దేవుడు గొప్పా....?సైన్స్ గొప్పా....?
ముందు సైన్స్ గురించి చెప్పుకుందాం.....సైన్స్ అంటే ఏదైనా హేతుబద్ధం(logical)గా పరిశోధించి కొత్తగా కనిపెట్టడం,దానికి సంబంధించిన సూత్రాలు,సిధ్ధాంతాలను(formulas & theorys) ఆవిష్కరించడం.ఈ శాస్త్ర,సాంకేతిక పరిఙానం వల్లనే ఈనాడు మనం అనుభవిస్తున్న విలాసాలు,అవసరాలను సులభతరం చేసే వస్తువులు,ఆవిష్కరణలు వచ్చాయి.ఇది ఒక చరిత్రాత్మకమైన,విప్లవాత్మకమైన గొప్పశకం.ఇక రాబోయే రోజుల్లో ఇది ఒక అద్భుతమైన పాత్ర పోషించడం వందశాతం నిర్వివాదాంశం.
ఇక నాణేనికి ఇంకోవైపు చూద్దాం.....ఇప్పటి వరకు మన భూమ్మీద చేసిన ప్రయోగాలకు కావలసిన సాధనా సామాగ్రి ఎక్కడిది....?చేసిన ఆవిష్కరణలకు కావలసిన ముడిసామాగ్రి ఎక్కడిది....?ఎవరు తయారు చేసారు....? ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే మనకు ఇప్పటి వరకు అతిపెద్ద అత్యాధునిక ఆవిష్కరణ అంటే ఒక రాకెట్,దాని ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెట్టే ఉపగ్రహాలు అనుకుందాం....!ఆ రాకెట్,ఉపగ్రహాలకు అవసరమైన లోహం(metal)ఎక్కడిది...?భూమిలోనిదే....!ఆ రాకెట్ అంతరిక్షంలోకి ప్రవేశించడానికి అవసరమైన ఇంధనం(fuel iridium)ఎక్కడిది....?అది కూడా భూమిలోనిదే,వాటిలో కావలసిన వాయువులు(liquid oxygen, nitrogen tetroxide, and hydrogen peroxide)అవి కూడా భూమ్మీదవే....!అంటే సైంటిస్ట్స్ కనిపెట్టక ముందు ఇవి భూమ్మీద లేవా,వేరే గ్రహం నుంచి ఏమైనా తీసుకొచ్చారా.....జస్ట్ ఇక్కడున్న వాటి వలన ఏమేం ఉపయోగాలున్నాయో,ఎందుకు పనికొస్తాయో డీకోడ్ చేసారంతే......మరి డీకోడ్ చెయ్యగలిగే ఆ బ్రెయిన్,మేధా సంపత్తిని ఏ సైంటిస్ట్ తయారు చేశారు....?
ఎన్నో వ్యాధులకి ఎన్నో మందులు కనిపెడుతున్నారు.మరి వాటికి కావలసిన ముడివస్తువులు ఎక్కడివి....?అవి కూడా భూమ్మీదవే....!మన ఋషులు[ (G)olden days scientists] ఆయుర్వేదంలో ఒక మాట చెప్పారు "ఈ భూమ్మీద జనించే ప్రతి రోగానికి ఈ భూమ్మీదే మందు ఉంది".అంటే.....ఏ మొక్క కూడా వ్యర్థం కాదు,మనకు వాటన్నింటి ఉపయోగం పూర్తిగా తెలియదు అంతే.....అప్పట్లోనే మన భారతీయ శాస్త్రవేత్తలు(ఋషులు)సాధ్యమైనంత వరకు డీకోడ్ చేసి ఆయుర్వేద గ్రంథాన్ని మనకు అందించారు.
మొత్తమ్మీద సూదిమొన మొదలుకుని బైక్స్,కార్లు,మొబైల్స్,కంప్యూటర్లు ఉపగ్రహం వరకు ఈ భూమ్మీద జరిగే ప్రతి ఆవిష్కరణ(innovation)కొత్తగా పుట్టించింది,వేరే గ్రహం నుంచి దిగుమతి చేసుకున్నదీ కాదు.....జస్ట్ భూమ్మీద ఉన్న వనరుల నుంచి డీకోడ్ చేయబడింది అంతే.ఉన్న పదార్థాలతో అనేక రకాల వంటలు వండుకుని ఆస్వాదిస్తున్నాం.......
ఇక ఈ వనరులన్నింటిని ఇచ్చి,మనిషి మేధా సంపత్తిని కనిపెట్టిన ఆ అఙాత సైంటిస్ట్ ఎవరో తెలుసుకుందాం.....?
భగవంతుడు శాడిస్ట్ కాదు.....కొన్ని మత గ్రంథాలలో పేర్కొన్నట్టు నన్ను కొలవకపోయినా,ఇంకొకరిని కొలిచినా శపిస్తా,చంపేస్తా అని అనడు.ఒక వేళ అలా అంటే ఆయన దేవుడెలా అవుతాడో ఎవరికి వారే ఆలోచించుకోండి.మనిషికి ఏమేం కావాలో అవన్నీ ఇక్కడే ఉంచాడు,వాటిని సక్రమంగా వాడుకోవడానికి మనిషికి ఙానాన్ని కూడా ఇచ్చాడు.ఆయన పట్ల క్ర్రతఙతతో జీవించడమే మన సంస్కారం.
పుట్టుకతోనే ప్రతివాడు పాపి అని చెప్పి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడం చాలా దుర్మార్గం.అసలు మనిషి ఎంత....?మనిషి మెదడు ఎంత....? అంటే స్ర్రష్టిని తలకిందులు చేయడం తప్ప మిగతా అన్నీ చేయగలిగేంత గొప్ప నైపుణ్యం మానవుడి సొంతం.ఒక లారీ మట్టి తీసుకొచ్చి ఒక చోట వేస్తే అది ఉపయోగపడని దాని వలే కనిపిస్తుంది.....కానీ దానిలో మనం తినడానికి కావలసిన పోషకాలను అందించే ఎన్నో రకాల పంట పండించుకోవచ్చు.ఆ మట్టిలో రసాయన చర్యలు జరిపిస్తున్నది ఎవరు....?
ఆదిమానవుడికి తినడం,తాగడం ఎవరు నేర్పించారు....?
అసలు ఆదిమానవుడికి ఏమీ తెలియనప్పుడు H20 అనబడే రసాయన చర్య ద్వారా నీటిని స్ర్రష్టించినది ఎవరు....?
అతనికి అవసరమైన తిండిని ఒక చిన్న విత్తనంలోంచి బయటకు తీసిన రసాయన చర్య ఎవరు చేశారు....?
మనిషికి,అన్ని జంతువులు,పక్షులు,జలచరాలు,ఉభయచరాలు వీటన్నింటికి సంతానం కోసం ఇద్దరు వేర్వేరు జాతులు కలిస్తేనే అన్న పద్ధతిలో పవిత్ర స్ర్రష్టికార్యం గురించి ఎవరు నేర్పించారు....?
ఈ భూమి మీద న్యూటన్ కనుక్కోకముందు నుంచి కూడా ఏ జీవి అంతరిక్షంలోకి జారిపడిపోకుండా గురుత్వాకర్షణ(gravitational force)ద్వారా నిలబెట్టింది ఎవరు....?
ఈ అనంత విశ్వంలో కోట్ల గ్రహాలను,నక్షత్రాలను,ఉపగ్రహాలను,మిల్కీవేలను,గెలాక్సీ లను ఏ ఆధారం లేకుండా ఎవరు అంతరిక్షంలో నిలిపారు....?
మనిషి మేధస్సు ఒక పరిధి దగ్గర ఆగిపోతుంది.....ఆ పరిధి నుంచి మొదలయ్యేదే ఆ విశ్వాతీతమైన శక్తి(The Ultimate Spiritual Power) ఆ శక్తినే భగవంతుడు అంటారు.ఆయనే Ultimate scientist.....
సేకరణ : Social Media
No comments:
Post a Comment