట ఇచ్చినట్టే , మాటకు కట్టుబడి అతను మంచిగానే ఉన్నాడు..కొంతకాలానికి అందరూ అతన్ని దయగలమారాజు అనుకుంటున్నారు...

మంత్రుల్లో ఒకరు ఈ మార్పు ఎలా సాధ్యం , తెలుసుకోకపోతే ఎలా అని చాలా కుతూహలంగా రాజు దగ్గరికి వెళ్ళి మీలో ఎందుకు ఉన్నట్టుండి అంత మార్పు వచ్చింది , కారణం చెప్తారా అని అడిగాడు...

రాజు సమాధానం చెప్తున్నాడు..
నేను ఒకరోజు గుర్రం మీద అడవిలో తిరుగుతుంటే ఒక వేటకుక్క నక్కని వెంటాడుతోంది...నక్క కష్టపడి తన గుహలోకి వెళ్ళేలోపే వేటకుక్క నక్క కాలు కరిచింది...నక్క కుంటిది అయిపోయింది...

ఆ రోజు కాసేపటికి పక్కనే ఉన్న ఊరికి వెళ్ళాను..అక్కడ అదే వేటకుక్క ఉంది...
ఒక మనిషి ఒక పెద్ద రాయి తీసుకుని వేటకుక్క మీదకి విసిరాడు ...ఆ రాయి కుక్కకాలుకి తగిలి వేటకుక్క కాలు విరిగింది....

అతను కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఒక గుర్రం అతన్ని బలంగా తన్నింది...అతను కిందపడి కాలు విరగ్గొట్టుకున్నాడు...
ఆ గుర్రం పరిగెత్తుకుంటూ వెళ్ళబోయింది...ఒక గుంటలో పడి దాని కాలూ విరిగిపోయింది...

వరుసగా జరిగిన ఈ సంఘటనలకు నాకు ఒక ఆలోచన తోచింది... 
నక్క కాలు కుక్క కరిస్తే , 
కుక్క కాలు మనిషి రాయి వల్ల విరిగింది , 
మనిషి కాలు గుర్రం తన్నినందువల్ల విరిగితే..
గుర్రం ఒక గుంటలో పడి కాలు పోగొట్టుకుంది...

ఒకరికి చెడు చేస్తే అదే చెడు వేరే ఏ కారణంతో అయినా మనకీ జరుగుతుంది అని బాగా తెలిసొచ్చింది...

అప్పుడు నా వల్ల ఎందరు బాధపడ్డారో..వారందరి వల్ల నేనూ బాధపడాల్సి వస్తే ఆ పరిస్థితి ఊహించుకుంటేనే వంట్లో వణుకు పుట్టింది...ఆ క్షణంలోనే నిజాయితీగా నిర్ణయించుకున్నాను...ఎవ్వరినీ ఇంక కష్టపెట్టకూడదు అని అందరితో దయగా ఉండాలి అనుకున్నాను అని రాజు వివరించాడు...

ఇదంతా విన్న మంత్రి ఈ రాజుకి చాదస్తం ఎక్కువయినట్టుంది...రాజుని ఈ పరిస్థితుల్లో సింహాసనం నుంచి తప్పించి..కిరీటం నేను దక్కించుకోవచ్చు అని పన్నాగం పన్నుకుంటూ ఆలోచనల్లో పడి ముందున్న మెట్లు చూసుకోలేదు..మెట్ల మీద జారి పడి మంత్రి మెడ విరిగి లేవలేని స్థితికి చేరుకున్నాడు...రాజు పదవి కాదు కదా మనిషిగా కూడా ఒకరిమీద ఆధారపడేలా అయ్యాడు..ఒకరికి చెడు చేస్తే ఏదో ఒకసారి మనకీ అదే చెడు జరుగుతుంది అన్న మంచి విషయం ఈ కధ సారాంశం..

    ॥ సర్వే జనా సుఖినో భవంతు॥
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

అంచనా

#అంచనా.....!!

     మా ఆవిడ సినిమాకి వెళదామంటే.. సరే అని వెళ్ళాం.టికెట్స్ తీసుకొని లోపలికి వెళుతుంటే..
ఎంట్రన్స్ డోర్ దగ్గర టికెట్స్ చింపుతూ ఉన్న గోపి గాడు నన్ను గుర్తు పట్టాడు. పలకరించుకున్నాక, మా ఆవిడకి పరిచయం చేశాను. ఇంటర్లో క్లాస్ మేట్ అని..!

         హాల్లో కూర్చున్నాక అడిగింది.. "అదేమిటండి మీ క్లాస్మెట్ అంటున్నారు.....ఇలా గేట్ దగ్గర టికెట్స్ చింపే ఉద్యోగంతో పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషిస్తాడో కదా పాపం.." అంది.

      "ఏమో చదువు అయ్యాక, ఇప్పుడే గదా కలిసింది" అన్నాను.వాడిల్లు చిన్నప్పుడు మా వీధిలోనే...చాలా అల్లరి వెధవ....సినిమాల పిచ్చి ఎక్కువ...ప్రతి రోజు పేపర్ తిరగెయ్యటం, ఏ సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందో చూడటం...

                ప్రతీ సినిమా రిలీజ్ రోజే ఉదయం ఆట చూసేయ్యటం... సినిమా హాల్స్ కేబిన్ దగ్గరకి వెళ్ళి తెగి పోయిన ఫిల్మ్ ముక్కలు ఏరు కోవటం..ఇదే పని.
         అప్పుడప్పుడు వాడి డబ్బులుతో నేల టిక్కెట్ కి నన్ను కూడా తీసుకెళ్లేవాడు...
           "ఎందుకురా" అంటే.. "ఒక్కడిని అయితే బెంచ్ టికెట్ తీసుకునేవాడిని.. నువ్వూ వస్తే 2నేల టికెట్స్.. అంతే గదరా.." అనేవాడు నవ్వుతూ ఆప్యాయంగా...!

            "మా పెద్దోళ్ళు, వాడితో తిరిగితే ఎక్కడ చెడి పోతామో అని వాడితో ఆడనిచ్చే వారు కాదు.చివరకు వాళ్ళు చెప్పినట్టే, వీడు లైఫ్ లో ఎదుగు బొదుగు లేకుండా ఇలా తగలడ్డాడు" అన్నాను.

        "మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను చాలా మంచోడులా ఉన్నాడు....లేపోతే మిమ్మల్ని తన డబ్బులతో సినిమాలకి ఎందుకు తీసుకెళుతాడు..
అయినా మీరు మటుకు చేసేది ఏమైనా పెద్ద కలక్టర్ ఉద్యోగమా ఏంటి....ఇప్పటి వరకు స్కూటర్ దాటి మరేం కొనలేదు" అంటూ భార్య దెప్పింది.

       నాకు ఉక్రోషం వచ్చి "ఎలా చూసినా వాడికంటే బెటరే కదే" అన్నాను.

        ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్ తెచ్చిచ్చిన..ఆ కుర్రోడికి డబ్బులు ఇవ్వబోతుంటే.. "వద్దు సార్" మీ ప్రెండ్ పంపాడు అని చెప్పి వెళ్లి పోయాడు.

         ఇదంతా గమనిస్తున్న మా ఆవిడ.. "నిజంగా మీ ఫ్రెండ్ మంచోడు అండీ..మీరే సరిగ్గా పలకరించ లేదు..పోజు కొడుతూ మాట్లాడారు." అన్నది.

         "కాదులేవే...వాడి పొజిషన్ ఇప్పుడు బాగా లేదేమో కదా.. నేను కాస్త ఆప్యాయంగా మాట్లాడాననుకో...రేపు ఎప్పుడైనా అప్పు అడిగితే...అదో తలనొప్పి మళ్లీ నాకు...!" అన్నాను సాలోచనగా.

           "అతను ఏ పొజిషన్ లో ఉన్నా.. స్నేహితుడు స్నేహితుడే..! "కనీసం కూల్ డ్రింక్స్ పంపినందుకైనా వెళ్ళేటప్పుడు థాంక్స్ చెప్పండి" అంది నా శ్రీమతీ నిశ్చయంగా..

 సినిమా అయిపోయింది......

              మా ఆవిడ పోరు పడలేక.. ఎంట్రన్స్ దగ్గర సిబ్బందితో, వాడి గురించి వాకబు చేస్తే...
అతను పై ఫ్లోర్ లోని ఒక రూమ్ లోకి తీసుకెళ్లాడు.

          పెద్ద ఎయిర్ కండిషనింగ్ రూమ్...ఒక సోఫాలో గోపి గాడు కూర్చుని ఉంటే....హాల్ మేనేజర్ ఆరోజు కలెక్షన్స్ లెక్కలు చెబుతున్నాడు... ఎదురుగా డిస్ట్రిబ్యూటర్ తాలూకు వాళ్ళు అనుకుంట...మేము లోపలికి వెళ్లగానే...లేచి బయటకు వెళ్లిపోయారు.

            గోపి గాడు మమ్మల్ని చూడగానే రారా.. రా.. అంటూ ఇద్దర్ని కూర్చో బెట్టి, కాఫీ తెప్పించాడు. ఇదంతా ఆశ్చర్యంగా పరికించి చూస్తున్న నాకు అప్పుడు అర్థమైంది ఆ సినిమా హాలు వాడిదేనని.!

       మొదట్లో 16mm ప్రొజెక్టర్ తో ఊర్లలో పండగలకి పబ్బాలకి సినిమాలాడించి, ఈ స్టేజీకి ఎదిగాడుట. ఇంకా ఆంద్రా, తెలంగాణాలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందట. కొత్త సినిమాలు జిల్లాల వారిగా కొంటాడుట..! అలా తను ఎదిగిన క్రమాన్ని చెపుతూ... ఈ రోజు టికట్ చింపే పనివాడు రాక పోతే తానే ఆపని చేసాడని చెప్పుకొచ్చాడు.

       నా స్నేహితుడు"ఎలా వచ్చార్రా.." అని నన్ను అడిగితే.."రిక్షాలో" అని చెప్పా తలవంచు కొంటూ.

        డ్రైవర్ని పిలిచి, వద్దన్నా వినకుండా తన కారులో మమ్మల్ని ఇంటి వద్ద దింపేసి రమ్మన్నాడు.

               అప్పుడు దారిలో మా ఆవిడ.. "ఇలా ఇంకెప్పుడూ, ఎవర్నీ తక్కువ అంచనా వేయకండి....
స్నేహితుడు ముఖ్యం. అతడి స్టేటస్ కాదు.. 
ముఖ్యంగా చిన్ననాటి మిత్రులను ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు..." అంది ఒకింత కోపంగా...!!
     "ఎదుటివారిని చూడంగానే ఒక అంచనా వేయకండి." మనిషి చూడానికి ఎలా వున్నా.... మీ కన్నా గొప్పవాడు కావచ్చేమో కదా....!!
          "మనిషి ముఖ్యం.....స్టేటస్ కాదు"
                   💐🙏🤝🤝🤝🙏💐 Friend ship is great not their position 👍
-NHR


తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

వృక్షదేవతలు - వారి విశిష్టత

🍁వృక్షదేవతలు - వారి విశిష్టత🍁

హిందువులు అన్ని జీవుల్లోను దేవుణ్ని చూశారు. అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. 

అలాగే చెట్లలో కూడా దేవుణ్ని చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు.
నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో బాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. 

కాగా చెట్లకు మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. అది ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమయింది. భారతీయ రుషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు. హిందువులు పవిత్ర మైన వృక్ష జాతులుగా పేర్కొనే వాటిలో - తులసి, రావి (అశ్వత్థం), వేప, మారేడు, మర్రి, అశోక, ఉసిరి మరి కొన్ని ఉన్నాయి

దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిలో కొన్నిటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండడం విశేషం. కొన్ని దేవతా వృక్షాల విశేషాలు తెలుసుకుందాం.

తులసి

తులసి పవిత్రమైనదని అందరికీ తెలుసు. ప్రతి ఇంటిలో తులసి ఉండాల్సిన అవసరముంది. తులసి కథ అందరికీ తెలిసిందే. విష్ణుమూర్తికి తులసి ప్రీతికరమని,దానితోఆయనకు పూజ పుణ్యప్రదమనేది అందరికీ తెలిసిందే. తులసిని పవి త్రంగా ఉన్నప్పుడే ముట్టుకోవచ్చని, అనవసరంగా తుంచరాదనే నియమాలు కూడా ఉన్నాయి. 
తులసి పవిత్రతని చెప్పే ఒక శ్లోకం ఉంది. అది

"యన్మూలే సర్వ తీర్థాని, యన్మధ్యే సర్వ దేవతా: యదగ్రే సర్వ వేదాశ్చ, తులసీం త్వాం నమామ్యహం" 

మూలంలో సర్వ తీర్థాలు, మధ్య భాగంలో సర్వ దేవతలు, అగ్రభాగంలో సర్వ వేదాలు గల తులసి కి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. తులసికి ఎన్నో ఔషధ గుణాలున్నాయన్నవిషయం తెలిసిందే. తులసికి మనస్సును ఉద్వేగాలను, శరీరాన్ని పరిశుద్ధం చేసే శక్తి ఉందని చెబుతారు. అందువల్లనే యోగులు, సాధువులు వంటి వారు తులసి మాలను మెడలో ధరిస్తుంటారు. ఇతరుల చెడు భావాలను ఎదుర్కొని దూరం చేసే శక్తి తులసికి ఉంది. అంత ఎందుకు తులసిని స్పృశించడమే మనలను శుద్ధి చేస్తుందని చెబుతారు.

రావి
దేవతా వృక్షాల్లో రావి(అశ్వత్థం)ఒకటి. అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారని చెప్పే శ్లోకం కూడా ఉంది. అది

"మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి అగ్రత: శివ రూపాయ, వృక్ష రాజాయతే నమ:" 

ఈ వృక్షం మూలం వద్ద బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రంలో శివుడు ఉన్నారని దీని అర్థం. ఇక రావి చెట్టు విష్ణువు రూపమని చెబుతారు. అందువల్లనే అశ్వత్థ నారాయణుడు అనే పేరు కూడా ఆయనకు ఉంది. మొహంజొదారో లో దొరికిన ఒక ముద్రలో సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం బయటపడింది. దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోయిన ఒక సందర్భంలో విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన ఆ చెట్టు రూపం దాల్చినందున దానికి పవిత్రత వచ్చిందని చెబుతారు. కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెబుతారు. 

స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలుకు గాని దాని కొమ్మలకు గాని ఎర్ర వస్త్రం గాని, ఎర్ర దారం గాని కట్టే ఆచారం ఉంది. ఏ చెట్టును నరకడమైనా పాపమే కాగా అశ్వత్థ వృక్షాన్ని నరకడం మహాపాపమని ఒక పురాణ వచనం. బుద్ధునికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం అయిందని చెబుతారు. అందువల్ల వారు దానిని బోధి వృక్షమని, జ్ఞాన వృక్షమని వ్యవహరిస్తారు.

వేప
వేపచెట్టు లక్ష్మీ దేవి స్వరూపమని చెబుతారు. అందువల్లనే విష్ణు రూపమైన రావి చెట్టుకు, లక్ష్మీ రూపమైన వేప చెట్టును ఒకే చోట పాతి వాటికి వివాహం చేసే ఆచారం కూడా ఉంది. ఉత్తర హిందూస్థానంలో వేప చెట్టును నీమారి దేవిగా వ్యవహరిస్తారు. కొన్ని శుద్ధి కార్యక్రమాల్లో వేప రెమ్మలను ఉపయోగిస్తారు. వేపలో ఉన్న ఔషధ గుణాలు తెలిసినవే. వేప‌ చెట్టు గాలే శరీరానికి మంచిదని అంటారు. దాని ఆకులు క్రిమి సంహారిణిగా ఉపయోగిస్తాయి. దాని బెరడు కొన్ని రకా ల చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది.


మారేడు
మారేడు పత్రాలనే సంస్కృతంలో బిల్వ పత్రాలంటారు. మారేడు శివునికి ప్రీతికరం. అందుకే ఆయనకు లక్ష పత్రి పూజలో కూడా బిల్వాలనే వాడతారు. అది దేవతా వృక్షమై నందునే దానిని కొన్ని రోజులలో, తిథులలో కోయరాదనే నిబంధన కూడా ఉంది. కోసేటప్పుడు కూడా ఒక శ్లోకం చదివి నమస్కరించి కోయాలంటారు.
ఆ శ్లోకం

"అమృతోద్భవ శీవృక్ష మహాదేవ ప్రియ: సదా గృహ్ణామి తవ పత్రాణి శివపూజార్థమాచరేత్‌" 

మారేడుకు అమృతం నుంచి ఉద్భవించిందని, శ్రీ వృక్షమని పేర్లు. అలాగే ఎప్పుడూ శివునికి ఇష్టమైనది. అటువంటి నీ పత్రాలను శివ పూజ నిమిత్తం కోస్తున్నాను అని దీని అర్థం. మారేడు లక్ష్మీ దేవికి ప్రీతికరం. మూడుగా కలసి ఉన్న బిల్వ దళాలను శివుని పూజకు వాడుతారు. ఈ మూడు పత్రాల దళం శివుని 
మూడు కనులకు ప్రతీక అని భావిస్తారు.

ధర్మస్య విజయోస్తు
అధర్మస్య నాశోస్తు
ప్రాణిషు సద్భావనాస్తు
విశ్వస్య కళ్యాణమస్తు
         🙏
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media

చులకన - యదార్థగాథ

అద్భుతమైన నిజ జీవిత కథ


నాపేరు లక్ష్మణరావు. నేనుండేది రాజమండ్రి పక్కన ధవళేశ్వరం. మండల రెవెన్యూ అధికారిగా ఉద్యోగం చేసి ఈమధ్యనే రిటైర్ అయ్యాను. నాకొక కొడుకు ఒక కూతురు. నాకూతురు అచ్చం నా అమ్మ పోలికే అందుకే చిట్టితల్లీ అని గారాబంగా పిలుస్తాను. నా కొడుకు డాక్టర్ అయ్యాడు..నా కూతురు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యింది.. 

నాకూతురుకి చక్కని సంబంధం వచ్చింది. ఒక్కడే కొడుకు. బాగా ఆస్థిపరులు. అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, అమెరికా ఉద్యోగం. కోటి రూపాయల కట్నం పెట్టి ఘనంగా నా కూతురు పెళ్ళి జరిపించాను. నా కూతురు పెళ్ళిలో ఒక అమ్మాయిని చూసి నా కొడుకు ఆమెనే పెళ్ళి చేసుకుంటా అని పట్టుబట్టాడు. 

ఆ అమ్మాయి వివరాలు ఆరాతీయగా ఆమె పంచాయితీ గుమస్తా కూతురని, ఆయుర్వేదిక డాక్టర్ అని, చాలామంచి కుటుంబం అని కాని ఆమె తండ్రి ఏమాత్రం ఆస్థులు సంపాదించలేదని తెలిసింది. నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. నా శ్రీమతి, నా కొడుకు మనకు మంచిగా ఆస్థిపాస్థులు ఉన్నాయికదా..

అమ్మాయి ఆయుర్వేదిక డాక్టర్...మంచి కుటుంబం...కాదనకండి అంటూ ఒప్పించే ప్రయత్నం చేసారు. చివర ప్రయత్నంగా అమ్మాయి అబ్బాయి జాతకాలు చూపించాను. నూటికి నూరుపాళ్ళు జాతకాలు కలిసాయి అని విన్నాక ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయిని మా ఇంటి కోడలు చేసుకోవలసి వచ్చింది. 

నాకోడలిని మా ఇంటికి తీసుకు వచ్చేటప్పుడు అదేనండీ అప్పగింతల సమయంలో 200 మందిపైగా మా ఇంటికి వచ్చారు. ఎన్నో పిండివంటలు. సారె సామాన్లు.. 

ఇంత ఖర్చుపెట్టి ఇన్ని తెచ్చేబదులు డబ్బు ఇవ్వచ్చు కదా అనుకున్నాను. కాని తరువాత తెలిసింది ఏమిటంటే ఆ సామాన్లు, పిండివంటలు చుట్టుపక్కల ఊర్లనుంచి అప్పగింతలకోసం వచ్చిన జనాలు పట్టుకొచ్చారట. 

నాకోడలు ఇంటికి వచ్చింది మొదలు రోజూ వైద్య సహాయానికి ఎవరో రావటం, వారికి నా కోడలు ట్రీట్మెంట్ చెయ్యటం, అవసరమైన టెస్టులు చేయించుకోమని చెప్పటం, టెస్టులు చేయించుకునే స్థోమత లేనివారికి రామకృష్ణామిషన్ డయాగ్నాస్టిక్ ల్యాబ్ కి వెళ్ళి తక్కువ ఖర్చుతో టెస్టులు చేయించుకోమని చెప్పటం, రిపోర్టులు చూసి వైద్యం చేసి జబ్బు నయం చేయటం జరుగుతున్నాయి..

నా కొడుకు కార్పొరేట్ హాస్పిటల్ లో డాక్టర్ గా చేస్తూ నెలకు లక్ష రూపాయలు జీతం సంపాదించటమే కాకుండా, చిన్న చిన్న హాస్పిటల్స్ లో విజిటింగ్ డాక్టర్ గా వెల్లి ట్రీట్మెంట్, ఆపరేషన్లు చేస్తూ ఇంకొక లక్ష రూపాయలవరకు సంపాదిస్తున్నాడు. నా కోడలు సంపాదన మాత్రం ఏమీలేదు.

ఒకరోజు లంక గ్రామం నుంచి ఒక రైతు దంపతులు గర్భవతి ఐన తమ కుమార్తెను తీసుకొచ్చారు. ఆ అమ్మాయి చాలా బలహీనంగా ఉంది. నడవటం కూడా కష్టంగా ఉంది. ఆ అమ్మాయిని చూసి ఎందుకు ఇంత అశ్రధ్ధ చేసారు అని మా కోడలు ఆమె తల్లిదండృలను మందలించింది. టెస్టులు రాసి రిపోర్టులు తీసుకురమ్మని చెప్పింది. మరునాటి ఉదయం రిపోర్టులతో వచ్చారు..

 మీ అమ్మాయికి దాదాపు నెలకుపైగా మంచి ట్రీట్మెంట్ చెయ్యాలి అనగానే రోజూ తీసుకు రావటం కష్టం తల్లీ నీకు తెలియంది కాదు కదా అని రైతు దంపతులు ప్రాధేయపడ్డారు. మా కోడలు నా దగ్గరకు వచ్చి పరిస్థితి వివరించింది. నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు, కాని నా భార్య ఆ అమ్మాయి పరిస్థితి చూసి కనికరించండి అని సెంటిమెంటు తో కొట్టింది. నాకు ఒప్పుకోక తప్పలేదు.

మా ఇంటి ముందర గదిలో బెడ్ వేసి ఆ అమ్మాయికి మా కోడలు ట్రీట్మెంట్ మొదలెట్టింది. ఆ అమ్మాయి తండ్రి ఊరు వెల్లి బియ్యం పప్పులు కూరలు తీసుకొచ్చాడు. మా ఇంటి పని, తోటపని మొత్తం ఆ అమ్మాయి తల్లిదండృలు చేస్తున్నారు. నెలరోజుల తరువాత టెస్టులకు పంపింది.. 

టెస్టు రిపోర్టులు చూసి బావున్నాయి అంటూ ఇంకొక వారం రోజుల తరువాత వారిని తిరిగి పంపింది. వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి ఆరోగ్యవంతంగా చక్కగా నడుచుకుంటూ వెళ్ళింది. నాకు నాశ్రీమతికి పాద నమస్కారం చెసి రైతు తన భార్యను కూతురుని తీసుకుని వెళ్ళాడు.

రెండు నెలల తరువాత ఆ అమ్మాయి ప్రసవించిందని తల్లీ బిడ్డ క్షేమమని ఫోన్ వచ్చింది. ఇంకొక నెల రోజుల తరువాత ఆ లంకగ్రామం నుంచి దాదాపు 50 మంది మా ఇంటికి వచ్చారు. నా శ్రీమతికి నాకు, నా కోడలికి కొడుక్కి పట్టుబట్టలు పెట్టారు. కొత్తబియ్యం తెచ్చారు. ఎన్నో రకాల కూరలు దుంపలు టమాట, మామిడి, గోంగూర ఆవకాయలు పట్టుకొచ్చారు. 

ఇప్పుడు నా ఇల్లు చాలా సందడిగా ఉంటుంది. ధవళేశ్వరం బస్టాండ్ దిగి ఎవరినడిగినా మా ఇంటికి సరాసరి తీసుకొచ్చేస్తున్నారు. నేను రోడ్డు మీదకు వెళ్ళేటప్పుడు ఆటోవాడు, రిక్షావాడు డబ్బులు అడగకుండా గమ్యానికి చేరుస్తున్నాడు. కిరాణాకొట్టు వాడు కూడా సామాన్లు డబ్బు తీసుకోకుండా ఇస్తున్నాడు. మా ఇంటిపని తోటపని చేయటానికి జీతం అడగకుండా మేము పిలవకుండా ఒస్తున్నారు.. 

కాని నాకున్న ఒకే ఒక బాధ. కోటి రూపాయల కట్నం ఇచ్చి పెళ్ళి చేసిన నా కూతురు అత్తమామలకు నెలకు 5 లక్షలు పంపుతుంటే కానీ కట్నం లేకుండా వచ్చిన నా కోడలు కనీసం లక్ష రూపాయలు కూడా నెలకు సంపాదించటం లేదు. 

ఇలా ఉండగా అమెరికానుంచి అల్లుడు ఫోన్ చేసాడు. నా చిట్టితల్లి నెలతప్పిందని, తనకు తోడుగా ఇంట్లో ఉండటానికి నాశ్రీమతిని నన్ను రమ్మని. ఫోన్ వచ్చిందే తడవు తనకు ఇష్టమైన పిండివంటలు చేయించి, బట్టలు కొని నాశ్రీమతి నేను అమెరికా పయనమయ్యాము. 

నా చిట్టితల్లి చాలా అనారోగ్యంగా ఉంది. విషయమేమిటంటే ఆఫీసులో పనిచెయ్యటం, అక్కడ పెట్టే ఆహారం చిప్స్, పిజ్జాలు, బర్గర్లు, కేకులు, కూల్ డ్రింకులు తో సరిపెట్టుకోవటం, వంట దాదాపుగా లేదు. ఎప్పుడైన టీ కాఫీలు చేసుకోవటం మాత్రం చేస్తున్నారు. నా శ్రీమతి వంటగదిని శుభ్రం చేసింది.. 

నేను వండి నా కూతురుకి లాలించి, బుజ్జగించి తినిపిస్తున్నాను. అంతా అంటారు, నా శ్రీమతి కంటే నేనే వంట బాగా చేస్తాను అని, చిన్నప్పడు నా చిట్టితల్లి గారాలు పోతుంటే ఆమెకు వండి తినిపించిన సందర్భాలు కోకొల్లలు.

ఒక నాలుగు రోజుల తరువాత నా చిట్టితల్లి ఇంట్లో నడుస్తూ పడిపోయింది. హుటాహుటిన హాస్పిటల్ లో చేర్పించాము. తనకు ప్లేట్లెట్స్ కౌంట్ రోజు రోజుకూ పడిపోతుందని, డాక్టర్లు ప్రయత్నిస్తామని, ప్లేట్లెట్స్ డోనర్స్ ని సిధ్ధం చేసుకోమని, ఇదే పరిస్థితి తీవ్రమైతే నా చిట్టితల్లి ఇక ఉండదని చెప్పారు. నా కొడుక్కి ఫోన్ చేసాను. వెంటనే నా కోడలు-కొడుకు, నా కొడుకు అత్త-మామ, నా కూతురు అత్త-మామ అమెరికా వచ్చారు.  

హాస్పిటల్ లో నా కూతురు రిపోర్టులు చూసిన నా కొడుకు చతికిలపడిపోయాడు. నాకు మరింత భయం వేసింది. నా కోడలు రిపోర్టులు చూసి గైనకాలజీ హెడ్ అపాయింట్‌మెంట్ తీసుకుంది. నేను, నా కోడలు-కొడుకు గైనకాలజీ హెడ్ ని కలిసాము. మీరు ఈ టెస్టులు చేయిస్తే బావుంటుందేమో అంటూ నా కోడలు ఒక పది వరకు టెస్టుల పేర్లు చెప్పింది..

 ఎందుకు ఆ టెస్టుల అవసరమేమిటి అని గైనకాలజీ హెడ్ ప్రశ్నించగా నా కోడలు కేసు హిస్టరీ, రిపోర్టులు చూపిస్తూ వివిధ కారణాలు చెప్పింది. హెడ్ గైనకాలజిస్ట్ సరే అంటూ ఆ టెస్టులు చేయించమని చెప్పింది.

నా కోడలుని ఆమె అనుభవమంత వయసు నీకు లేదు ఆమెకే సలహాలిచ్చే ప్రయత్నం చేస్తున్నావే అంటూ తీవ్రంగా చీవాట్లు పెట్టాను. శాయంత్రం కాగానే నా అల్లుడు, కూతురు అత్త-మామ హాస్పిటల్ లో ఉండి మాకు ఇంటికి వెళ్ళి తెల్లారి రమ్మని చెప్పారు. నా కోడలు చెప్పిన టెస్టుల రిపోర్టులు తీసుకుని ఇంటికొచ్చాము. 

నా మనసు మనసులో లేదు.నా కోడలు తల్లిదండృల బలవంతం మీద ఏదో ఎంగిలిపడ్డాము. నా శ్రీమతి నా కోడలి తల్లి ఒక బెడ్‌రూంలో నిద్రపోతున్నారు. నా కొడుకు నేను ఒక బెడ్‌రూంలో పడుకున్నాము కాని నిద్రపట్టడం లేదు. ఇంతలో నా ఫోన్ మ్రోగింది. భయం భయంగా ఫోన్ ఎత్తాను..

 ఫోన్ చేసింది హెడ్ గైనకాలజిస్ట్. మీతో వచ్చి టెస్టులు చేయించమని చెప్పిన అమ్మాయి మీ అమ్మాయి కేసును చక్కగా అనలైజ్ చేసిందట. హైదరాబాద్ లో నాకు తెలిసిన ఆయుర్వేదిక డాక్టర్ ను అడిగి తెలుసుకున్నాను. మరొక్క విషయం ఆ డాక్టర్ గారి శిష్యురాలు ధవళేశ్వరంలో ఉంటుందట. ఆమె భర్తకూడా డాక్టరేనట. ఆమెను మీరు రప్పించి మీ అమ్మాయికి ట్రీట్మెంట్ చేయిస్తే ఖచ్చితంగా ఫలితం ఉండొచ్చు అంటున్నారు అని చెప్పింది. 

కలా నిజమా నమ్మలేకపోయాను. హెడ్ గైనకాలజిస్ట్ కు ఫోన్ కలిపి మాటాడి నిర్ధారణ చేసుకున్నాను. ఇప్పుడు నా కోడలు అపరధన్వంతరి అవతారమూర్తిలా అనిపించింది. బెడ్‌రూం లోనుంచి లేచి హాల్ లోకి వచ్చాను..

 నాకోడలు రిపోర్టులు చూస్తూ, మధ్య మధ్యలో కంప్యూటర్లో వివిధ కేసులు చూస్తూ, నా కూతురి ట్రీట్మెంట్ ఎలా చేయాలో నోట్స్ తయారు చేస్తుంది. ఆమె తండ్రి హాల్ లో పచార్లు చేస్తున్నాడు. నన్ను చూసి బావ గారూ నిద్ర పట్టలేదా అంటూ పలకరించాడు..

 కోడలు ఇటు తిరిగి చూసింది. నాన్నా! అమ్మను లేపి టీ పెట్టమని చెప్పవా? నిద్ర వస్తుంది అన్నాది. టీ పెట్టడానికి మీ అమ్మను ఎందుకు నిద్రలేపాలి తల్లీ, నేను పెట్టిస్తాను కదా అంటూ నాకోడలి తలపై ఆప్యాయంగా నిమిరాను. 

అయ్యో మామయ్య గారు మీకెందుకు శ్రమ అని కోడలు అనగానే మనపని మనం చేసుకుంటే శ్రమ ఏమిటి అంటూ వంటగదిలోకి వెళ్ళాను. నావెనుక నా కోడలి తండ్రి. టీ కాచి మూడు కప్పులలో వేసాను. టీ త్రాగుతూ నా కోడలు మామయ్య గారూ....తనకు ఏ ఇబ్బంది లేదు...మీరు కంగారు పడవలసిన పనిలేదు అంటూ భరోసా ఇచ్చింది.

మరునాడు హెడ్ గైనకాలజిస్ట్ ని కలిసాము. నా కోడలు ట్రీట్మెంట్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని అడిగింది. ఆమె హైదరాబాద్ లోని డాక్టర్ గారిని సంప్రదించి కొద్దిపాటి మార్పులతో ఆమోదించింది..

 ఆరోజునుంచి నా చిట్టితల్లికి నా కోడలి పర్యవేక్షణలో ట్రీట్మెంట్ మొదలయ్యింది. డాక్టర్లు 11 వ రోజున కొద్దిగా గుణం కనిపిస్తుంది అన్నారు, 18 వ రోజున ప్లేట్లెట్స్ నష్టపోవట్లేదు అన్నారు. నెల రోజులు దాటాక నా చిట్టితల్లికి ఏమీ ఇబ్బంది లేదు అని చెప్పారు..

నా చిట్టితల్లి నెమ్మదిగా లేచి నడవటం మొదలెట్టింది. నా కోడలు చెప్పిన ఆహారమే పూర్తిగా నా చిట్టితల్లి కి పెడుతున్నాము. ఒక్కోసారి బాగా లాలన చేసి పెట్టాల్సి వస్తుంది. ఐనా నాకోడలు కాని నేను కాని ఎంతమాత్రం విసుగు చెందలేదు..

నా చిట్టితల్లి డెలివరీ డేట్ దగ్గరపడుతున్నకొద్దీ నాకు భయం ఆవహిస్తుంది. నా కొడుకు, వాడి మామగారు నాకు ధైర్యం చెబుతున్నారు. నా శ్రీమతికైతే కోడలి ట్రీట్మెంట్ మీద పూర్తి నమ్మకం వచ్చేసి ధైర్యంగా ఉంది..

నా చిట్టితల్లికి పురిటినెప్పులు ప్రారంభమయ్యాయి. నా కోడలు హెడ్ గైనకాలజిస్టుతో ఎంతో అవసరమైతే తప్ప సిజేరియన్ వద్దు అని చెప్పి ఒప్పించింది. సుఖప్రసవం అయ్యింది. నా చిట్టితల్లి చిన్నారిచిట్టితల్లికి జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమమని హాస్పిటల్ వర్గాలు ఆనందంగా తెలియజేసాయి..

నా మనసు కుదుట పడింది. ఇంటికి వచ్చాను. నా కూతురు మామగారితో వీళ్ళు ఇక్కడుండి సంపాదించింది చాలు, ఇండియాలో కూడా మంచి జీతాలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వస్తున్నాయి కదండీ, మీకు అభ్యంతరం లేకపోతే మీ కోడలిని-కొడుకును మనతోపాటే ఇండియా తీసుకు వెళ్దామండీ అని అభ్యర్ధించాను. నా కోడలి తల్లిదండృలు కూడా సర్ది చెప్పారు. చివరికి ఆయన ఒప్పుకున్నాడు.

రెండునెలల తరువాత ఇండియా పయనమయ్యాము. వారం రోజుల తరువాత నా కోడలి పుట్టినరోజు. వంటగదిలోకి వెళ్ళి నా కోడలికిష్టమైన పుళిహోర చేసాను. నా కోడలు స్నానం చేసి కొత్తబట్టలు వేసుకుని నాశ్రీమతికి నాకు పాదనమస్కారం చేసింది. అక్కడకు వచ్చిన నా కోడలి తల్లిదండృలకు కూడా పాద నమస్కారం చేసింది. ఆవుపాలలో బెల్లం వేసి కలిపి నా కోడలికిచ్చాను. పాలు కొంచెం త్రాగిన తరువాత నా స్వహస్థాలతో చేసిన పుళిహోర ఆమెకు అందించాను..

 నా కోడలికి ఆమె తల్లిదండృలకు ఆనందానికి అవధులు లేవు. ఇంతలో గేటు చప్పుడయ్యింది. చాలామంది నా కోడలిని ఆశీర్వదించటానికి, శుభాకాంక్షలు చెప్పటానికి ఇంటికి వచ్చారు. వచ్చినవారికందరికీ టీ, కాఫీ, టిఫిన్లు పెట్టి పంపించాను.

ఇక మా ఇంటికి నా కోడలి దగ్గర వైద్యానికి వచ్చేవారికి నాకు చేతనైన సాయం చేస్తున్నా.ఖండాంతరాలకు వ్యాపిస్తున్న నా కోడలి సేవలకు తోడుగా ఉండి చందృనికో నూలుపోగుగా మారాలని.
🙏🙏

సేకరణ : Social Media
తెలుగులో విజ్ఞానం

సేకరణ : Social Media