ప్రేమ గుడ్డిది:
ఈమాట మనం ఎన్నోసార్లు విని వుంటాం,ఎన్నో సినిమాల్లో చూసివుంటాం.
కానీ అందులోని అంతరార్థం ఈ సినిమాల వల్ల మరుగున పడిందని చెప్పడానికి చాలా చింతిస్థున్నాను.
ఇందులో గమనించాల్సినదేంటంటే! ఒకటి-ప్రేమ రెండవది- గుడ్డితనము.
ప్రేమ ఈ మనిషికి మాత్రమే కాదు సకల జీవ రాశులనన్నిటి మనుగడకూ ముఖ్యం.ప్రేమ లేని ఈ లోకాన్ని ఊహించుకోడానికి కూడా ఏ జీవీ ధైర్యం చేయదు.అలాంటి పరి పూర్ణమైన ప్రేమను మనం పొందాలంటే ఒక్కటే మార్గం.అదే గుడ్డితనం.దయచేసి నవ్వకండి.అవును నిజమే.గుడ్డివాడు తన కళ్ళతో ప్రేమించ గలడా.తన చేతిలో ఉన్న ఊతకర్ర, లేదా తనకు చెయ్యందించిన మనసు,ఈరెండిటిని తప్ప ఈ ప్రపంచాన్ని కూడా నమ్మడు.అసలు తన ప్రపంచమే ఆ రెండింటిలో ఏదో ఒకటి.తన చేతిలోని కర్ర ఎటుచూపితే అటువైపే తన ప్రయాణం.చివరకు చావు వచ్చినా సరే.
నిజమైన ప్రేమను కళ్ళతో చూడాలనుకోవడం, గుడ్డి వాడు కర్రలేకుండా జాతీయ రహదారి దాటడం రెండూ ఒక్కటే.
ఇప్పటికైనా అర్థం అయ్యిందా ప్రేమ గుడ్డిది అని ఎందుకంటారో!!!
ప్రేమంటే నిస్వార్థంగా ప్రేమను ఇవ్వడం మాత్రమే కాదు, నిస్వార్థంగా నమ్మటం కూడా.
మీ
వంశీ కాసులనాటి.
No comments:
Post a Comment