ముక్కోటి (ముప్పై మూడు కోట్లు) దేవతలు వివరణ బృహదారణ్యక ఉపనిషత్తులో యాగ్న్యవల్క్య ప్రశ్నావళిలో వివరంగా ఉంటుంది.
ముప్పై మూడు కోట్లు అనే లెక్కకి సంస్కృత భాష పద అర్ధ తాత్పర్యం సామాన్య ప్రజానీకంలోకి వాడుక భాష లోకి వచ్చేసరికి అసలు అర్ధం మారిపోయింది.
సంస్కృత భాషలో ఉన్న కోటి పదానికి ఉన్న అర్ధం eminent type రకాలు విభాగాలు అని కూడా ఉన్న అసలైన అర్ధం.
యాగ్న్యవల్క్య శాకల్య ప్రశ్నావళిలో గల సంవాదం ఆయన ఇచ్చిన జవాబుల్లో తేలికగా అర్ధం అవుతుంది.
నిజానికి మనకి ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారా ? అంటే దీనికి సమాధానంగా ఒకచోట ఇలా సమాధానం చెప్పారు.
సంస్కృత భాషలో కోటి అనే పదానికి అనేకమైన అర్ధాలతో పాటు "వర్గము", " కూటమి" అనే అర్ధాలు కూడా ఉన్నాయి. అలా చూస్తే ముప్పై మూడు కూటములు, వర్గములు అనే అర్ధాలు కూడా తీసుకోవచ్చును.
మరి ఈ ముప్పై మూడు కూటములు ఏవీ అంటే, 12 మంది ఆదిత్యులు, + 11 (ఏకాదశ) రుద్రులు , + 8 (అష్ట) వసువులు + 2 అశ్వనీ కుమారులు. మొత్తం ౩౩ కుటుంబములు అన్నమాట.
కొన్ని చోట్ల ఈ ఇద్దరు అశ్వనీ కుమారులు కాకుండా , ఇంద్రుడు , ప్రజాపతి అని చెబుతున్నారు కానీ, ఇంద్ర, ప్రజాపతి అనేవి పదవులు అనుకుంటే, అశ్వనీ కుమారులు అనేది మరింత సహజంగా కనబడుతోంది.
సంస్కృతం లో ఒక్కో పదానికి చాల అర్థాలు ఉంటాయి. అవి అక్కడ ఉన్న భావం ని వచ్చే అర్థాన్ని పరిగణలోకి తీసుకోవాలి తప్ప మనకి తెలిసినదే సరైన అర్థమని భావి పరిగణలోకి తీసుకుంటే అర్థం మారుతుంది. ఆ విషయం తెలియక కోటి అంటే అదేదో సంఖ్య గా బావించి అలా మూర్ఖంగా మాట్లాడతారు అన్యమతస్తులు. కోటి అంటే సమూహం అని రకాలు అని కూడ అర్థం వస్తుంది.
అసలు ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే అక్కడ ముప్పైమూడు మంది అని అర్థం వస్తుంది.
వారెవరంటే..
అశ్వనీ దేవతలు 2
అష్టవసువులు 8
ద్వాదశాదిత్యులు 12
ఏకాదశ రుద్రులు 11 మొత్తం ముప్పైమూడు మంది.
అసలు ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే అక్కడ ముప్పైమూడు మంది అని అర్థం వస్తుంది.
వారెవరంటే..
అశ్వనీ దేవతలు 2
అష్టవసువులు 8
ద్వాదశాదిత్యులు 12
ఏకాదశ రుద్రులు 11 మొత్తం ముప్పైమూడు మంది.
అశ్వనీ దేవతలు ఇద్దరు కాగా,
1.ధరుడు ..
2. ధృవుడు
3.సోముడు
4.అహుడు
5. అనిలుడు
6.అగ్ని 7.
ప్రత్యూషుడు
8.భీష్ముడు అష్ట వసువులుగా చెప్పబడుతున్నారు.
1.ధరుడు ..
2. ధృవుడు
3.సోముడు
4.అహుడు
5. అనిలుడు
6.అగ్ని 7.
ప్రత్యూషుడు
8.భీష్ముడు అష్ట వసువులుగా చెప్పబడుతున్నారు.
ఇక
1.శంభుడు
2.పినాకి
3 గిరీషుడు
4.స్థాణువు
5. భర్గుడు
6.శివుడు
7సదాశివుడు
8. హరుడు
9.శర్వుడు
10.కపాలి
11.భవుడు
ఏకాదశ రుద్రులుగా పేర్కొనబడ్డారు.
1.ఆర్యముడు
2. మిత్రుడు
3. వరుణుడు
4.అర్కుడు
5.భగుడు
6. ఇంద్రుడు
7. వివస్వంతుడు
8.పూషుడు
9.పర్జన్యుడు
10. త్వష్ట
11. విష్ణువు
12.అజుడు
.. ద్వాదశ ఆదిత్యులుగా చెప్పబడ్డారు. వీళ్లందరూ కలుపుకుని ముప్పై మూడుమంది దేవతలు.
1.శంభుడు
2.పినాకి
3 గిరీషుడు
4.స్థాణువు
5. భర్గుడు
6.శివుడు
7సదాశివుడు
8. హరుడు
9.శర్వుడు
10.కపాలి
11.భవుడు
ఏకాదశ రుద్రులుగా పేర్కొనబడ్డారు.
1.ఆర్యముడు
2. మిత్రుడు
3. వరుణుడు
4.అర్కుడు
5.భగుడు
6. ఇంద్రుడు
7. వివస్వంతుడు
8.పూషుడు
9.పర్జన్యుడు
10. త్వష్ట
11. విష్ణువు
12.అజుడు
.. ద్వాదశ ఆదిత్యులుగా చెప్పబడ్డారు. వీళ్లందరూ కలుపుకుని ముప్పై మూడుమంది దేవతలు.
-- పురాణ బ్రహ్మ బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు
సేకరణ : Social Media
No comments:
Post a Comment