పార్ట్1
మొట్ట మొదట శూన్యంలోంచి శబ్దం పుట్టింది. ఆ శబ్దం ఓంకారం. ఓంకారం లోంచి ప్రకంపణలవలన శూన్యమంతా ఆవరించిన శక్తిలో చలనం మొదలైంది. ఆ చలనం ఈ బ్రహ్మాండ విశ్వాన్ని, గ్రహ,నక్షత్రాల్ని సృష్టించింది. శబ్దమే శక్తి యొక్క తొలి వ్యక్త రూపం. ఓంకారం లో అ ,ఉ, మ అనే అక్షరాలున్నాయి. అంటే మనం ఏ శబ్దం పలకాలన్నా నోరు తెరిచి (అ)....నోరు మూయాల్సి ఉంటుంది(మ). అంటే....లోకంలో ప్రతి శబ్దం అ-మ ల మద్యే జనిస్తుంది. ఇలా అన్ని శబ్దాలూ ఓమ్ లోంచే పుడుతాయి కనుక ఓం మూల బీజం. అ, ఉ, మ శబ్దాలను కల్గిఉన్న అక్షరాలను బీజాక్షరాలని అంటారు. ఉదాహరణకు ...శ్రీ అనేది మ తో కలిసి శ్రీమ్ గా ఏర్పడినప్పుడు అది బీజాక్షరం అవుతుంది. గ అనేది మ తో కలిసి గం అనే బీజాక్షరం అవుతుంది. ఇలా మనకు బీజాక్షరాలు ఉద్భవిస్తాయి. ఓం అంటే శబ్దం. అదే మూల శక్తి. ఓం అనే శబ్దంలోంచి పుట్టిన ప్రతి శబ్దమూ శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఆ,ఉ, మ లతో కలసిన ప్రతి బీజాక్షరానికీ శక్తి ఉంటుంది. ఎందుకంటే....శక్తి అంటే శబ్దమే. శబ్దం ఎలా పుడుతుంది? ఓం లోంచి. అంటే ఓం లోంచి పుట్టిన బీజాక్షరానికీ శక్తి ఉంటుంది కదా. అక్షరం అంటే క్షరము(నాశనం)కానిది అని అర్థం. అక్షరం అంటే మనం అనుకునే లెటర్స్ (అ-క్ష) కాదు. లెటర్స్ అక్షరాలైతే.....ఎన్నో లెటర్స్ ఇప్పుడు కనిపించకుండా, వాడుకలో లేకుండా పోయాయి. అక్షరం అంటే శబ్దము అని అర్థం.శబ్దం ఎన్నటికీ నశించదు. ఆ శబ్దాలకు ఒక్కో స్థలంలో ఒక్కో విధంగా మానవులు గుర్తులు ఉంచుకున్నారు సింబల్స్ నే మనం ఆల్ఫాబెట్స్ (ఆ,a, b) అంటాము. ఈవిధంగా ఓం లోంచి పుట్టిన అనేక శబ్దాలు బీజాక్షరాలుగా ఉద్భవించి ఆ అక్షరాలను మనం ఉచ్చరించి నప్పుడు మన శరీరంలో శక్తి జనిస్తుంది. ఇలా జనించిన శక్తితో మన సంకల్పాలు నెరవేరుతాయి. బీజం అంటే విత్తనం. బీజాక్షరం అంటే అక్షరమే శక్తి విత్తనంగా ఉంటుంది. ఆ శక్తి విత్తనాన్ని మనం మనలో నాటి నట్లైతే.....రోజూ...ఆ బీజాక్షరాని జపిస్తూ...ఆ నాటిన విత్తనాని కి శక్తినందిస్తూ ...పోషిస్తే, ఆ విత్తనం మొలకెత్తి, వృక్షమై, ఫలాన్నిస్తుంది. అందుకే ఒక్కో బీజాక్షరానికీ కొన్ని జప సంఖ్యలుంటాయి. అన్నిసార్లు జపిస్తే తప్పా...ఆ చెట్టు ఫలాన్ని ఇవ్వలేదు. ఇలా ఒక్కో బీజాక్షరం ఒక్కో రకమైన ఫలితాలను ఇస్తాయి. బీజాక్షరాలని పలికిన ప్రతిసారీ మనలో శక్తి జనిస్తుంది. ఈ శక్తిని మనం గమనించగల్గాలి. ఇలా బీజాక్షరాలని సమ్మిళితం చేసిన దేవతా నామాలను మంత్రాలని అంటాం. లోకంలో ఏ దేవుని నామంలో ఐనా బీజాక్షరాలు ఉంటాయి. అన్ని మతాల దేవుళ్ళ పేర్లలోనూ ఈ బీజాక్షరాలు ఉన్నాయి.అందుకే దేవుడి నామం పలకడంతోటే శక్తి పుట్టి....ఆ శక్తి మనలోని పాప రాశి ఐన నెగెటివ్ శక్తిని నిర్మూలించి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఇప్పుడు మంత్రోపదేశం అంటే ఏమిటి? మనం అన్నం తింటే శక్తి వస్తుంది. అలాగే మంత్రం జపిస్తే శక్తి వస్తుంది.కానీ....అన్నం తినడానికైనా శక్తి కావాలి కదా....ఈ శక్తి ఉంటేనే అన్నం తిని మరింత శక్తిని సంపాదించుకుంటాం. ఇన్షియల్ గా ఒక మంత్రాన్ని జపించడాని శక్తి కావాలి. ఈ ఇన్షియల్ శక్తిని మనకు గురువు ప్రసాదిస్తాడు. గురువు ఒక మంత్రాన్ని ఇస్తూ...దాన్ని పలకడానికి కావాల్సిన శక్తిని మనలోకి ప్రవహింప జేస్తాడు. దీనినే మనం ఉపదేశం(intiation)అంటాం. ఇలా శక్తిని ఇవ్వగల శక్తి గురువుకు ఎలా వస్తుందంటే....ఆ మంత్రాన్ని ఆయన కొన్ని లక్షల సార్లు జపించి ....ఫలాన్ని పొంది ఉంటారు. అలా మంత్రసిద్ధి పొందిన గురువు ఇచ్జిన మంత్రోపదేశం మాత్రమే శక్తి కలిగి ఉంటుంది. ఒక మంత్రాన్ని ఉపదేశించాలంటే ....జప సంఖ్యను పూర్తి చేసి ఆ మంత్రానికి అధికారి అయ్యి ఉండాలి. సాధారణంగా బీజాక్షరాలు మంత్రంగా ఇవ్వాలంటే గురువు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే వాటిని పలికే శక్తి, వాటిని ఫలింప జేసుకొనే శక్తి మనకు ఉండదు.అందుకే ఉపదేశం కావాలంటే గురువు తప్పక కావాలి. గురువు లేకపోతే ఇక సాధన లేదు. మరి గురువు దొరకని వారి పరిస్థితి ఏమిటి? గురువు మంత్రాన్ని ఉపదేశించడంలోని ఉద్దేశ్యం ....శిష్యుడు ఆ మంత్రంలోని బీజాక్షరాలను పలికి....వాటి శక్తిని పొందాలనే. అంటే...... బీజాక్షరాలు పలకడమే... ఇక్కడ ప్రధాన విషయం. గురువు మంత్రం ఇవ్వకపోతే....మనం బీజాక్షరాలను పాలకలేమా అంటే ....పలకవచ్చు... ఎలా అంటే భగవంతుని నామాన్ని పలికితే చాలు....అందులో బీజాక్షరాలు ఉంటాయి.అందుకే విష్ణు, శివ, లలితా సహస్ర, శత నామాలు ఉన్నాయి. మనకు భగవంతుని నామాన్ని పలకడానికి ఏ ఉపదేశం అవరసం లేదు. నామం పలికితే ...అందులోని బీజాక్షరాలను పలికే ఆ ఆకాశం ఉండి... ఆ ఫలితం కూడా దక్కుతుంది. ఉదాహరణకు... విష్ణు సహస్ర నామాల్లో మొదటి నామం విశ్వాయనమః....... ఇందులో...విశ్వా అనే దానిలో ' అ' ఉంది. ....నమః లో ....అ, మ లు ఉన్నాయి. లలితా సహస్రంలో.....మొదటి నామం శ్రీమాతా. ఇందులో శ్రీమ్....అనే బీజం.... మా ....అనే బీజం తా.....లో ఆ అనే బీజాక్షరాలు ఉన్నాయి. దేవతా నామాలు పలికితే చాలు బీజాక్షరాలు పలికిన ఫలితం వస్తుంది. గురువు లేనివారు....ఎదో ఒక భగవంతుడి నామాన్ని తీసుకుని జపిస్తూ ఉంటే చాలు.
సేకరణ : Social Media
No comments:
Post a Comment