ఈ చిత్రంలో మొత్తం జీవిత సత్యాన్ని ఎంత చక్కగా వివరించారో చూడండి.
ఏనుగు గతజన్మకి సంకేతం. కింద ఉన్న పాములు తరువాతి జన్మలకి సంకేతం.
చెట్టుకి ఉన్న కొమ్మ ఈ జన్మకి సంకేతం.
కొమ్మకి ఉన్న తెలుపు నలుపు ఎలుకలు రోజుకి అంటే పగలు రాత్రి కి సంకేతం.
పైన ఉన్న తేనె పట్టు తాత్కాలిక సంతోషం.
ఏనుగు అనే గత జన్మల పాపపుణ్యాలు కొమ్మ అనే ఈ జన్మని కదుపుతూ ఉంటే.. మరోవైపు పగలు రాత్రి రూపంలో కాలం ఈ జన్మని పడతోస్తూ ఉన్నా కూడా... మనిషి తాత్కాలికమైన తేనె తాగుతూ ప్రమాదకరమైన తరువాతి జన్మలలోకి వెళ్ళడానికి సిద్ద పడుతున్నాడు కానీ...
పక్కనే ఉండి చేయిచాచిన పరమాత్మచేతిని అందుకోలేక పోతున్నాడు.
No comments:
Post a Comment